1.1. ये मुश्किलें, ये
कशमकश,
ये जद्दोजहद, ये
दुश्वारियां..
ऐ जिंदगी तू लाख नखरे दिखा,
तुझसे इश्क है, तो है..
ఈ కష్టాలు, ఈ సంఘర్షణలు, ఈ ప్రయత్నాలు, ఈ
దురూహతలు(కాఠిన్యాలు)..
ఓ జీవితమా, నీవు లక్ష వేషాలు వేయి, నీవంటే ప్రేమ ఉంది,
అంటే
ఉంది- అంతే..
1.2. मेरे लफ्जों से न कर मेरे किरदार का
फ़ैसला..
तेरा वजूद मिट जायेगा मेरी हकीकत ढूंढ़ते
ढूंढ़ते..
నా మాటలతో నా వ్యక్తిత్వాన్ని నిశ్చయించకు..
నా వాస్తవాలు వెతుకుతూ వెతుకుతూ నీ అస్తిత్వం మాసి(సమసి)పోతుంది..
1.3. पाँव हौले से रख कश्ती से उतरने वाले..
ज़मीं अक्सर किनारों से ही खिसका करती है..
కాలు నెమ్మదిగా కింద పెట్టు, ఓ పడవ దిగేవాడా..
అప్పుడప్పుడు తీరాలనుంచే భూమి కదిలి(జరిగి)పోతుంటుంది..
1.4. जिस्म पर जो निशान हैं ना जनाब..
वो सारे बचपन के हैं,
बाद के तो सारे दिल पर लगे हैं !!
శరీరం మీద గుర్తులన్నీ చిన్నతనంలో తగిలినివే..
తరువాత తగిలినవన్నీ మనస్సు మీదే తగిలాయండీ..
1.5. ये नर्म मिज़ाजी है कि फूल कुछ नहीं कहते..
वरना कभी दिखलाइये कांटों को मसलकर..
పూవులు మృదు స్వభావం కలవి కనుక ఏమనవు..
లేదంటే, ఓసారి ముళ్ళను నలిపి చూపించండి..
1.6. गुरुर किस बात का साहब?..
आज मिट्टी के ऊपर तो कल मिट्टी में..
పొగరు దేనికండీ? ఇవాళ మట్టి పైన ఉన్నాము..
రేపు మట్టిలో ఉంటాము..
(मिट्टी के नीचे - మట్టి కింద- అని
ఉండింది- కానీ అది హింద్వేతరుల సిద్ధాంతం)
1.7. तेरी बन्दगी से मिली है मेरे वजूद को
शोहरत..
मेरा जिक्र ही कहाँ था तेरी रहमत से पहले..
నీ ఆరాధన వల్లే నా అస్తిత్వానికి పేరుప్రఖ్యాతలు..
నీ అనుగ్రహానికి ముందు నా ప్రస్తావనే ఎక్కడుంది?
1.8. मंदिर में क्या ढूँढते हो मुझे..
मैं तो वहाँ भी हूँ
जहाँ तुम गुनाह किया करते हो..
దేవమందిరంలో ఏం వెతుకులాడతావు నన్ను..
నువ్వు పాపం చేసే చోటులో కూడా నేనున్నాను..
1.9. मशहूर हुए वो जो कभी क़ाबिल ना थे..
कमबख़्त मंजिल भी उन्हें मिली
जो दौड़ में कभी शामिल ना थे..
ఏ అర్హత లేనివారు చాలా గొప్ప పేరు పొందారు..
గమ్యం కూడా దొరికింది, అసలు పరుగులో పాల్గొననివారికి..
1.10. घटाएं आ गई हैं आसमां पे, दिन सुहाने हैं..
मेरी मजबूरी, मुझे बारिश
में भी काग़ज़ कमाने हैं..
ఆకాశంలో మేఘాలు పరుచుకున్నాయి, రోజులు అందంగా
ఉన్నాయి..
నా నిస్సహాయత ఏమంటే, వానలో కూడా నేను
కాగితాలు కూడబెట్టాలి..
1.11. जब तक ज़िन्दगी है, रोज़
डी पी बदलिये..
बाद में तो एक ही फोटो में टंगे रहना है..
జీవించి ఉన్నంతకాలం రోజూ ప్రదర్శన చిత్రం (ప్రొఫైల్ ఫోటో)
మార్చండి..
తరువాత ఎటూ ఒకటే చిత్రంలో వేలాడక తప్పదు..
1.12. लोग तो बेवजह ही खरीदते हैं आईने..
आँखें बंद करके भी अपनी हकीकत जानी जा सकती है..
జనాలు అకారణంగా కొంటారు అద్దాలు..
కళ్ళు మూసుకుని కూడా వాస్తవాన్ని తెలుసుకోవచ్చు..
1.13. तकलीफ़ खुद ही कम हो गई..
जब अपनों से उम्मीद कम हो गई..
బాధ దానికదే తగ్గిపోయింది..
సొంతవారిపై ఆశలు తగ్గిపోంగానే..
1.14. तोड़ो न तुम आईने चेहरे हजार दिखेंगे..
अभी तो हम सिर्फ एक है फिर बेशुमार दिखेंगे..
పగలగొట్టకు అద్దాలను, ముఖాలు వేలలో
కనిపిస్తాయి..
ఇప్పుడు నేను ఒక్కటిగానే ఉన్నాను, తరువాత అనంతంగా
కనిపిస్తాను..
1.15. शीशा टूटे और बिखर जाये वो बेहतर है..
दरारे ना जीने देती हैं ना मरने देती है..
అద్దాలు విరిగిపోయి, చెదిరిపోయిందే నయం..
పగుళ్ళు బ్రతకనివ్వవు, చావనివ్వవు..
1.16. पूरी रात जागकर गुजार दूं उसकी खातिर..
एक बार वो कहकर तो देखें की- "मुझे
तुम्हारे बिना नींद नहीं आती"..
తన కోసం రేయంతా మెలుకువతో గడపగలను..
ఒక్కసారి చెప్పి అయితే చూడమను.. "నీవు లేకపోతే నాకు
నిద్ర రాదని"..
1.17. शिकायतों की पाई पाई जोड़ कर रखी थी मैं
ने..
दोस्त ने गले लगा कर सारा हिसाब बिगाड़ दिया..
అభియోగాలు కణం కణం జోడించి పెట్టుకున్నాను..
స్నేహితుడు గుండెకు హత్తుకుని మొత్తం లెక్కలు పాడు చేశాడు..
1.18. उनसे अब कोई वास्ता तो नहीं हैं मेरा..
लेकिन उनके हिस्से का वक़्त आज भी तनहा ही गुजरता
हैं..
తనతో ఇక నాకు ఎటువంటి అనుబంధమూ లేదు..
కానీ తన వంతు సమయం ఇప్పటికీ ఒంటరిగానే గడుస్తుంది..
1.19. दुनिया में सब चीज मिल जाती है..
केवल अपनी गलती नहीं मिलती..
లోకంలో అన్ని వస్తువులు దొరుకుతాయి..
కేవలం మన తప్పు దొరకదంతే..
1.20. भगवान से वरदान माँगा कि..
दुश्मनों से पीछा छुड़वा दो..
अचानक दोस्त कम हो गये..
భగవంతుడిని వరం అడిగాను..
శత్రువుల బారి నుంచి నన్ను విడిపించు అని..
అకస్మాత్తుగ కొందరు స్నేహతులు తగ్గిపోయారు..
1.21. जितनी भीड़, बढ़ रही
ज़माने में..
लोग उतनें ही, अकेले होते
जा रहे हैं..
సమాజంలో ఎంత జనసమ్మర్దం (రద్దీ) పెరుగుతున్నదో..
జనాలు అంత ఒంటరిగా అయిపోతున్నారు..
1.22. जला हुआ जंगल छुपकर रोता रहा तन्हाई में..
लकड़ी उसी की थी, उस
दियासलाई में..
కాలిన అడవి రహస్యంగా ఏడుస్తుంది ఒంటరిగా..
ఆ అగ్గిపుల్లలో పుల్ల తనకు చెందిందే..
1.23. किनारे पर तैरने वाली लाश को देखकर ये समझ
आया..
बोझ शरीर का नहीं, साँसों
का था..
ఒడ్డున తేలుతున్న శవాన్ని చూసి అర్థమైంది..
బరువు శరీరానిది కాదు, శ్వాసలదని..
1.24. तारीख हज़ार साल में, बस इतनी सी बदली है..
तब दौर पत्थर का था, अब
लोग पत्थर के हैं..
వేల సంవత్సరాల తరువాత పద్ధతి మారినది ఇంతే..
అప్పుడు యుగం రాతిది, ఇప్పుడు జనాలు
రాళ్ళు..
1.25. कमी तो होनी है पानी की शहर में..
न किसी की आँख में बचा है, न किसी के जज़्बात में..
ఊళ్ళో నీరు లేకపోవటం సహజమే కదా.. (జరగవలసిందే)..
ఎవ్వరి కళ్ళలోనూ మిగలలేదు, ఎవ్వరి భావాలలోనూ
మిగలలేదు..
1.26. सब कुछ मिला सुकून की दौलत न मिली..
एक तुझको भूल जाने की मोहलत न मिली..
करने को बहुत काम थे अपने लिए मगर..
हमको तेरे ख्याल से कभी फुरसत न मिली..
సర్వం దొరికింది, ప్రశాంతత అనే ధనం దొరకలేదు..
నిన్ను మాత్రం మర్చిపోయే అవకాశం దొరకలేదు..
చేయటానికి చాలా పనులే ఉన్నాయి నాకోసం, కానీ..
మాకు నీ జ్ఞాపకాల నుంచి తీరికే దొరకలేదు..
1.27. कुछ दोस्त खजाने की तरह होते हैं..
मन करता है, जमीन मे गाढ
दूँ..
కొందరు మిత్రులు నిధి వంటి వారు..
(తీసుకుపోయి) భూమిలో పాతెయ్యాలి అనిపిస్తుంది..
1.28. अजीब सी बस्ती में ठिकाना है मेरा ग़ालिब..
जहाँ लोग मिलते कम झांकते ज़्यादा है..
వింతైన బస్తీ (జనావాసం) లో నా నివాసం, గాలిబ్...
జనాలిక్కడ కవలటం తక్కువ, తొంగి చూడటం ఎక్కువ
చేస్తుంటారు..
1.29. उन्हें छत पर जाने से मना कर दिया हमने..
शहर में बेवजह ईद की तारीख बदल जाती..
ఆమెను మిద్దె (డాబా) మీదకు పోవద్దని అన్నాను..
నగరంలో అకారణంగా ఈద్ తేదీ మారిపోతుంది..
1.30. मन की बात कह देने से फैसले हो जाते हैं..
और मन में रख लेने से फासले हो जाते हैं..
మనసులో మాటలు చెప్పేస్తే నిర్ణయాలు జరిగిపోతాయి..
మనసులోనే పెట్టేసుకుంటే దూరాలు పెరిగిపోతాయి..
1.31. यूं ही ख्यालों में चले आया करो..
ना पकड़े जाने का खतरा, ना
जाने की जल्दी..
ఇట్లాగే తలపులలోకి వచ్చేస్తూ ఉండు..
పట్టుబడతామన్న భయం ఉండదు..
తిరిగిపోవాలన్న తొందరా ఉండదు..
1.32. ज़माना
वफ़ादार नहीं हुआ तो क्या हुआ..
धोकेबाज़ तो हमेशा अपने ही होते हैं..
లోకం విశ్వాసపాత్రం కాకపోతే ఏంటి..
మోసగాళ్ళు ఎప్పుడూ తనవారే అయి ఉంటారు..
1.33. मुमकिन नहीं हर वक्त मेहरबां रहे जिंदगी..
कुछ लम्हे जीने का तजुर्बा भी सिखाते हैं..
అన్నివేళలా జీవితం దయతో కనికరించటం సాధ్యం కాదు..
కొన్ని సమయాలు జీవించటానికి అనుభవాన్ని కూడా
అంది(నేర్పి)స్తాయి..
1.34. भूलकर भी मुसीबत में न पड़ना कभी..
खामखां, अपने और परायों की
पहचान हो जाएगी..
మర్చిపోయి కూడా కష్టంలో పడవద్దు ఎన్నడూ..
అనవసరంగా మనవారు, పరుల భేదం తెలిసిపోతుంది..
1.35. शहर जालिमों का है साहब, जरा संभल कर चलना..
यहाँ लोग सीने से लग कर दिल निकाल लेते हैं..!
ఈ నగరం క్రూరులదండోయ్, కాస్త జాగ్రత్తగా
నడవండి..
ఇక్కడ జనాలు ఛాతికి హత్తుకుని (కౌగిలించుకుని) హృదయాలను
(వెలికి)తీసేసుకుంటారు..
1.36. एहसासों की नमी बेहद जरुरी है हर रिश्ते
में..
रेत भी सूखी हो तो हाथों से फिसल जाती है..
అనుబంధాలలో అనుభూతుల తడి కూడా ఎంతో అవసరం,
ఇసుక కూడా తడిలేకపోతే చేతులనుండి జారిపోతుంది..
1.37. ज़माने में आये हो तो जीने का हुनर भी
रखना..
दुश्मनों से कोई खतरा नहीं बस अपनों पे नज़र
रखना..
లోకంలోకి అడుగు పెట్టావంటే జీవించే కళ కూడా తెలిసి ఉండాలి..
శత్రువులతో భయం లేదు, కాస్త సొంతవారి మీదే
ఓ చూపు ఉంచాలి..
1.38. ज़रा ज़िद्दी हूँ, ख़्वाब
देखने से बाज़ नहीं आता..
इतनी सी बात पर, हकीक़तें
रूठ जाती हैं मुझसे..
కొద్దిగా మొండివాడిని, కలలు కనటం మానను..
ఇంత చిన్న దానికే వాస్తవాలు నా మీద అలుగుతాయి.
39. ताश के पत्ते खुशनसीब है यारों..
बिखरने के बाद उठाने वाला तो कोई है..
పేకముక్కలు అదృష్టం చేసుకున్నవి..
విసిరిన తరువాత వాటిని ఎత్తి పట్టుకునేవారు ఎవరో
ఒకరుంటారు..
1.40. बेचैनियाँ बाजारों में नहीं मिला करती,
मेरे दोस्त..
इन्हें बाँटने वाला, कोई
बहुत नज़दीक का होता हैं..
అశాంతులు బజారులో దొరకవు, నేస్తమా..
వీటిని (కలిగించే) పంచేవారు చాలా దగ్గరివారు ఉంటారు..
1.41. जिन्दगी में कुछ हसीन भ्रम भी जरूरी है..
हक़ीक़त कहाँ हमेशा खूबसूरत होती हैं..
జీవితంలో కొన్ని మధురమైన భ్రమలు కూడా అవసరం..
వాస్తవం ఎప్పుడూ అందంగా ఉండటం ఎక్కడ జరుగుతుంది?..
1.42. कुछ चीजे पैसों से नहीं मिलती..
और मुझे उन्हीं चीजो का शौक हैं..
కొన్ని వస్తువులు ధనంతో కొనలేనివి..
కానీ నాకేమో అవంటేనే షోకు (ఇష్టం)..
1.43. आशियाने बनें भी तो कहाँ जनाब..
ज़मीनें महँगी हो चली हैं और दिल में लोग जगह
नहीं देते....
నివాసాలు కట్టుకోవాలన్నా ఎక్కడవుతుందండీ..
భూములు ఖరీదైపోతునాయి..
జనాలేమో మనసుల్లో చోటునివ్వరు..
1.44. मुकाम वो चाहिए कि जिस दिन भी हार जाऊ..
जीत खुद आकर कहे माफ़ करना मज़बूरी थी..
ఏ స్థానానికి చేరాలని ఉందంటే, నేను ఓడిపోయిన
రోజు..
గెలుపు నా వద్దకు వచ్చి అనాలి- క్షమించు, నిస్సహాయుడిని- అని.
1.45. बेकार ज़ाया किया वक्त किताबों में..
सारे सबक तो कमबख्त ठोकरों से मिले हैं..
అనవసరంగా పుస్తకాలతో సమయం వృథాగా గడిపాను..
పాఠాలన్నీఎదురుదెబ్బలు తగులుతూ ఒంటబట్టాయి..
1.46. क्या गज़ब है उसकी ख़ामोशी..
मुझ से बातें हज़ार करती है..
ఎంత ఆశ్చర్యకరమైనదో తన మౌనం..
నాతో వెయ్యి మాటలు మాట్లాడుతుంది..
1.47. हवाएँ हड़ताल पर हैं शायद..
आज तुम्हारी खुशबू नहीं आई...
గాలులు నిరసన చేస్తున్నట్లున్నాయి..
ఇవాళ నీ సుగంధం నను చేరలేదే..
1.48. महफ़िल में चल रही थी हमारे कत्ल की
तैयारी..
हम पहुँचे तो बोलें बहुत लम्बी उम्र है
तुम्हारी..
సభలో నా హత్యకు ప్రయత్నాలు జరుగుతుండినవి..
నేను చేరగానే-- అబ్బ, నిండా నూరేళ్ళు
నీకు-- అన్నారు..
1.49. वो दुश्मन बनकर मुझे जीतने निकले थे..
दोस्ती कर लेते, तो मैं
खुद ही हार जाता..
వారు శత్రువులై నన్ను గెలవాలని బయలుదేరారు..
స్నేహం చేసుకునుంటే నేనే ఓడిపోయేవాడిని..
1.50. वादा करते ही वादे को दिल की किताब में
लिख लिया करो..
वक़्त आने पर वादा भूल जाने की पुरानी आदत है
यारों की..
వచనం ఇవ్వగానే మాటను మనస్సు పుస్తకంలో వ్రాసి
ఉంచుకొంటుండు..
సమయం వచ్చిన వేళ (ఇచ్చిన) మాట మర్చిపోవటం స్నేహితులకు పాత
అలవాటు..
1.51. किसी के ऐब को तू बेनकाब ना कर..
खुदा करेगा हिसाब तू खुद हिसाब ना कर..
बुरी नज़र से ना देख मुझको देखने वाले..
मैं लाख बुरा सही तू अपनी नज़र खराब न कर..
ఎవ్వరి తప్పులకు (చెడులను) ముసుగు తీసివేయకు..
పైవాడు పద్దు వ్రాసుకుంటాడు, నీవేమీ లెక్కలు
కట్టకు..
చెడు దృష్టితో నన్ను చూడకు, ఓ చూసే వాడా..
నేను లక్షరకాలుగా చెడ్డవాడిని కావచ్చు, నువ్వు నీ దృష్టిని
పాడు చేసుకోకు..
1.52. ज़िन्दगी की हर तपिश को मुस्कुरा कर
झेलिए..
धूप कितनी भी हो समंदर सूखा नहीं करते..
జీవితంలో వేడినంతా నవ్వుతూ గడిపేయరా..
ఎండ ఎంతగ కాచినా ఆ సంద్రమెన్నడు ఎండదు..
1.53. चलती हुई कहानियों के जवाब तो बहुत हैं
मेरे पास..
लेकिन खत्म हुए किस्सों के लिए खामोशी ही बेहतर
है..
సాగుస్తున్న కథలకు సమాధానాలు చాలా ఉన్నాయి నా వద్ద...
కానీ పూర్తయిన కథలకోసం మాత్రం మౌనమే మంచిది..
1.54. अब तो उन्हें बारिशों में भी हमारी याद
नहीं आती..
जो कभी बादलों के गरजने से पहले ही आकर हमसे
लिपट जाया करते थे....
ఇప్పుడు వారికి వర్షంలో కూడా నా స్మరణ కలగదు (నేను గుర్తుకు
రాను..)
ఒకప్పుడు మేఘాలు గర్జించక ముందే వచ్చి చుట్టేసుకునేవారు..
1.55. मेरे महाकाल,
तस्वीर तेरी दिलकश है, सूरत
तेरी प्यारी है..
जिसने भी तुझे देखा, सौ
जान से वारी है..
क्या नज़र करें तुमको, क्या
चीज़ हमारी है..
ये दिल भी तुम्हारा है, ये
जान भी तुम्हारी है..
ఓ మహాకాలా, పరమేశ్వరా,
నీ రూపం మనోహరమైనది, నీ మోము అందమైనది..
ఎవరు నిన్ను చూస్తారో వారి ప్రాణం నీకే అర్పించారు..
నీకేమి ఉపహరించగలము, నాదేమి (మిగిలి)
ఉన్నది..
ఈ హృదయం కూడా నీదే, ఈ ప్రాణం కూడా నీదే..
1.56. हम आईना है आईना ही रहेंगे फ्रिक वो
करें..
जिनकी शक्ल में कुछ और है दिल में कुछ और..
నేను అద్దాన్ని, అద్దంగానే ఉంటాను..
బెంగ వారిని పడమనండి-
ఎవరికి ముఖం పై ఒకటి, మనసులో వేరొకటి
ఉంటుందో..
1.57. गिनती आज भी नहीं आती, मेरी माँ को यारों..
मैं एक रोटी मांगता हूँ, वो
हमेशा दो ही लेकर आती है..
లెక్కలు ఇప్పటికీ రావు మా అమ్మకు..
నేను ఒక రొట్టె అడిగితే ఆమె ఎప్పుడూ రెండు తెస్తుంది..
1.58. भागते कल भी थे, भागते
आज भी हैं.
बस्ता वही है बस, सामान
बदल गया..
పరిగెత్తటం నిన్నా చేశాం, ఇవాళా చేస్తున్నాం..
సంచీ అదే.. సామాగ్రి మారిందంతే..
1.59. मैले हो जाते हैं रिश्ते भी लिबासों की
तरह..
कभी-कभी इनको भी मोहब्बत से धोया कीजिए..
మాసిపోతాయి అనుబంధాలు కూడా బట్టలలాగే..
అప్పుడప్పుడు వాటిని ప్రేమతో శుభ్రం చేస్తూ ఉండండి..
1.60. इंसानियत बहुत बड़ा खज़ाना है..
उसे लिबास में नहीं, इंसान
में तलाश करो..
మానవత్వం చాలా పెద్ద నిధి..
దాన్ని వేషంలో కాదు, మనుషుల్లో
వెతుకులి..
1.61. कभी साथ बैठो तो कहूँ कि दर्द क्या है..
अब यूँ दूर से पूछोगे तो ख़ैरियत ही कहेंगे..
ఎప్పుడైనా నాతో కూర్చుంటే చెప్తాను బాధ ఏంటో..
ఇట్ల దూరం నుంచి అడిగితే బాగున్నాననే అంటాను..
1.62. बैठता वहीं हूँ, जहाँ
अपनेपन का अहसास है मुझको..
यूँ तो जिन्दगी में कितने ही लोग आवाज देते
हैं...
నాకు 'నా' అనిపించిన చోటే వెళ్ళి కూర్చుంటాను..
జీవితంలో (రమ్మని) పిలిచేవారు చాలామందే ఉంటారులే..
1.63. हम तो सीखते ही रहे उम्र भर लहरों से
लड़ने का हुनर..
हमें कहाँ पता था क़ि किनारे भी क़ातिल
निकलेंगे..
జీవింతాంతం అలలతో పోరాడే కళను నేరుస్తూ ఉండిపోయామే..
మాకేం తెలుసు, తీరం చేరాక కూడా హంతకులు ఉంటారని..
1.64. रुकावटें तो जनाब ज़िन्दा इन्सान के
हिस्से में ही आती हैं..
वरना जनाज़े के लिए रास्ता तो सभी छोड़ देते
हैं..
ఆటంకాలు బ్రతికి ఉన్న మనిషికే కలుగుతాయి..
లేదంటే శవయాత్ర కోసం దారి అందరూ వదిలిపెడతారు..
1.65. गुज़र जाते हैं खूबसूरत लम्हें यूं ही
मुसाफिरों की तरह..
यादें वहीं खडी रह जाती हैं रुके रास्तों की
तरह..
అందమైన క్షణాలు ఊరికేనే (ఇట్లాగే) యాత్రికులలాగ
వెళిపోతాయి..
జ్ఞాపకాలు మాత్రం అట్లా నిలిచిపోతాయి, ఆగిపోయిన దారుల
వలె..
1.66. ज़िन्दगी की हकीकत को बस इतना जाना है..
दर्द में अकेले हैं और ख़ुशी में जमाना है...
జీవితసత్యాన్ని తెలుసుకున్నదింతే--
కష్టంలో ఒంటరిగా ఉన్నాం, సంతోషం సమయంలో
ప్రపంచమంతా ఉంది..
1.67. कारीगर हूँ साहब, अल्फ़ाज़ो'
की मिट्टी से महफ़िलों को सजाता हूँ..
कुछ को बेकार कुछ को कलाकार नज़र आता हूँ..
శిల్పకారుణ్ణండీ, మాటల మట్టితో విందులను అలంకరిస్తాను..
కొందరికి వృథాకారుడిగా (పనికిరానట్టు) కొందరికి కళాకారుడిగా
అగుపిస్తాను..
1.68. हम तो फूलों की तरह अपनी आदत से बेबस
हैं..
तोड़ने वाले को भी, खुशबू
की सज़ा देते हैं..
మేమూ పూవుల్లాగే మా అలవాటుకు అధీనులం..
కోసేవాడికి కూడా సువాసనల శిక్ష వేస్తాము..
1.69. जिंदगी जब भी लगा कि तुझे पढ़ लिया..
तूने अपना एक पन्ना और खोल दिया..
జీవితమా, ఎప్పుడెప్పుడు నేను నిన్ను చదివేశాను అనుకున్నానో..
అప్పుడు నీవు మరో కొత్త పుటను తెరిచావు..
1.70. लफ़्ज़ों के बोझ से थक जाती हैं ज़ुबान कभी
कभी..
पता नहीं खामोशी मज़बूरी हैं, या समझदारी..
మాటల బరువుతో అలసిపోతుంది నాలుక అప్పుడప్పుడు..
మౌనం వివశత్వమో వివేకమో అర్థం కాదు..
1.71. इश्क के गुल थोडे इंतजार में नहीं खिलते..
मंज़िल पर खड़े लोग मझधार में नहीं मिलते..
रूह तक में बस जाए खुशबू जिनकी..
अब वो फूल बाजार में नहीं मिलते..
ప్రేమ సుమాలు (గులాబీలు) కొద్ది నిరీక్షణతో విచ్చుకోవు..
ఒడ్డున నిలిచినవారు నడిసంద్రంలో (ధారాప్రవాహం మధ్యలో)
దొరకరు..
ఎవరి సుగంధం అంతరాత్మలోకి చొచ్చుకుని పోతుందో..
ఆ పువ్వులు ఇప్పుడు బజారులో దొరకవు..
1.72. इस दुनिया के लोग भी कितने अजीब है ना..
सारे खिलौने छोड़ कर जज़बातों से खेलते हैं..
ఈ లోకంలో జనాలు కూడా ఎంత వింతైనవారు కదా..
అన్ని ఆటబొమ్మలూ వదిలి భావాలతో ఆడుకుంటారు..
1.73. कभी उम्मीदें उधड़ जाएँ तो मेरे पास ले
आना..
मैं हौंसलों का दर्ज़ी हूँ मुफ़्त में रफ़ू कर
दूंगा..
ఎప్పుడైనా ఆశలు చిరిగిపోతే నా వద్దకు తీసుకురండి..
నేను ధైర్యాల దర్జీని ఊరికెనే కుట్టి ఇస్తాను..
1.74. खुद में झाँकने के लिए ज़िगर चाहिए..
दूसरों की शिनाख्त में तो हर शख्स माहिर है..
తనలోకి తాను చూసుకోవటానికి కలేజా (సాహసం) కావాలి...
పక్కవాణ్ణి గుర్తించటంలో అంతా విశేషజ్ఞులే..
1.75. ऐब भी बहुत हैं मुझमें और खूबियाँ भी..
ढूँढने वाले तू सोच तुझे क्या चाहिए मुझमें
నాలో తప్పులూ ఉన్నాయి, గొప్పలూ ఉన్నాయి..
ఓ వెతికేవాడా, ఆలోచించుకో, నాలో నీకేం కావాలో..
1.76. जिंदगी में ये हुनर भी आजमाना चाहिए,
अपनों से हो जंग तो हार जाना चाहिए।
జీవితంలో ఈ కళ కూడా ప్రయత్నించాలి..
యుద్ధం సొంతవారితో అయినప్పుడు ఓడిపోవాలి..
1.77. हवाओं की भी अपनी अजब सियासतें हैं साहब..
कहीं बुझी राख भड़का दे तो कहीं जलते चिराग बुझा
दे..
గాలులకు కూడా అర్థంకాని రాజకీయాలు ఉంటాయి సుమా..
ఒకచోట ఆరిన బూడిదలో నిప్పు రగులుస్తుంది..
మరోచోట వెలుగుతున్న దీపాన్ని ఆర్పుతుంది..
1.78. पत्तों सी हो गई है, रिश्तों की उम्र..
आज हरे, कल पीले, परसों सूखे..
ఆకులలాగా అయిపోయింది అనుబంధాల ఆయువు..
ఇవాళ ఆకుపచ్చగా, రేపు పసుపుపచ్చాగ, ఎల్లుండి ఎండిపోయి
(ఉంటాయి)..
1.79. ज़िंदगी तू भी कच्ची पेंसिल की तरह है..
हर रोज़ छोटी होती जा रही है..
జీవితమా, నీవూ గట్టిలేని పెంసిల్ వంటిదానివి..
రోజూ చిన్నగా అయిపోతున్నావు..
1.80. बारिश में रख दूँ जिंदगी को, ताकि धुल जाए पन्नों की स्याही,
ज़िन्दगी फ़िर से लिखने का मन करता है कभी-कभी।
వర్షంలో పెట్టేయాలనిపిస్తుంది జీవితాన్ని, కాగితాలపై సిరా
చెరిగిపోవాలని..
జీవితాన్ని తిరిగి వ్రాయాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు..
1.81. तारीफ़ करने वाले बेशक आपको पहचानते
होंगे..
मगर फ़िक्र करने वालों को आपको ही पहचानना होगा..
పొగిడే వారు మిమ్మల్ని నిస్సందేహంగా గుర్తిస్తారు..
కానీ మీ గురించి బెంగపడేవారిని (పట్టించుకునేవారిని) మీరే
గుర్తించాలి..
1.82. हमारे जीने का अलग अंदाज है..
एक आँख में आँसू तो दूसरे में ख्वाब है..
टूटे हुए ख्वाबो पे आँसू बहा लेते है..
और दूसरी आँख में फिर से ख्वाब सज़ा लेते हैं..
మేము జీవించే శైలి విభిన్నమైనది..
ఒక కంట్లో కన్నీరు ఉంటే రెండవదానిలో కల ఉంటుంది..
విరిగన కలల గురించి కన్నీరు కారుస్తాము..
మళ్ళీ రెండవ కంటిలో కలలను అలంకరిస్తాము..
1.83. जिंदगी में बेशक हर मौके का फायदा उठाओ..
मगर किसी के भरोसे का फ़ायदा नहीं..
జీవితంలో ప్రతి అవకాశాన్ని వాడుకో (లాభం చేసుకో)..
కానీ ఎవ్వరి విశ్వాసాన్ని వాడుకోకు..
1.84. ज़ुल्म के सारे हुनर हम पर यूँ आज़माए गये..
ज़ुल्म भी सहे हमने और ज़ाहिल भी कहलाये गये..!
అణిచివేతలోని అన్ని నైపుణ్యాలు మా పై ప్రయోగించబడినవి..
అటు నేరాలూ భరించాము, ఇటు బుద్ధిహీనుడని
పేరు కూడా అనిపించుకున్నాము..
1.85. हो के मायूस न यूँ शाम-से ढलते रहिये..
ज़िंदगी भोर है, सूरज-से
निकलते रहिये।
దిగులు పడుతూ సాయింత్రాలలా అస్తమిస్తూ ఉండిపోకండి..
జీవితం ఉషోదయం, సూర్యునిలా ఉదయిస్తూ ఉండండి..
1.86. आदतें अलग है हमारी दुनिया वालों से..
कम दोस्त रखते हैं, मगर
लाजवाब रखते हैं..
क्योंकि बेशक हमारी माला छोटी है..
पर फूल उसमें सारे गुलाब रखते हैं..
మా అలవాట్లు కొంత ఇతరులకన్నా భిన్నమైనవి
తక్కువ స్నేహితులే కానీ తిరుగులేనివారిని పెట్టుకుంటాము,
సందేహం లేదు, మా పూమాల చిన్నదే కానీ..
అందులో పూవులన్నీ గులాబీలనే పెట్టుకుంటాము..
(అప్పుడప్పుడు గుచ్చుకుంటాయి కూడా.. అయినా ఫర్లేదు..)
1.87. एहसान रहा इलज़ाम लगाने वालों का भी मुझ
पर..
उठती ऊँगलियों ने मुझे मशहूर कर दिया..
నన్ను ఆక్షేపించినవారి సహాయం కూడా నాకెంతో ఉంది..
లేచిన చూపుడు వేళ్ళు నాకు పేరు తెచ్చి పెట్టాయి.. (నన్ను
అందరికీ తెలిసేలా చేశాయి..)
1.88. जिंदगी में ऐसे लोग भी मिलते हैं..
जो वादे तो नहीं करते लेकिन निभा बहुत कुछ जाते
हैं..
జీవితంలో అటువంటివారు కూడా తారసపడతారు..
మాట ఇవ్వరు, కానీ ఎంతో నిలబెట్టుకొంటారు..
1.89. मांगू बस तुझसे वो इबादत दे दे..
अपने खजाने से थोड़ी सी मुहब्बत दे दे..
या तो कर ले एतवार मेरे प्यार पर
या फिर.. अपने दर पे मरने की इजाजत दे दे..
నిన్ను అడిగేది, ఆ (నీ) ఆరాధనను నాకివ్వవా అని
నీ నిధి నుండి కాసింత ప్రేమను ఇవ్వవా అని
నా ప్రేమ మీద విశ్వసించనైనా విశ్వసించు
లేదా నీ స్ననిధిలో చచ్చిపోయేందుకు అనుజ్ఞనైనా ఇవ్వు..
1.90. हमको इतना बुरा भी ना समझो तुम..
दर्द लिखने की आदत है, देने
की नहीं..
నీవు నాగురించి అంత చెడ్డగా భావించుకోకు..
వేదనను వ్రాయటమే అలవాటు, (ఒకరికి) కలిగించే
అలవాటు లేదు..
1.91. ज़रुरी है तेरे अहसास मेरे अल्फ़ाजों के
लिये..
तुम बिन हर शायरी अधुरी है मेरी..
నా మాటల కోసం నీ అనుభూతులు చాలా అవసరం..
నీవు లేక నా ప్రతి కవితా అపూర్ణమే..
1.92. तुम्हारा सिर्फ हवाओं पे शक़ गया होगा..
चिराग़ खुद भी तो जल-जल के थक गया होगा..
నీకు గాలులపై మాత్రమే అనుమానం కలిగి ఉంటుంది..
దీపం వెలిగి వెలిగి కూడా అలసిపోయి ఉండవచ్చు కదా..
1.93. दिमाग वाला दिल मुझे भी दे ऐ खुदा..
ये दिल वाला दिल तकलीफ ही देता है..
మెదడు తో కలిసి ఉండే మనస్సు నాకూ ఇవ్వు భగవంతుడా..
ఈ మనసు తో ఉండే మనస్సు చాలా పీడింపచేస్తుంది..
1.94. बांटना है तो हंसी बांट लो...
आंसू तो सबके पास हैं..
పంచుకోదలిస్తే నవ్వులు పంచుకో..
కన్నీరైతే అందరి వద్దా ఉంది..
1.95. हालत पुछती नहीं दुनिया ज़िंदा लोगो की..
चले आते है ज़नाज़े पर बारात की तरह..
బ్రతికి ఉన్నవారిని పరిస్థితి అడగదు లోకం..
శవయాత్రకు వివాహశోభాయాత్రలా తరలి వస్తారు జనాలు..
1.96. पांवों के लड़खड़ाने पे तो सबकी है नज़र..
सर पर है कितना बोझ, कोई
देखता नहीं..
అడుగులు తడబడటం మీద అందరి దృష్టీ ఉంది..
తల మీద ఎంత బరువుందో ఎవ్వరూ చూడరు..
1.97. ये फ़ौजी भाई भी कमाल के होते हैं..
बटुए में परिवार छुपा लेते हैं..
और दिल में हिंदुस्तान..
ఈ సైనిక సోదురులు కూడా చాలా అద్భుతమైన వారు..
పర్సులో కుటుంబాన్ని..
మనసులో భారతదేశాన్ని దాచుకుంటారు..
1.98. कुदरत का नियम है...
मित्र और चित्र
दिल से बनाओगे तो..
उनके रंग जरूर निखर आयेंगे..
ప్రకృతి నియమం ఏంటంటే మిత్రుడు, చిత్రము..
ఈ రెంటినీ మనస్సుతో వేస్తే..
వాటి రంగులు తప్పక అందంగా వస్తాయి..
1.99. अच्छे विचारों का असर आज कल इसलिए नही
होता..
क्योंकि लिखने वाले और पढने वाले दोनो ये समझते
है कि ये दूसरों के लिए है..
మంచిమాటల ప్రభావం ఇవాళ రేపు (ఎక్కడా) పడటం లేదు..
ఎందుకంటే వ్రాసేవాడు, చదివేవాడు- ఇద్దరూ
ఇదవి ఇతరులకోసం అనుకుంటారు..
1.100. तिनका हूँ तो क्या हुआ, वजूद है मेरा,
उड़ उड़ के हवा का रुख तो बताता हूँ..
(దూది)పింజనైతే ఏమైందిటా,
నాకూ అస్తిత్వం ఉన్నది..
ఎగురుతూ ఎగురుతూ గాలి
దిశ అయినా తెలియచెప్తాను కదా..
1.101. अगर दुश्मन सिर्फ़ समझाने से समझते तो..
बांसुरी बजाने वाला कभी महाभारत नहीं होने
देता..
శత్రువులు కేవలం సర్ది చెప్పటం వల్ల అర్థం చేసుకునేవారై
ఉంటే..
వేణువూదే నాథుడు మహాభారతం జరగనిచ్చేవాడే కాదు..
1.102. अजब किस्सा है जिंदगी का कम्बख़्त...
एक दिन मरने के लिये पुरी ज़िंदगी जीना पडता है.
ఏంటో ఈ బ్రతుకు కథ కూడా వింతైనది..
ఒకరోజు చావటానికి జీవితమంతా బ్రతకాలి..
1.103. वक़्त भी कितना अजीब होता है..
किसी का कटता नहीं और, किसी
के पास होता नहीं..
సమయం కూడా ఎంత వింతైనదో..
ఒకరికి గడవదు, ఒకరికి దొరకదు..
1.104. कॉल फ्री होने से क्या होता है साहिब..
दिलों में गुंजाइश भी तो होनी चाहिए बात करने के
लिए..
కాల్ ఉచితమైనంతమాత్రాన ఏంటి లాభమండీ..
మనసుల్లో మాట్లాడాలని కూడా ఉండాలి కదా..
1.105. आज का उच्च विचार..
कृपया टांगों का इस्तेमाल चलने में करें..
अड़ाने में नहीं...
ఈనాటి ఉత్తమ ఆలోచన--
దయచేసి కాళ్ళను నడవటానికి ఉపయోగించండి-
(ఆవలివారు తట్టుకోవటానికి) అడ్డం పెటట్టానికి కాదు..
1.106. यूं ही न अपने मिज़ाज़ को चिड़चिड़ा
कीजिये..
कोई बात छोटी करे तो दिल बड़ा कीजिये..
ఊరికెనే మీ మనస్సును చిరాకు చేసుకోకండి..
ఒకసారి విషయాన్ని (ఘటనను) చిన్నగా చేసుకోండి,
మరోసారి మనసును విశాలంగా చేసుకోండి.
1.107. मेरे ऐब सिर्फ मुझे ही बताना..
मेरी कोई दूसरी शाखाएँ नहीं हैं..
నా తప్పులు నాకే చెప్పండి..
నాకు వేరే శాఖలు (బ్రాంచిలు) లేవు..
1.108. कुछ भी कर्म करो..
हमेशा एक बात ध्यान रखो कि..
परमात्मा हमेशा ऑनलाइन है..
ఏదైనా పని చేసేవేళ ఒకే ఒక్క విషయం దృష్టిలో ఉంచుకో..
పరమాత్మ నిత్యం ఆన్ లైన్ ఉంటాడు..
1.109. अगर आपको ढूंढना ही है तो आपकी परवाह
करने वालों को ढूंढिए..
आपका उपयोग करनेवाले तो आपको ढूंढ ही लेंगे..
వెతకాలనే అనుకుంటే మీ గురించి బెంగపడేవారిని వెతుక్కోండి..
ఉపయోగించుకునేవారు మిమ్మల్ని వారే వెతుక్కుంటూ వస్తారు..
1.110. लोग डूबते हैं तो समंदर को दोष देते हैं,
मंजिल न मिले तो मुकद्दर को दोष देते हैं,
खुद तो संभल कर चल नहीं सकते,
जब ठेस लगती है तो पत्थर को दोष देते हैं।
జనాలు మునిగినప్పుడు సముద్రాన్ని తప్పు పడతారు..
గమ్యం అందకపోతే భాగ్యాన్ని తప్పు పడతారు..
తాము సరిగ్గా చూసుకుని నడవటం చేతకాదు..
తట్టుకున్నప్పుడు రాయిని తప్పు పడతారు..
1.111. सियासत की दुकानों में रौशनी के लिए..
जरूरी है कि देश जलता रहे..
రాజకీయాల దుకాణాలలో వెలుగుల కోసం..
దేశం రగులుతుండటం ఆవశ్యకం..
1.112. मैं नहीं कहता की मेरी खबर पूछो
दोस्तों..
खुद किस हाल में हो बस इतना ही बता दिया करो..
నా క్షేమం అడగమని నేననటం లేదు మిత్రులారా,
మీరు ఎట్లా ఉన్నారో - అంత చెప్తుండండి- చాలు..
1.113. सब्र और सच्चाई एक ऐसी सवारी है..
जो अपने सवार को कभी गिरने नहीं देती..
ना किसी के कदमो में, और
ना किसीकी नज़रों में..
ఓర్పు, సత్యం ఎటువంటి బండ్లు అంటే..
అవి ఎన్నడూ తమ పై పయనించే వారిని పడనివ్వవు..
ఎవ్వరి పాదాలపైనా కానీ.. ఎవ్వరి చూపుల్లో కానీ..
1.114. यह सोचना ग़लत है कि तुम पर नज़र नहीं
है..
बस व्यस्त बहुत है, मगर
बे-ख़बर नहीं है..
(शायरी नहीं है,आयकर विभाग
की चेतावनी है)
--నీ మీద దృష్టి లేదని అనుకోవటం పొరపాటు..
బాగా పనిలో మునిగి ఉన్నాను.. అంతేకానీ (ఏం జరుగుతుందో)
తెలియకుండా లేను..
(కవిత్వం కాదు- ఆదాయపన్ను శాఖ వారి హెచ్చరిక)
1.115. पसीने की स्याही से जो लिखते है अपने
इरादों को..
उनके मुकद्दर के पन्ने कभी कोरे नहीं हुआ करते..
ఘర్మబిందువుల సిరాతో తమ లక్ష్యార్థాలను ఎవరు
వ్రాసుకుంటారో..
వారి భాగ్యాల పుటలు ఎన్నడూ రిక్తంగా ఉండవు..
1.116. यहाँ अनाथ कौन है, त्रिलोकनाथ
साथ है..
दयालु दीनबंधु के बडे विशाल हाथ है..
ఇక్కడెవరనాథలు? త్రిలోకనాథుడుండగా!
దయాళువు, దీనబంధువతడి చేతులు విశాలము!!
(అదే వృత్తం ప్రయత్నించాను.. అతి స్వల్ప మార్పుతో)