Friday, 13 July 2018

షేరోం కా షోర్-15 - (शेरों का शोर) ఉర్దూ షేర్ లకు తెలుగు అనువాదం

15.1 कौन कहता है मौत आयी तो मर जाऊँगा..
मैं तो दरिया हूँ समन्दर में समा जाऊँगा..
ఎవరన్నారు, చావొస్తే నేను చచ్చిపోతానని..
నేను నదిని, సముద్రంలో కలసిపోతాను..

15.2 हौसले भी किसी हक़ीम से कम नहीं होते हैं..
हर तकलीफ़ में ताक़त की दवा देते हैं..
ధైర్యాలూ ఏ వైద్యుడికీ తీసిపోవు..
ప్రతి కష్టంలో బలమనే మందును ఇస్తాయి..

15.3 इतने सालों बाद उसने ग़लती की माफ़ी माँगी..
मैं ने कहा, प्यार को ग़लती नहीं कहते..
ఇన్నేళ్ళకు తను చేసిన పొరపాటుకు క్షమార్పణ అడిగితే..
నేను అన్నాను, ప్రేమను పొరపాటు అనరు అని..

15.4 कितने बेवफ़ा होते हैं ये जुगनू भी..
रोशनी दिखाकर अंधेरों की तरफ़ ले जाते हैं..
ఈ మిణుగురు పురుగులు ఎంత మోసకారులు కదా..
వెలుగును చూపి చీకట్లవైపు తీసుకుపోతాయి..

15.5 मेरी मोहब्बत आधी रह गयी..
पर उसका मन बहलाना पूरा हो गया..
నా ప్రేమ అపూర్ణంగా మిగిలింది..
తన కాలక్షేపం మాత్రం పూర్తైంది..

15.6 तो क्या हुआ जो दोस्त नहीं मिलते हमसे..
मिला तो रब भी नहीं, पर इबादत कहाँ रुकी हमसे..
నేస్తాలూ కలవరు నన్ను, అయితే ఏంటంటా..
దేవుడూ దొరికింది లేదు, ప్రార్థించటం ఎక్కడ ఆగిందంటా?..

15.7 सलीका इतना अदब का तो बरक़रार रहे..
रंज़िशें अपनी जगह हों, सलाम अपनी जगह...
ఇంత అయినా మర్యాద సక్రమంగా ఉండాలి..
మనఃస్పర్ధలు వాటిచోటే ఉండనీ, పలకరింపులు సాగుతుండాలి..

15.8 बड़ी मुख़्तसर वजह है, मेरे झुक कर मिलने की..
मिट्टी का बना हूँ, गुरूर जँचता नहीं मुझ पर..
చాలా చిన్న కారణం, నేను వంగి మెలగటానికి..
మట్టితో తయారైనాను, పొగరు నాకు సరిపడదు..

15.9 अब तो दिन रात पर हीं रुकता है..
मुझे याद है, पहले एक शाम भी हुआ करती थी..
ఇప్పుడిక ఉదయాలు రాత్రుల దగ్గరే ఆగుతున్నవి..
నాకు గుర్తుంది, మొదలు ఒక సాయింత్రం కూడా ఉంటుండేది..

15.10 वो दिल में रहे इतना ही बहुत है..
मुलाकात की हमें इतनी भी ज़रूरत नहीं..
తను మనసులో ఉంటే అదే చాలు..
కలవటం నాకు అంతగా అవసరం కాదు..

15.11 थोड़ा सा और बिखर जाऊँ, मैं ने यही ठानी है..
ऐ ज़िंदगी ,थोड़ा रुक, मैं ने अभी, हार कहाँ मानी है..
ఇంక కాస్త చెదిరిపోనివ్వు, నేనిదే పట్టుబట్టాను..
ఓ జీవితమా, కాస్తాగవే, నేనింకా ఓటమిని ఒప్పుకోలేదే?..

15.12 चलो मान लिया मुझे मोहब्बत करनी नहीं आती..
मगर ये तो बताओ तुम्हें दिल तोड़ना किसने सिखाया..
సరే పో, ఒప్పుకుంటాను, నాకు ప్రేమించటం రాదని..
కానీ, ఓ మాట చెప్పు, నీకు మనసు విరవటం ఎవరు నేర్పారు?..

15.13 दिल तो करता है ख़तम कर दूँ ज़िन्दगी..
फिर ख़्याल आता है, कि वो नफ़रत किस से करेंगे..
జీవితాన్ని అంతం చేద్దామని అనిపిస్తుంది..
మళ్ళీ ఆలోచన వస్తుంది, తను ద్వేషించేందుకు ఎవరుంటారు?..

15.14 अभी बाकी हैं साँसें और जिंदा इश्क़ है मेरा..
मैं और याद आऊँगा बस तुम हौसला रखना..
ఇంకా నా శ్వాసలు మిగిలున్నాయి, ప్రేమ బ్రతికే ఉంది..
నేనింకా గుర్తుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, చాలు..

15.15 तेरे आने से पहले उदासी रहती है..
तेरे जाने के बाद उदासी छाती है..
इस बीच जो वक़्त गुज़रता है उसे मैं
ज़िन्दगी नाम देता हूँ..
నీ రాకకు ముందు దిగులుగా ఉంటుంది..
నీవు వెళిపోయాక దిగులు ఆవరిస్తుంది..
ఈ మధ్యలో గడిచే సమయాన్ని
నేను జీవితం అని అంటాను..

15.6 ऐ ख़ुदा तू कभी इश्क न करना, बेमौत मारा जायेगा..
हम तो मरके भी तेरे पास आते हैं पर तू कहाँ जायेगा..
ఓ ఖుదా, నీవెప్పుడూ ప్రేమించకు, అకారణంగా చనిపోతావు..
మేము చనిపోయి నీ వద్దకు వస్తాము, కానీ నీవెక్కడకు పోతావు?..

15.7 काश, रोने से नसीब बदल जाता..
कसम तुम्हारी, आंसुओं से दुनिया डुबो देते..
ఏడిస్తే భాగ్యం మారేది ఉంటే బాగుండేది..
కన్నీటితో ప్రపంచాన్ని ముంచేసేవాడిని, నీ మీదొట్టు

15.8 कहते हैं, प्यार की शुरुआत आँखो से होती है..
यक़ीन मानो दोस्तों..
प्यार की कीमत भी आँखों से ही चुकानी पड़ती है..
ప్రేమ కళ్ళతో ప్రారంభం అవుతుందంటారు..
నిజం నేస్తాలూ, నమ్మండి..
ప్రేమ వెల కూడా కళ్ళతోనే కట్టుకోవాల్సి వస్తుంది..

15.9 सजावट रूह की हो तो खूबसूरती निखर कर आती है..
सिर्फ चेहरों की बिसात पर दिलों के आशियाने सजाये नहीं जाते..
అలంకరణ అంతరంగానిదైతే అందం ఇనుమడిస్తుంది..
కేవలం ముఖం స్థలం మీద మనస్సుల భవంతులు తీర్చిదిద్దబడవు..

15.10 कुछ कहना चाहो तो अलफ़ाज़ ना मिलें..
आशिकों के साथ अक्सर ये इत्तेफ़ाक़ होता है..
ఏదైనా చెప్పాలనుకుంటే మాటలు దొరకకపోవటం..
ప్రేమికులకు ఇది ఎప్పుడూ యాదృచ్ఛికంగా జరుగుతుంది..

15.11 उजड़ जाते हैं सिर से पाँव तक वो लोग..
जो किसी बेपरवाह से बेइंतहा मोहब्बत करते हैं..
తలనుండి కాలిదాకా దుమ్ముకొట్టుకునిపోతారు..
ఏమీ పట్టనివారిని ఎల్లల్లేకుండా ప్రేమించేవారు..

15.12 हज़ारो ग़म है सीने में, मगर शिक़वा करें किससे?..
इधर दिल है तो अपना है, उधर तुम हो तो अपने हो..
గుండెల్లో వేలకొద్దీ బాధలున్నాయి కానీ ఎవరిని తప్పు పట్టాలి?..
ఇటు మనసూ నా సొంతమే, అటు నీవూ నా సొంతమే కదా..

15.13 कौन करता है यहाँ प्यार निभाने के लिये..
दिल तो बस एक खिलौना है जमाने के लिये
బంధం నిలుపుకునేంతగా ఇక్కడ ప్రేమించేదెవరు?..
మనసంటే లోకానికొక ఆటబొమ్మే కదా..

15.14 ख़्वाहिशों का कैदी हूँ..
मुझे हकीक़तें सज़ा देती हैं..
కోరికలకు బంధీని..
నాకు వాస్తవాలు శిక్ష వేస్తాయి..

15.15 गुज़र गया दिन अपनी तमाम रौनक लेकर..
ज़िन्दगी ने वफ़ा कि तो कल फिर सिलसिले होंगे..
సందడంతా ఏరుకుని రోజు గడిచిపోయింది..
జీవితం తోడుంటే రేపు మళ్ళీ దొంతరలు సాగుతాయి..

15.16 हमारे पूर्वज तो पत्थरों से आग लगाते थे..
हम तो बातों से ही लगा देते है..
పాతకాలం వారు రాళ్ళనుండి నిప్పు రగిల్చేవారు..
మేము మాటలతోనే రగిలించేస్తాము..

15.17 क़दर करना सीख लो..
ना ज़िंदगी वापस आती है...
ना ज़िंदगी में आये हुये लोग....
విలువను ఇవ్వటం నేర్చుకో..
జీవితమూ తిరిగి రాదు,
జీవితంలో వచ్చినవారూ తిరిగిరారు..

15.18 कई बार तबीयत दवा लेने से नहीं..
हाल पूछने से भी ठीक हो जाती है..
మందు వేసుకోవటం వల్లే కాదు..
ఆరోగ్యం పలకరింపుతో కూడా చాలామటుకు బాగైపోతుంది..

15.19 ताज्जुब न कीजिएगा ग़र कोई दुश्मन भी आपकी ख़ैरियत पूछ जाए..
ये वो दौर है जहाँ, हर मुलाकात में मकसद छुपे होते है..
ఒకవేళ ఎవరైనా విరోధి వచ్చి పలకరించి వెళితే ఆశ్చర్యపోకండి..
ప్రతీ సమాగమానికి ఏదో ఉద్దేశ్యం దాగి ఉండే కాలం ఇది..

15.20 पर्ची जो तेरे दिल की आरज़ुओं की हाथ लग जाती अगर..
इश्क़ में तेरे हम भी नकल कर के पास हो जाते..
నీ మనసులోని కోరికల చిట్టీ నా చేతికి అందితే..
నీ ప్రేమలో నేనూ కాపీ కొట్టి పరీక్ష గట్టెక్కేసేవాడిని..

15.21 किसी के पास टूटा हुआ दिल है क्या..
आधा मेरा वाला लगाकर नया दिल बनाते हैं..
ఎవరి వద్ద అయినా విరిగిన గుండె ఉందా?..
నాది సగం కలిపి పెట్టి కొత్త గుండెను చేద్దాం..

15.22 बदल लेती है रहगुज़र कोई गिला नहीं करती..
ठोकरें जहान की खाके हवाएँ गिरा नहीं करती..
దారులు మారుస్తాయి, బాధలేమీ చెప్పుకోవు..
లోకపు ఎదురుదెబ్బలు తిని కూడా గాలులు కిందపడిపోవు..

15.23 बादशाह की मात को इक्के निकल आते हैं
पक्के वादे भी जब कच्चे निकल आते हैं
ये क़िताब-ए-ज़िंदगी और रिश्तों के धागे हैं
धागे टूट जाएँ तो पन्ने निकल आते हैं
(పేకలో) రాజును పడగొట్టటానికి ఆసులు లేచివస్తాయి
ఇచ్చిన మాటలు కూడా గాలిమాటలుగా తేలిపోతాయి..
ఇది జీవితపు పుస్తకం, ఇవి అనుబంధాల దారాలు
దారాలు తునిగిపోతే పుటలు ఊడిపోతాయి..

15.24 नादान आईने को क्या खबर..
कि एक चेहरा चेहरे के अन्दर भी होता है...
పాపం, అద్దానికేం తెలుసు..
ముఖం లోపల కూడా ఇంకొక ముఖం ఉంటుందని..

15.25 वक़्त की रफ़्तार रुक गई होती
शर्म से आँखे झुक गई होती..
अगर दर्द जानती शमा परवाने का
तो जलने से पहले बुझ गई होती..
కాలపు వేగం ఆగిపోయి ఉండేది
సిగ్గుతో కన్నులు వాలిపోయి ఉండేవి..
దీపపు పురుగు నెప్పి దీపానికి తెలిసి ఉంటే
వెలిగే ముందరే మలిగిపోయి ఉండేది..

15.26 लोग तो बे-वजह ही खरीदते हैं आईने ..
आंख बंद करके भी अपनी हकीकत जानी जा सकती है ..
జనాలు అనవసరంగా అద్దం కొనుక్కుంటారు..
కన్నులు మూసుకుని కూడా తన వాస్తవం తెలుసుకోవచ్చు..

15.27 इश्क़ में तेरे नशे में चूर होता जा रहा हूँ..
मैं तुम्हेँ लिखते-लिखते मशहूर होता जा रहा हूँ..
నీ ప్రేమలో, నీ మత్తులో నేను కరిగిపోతున్నాను..
నిన్ను గురించి వ్రాస్తూ వ్రాస్తూ నేను గొప్ప పేరు గడించేస్తున్నాను..

15.28 अब तो मोहब्बत भी सरकारी नौकरी जैसी लगती है..
कंबख़्त ग़रीबों को तो मिलती ही नहीं..
ఇప్పుడు ప్రేమ కూడా ప్రభుత్వోద్యోగం లా అయిపోయింది..
ఛ, అసలు పేదవారికి దొరకనే దొరకదే..

15.29 कैसे करें इंतजार तेरे लौट आने का..
अभी दिल को यक़ीन नहीं हुआ है तेरे चले जाने का..
నీవు తిరిగిరావాలని ఎట్లా ఎదురుచూసేది?..
ఇంకా నీవు వెళిపోయిన సంగతే నా మనసు నమ్మటం లేదే..

15.30 हम तो हद से गुज़र गए थे तुम्हे चाहने में..
तुम्ही उलझे रहे हमें आज़माने में..
నేను నిన్ను కోరుకోవటంలో హద్దులు దాటిపోతునే ఉన్నాను..
నువ్వే నన్ను పరికించటంలో చిక్కుకుపోయి ఉన్నావు..

15.31 काश तेरी याद़ों का खज़ाना बेच पाते हम..
हमारी भी गिनती आज अमीरों में होती ..
నీ జ్ఞాపకాల నిధిని అమ్మగలిగితే బాగుండేది..
నన్ను కూడా ధనవంతులతో లెక్క వేసేవారు..

15.32 मोहब्बत में हमेशा अपने आप को बादशाह समझा हमने..
मगर एहसास तब हुआ जब किसी को माँगा फकीरों की तरह..
ప్రేమలో ఎప్పుడూ నన్ను నేను చక్రవర్తిననే అనుకున్నాను..
కానీ ఒకరు కావాలని బిచ్చగాడిలా అడుక్కునేవేళ కానీ నిజం తెలియలేదు..

15.33 इश्क़ ना होने के सिर्फ़ दो ही तरीक़े थे..
या दिल ना होता, या तुम ना होते..
ప్రేమ కలగకుండా ఉండటానికి రెండే మార్గాలు..
మనసైనా ఉండాల్సింది కాదు, నీవైనా ఉండకుండా ఉండాలి..
నా మనసో, నీవో - ఎవరో ఒకరు ఉండాల్సింది కాదు..

15.34 चलो, अब जाने भी दो, क्या करोगे दास्तां सुनकर..
खामोशी तुम समझोगी नहीं, और बयां हमसे होगी नहीं..
ఇక వదిలేయరాదా, ఏం చేస్తావు జరిగింది విని..
మౌనమేమో నీకు అర్థం కాదు, వ్యక్తపరచటమేమో నా వల్ల కాదు..

15.35 बारिश और मोहब्बत दोनों में फर्क़ बस इतना है कि..
एक में जिस्म भीग जाता है, और दूसरी में आखें..
వాన ప్రేమ- రెండిటిలో తేడా ఇంతే..
ఒకదానిలో శరీరం తడుస్తుంది, ఇంకోదానిలో కన్నులు..

15.36 वो अपनी तन्हाई की खातिर फिर आ मिला मुझसे..
हम नादान ये समझे हमारी दुआओं में असर है..
తను తన ఒంటరితనం వల్ల మళ్ళీ నన్ను కలిశాడు..
నేనేమో వెర్రిదాన్ని నా ప్రార్థనల ఫలితమని అనుకున్నాను..

15.37 वो अक्सर मुझसे पूछा करती थी..
तुम मुझे कभी छोड़ कर तो नहीं जाओगे..
काश मैंने भी पूछ लिया होता..
తను ఎప్పుడూ అడిగేది,
నన్ను విడిచి పోవు కదా అని..
నేనూ అడిగి ఉంటే బాగుండేది..

15.38 वो ना ही मिलते तो अच्छा था..
बेकार में मोहब्बत से नफ़रत हो गई..
తను కలవనే కలవకపోతే బాగుండేది..
అనవసరంగా ప్రేమంటే ద్వేషం పుట్టింది..

15.39 ज़िन्दगी में ज़िन्दगी से हर चीज़ मिली..
मगर उनके बाद ज़िन्दगी न मिली..
జీవితంలో జీవితంనుండి అన్ని వస్తువులు దొరికాయి..
కానీ తన తరువాత జీవితమే దొరకలేదు..

15.40 अब शिकायतें तुम से नहीं, खुद से है..
माना के सारे झूठ तेरे थे..
लेकिन उन पर यकिन तो मेरा था..
ఇక నా ఆవేదన నీగురించి కాదు, నా గూర్చే..
అబద్ధాలన్నీ నీవే కావచ్చు గాక..
కానీ వాటి మీద నమ్మకం మాత్రం నాదే కదా..

15.41 रंग तेरी यादों का ना उतरा अब तक..
लाख बार खुद को आँसुओं से धोया हमने..
నీ జ్ఞాపకాల రంగు ఇంకా దిగటమే లేదు..
లక్షసార్లు నన్ను నేను అశ్రువులతో కడుక్కున్నాను..

15.42 भूल जाने का मशवरा और जिंदगी बनाने की सलाह..
ये कुछ तोहफ़े मिले थे उनसे, आखिरी मुलाकात में..
మర్చిపొమ్మని సలహా, జీవితం దిద్దుకోమని పరామర్శ..
ఇవి తననుండి చివరగా కలసినప్పుడు దొరికిన కానుకలు..

15.43 चलते रहेंगे क़ाफ़िले मेरे बग़ैर भी यहाँ..
एक तारा टूट जाने से फ़लक़ सूना नहीं होता..
నేను లేకుండా కూడా ఇక్కడ యాత్రలు సాగుతుంటాయి..
ఒక చుక్క రాలినంతమాత్రాన ఆకాశం శూన్యమైపోదు..

15.44 यूँ ही हम दिल को साफ़ रखा करते थे..
पता नहीं था कि क़ीमत चेहरों की होती है..
నేను మనసును స్వచ్ఛంగా ఉంచుకున్నది వృథా అయింది..
విలువ ముఖాలకు ఇస్తారని తెలియదు కదా..

15.45 हर रात जान बूझकर रखता हूँ दरवाज़ा खुला..
शायद कोई लुटेरा मेरा ग़म भी लूट ले..
ప్రతీ రాత్రి కావాలనే తలుపులు తీసి పెడతాను..
ఎవరైనా దోపిడీవాడు నా బాధను దోచుకుపోతే బాగుండు..

15.46 वही रिश्ता, वही नाता, वही मैं और वही तुम..
बस, अब वक्त ना रहा तेरे पास, इज़हार-ए-मोहब्बत के लिए..
అదే బంధం, అదే అనుబంధం, అదే నేను, అదే నీవు..
కానీ నీ వద్ద ఇప్పుడు వ్యవధి లేదు, ప్రేమను వ్యక్తం చేయటానికి..

15.47 फर्क़ है तुम्हारी और मेरे दर्द में..
तुम्हारी आँखें रोती है और हमारा दिल..
నా నెప్పిలో, నీ నెప్పిలో చాలా తేడా ఉంది..
నీవేమో కన్నులు ఏడుస్తాయి, నాదేమో మనస్సు..

15.48 बहुत तकलीफ़ देते है वो ज़ख़्म..
जो बिना बात के मिलते है..
చాలా కష్టపెడతాయి ఆ గాయాలు..
అకారణంగా తగిలేవి..

15.49 अजीब सबूत माँगा उसने मेरी मोहब्बत का..
के भूल जाओ तो मानूँ कि मुझसे मोहब्बत है..
చాలా విచిత్రమైన ఋజువు కావాలన్నారు వారు ప్రేమకు..
నన్ను మర్చిపో, ఎప్పుడే ఒప్పుకుంటా, నీకు నేనంటే ఇష్టమని..

15.50 बहुत अंदर तक तबाही मचाता है..
वो आँसू जो आँख से बह नहीं पाता..
చాలా లోతుగా నాశనం చేస్తుంది..
కంటిని వీడలేకపోయిన ఆ కన్నీటి చుక్క..


15.51 तुम रख न सकोगे मेरा तोहफ़ा संभालकर..
वरना मैं अभी दे दूँ, जिस्म से रूह निकालकर..
నీవు నా కానుకను జాగ్రత్తగా ఉంచుకోలేవు..
లేదంటే ఇప్పుడే నా శరీరంనుండి అంతరాత్మను తీసిచ్చేస్తాను..

15.52 बेवफ़ा लोग बढ़ रहे हैं धीरे धीरे..
इक शहर अब इनका भी होना चाहिए..
నమ్మకద్రోహులు పెరుగుతున్నారు నెమ్మదిగా..
వీరిది కూడా ఒక ఊరు (విడిగా) ఉండాలి..

15.53 कसूर तो बहुत किये ज़िन्दगी में..
पर सज़ा वहाँ मिली जहाँ बेक़सूर थे हम..
తప్పులు చాలా చేశాను జీవితంలో..
కానీ నిరపరాధినైన చోటే శిక్ష పడింది..

15.54 याद आ जाये तो बता देना
मैं ने आज भी दिल के दरवाज़े खुले रखे है
నేను జ్ఞాపకం వచ్చినట్లైతే చెప్పు..
ఈనాటికి కూడా మనసు తలుపులు తీసే ఉంచాను..

15.55 बिना उसके दिल का हाल कैसे बतलाऊँ..
जैसे खाली बस्ता हो किसी नालायक बच्चे का..
తను లేకుండా మనసెట్లా ఉందో ఎట్ల చెప్పను?..
ఒక అల్లరిపిల్లవాడి ఖాళీ సంచీలా..

15.56 मैं तुम पर अपनी जान भी लुटा दूँ..
तुम मुझ से मुझ जैसी मोहब्बत तो करो..
నేను నీకై ప్రాణాలు సైతం ఇచ్చేయగలను..
నువ్వు నన్ను నాలాగా ప్రేమించనైతే ప్రేమించు..

15.57 लिखना तो ये था कि, खुश हूँ तेरे बग़ैर भी..
पर कलम से पहले आँसू कागज़ पर गिर गया..
నీవు లేకుండా కూడా సంతోషంగా ఉన్నానని వ్రాయాలనుకున్నా..
కానీ కలం కన్నా ముందు కన్నీటి బొట్టు కాగితం పై పడింది..

15.58 दुख तो अपने ही देते हैं वरना..
ग़ैरों को कैसे पता की हमें तकलीफ़ किस बात से होती है..
బాధపెట్టేవారు మనవారే ఉంటారు, లేకపోతే..
పరాయివారికి ఏం తెలుసు, దేనివల్ల మనను నొప్పించవచ్చో..

15.59 तनहा ही उम्र गुज़रती है..
लोग तसल्लिया देते है साथ नहीं..
ఒంటరిగానే జీవితం గడుస్తుంది..
జనాలు ఆశ్వాసనలిస్తారు, చేయూతనివ్వరు..

15.60 कमाल का जिगर रखते है कुछ लोग..
दर्द पढ़ते है और आह तक नहीं करते..
భలే నిబ్బరం ఉంటుంది కొందరికి..
దుఃఖాన్ని చదువుతారు, అయ్యో అని కూడా అనరు..


15.61 ले लूंगा अपने सर पे ,मैं, तोहमतें सारी..
इल्ज़ाम मोहब्बत पे लगाया न जाएगा..
నా తలమీదకే అన్ని నెపాలూ వేసేసుకుంటాను..
ప్రేమ మీద ఏ నేరమూ మోపబడదు..

15.62 बेहतरीन होता है वो रिश्ता,
जो तकरार होने के बाद भी..
सिर्फ़ एक मुस्कुराहट पर पहले जैसा हो जाए..
అద్భుతమైనది ఆ అనుబందం,
పోట్లాట తరువాత కూడా
ఒకే ఒక్క చిరునవ్వుతో ఇదివరకటిలాగా అయిపోయేది..

15.63 यह बारिश भी तेरे दर्द जैसी ही है..
हल्की हल्की ही सही पर होते जा रही है..
ఈ వర్షం కూడా నిను గూర్చిన వేదన లాంటిదే..
కొద్దికొద్దిగా అయినా నానుడుగా పడుతూనే ఉంది..

15.64 सुख-दुख की ना जाने कितनी फाइलें छुपा रखी हैं इस दिल में..
कौन कहता है कि सीने में अलमारियां नहीं होती.
సుఖదుఃఖాల ఫైళ్ళు ఎన్ని దాగి ఉన్నాయో ఈ గుండెలో..
ఎవరన్నారు, ఛాతిలో గూళ్ళు ఉండవని..

15.65 तेरी तस्वीर, तेरी यादें, तेरे ख़्वाब, तेरी ही बातें..
मैं अपने ही मकान में जैसे किरायेदार सा हूँ..
నీ రూపం, నీ జ్ఞాపకాలు, నీ కలలు, నీవే మాటలు..
నేను నా సొంత ఇంట్లోనే బాడుగకు ఉన్నట్టుంది..

15.66 घर का आईना भी अब हक़ जताने लगा है..
ख़ुद तो वैसा ही है, पर मेरी उम्र बताने लगा है..
ఇంట్లో అద్దం కూడా ఇప్పుడు హక్కు వినియోగిస్తోంది..
తాను మారలేదు కానీ నా వయసును చూపించటం మొదలుపెట్టింది..

15.67 एक अजीब सी दौड़ है ये जिन्दगी..
जीत जाओ तो कई अपने पीछे छूट जाते हैं..
और हार जाओ तो, अपने ही पीछे छोड़ जाते हैं..
జీవితం భలే తమాషా పరుగు పందెం..
గెలిస్తే సొంతవారెందరో వెనకే వీడిపోతారు..
ఓడితే సొంతవారే విడిచిపెట్టేస్తారు..

15.68 जाने कौन सी शौहरत पर आदमी को नाज़ है..
जो आखरी सफ़र के लिए भी दूसरे का मोहताज है..
ఏ ఆస్తిపాస్తులు చూసుకుని మనిషి గొప్పలకు పోతాడో..
అంతిమయాత్రకు కూడా ఇతరులపై ఆధారపడేవాడు..

15.69 याद आयेगी हमारी तो बीते कल की किताब पलट लेना..
यूँ ही किसी पन्ने पर मुस्कुराते हुए हम मिल जायेंगे..
నేను గుర్తుకువస్తే గతం పుస్తకం పుటలు తిప్పుకో..
ఎక్కడో ఒకచోట చిరునవ్వుతో తప్పక కనిపిస్తాను..

15.70 यूँ तो ग़लत नहीं होते अंदाज़ चहरों के..
लेकिन लोग वैसे भी नहीं होते जैसे नज़र आते है..
చెప్పాలంటే, ముఖాలు చూసి ఊహించినది తప్పేం పోదు..
కానీ జనాలు కనిపించినట్లే ఉండరు కదా..

15.71 तेरा हाथ लूँ हाथ में और फिर ऐसा हो..
कि तेरे ग़म ख़ुद ब ख़ुद मुझमें उतर जाये..
నీ చేతిని నా చేతిలోకి తీసేసుకున్నాక, ఇట్లా జరగాలి..
నీ దుఃఖాలన్నీ వాటికవే నాలోకి దిగిపోవాలి..

15.72 अबके सावन में हुई ये कैसी बरसात..
बादल बरसे दो घड़ी और नैना सारी रात..
ఈసారి శ్రావణంలో ఇదొక విచిత్ర వర్షం..
మబ్బులు కొద్ది సేపే, కన్నులు కురిసింది మాత్రం రాత్రల్లా..

15.73 खुद को खोने का पता नहीं चला..
किसी को पाने की यूँ इन्तहा कर दी मैं ने..
నన్ను నేను పోగొట్టుకున్నది తెలియనే లేదు..
ఒకరిని పొందటంలో చరమసీమకు వెళిపోయాను..

15.74 उनकी जब मर्ज़ी होती है वो हमसे बात करते हैं..
और हम भी पूरा दिन उनकी मर्ज़ी का इंतज़ार करते हैं..
వారికి ఇష్టం ఉన్నప్పుడు వారు మాతో మాట్లాడతారు..
మేము కూడా రోజంతా వారి ఇష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటాము..

15.75 खूबसूरती न सूरत में होती है न लिबास में..
बस, निगाहें जिसे चाहे उसे हसीन कर दें..
అందం ముఖంలోనూ ఉండదు, బట్టలలోనూ ఉండదు..
చూపులు ఎవరిని తలుచుకుంటే వారిని అందంగా చేసేయగలవు..

15.76 लफ़्ज़ मेरी पहचान बने तो बेहतर है..
चेहरे का क्या? वो तो साथ चला जाएगा..
మాటలే నా గుర్తింపు అయితే మంచిది..
ముఖానిదేముంది, అది నా వెంటే వెళిపోతుంది..

15.77 तुम्हें कितनी मोहब्बत है, मालूम नहीं..
मुझे लोग आज भी तेरी क़सम दे कर मना लेते है..
నీకెంత ప్రేమ ఉందో నేనెరుగను..
జనాలు నన్ను ఈనాటికి కూడా నీ మీద ఒట్టేసి ఒప్పించేసుకుంటారు..

15.78 दुनिया की भीड़ में तुझे याद कर सकूँ कुछ पल..
अजनबी राहों की तरफ़ कदम मोड़ता हूँ..
ఈ లోకం రద్దీలో కొద్దిసేపు నిన్ను తలచుకుందామని..
తెలియని దారుల్లోకి అడుగులు మళ్ళిస్తాను..

15.79 वफ़ा उनसे ना पूँछो जो आंसू बहाते हैं..
वफ़ा उनसे पूँछो जो उन्हें पी जातें हैं
విశ్వాసమంటే ఏంటని కన్నీరు కార్చేవారిని అడగకండి..
కన్నీరు (మౌనంగా లోలోపలే) తాగేసేవారిని అడగండి..

15.80 आँसू निकल पड़े ‪ख़्वाब‬ में ‪उसको‬ दूर जाते ‪‎देखकर‬.. ‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬
आँख ‪‎खुली‬ तो ‪एहसास‬ हुआ ‪इश्क‬ सोते ‪‎हुए‬ भी ‪‎रुलाता‬ है..‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬
 కన్నీరు కారింది, కలలో తను దూరం కావటం చూసి..
కళ్ళు తెరిచాక అనిపించింది, ప్రేమ నిద్రలో ఉన్నవారినీ ఏడిపిస్తుందని..

15.81 ज़िंदगी एक सफ़र है, आराम से बढ़ते चलो..
उतार चढ़ाव तो आते रहेंगे, बस गियर बदलते रहो..
జీవితం ఒక ప్రయాణం, సాగుతూ ఉండండి..
ఎత్తుపల్లాలు వస్తుంటాయి, గేర్ మారుస్తూండండి..

15.82 जनाजों में भीड़ ऐसे ही नहीं होती..
हर इंसान अच्छा है
बस इस दुनिया से चले जाने के बाद
అంతిమయాత్రలో రద్దీ అనేది అకారణంగా ఉండదు..
ప్రతివాడూ మంచివాడే, లోకంవీడి వెళిపోయాక..

15.83 बार–बार वो हिसाब करने बैठ जाते हैं..
जबकि उनको पता है जो भी हुआ बेहिसाब हुआ..
మాటిమాటికీ వారు లెక్కలకు కూర్చుంటారు..
తనకు తెలుసు, ఏది జరిగినా లెక్కకందనంత జరిగిందని..

15.84 वो जा रही थी और मैं ख़ामोश खड़ा देखता रहा..
क्योंकि सुना था कि पीछे से आवाज़ नहीं देते..
తను వెళిపోతున్నది, నేను మౌనంగా నిలబడి చూస్తూండిపోయాను..
ఎందుకంటే వెనకనుంచి ఎవరినీ పిలవకూడని విన్నాను..

15.85 मोहब्बत की तरह नफ़रत का भी साल में एक ही दिन तय कर दो कोई..
ये रोज़-रोज़ की नफ़रतें अच्छी नहीं लगतीं..
ప్రేమలాగే ద్వేషానికీ ఏడాదికొక రోజు నిర్ణయించండి ఎవరైనా..
ఈ దైనందిన ద్వేషాలు నాకు నచ్చటం లేదు..

15.86 दिल से खेलना तो हमे भी आता है..
लेकिन जिस खेल में खिलौना टूट जाए, वो खेल हमें पसंद नहीं..
మనసులతో ఆడుకోవటం నాకూ ఇష్టమే..
కానీ ఏ ఆటలో బొమ్మ తునకలౌతుందో, ఆ ఆట నాకు నచ్చదు..



15.87 हम बेक़सूर लोग भी बड़े दिलचस्प होते हैं..
शर्मिंदा होजाते हैं ख़ता के बग़ैर भी..
మనం నిర్దోషులం కూడా భలే ఆసక్తికరమైనవాళ్ళం..
తప్పు చేయకుండానే తల వంచుకుంటాం..
(స్వతంత్రించాను)

15.88 ज़रूरी तो नहीं कि दौलत ही अमीरी का पैमाना हो..
कुछ लोगों के पास आप जैसे दोस्त भी होते हैं..
ఆస్తిపాస్తులే ఉన్నవారనటానికి సంకేతం కాదు..
కొందరి వద్ద మీవంటి స్నేహితులు కూడా ఉంటారు..

15.89 चाँद देखकर मुस्कुराना बेशक ईद हैं..
लेकिन इंसान इंसान को देखकर मुस्कुराये तो रोज़ ईद हैं..
చంద్రుని చూసి చిరునవ్వు చిందించటం నిస్సందేహంగా ఈద్ పండగే..
కానీ మనిషి మనిషిని చూసి చిరునవ్వు నవ్వితే ప్రతిరోజూ ఈద్ పండగే..

15.90 आदत नहीं है, मुझे सब पे फ़िदा होने की..
पर तुझ में कुछ बात ही ऐसी है कि,
दिल को समझने का मौका ही नहीं मिला..
నాకు అలవాటు లేదు, అందరిమీదా మనసు పారేసుకోవటం..
కానీ నీలో ఏదో ఉంది- దానితో..
మనసుకు అర్థం చేసుకునే అవకాశమే దొరకలేదు..

15.91 एक ग़ज़ल तेरे लिए ज़रूर लिखूंगा
बे-हिसाब उस में तेरा कसूर लिखूंगा..
टूट गए बचपन के तेरे सारे खिलौने
अब दिलों से खेलना तेरा दस्तूर लिखूंगा..
నీకోసం ఓ పాట వ్రాస్తాను
అందులో లెక్కలేని నీ తప్పిదాలను వ్రాస్తాను..
చిన్ననాటి నీ ఆటబొమ్మలన్నీ విరిగిపోయాయి..
ఇక మనసులతో ఆడుకోవటం నీ పద్ధతని వ్రాస్తాను..

15.92 क्या पता तुम कब भूल जाओ ये मोहब्बत..
जिसे हम ज़िन्दगी और तुम एक लफ्ज़ कहते हो..
దేన్ని నేను జీవితమంటాను, నీవు ఒక పదమని అంటావో..
అట్టి ఈ ‘ప్రేమ’ను నువ్వు ఏ క్షణాన మర్చిపోతావో ఏమో..

15.93 आज मुझे राख समझकर मेरी हंसी उडा लोगे..
मेरे ख्वाब छुओगे जिस दिन अपने हाथ जला लोगे..
ఈనాడు నన్ను బూడిద గా భావించి వెక్కిరిస్తావు..
నా కలలను తాకిననాడు, నీ చేతులు కాలిపోగలవు..

15.94 अहमियत और दूरियों में अनोखा रिश्ता है..
दोनों एक साथ बढ़ती हैं..
గొప్పతనం, దూరం- వీటికి భలే విచిత్ర అనుబంధం..
రెండూ ఒకేసారి పెరుగుతాయి..

15.95 किसी को न पाने से ज़िंदगी खत्म नहीं हो जाती..
पर किसी को पाकर खो देने के बाद कुछ बाकी भी नहीं बचता..
ఒకరిని పొందనందువల్ల జీవితం అంతమైపోదు..
కానీ ఎవరినైనా పొంది పోగొట్టుకున్నాక మిగిలింది కూడా ఏమీ ఉండదు..

15.96 तकिये क़े नीचे दबा क़े रखे हैँ तुम्हारे ख़याल..
एक तेरा अक्स, एक तेरा इश्क़..
ढेरों सवाल और तेरा इंतज़ार..
దిండు కింద మడిచి పెట్టేశాను నీ గురించిన ఆలోచనలను..
ఒక నీ చిత్రాన్ని, ఒక నీ ప్రేమను,
గుట్టల కొద్దీ ప్రశ్నలను, నీ గురించిన ప్రతీక్షను..

15.97 मेरे ज़ख्म का अंदाज़ा ना लगा..
दिल का हर पन्ना दर्द की किताब है..
నా గాయాలను అంచనా వేయకు..
మనసులో ప్రతి పుటా బాధల గ్రంథమే..

15.98 निकाल दिया उसने हमें अपनी ज़िन्दगी से भीगे कागज़ की तरह..
ना लिखने के काबिल छोड़ा ना जलने के..
నన్ను తీసిపారేశారు వారు, తన జీవితం నుండి, తడిసిన కాగితంలా..
వ్రాతకూ పనికిరాను, కాలిపోవటానికీ కుదరదు..

15.99 कोई इल्ज़ाम रह गया हो तो वो भी दे दो..
पहले भी हम बुरे थे, अब थोड़े और सही..
ఏదైనా నెపం మిగిలితే అదీ వేసేసేయి..
మొదలూ చెడ్డవారమే, ఇక ఇంకొంత ఎక్కువైతే ఏంటి..

15.100 दो आँखो में दो ही आँसू..
एक तेरे लिए, एक तेरी खातिर..
రెండు కన్నులలో రెండే కన్నీటి చుక్కలు..
ఒకటి నీ కోసం, మరొకటి నీ కొరకు..

15.101 लोगों की बातें सुनकर छोड़ जाने वाले..
हम कितने बुरे थे तुम पता तो कर लेते..
జనాల మాటలు విని వదిలివెళ్ళే మనిషీ..
నాలో ఎంత చెడుందో స్వయంగా తెలుసుకోవలసింది కదా..

15.102 कुछ उनकी मजबूरियाँ, कुछ मेरी कश्मकश..
बस यूँ ही एक ख़ूबसूरत कहानी को खत्म कर दिया हमने..
కొంత తన అసహాయత, కొంత నా అసమంజసం..
దానితో ఒక అందమైన కథను అంతం చేశాము మేము..

15.103 आप भले अपनी जिंदगी से खुश नहीं हो
पर कुछ लोग ऐसे भी है जो
आप जैसी जिंदगी जीने के लिए तरसते है
మీకు మీ జీవితం సంతోషంగా లేకపోవచ్చు..
కానీ కొందరు మీ వంటి జీవితాన్ని
జీవించాలని కోరేవారూ ఉంటారు.. 

15.104 उस मोड़ से शुरू करनी है फिर से जिंदगी..
जहाँ सारा शहर अपना था और तुम अजनबी..
ఎక్కడైతే ఊరంతా నా సొంతం, నువ్వు ఏ మాత్రం పరిచయం లేవో..
మరోమారు జీవితాన్ని ఆ కోణంనుంచి మొదలుపెట్టాలనుంది..

15.105 बड़ी आसानी से दिल लगाये जाते हैं..
पर बड़ी मुश्किल से वादे निभाए जाते हैं..
చాలా సులవుగా మనసులిచ్చి పుచ్చేసుకుంటారు..
చాలా కష్టంమీద మాట నిలుపుకుంటారు..

15.106 दूरियों से ही एहसास होता है कि..
नज़दीकियाँ कितनी ख़ास होती है..
దూరాల వల్లే తెలుస్తుంది..
దగ్గరితనాలెంత గొప్పవో అని..

15.107 तुम्हारे बाद मेरा कौन बनेगा हमदर्द..
मैं ने अपने भी खो दिए, तुझे पाने की ज़िद में..
నీ తరువాత నాకెవరుంటారు, బాధను పంచుకునేవారు?..
నిన్ను పొందాలనే పట్టుదలలో నా సొంతవారిని కూడా పోగొట్టుకున్నాను..

15.108 तुम ही वजह मेरे खालीपन की..
और, तुम्ही गूंजते हो मुझमें हरदम..
నా శూన్యస్థితికీ నువ్వే కారణం..
నువ్వే మోగుతుంటావు నాలో ప్రతిక్షణం..

15.109 जब बेअसर से होने लगें मन्नतों के धागे..
समझ लो और इम्तिहान हैं इसके आगे..
ప్రార్థనలన్నీ వ్యర్థమవుతున్నాయంటే..
దగ్గరలో పరీక్ష ఉందని అర్థం..

15.110 बुरे हैं हम तभी तो जी रहे हैं..
अच्छे होते तो दुनिया कहाँ जीने देती..
చెడ్డవారం కాబట్టే బ్రతుకుతున్నాము..
మంచివారమైతే ప్రపంచం ఎక్కడ బ్రతకనిస్తుంది..

15.111 भुला देंगे तुमको ज़रा सब्र तो कीजिये..
आपकी तरह मतलबी बनने में थोड़ा वक़्त तो लगेगा हमें..
మర్చిపోతాను మిమ్మల్ని కాస్త ఓర్పు పట్టండి..
మీ లాగా స్వార్థపరులం కావటానికి కాస్తైనా సమయం పడుతుంది కదా..

15.112 अबकी बार सुलह करले मुझसे..
ए दिल, वादा करता हूँ..
कि फिर नहीं दूँगा तुझे किसी ज़ालिम के हाथों में..
ఈసారికి సంధిచేసుకో నాతో..
ఓ మనసా, మాటిస్తున్నాను..
ఇంకోసారి నిన్ను ఏ నిర్దయుల చేతిలో పెట్టను..

15.113 ऐ इश्क़, तेरा वक़ील बन के बुरा किया मै नें..
यहाँ हर शायर तेरे ख़िलाफ़ सबूत लिए बैठा हैं..
ఓ ప్రేమా, నీ తరఫు న్యాయవాదినై తప్పు చేశాను..
ఇక్కడ ప్రతీ కవి నీకు విరుద్ధంగా సాక్ష్యాధారాలు పెట్టుకుని కూర్చున్నాడు..

15.114 इरादा कतल का था तो मेरा सिर कलम कर देते..
क्यों इश्क़ में डाल कर तूने मेरी हर साँस पर मौत लिखदी..
హత్యచేయటం లక్ష్యమైతే నా తల తెగేయవలసింది..
ఎందుకు ప్రేమలో పడేసి నా ప్రతి ఊపిరిపై మృత్యువును వ్రాసేశావు?..

15.115 वो सुना रहे थे अपनी वफ़ाओं के किस्से..
हम पर नज़र पड़ी तो खामोश हो गए..
వారు వినిపిస్తున్నారు, తమ విశ్వస్తత గాథలు..
మా పై దృష్టి పడగానే మౌనం వహించారు..

15.116 उसने कहा, तुम मुझे ज़हर लगती हो..
मैंने भी बोल दिया, खा के मर जा..
అతనన్నాడు- నువ్వు నాకు విషంలా అనిపిస్తావని..
నేనూ అన్నాను- తిని చచ్చిపొమ్మని..