Friday, 13 July 2018

షేరోం కా షోర్-15 - (शेरों का शोर) ఉర్దూ షేర్ లకు తెలుగు అనువాదం

15.1 कौन कहता है मौत आयी तो मर जाऊँगा..
मैं तो दरिया हूँ समन्दर में समा जाऊँगा..
ఎవరన్నారు, చావొస్తే నేను చచ్చిపోతానని..
నేను నదిని, సముద్రంలో కలసిపోతాను..

15.2 हौसले भी किसी हक़ीम से कम नहीं होते हैं..
हर तकलीफ़ में ताक़त की दवा देते हैं..
ధైర్యాలూ ఏ వైద్యుడికీ తీసిపోవు..
ప్రతి కష్టంలో బలమనే మందును ఇస్తాయి..

15.3 इतने सालों बाद उसने ग़लती की माफ़ी माँगी..
मैं ने कहा, प्यार को ग़लती नहीं कहते..
ఇన్నేళ్ళకు తను చేసిన పొరపాటుకు క్షమార్పణ అడిగితే..
నేను అన్నాను, ప్రేమను పొరపాటు అనరు అని..

15.4 कितने बेवफ़ा होते हैं ये जुगनू भी..
रोशनी दिखाकर अंधेरों की तरफ़ ले जाते हैं..
ఈ మిణుగురు పురుగులు ఎంత మోసకారులు కదా..
వెలుగును చూపి చీకట్లవైపు తీసుకుపోతాయి..

15.5 मेरी मोहब्बत आधी रह गयी..
पर उसका मन बहलाना पूरा हो गया..
నా ప్రేమ అపూర్ణంగా మిగిలింది..
తన కాలక్షేపం మాత్రం పూర్తైంది..

15.6 तो क्या हुआ जो दोस्त नहीं मिलते हमसे..
मिला तो रब भी नहीं, पर इबादत कहाँ रुकी हमसे..
నేస్తాలూ కలవరు నన్ను, అయితే ఏంటంటా..
దేవుడూ దొరికింది లేదు, ప్రార్థించటం ఎక్కడ ఆగిందంటా?..

15.7 सलीका इतना अदब का तो बरक़रार रहे..
रंज़िशें अपनी जगह हों, सलाम अपनी जगह...
ఇంత అయినా మర్యాద సక్రమంగా ఉండాలి..
మనఃస్పర్ధలు వాటిచోటే ఉండనీ, పలకరింపులు సాగుతుండాలి..

15.8 बड़ी मुख़्तसर वजह है, मेरे झुक कर मिलने की..
मिट्टी का बना हूँ, गुरूर जँचता नहीं मुझ पर..
చాలా చిన్న కారణం, నేను వంగి మెలగటానికి..
మట్టితో తయారైనాను, పొగరు నాకు సరిపడదు..

15.9 अब तो दिन रात पर हीं रुकता है..
मुझे याद है, पहले एक शाम भी हुआ करती थी..
ఇప్పుడిక ఉదయాలు రాత్రుల దగ్గరే ఆగుతున్నవి..
నాకు గుర్తుంది, మొదలు ఒక సాయింత్రం కూడా ఉంటుండేది..

15.10 वो दिल में रहे इतना ही बहुत है..
मुलाकात की हमें इतनी भी ज़रूरत नहीं..
తను మనసులో ఉంటే అదే చాలు..
కలవటం నాకు అంతగా అవసరం కాదు..

15.11 थोड़ा सा और बिखर जाऊँ, मैं ने यही ठानी है..
ऐ ज़िंदगी ,थोड़ा रुक, मैं ने अभी, हार कहाँ मानी है..
ఇంక కాస్త చెదిరిపోనివ్వు, నేనిదే పట్టుబట్టాను..
ఓ జీవితమా, కాస్తాగవే, నేనింకా ఓటమిని ఒప్పుకోలేదే?..

15.12 चलो मान लिया मुझे मोहब्बत करनी नहीं आती..
मगर ये तो बताओ तुम्हें दिल तोड़ना किसने सिखाया..
సరే పో, ఒప్పుకుంటాను, నాకు ప్రేమించటం రాదని..
కానీ, ఓ మాట చెప్పు, నీకు మనసు విరవటం ఎవరు నేర్పారు?..

15.13 दिल तो करता है ख़तम कर दूँ ज़िन्दगी..
फिर ख़्याल आता है, कि वो नफ़रत किस से करेंगे..
జీవితాన్ని అంతం చేద్దామని అనిపిస్తుంది..
మళ్ళీ ఆలోచన వస్తుంది, తను ద్వేషించేందుకు ఎవరుంటారు?..

15.14 अभी बाकी हैं साँसें और जिंदा इश्क़ है मेरा..
मैं और याद आऊँगा बस तुम हौसला रखना..
ఇంకా నా శ్వాసలు మిగిలున్నాయి, ప్రేమ బ్రతికే ఉంది..
నేనింకా గుర్తుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, చాలు..

15.15 तेरे आने से पहले उदासी रहती है..
तेरे जाने के बाद उदासी छाती है..
इस बीच जो वक़्त गुज़रता है उसे मैं
ज़िन्दगी नाम देता हूँ..
నీ రాకకు ముందు దిగులుగా ఉంటుంది..
నీవు వెళిపోయాక దిగులు ఆవరిస్తుంది..
ఈ మధ్యలో గడిచే సమయాన్ని
నేను జీవితం అని అంటాను..

15.6 ऐ ख़ुदा तू कभी इश्क न करना, बेमौत मारा जायेगा..
हम तो मरके भी तेरे पास आते हैं पर तू कहाँ जायेगा..
ఓ ఖుదా, నీవెప్పుడూ ప్రేమించకు, అకారణంగా చనిపోతావు..
మేము చనిపోయి నీ వద్దకు వస్తాము, కానీ నీవెక్కడకు పోతావు?..

15.7 काश, रोने से नसीब बदल जाता..
कसम तुम्हारी, आंसुओं से दुनिया डुबो देते..
ఏడిస్తే భాగ్యం మారేది ఉంటే బాగుండేది..
కన్నీటితో ప్రపంచాన్ని ముంచేసేవాడిని, నీ మీదొట్టు

15.8 कहते हैं, प्यार की शुरुआत आँखो से होती है..
यक़ीन मानो दोस्तों..
प्यार की कीमत भी आँखों से ही चुकानी पड़ती है..
ప్రేమ కళ్ళతో ప్రారంభం అవుతుందంటారు..
నిజం నేస్తాలూ, నమ్మండి..
ప్రేమ వెల కూడా కళ్ళతోనే కట్టుకోవాల్సి వస్తుంది..

15.9 सजावट रूह की हो तो खूबसूरती निखर कर आती है..
सिर्फ चेहरों की बिसात पर दिलों के आशियाने सजाये नहीं जाते..
అలంకరణ అంతరంగానిదైతే అందం ఇనుమడిస్తుంది..
కేవలం ముఖం స్థలం మీద మనస్సుల భవంతులు తీర్చిదిద్దబడవు..

15.10 कुछ कहना चाहो तो अलफ़ाज़ ना मिलें..
आशिकों के साथ अक्सर ये इत्तेफ़ाक़ होता है..
ఏదైనా చెప్పాలనుకుంటే మాటలు దొరకకపోవటం..
ప్రేమికులకు ఇది ఎప్పుడూ యాదృచ్ఛికంగా జరుగుతుంది..

15.11 उजड़ जाते हैं सिर से पाँव तक वो लोग..
जो किसी बेपरवाह से बेइंतहा मोहब्बत करते हैं..
తలనుండి కాలిదాకా దుమ్ముకొట్టుకునిపోతారు..
ఏమీ పట్టనివారిని ఎల్లల్లేకుండా ప్రేమించేవారు..

15.12 हज़ारो ग़म है सीने में, मगर शिक़वा करें किससे?..
इधर दिल है तो अपना है, उधर तुम हो तो अपने हो..
గుండెల్లో వేలకొద్దీ బాధలున్నాయి కానీ ఎవరిని తప్పు పట్టాలి?..
ఇటు మనసూ నా సొంతమే, అటు నీవూ నా సొంతమే కదా..

15.13 कौन करता है यहाँ प्यार निभाने के लिये..
दिल तो बस एक खिलौना है जमाने के लिये
బంధం నిలుపుకునేంతగా ఇక్కడ ప్రేమించేదెవరు?..
మనసంటే లోకానికొక ఆటబొమ్మే కదా..

15.14 ख़्वाहिशों का कैदी हूँ..
मुझे हकीक़तें सज़ा देती हैं..
కోరికలకు బంధీని..
నాకు వాస్తవాలు శిక్ష వేస్తాయి..

15.15 गुज़र गया दिन अपनी तमाम रौनक लेकर..
ज़िन्दगी ने वफ़ा कि तो कल फिर सिलसिले होंगे..
సందడంతా ఏరుకుని రోజు గడిచిపోయింది..
జీవితం తోడుంటే రేపు మళ్ళీ దొంతరలు సాగుతాయి..

15.16 हमारे पूर्वज तो पत्थरों से आग लगाते थे..
हम तो बातों से ही लगा देते है..
పాతకాలం వారు రాళ్ళనుండి నిప్పు రగిల్చేవారు..
మేము మాటలతోనే రగిలించేస్తాము..

15.17 क़दर करना सीख लो..
ना ज़िंदगी वापस आती है...
ना ज़िंदगी में आये हुये लोग....
విలువను ఇవ్వటం నేర్చుకో..
జీవితమూ తిరిగి రాదు,
జీవితంలో వచ్చినవారూ తిరిగిరారు..

15.18 कई बार तबीयत दवा लेने से नहीं..
हाल पूछने से भी ठीक हो जाती है..
మందు వేసుకోవటం వల్లే కాదు..
ఆరోగ్యం పలకరింపుతో కూడా చాలామటుకు బాగైపోతుంది..

15.19 ताज्जुब न कीजिएगा ग़र कोई दुश्मन भी आपकी ख़ैरियत पूछ जाए..
ये वो दौर है जहाँ, हर मुलाकात में मकसद छुपे होते है..
ఒకవేళ ఎవరైనా విరోధి వచ్చి పలకరించి వెళితే ఆశ్చర్యపోకండి..
ప్రతీ సమాగమానికి ఏదో ఉద్దేశ్యం దాగి ఉండే కాలం ఇది..

15.20 पर्ची जो तेरे दिल की आरज़ुओं की हाथ लग जाती अगर..
इश्क़ में तेरे हम भी नकल कर के पास हो जाते..
నీ మనసులోని కోరికల చిట్టీ నా చేతికి అందితే..
నీ ప్రేమలో నేనూ కాపీ కొట్టి పరీక్ష గట్టెక్కేసేవాడిని..

15.21 किसी के पास टूटा हुआ दिल है क्या..
आधा मेरा वाला लगाकर नया दिल बनाते हैं..
ఎవరి వద్ద అయినా విరిగిన గుండె ఉందా?..
నాది సగం కలిపి పెట్టి కొత్త గుండెను చేద్దాం..

15.22 बदल लेती है रहगुज़र कोई गिला नहीं करती..
ठोकरें जहान की खाके हवाएँ गिरा नहीं करती..
దారులు మారుస్తాయి, బాధలేమీ చెప్పుకోవు..
లోకపు ఎదురుదెబ్బలు తిని కూడా గాలులు కిందపడిపోవు..

15.23 बादशाह की मात को इक्के निकल आते हैं
पक्के वादे भी जब कच्चे निकल आते हैं
ये क़िताब-ए-ज़िंदगी और रिश्तों के धागे हैं
धागे टूट जाएँ तो पन्ने निकल आते हैं
(పేకలో) రాజును పడగొట్టటానికి ఆసులు లేచివస్తాయి
ఇచ్చిన మాటలు కూడా గాలిమాటలుగా తేలిపోతాయి..
ఇది జీవితపు పుస్తకం, ఇవి అనుబంధాల దారాలు
దారాలు తునిగిపోతే పుటలు ఊడిపోతాయి..

15.24 नादान आईने को क्या खबर..
कि एक चेहरा चेहरे के अन्दर भी होता है...
పాపం, అద్దానికేం తెలుసు..
ముఖం లోపల కూడా ఇంకొక ముఖం ఉంటుందని..

15.25 वक़्त की रफ़्तार रुक गई होती
शर्म से आँखे झुक गई होती..
अगर दर्द जानती शमा परवाने का
तो जलने से पहले बुझ गई होती..
కాలపు వేగం ఆగిపోయి ఉండేది
సిగ్గుతో కన్నులు వాలిపోయి ఉండేవి..
దీపపు పురుగు నెప్పి దీపానికి తెలిసి ఉంటే
వెలిగే ముందరే మలిగిపోయి ఉండేది..

15.26 लोग तो बे-वजह ही खरीदते हैं आईने ..
आंख बंद करके भी अपनी हकीकत जानी जा सकती है ..
జనాలు అనవసరంగా అద్దం కొనుక్కుంటారు..
కన్నులు మూసుకుని కూడా తన వాస్తవం తెలుసుకోవచ్చు..

15.27 इश्क़ में तेरे नशे में चूर होता जा रहा हूँ..
मैं तुम्हेँ लिखते-लिखते मशहूर होता जा रहा हूँ..
నీ ప్రేమలో, నీ మత్తులో నేను కరిగిపోతున్నాను..
నిన్ను గురించి వ్రాస్తూ వ్రాస్తూ నేను గొప్ప పేరు గడించేస్తున్నాను..

15.28 अब तो मोहब्बत भी सरकारी नौकरी जैसी लगती है..
कंबख़्त ग़रीबों को तो मिलती ही नहीं..
ఇప్పుడు ప్రేమ కూడా ప్రభుత్వోద్యోగం లా అయిపోయింది..
ఛ, అసలు పేదవారికి దొరకనే దొరకదే..

15.29 कैसे करें इंतजार तेरे लौट आने का..
अभी दिल को यक़ीन नहीं हुआ है तेरे चले जाने का..
నీవు తిరిగిరావాలని ఎట్లా ఎదురుచూసేది?..
ఇంకా నీవు వెళిపోయిన సంగతే నా మనసు నమ్మటం లేదే..

15.30 हम तो हद से गुज़र गए थे तुम्हे चाहने में..
तुम्ही उलझे रहे हमें आज़माने में..
నేను నిన్ను కోరుకోవటంలో హద్దులు దాటిపోతునే ఉన్నాను..
నువ్వే నన్ను పరికించటంలో చిక్కుకుపోయి ఉన్నావు..

15.31 काश तेरी याद़ों का खज़ाना बेच पाते हम..
हमारी भी गिनती आज अमीरों में होती ..
నీ జ్ఞాపకాల నిధిని అమ్మగలిగితే బాగుండేది..
నన్ను కూడా ధనవంతులతో లెక్క వేసేవారు..

15.32 मोहब्बत में हमेशा अपने आप को बादशाह समझा हमने..
मगर एहसास तब हुआ जब किसी को माँगा फकीरों की तरह..
ప్రేమలో ఎప్పుడూ నన్ను నేను చక్రవర్తిననే అనుకున్నాను..
కానీ ఒకరు కావాలని బిచ్చగాడిలా అడుక్కునేవేళ కానీ నిజం తెలియలేదు..

15.33 इश्क़ ना होने के सिर्फ़ दो ही तरीक़े थे..
या दिल ना होता, या तुम ना होते..
ప్రేమ కలగకుండా ఉండటానికి రెండే మార్గాలు..
మనసైనా ఉండాల్సింది కాదు, నీవైనా ఉండకుండా ఉండాలి..
నా మనసో, నీవో - ఎవరో ఒకరు ఉండాల్సింది కాదు..

15.34 चलो, अब जाने भी दो, क्या करोगे दास्तां सुनकर..
खामोशी तुम समझोगी नहीं, और बयां हमसे होगी नहीं..
ఇక వదిలేయరాదా, ఏం చేస్తావు జరిగింది విని..
మౌనమేమో నీకు అర్థం కాదు, వ్యక్తపరచటమేమో నా వల్ల కాదు..

15.35 बारिश और मोहब्बत दोनों में फर्क़ बस इतना है कि..
एक में जिस्म भीग जाता है, और दूसरी में आखें..
వాన ప్రేమ- రెండిటిలో తేడా ఇంతే..
ఒకదానిలో శరీరం తడుస్తుంది, ఇంకోదానిలో కన్నులు..

15.36 वो अपनी तन्हाई की खातिर फिर आ मिला मुझसे..
हम नादान ये समझे हमारी दुआओं में असर है..
తను తన ఒంటరితనం వల్ల మళ్ళీ నన్ను కలిశాడు..
నేనేమో వెర్రిదాన్ని నా ప్రార్థనల ఫలితమని అనుకున్నాను..

15.37 वो अक्सर मुझसे पूछा करती थी..
तुम मुझे कभी छोड़ कर तो नहीं जाओगे..
काश मैंने भी पूछ लिया होता..
తను ఎప్పుడూ అడిగేది,
నన్ను విడిచి పోవు కదా అని..
నేనూ అడిగి ఉంటే బాగుండేది..

15.38 वो ना ही मिलते तो अच्छा था..
बेकार में मोहब्बत से नफ़रत हो गई..
తను కలవనే కలవకపోతే బాగుండేది..
అనవసరంగా ప్రేమంటే ద్వేషం పుట్టింది..

15.39 ज़िन्दगी में ज़िन्दगी से हर चीज़ मिली..
मगर उनके बाद ज़िन्दगी न मिली..
జీవితంలో జీవితంనుండి అన్ని వస్తువులు దొరికాయి..
కానీ తన తరువాత జీవితమే దొరకలేదు..

15.40 अब शिकायतें तुम से नहीं, खुद से है..
माना के सारे झूठ तेरे थे..
लेकिन उन पर यकिन तो मेरा था..
ఇక నా ఆవేదన నీగురించి కాదు, నా గూర్చే..
అబద్ధాలన్నీ నీవే కావచ్చు గాక..
కానీ వాటి మీద నమ్మకం మాత్రం నాదే కదా..

15.41 रंग तेरी यादों का ना उतरा अब तक..
लाख बार खुद को आँसुओं से धोया हमने..
నీ జ్ఞాపకాల రంగు ఇంకా దిగటమే లేదు..
లక్షసార్లు నన్ను నేను అశ్రువులతో కడుక్కున్నాను..

15.42 भूल जाने का मशवरा और जिंदगी बनाने की सलाह..
ये कुछ तोहफ़े मिले थे उनसे, आखिरी मुलाकात में..
మర్చిపొమ్మని సలహా, జీవితం దిద్దుకోమని పరామర్శ..
ఇవి తననుండి చివరగా కలసినప్పుడు దొరికిన కానుకలు..

15.43 चलते रहेंगे क़ाफ़िले मेरे बग़ैर भी यहाँ..
एक तारा टूट जाने से फ़लक़ सूना नहीं होता..
నేను లేకుండా కూడా ఇక్కడ యాత్రలు సాగుతుంటాయి..
ఒక చుక్క రాలినంతమాత్రాన ఆకాశం శూన్యమైపోదు..

15.44 यूँ ही हम दिल को साफ़ रखा करते थे..
पता नहीं था कि क़ीमत चेहरों की होती है..
నేను మనసును స్వచ్ఛంగా ఉంచుకున్నది వృథా అయింది..
విలువ ముఖాలకు ఇస్తారని తెలియదు కదా..

15.45 हर रात जान बूझकर रखता हूँ दरवाज़ा खुला..
शायद कोई लुटेरा मेरा ग़म भी लूट ले..
ప్రతీ రాత్రి కావాలనే తలుపులు తీసి పెడతాను..
ఎవరైనా దోపిడీవాడు నా బాధను దోచుకుపోతే బాగుండు..

15.46 वही रिश्ता, वही नाता, वही मैं और वही तुम..
बस, अब वक्त ना रहा तेरे पास, इज़हार-ए-मोहब्बत के लिए..
అదే బంధం, అదే అనుబంధం, అదే నేను, అదే నీవు..
కానీ నీ వద్ద ఇప్పుడు వ్యవధి లేదు, ప్రేమను వ్యక్తం చేయటానికి..

15.47 फर्क़ है तुम्हारी और मेरे दर्द में..
तुम्हारी आँखें रोती है और हमारा दिल..
నా నెప్పిలో, నీ నెప్పిలో చాలా తేడా ఉంది..
నీవేమో కన్నులు ఏడుస్తాయి, నాదేమో మనస్సు..

15.48 बहुत तकलीफ़ देते है वो ज़ख़्म..
जो बिना बात के मिलते है..
చాలా కష్టపెడతాయి ఆ గాయాలు..
అకారణంగా తగిలేవి..

15.49 अजीब सबूत माँगा उसने मेरी मोहब्बत का..
के भूल जाओ तो मानूँ कि मुझसे मोहब्बत है..
చాలా విచిత్రమైన ఋజువు కావాలన్నారు వారు ప్రేమకు..
నన్ను మర్చిపో, ఎప్పుడే ఒప్పుకుంటా, నీకు నేనంటే ఇష్టమని..

15.50 बहुत अंदर तक तबाही मचाता है..
वो आँसू जो आँख से बह नहीं पाता..
చాలా లోతుగా నాశనం చేస్తుంది..
కంటిని వీడలేకపోయిన ఆ కన్నీటి చుక్క..


15.51 तुम रख न सकोगे मेरा तोहफ़ा संभालकर..
वरना मैं अभी दे दूँ, जिस्म से रूह निकालकर..
నీవు నా కానుకను జాగ్రత్తగా ఉంచుకోలేవు..
లేదంటే ఇప్పుడే నా శరీరంనుండి అంతరాత్మను తీసిచ్చేస్తాను..

15.52 बेवफ़ा लोग बढ़ रहे हैं धीरे धीरे..
इक शहर अब इनका भी होना चाहिए..
నమ్మకద్రోహులు పెరుగుతున్నారు నెమ్మదిగా..
వీరిది కూడా ఒక ఊరు (విడిగా) ఉండాలి..

15.53 कसूर तो बहुत किये ज़िन्दगी में..
पर सज़ा वहाँ मिली जहाँ बेक़सूर थे हम..
తప్పులు చాలా చేశాను జీవితంలో..
కానీ నిరపరాధినైన చోటే శిక్ష పడింది..

15.54 याद आ जाये तो बता देना
मैं ने आज भी दिल के दरवाज़े खुले रखे है
నేను జ్ఞాపకం వచ్చినట్లైతే చెప్పు..
ఈనాటికి కూడా మనసు తలుపులు తీసే ఉంచాను..

15.55 बिना उसके दिल का हाल कैसे बतलाऊँ..
जैसे खाली बस्ता हो किसी नालायक बच्चे का..
తను లేకుండా మనసెట్లా ఉందో ఎట్ల చెప్పను?..
ఒక అల్లరిపిల్లవాడి ఖాళీ సంచీలా..

15.56 मैं तुम पर अपनी जान भी लुटा दूँ..
तुम मुझ से मुझ जैसी मोहब्बत तो करो..
నేను నీకై ప్రాణాలు సైతం ఇచ్చేయగలను..
నువ్వు నన్ను నాలాగా ప్రేమించనైతే ప్రేమించు..

15.57 लिखना तो ये था कि, खुश हूँ तेरे बग़ैर भी..
पर कलम से पहले आँसू कागज़ पर गिर गया..
నీవు లేకుండా కూడా సంతోషంగా ఉన్నానని వ్రాయాలనుకున్నా..
కానీ కలం కన్నా ముందు కన్నీటి బొట్టు కాగితం పై పడింది..

15.58 दुख तो अपने ही देते हैं वरना..
ग़ैरों को कैसे पता की हमें तकलीफ़ किस बात से होती है..
బాధపెట్టేవారు మనవారే ఉంటారు, లేకపోతే..
పరాయివారికి ఏం తెలుసు, దేనివల్ల మనను నొప్పించవచ్చో..

15.59 तनहा ही उम्र गुज़रती है..
लोग तसल्लिया देते है साथ नहीं..
ఒంటరిగానే జీవితం గడుస్తుంది..
జనాలు ఆశ్వాసనలిస్తారు, చేయూతనివ్వరు..

15.60 कमाल का जिगर रखते है कुछ लोग..
दर्द पढ़ते है और आह तक नहीं करते..
భలే నిబ్బరం ఉంటుంది కొందరికి..
దుఃఖాన్ని చదువుతారు, అయ్యో అని కూడా అనరు..


15.61 ले लूंगा अपने सर पे ,मैं, तोहमतें सारी..
इल्ज़ाम मोहब्बत पे लगाया न जाएगा..
నా తలమీదకే అన్ని నెపాలూ వేసేసుకుంటాను..
ప్రేమ మీద ఏ నేరమూ మోపబడదు..

15.62 बेहतरीन होता है वो रिश्ता,
जो तकरार होने के बाद भी..
सिर्फ़ एक मुस्कुराहट पर पहले जैसा हो जाए..
అద్భుతమైనది ఆ అనుబందం,
పోట్లాట తరువాత కూడా
ఒకే ఒక్క చిరునవ్వుతో ఇదివరకటిలాగా అయిపోయేది..

15.63 यह बारिश भी तेरे दर्द जैसी ही है..
हल्की हल्की ही सही पर होते जा रही है..
ఈ వర్షం కూడా నిను గూర్చిన వేదన లాంటిదే..
కొద్దికొద్దిగా అయినా నానుడుగా పడుతూనే ఉంది..

15.64 सुख-दुख की ना जाने कितनी फाइलें छुपा रखी हैं इस दिल में..
कौन कहता है कि सीने में अलमारियां नहीं होती.
సుఖదుఃఖాల ఫైళ్ళు ఎన్ని దాగి ఉన్నాయో ఈ గుండెలో..
ఎవరన్నారు, ఛాతిలో గూళ్ళు ఉండవని..

15.65 तेरी तस्वीर, तेरी यादें, तेरे ख़्वाब, तेरी ही बातें..
मैं अपने ही मकान में जैसे किरायेदार सा हूँ..
నీ రూపం, నీ జ్ఞాపకాలు, నీ కలలు, నీవే మాటలు..
నేను నా సొంత ఇంట్లోనే బాడుగకు ఉన్నట్టుంది..

15.66 घर का आईना भी अब हक़ जताने लगा है..
ख़ुद तो वैसा ही है, पर मेरी उम्र बताने लगा है..
ఇంట్లో అద్దం కూడా ఇప్పుడు హక్కు వినియోగిస్తోంది..
తాను మారలేదు కానీ నా వయసును చూపించటం మొదలుపెట్టింది..

15.67 एक अजीब सी दौड़ है ये जिन्दगी..
जीत जाओ तो कई अपने पीछे छूट जाते हैं..
और हार जाओ तो, अपने ही पीछे छोड़ जाते हैं..
జీవితం భలే తమాషా పరుగు పందెం..
గెలిస్తే సొంతవారెందరో వెనకే వీడిపోతారు..
ఓడితే సొంతవారే విడిచిపెట్టేస్తారు..

15.68 जाने कौन सी शौहरत पर आदमी को नाज़ है..
जो आखरी सफ़र के लिए भी दूसरे का मोहताज है..
ఏ ఆస్తిపాస్తులు చూసుకుని మనిషి గొప్పలకు పోతాడో..
అంతిమయాత్రకు కూడా ఇతరులపై ఆధారపడేవాడు..

15.69 याद आयेगी हमारी तो बीते कल की किताब पलट लेना..
यूँ ही किसी पन्ने पर मुस्कुराते हुए हम मिल जायेंगे..
నేను గుర్తుకువస్తే గతం పుస్తకం పుటలు తిప్పుకో..
ఎక్కడో ఒకచోట చిరునవ్వుతో తప్పక కనిపిస్తాను..

15.70 यूँ तो ग़लत नहीं होते अंदाज़ चहरों के..
लेकिन लोग वैसे भी नहीं होते जैसे नज़र आते है..
చెప్పాలంటే, ముఖాలు చూసి ఊహించినది తప్పేం పోదు..
కానీ జనాలు కనిపించినట్లే ఉండరు కదా..

15.71 तेरा हाथ लूँ हाथ में और फिर ऐसा हो..
कि तेरे ग़म ख़ुद ब ख़ुद मुझमें उतर जाये..
నీ చేతిని నా చేతిలోకి తీసేసుకున్నాక, ఇట్లా జరగాలి..
నీ దుఃఖాలన్నీ వాటికవే నాలోకి దిగిపోవాలి..

15.72 अबके सावन में हुई ये कैसी बरसात..
बादल बरसे दो घड़ी और नैना सारी रात..
ఈసారి శ్రావణంలో ఇదొక విచిత్ర వర్షం..
మబ్బులు కొద్ది సేపే, కన్నులు కురిసింది మాత్రం రాత్రల్లా..

15.73 खुद को खोने का पता नहीं चला..
किसी को पाने की यूँ इन्तहा कर दी मैं ने..
నన్ను నేను పోగొట్టుకున్నది తెలియనే లేదు..
ఒకరిని పొందటంలో చరమసీమకు వెళిపోయాను..

15.74 उनकी जब मर्ज़ी होती है वो हमसे बात करते हैं..
और हम भी पूरा दिन उनकी मर्ज़ी का इंतज़ार करते हैं..
వారికి ఇష్టం ఉన్నప్పుడు వారు మాతో మాట్లాడతారు..
మేము కూడా రోజంతా వారి ఇష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటాము..

15.75 खूबसूरती न सूरत में होती है न लिबास में..
बस, निगाहें जिसे चाहे उसे हसीन कर दें..
అందం ముఖంలోనూ ఉండదు, బట్టలలోనూ ఉండదు..
చూపులు ఎవరిని తలుచుకుంటే వారిని అందంగా చేసేయగలవు..

15.76 लफ़्ज़ मेरी पहचान बने तो बेहतर है..
चेहरे का क्या? वो तो साथ चला जाएगा..
మాటలే నా గుర్తింపు అయితే మంచిది..
ముఖానిదేముంది, అది నా వెంటే వెళిపోతుంది..

15.77 तुम्हें कितनी मोहब्बत है, मालूम नहीं..
मुझे लोग आज भी तेरी क़सम दे कर मना लेते है..
నీకెంత ప్రేమ ఉందో నేనెరుగను..
జనాలు నన్ను ఈనాటికి కూడా నీ మీద ఒట్టేసి ఒప్పించేసుకుంటారు..

15.78 दुनिया की भीड़ में तुझे याद कर सकूँ कुछ पल..
अजनबी राहों की तरफ़ कदम मोड़ता हूँ..
ఈ లోకం రద్దీలో కొద్దిసేపు నిన్ను తలచుకుందామని..
తెలియని దారుల్లోకి అడుగులు మళ్ళిస్తాను..

15.79 वफ़ा उनसे ना पूँछो जो आंसू बहाते हैं..
वफ़ा उनसे पूँछो जो उन्हें पी जातें हैं
విశ్వాసమంటే ఏంటని కన్నీరు కార్చేవారిని అడగకండి..
కన్నీరు (మౌనంగా లోలోపలే) తాగేసేవారిని అడగండి..

15.80 आँसू निकल पड़े ‪ख़्वाब‬ में ‪उसको‬ दूर जाते ‪‎देखकर‬.. ‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬
आँख ‪‎खुली‬ तो ‪एहसास‬ हुआ ‪इश्क‬ सोते ‪‎हुए‬ भी ‪‎रुलाता‬ है..‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬
 కన్నీరు కారింది, కలలో తను దూరం కావటం చూసి..
కళ్ళు తెరిచాక అనిపించింది, ప్రేమ నిద్రలో ఉన్నవారినీ ఏడిపిస్తుందని..

15.81 ज़िंदगी एक सफ़र है, आराम से बढ़ते चलो..
उतार चढ़ाव तो आते रहेंगे, बस गियर बदलते रहो..
జీవితం ఒక ప్రయాణం, సాగుతూ ఉండండి..
ఎత్తుపల్లాలు వస్తుంటాయి, గేర్ మారుస్తూండండి..

15.82 जनाजों में भीड़ ऐसे ही नहीं होती..
हर इंसान अच्छा है
बस इस दुनिया से चले जाने के बाद
అంతిమయాత్రలో రద్దీ అనేది అకారణంగా ఉండదు..
ప్రతివాడూ మంచివాడే, లోకంవీడి వెళిపోయాక..

15.83 बार–बार वो हिसाब करने बैठ जाते हैं..
जबकि उनको पता है जो भी हुआ बेहिसाब हुआ..
మాటిమాటికీ వారు లెక్కలకు కూర్చుంటారు..
తనకు తెలుసు, ఏది జరిగినా లెక్కకందనంత జరిగిందని..

15.84 वो जा रही थी और मैं ख़ामोश खड़ा देखता रहा..
क्योंकि सुना था कि पीछे से आवाज़ नहीं देते..
తను వెళిపోతున్నది, నేను మౌనంగా నిలబడి చూస్తూండిపోయాను..
ఎందుకంటే వెనకనుంచి ఎవరినీ పిలవకూడని విన్నాను..

15.85 मोहब्बत की तरह नफ़रत का भी साल में एक ही दिन तय कर दो कोई..
ये रोज़-रोज़ की नफ़रतें अच्छी नहीं लगतीं..
ప్రేమలాగే ద్వేషానికీ ఏడాదికొక రోజు నిర్ణయించండి ఎవరైనా..
ఈ దైనందిన ద్వేషాలు నాకు నచ్చటం లేదు..

15.86 दिल से खेलना तो हमे भी आता है..
लेकिन जिस खेल में खिलौना टूट जाए, वो खेल हमें पसंद नहीं..
మనసులతో ఆడుకోవటం నాకూ ఇష్టమే..
కానీ ఏ ఆటలో బొమ్మ తునకలౌతుందో, ఆ ఆట నాకు నచ్చదు..



15.87 हम बेक़सूर लोग भी बड़े दिलचस्प होते हैं..
शर्मिंदा होजाते हैं ख़ता के बग़ैर भी..
మనం నిర్దోషులం కూడా భలే ఆసక్తికరమైనవాళ్ళం..
తప్పు చేయకుండానే తల వంచుకుంటాం..
(స్వతంత్రించాను)

15.88 ज़रूरी तो नहीं कि दौलत ही अमीरी का पैमाना हो..
कुछ लोगों के पास आप जैसे दोस्त भी होते हैं..
ఆస్తిపాస్తులే ఉన్నవారనటానికి సంకేతం కాదు..
కొందరి వద్ద మీవంటి స్నేహితులు కూడా ఉంటారు..

15.89 चाँद देखकर मुस्कुराना बेशक ईद हैं..
लेकिन इंसान इंसान को देखकर मुस्कुराये तो रोज़ ईद हैं..
చంద్రుని చూసి చిరునవ్వు చిందించటం నిస్సందేహంగా ఈద్ పండగే..
కానీ మనిషి మనిషిని చూసి చిరునవ్వు నవ్వితే ప్రతిరోజూ ఈద్ పండగే..

15.90 आदत नहीं है, मुझे सब पे फ़िदा होने की..
पर तुझ में कुछ बात ही ऐसी है कि,
दिल को समझने का मौका ही नहीं मिला..
నాకు అలవాటు లేదు, అందరిమీదా మనసు పారేసుకోవటం..
కానీ నీలో ఏదో ఉంది- దానితో..
మనసుకు అర్థం చేసుకునే అవకాశమే దొరకలేదు..

15.91 एक ग़ज़ल तेरे लिए ज़रूर लिखूंगा
बे-हिसाब उस में तेरा कसूर लिखूंगा..
टूट गए बचपन के तेरे सारे खिलौने
अब दिलों से खेलना तेरा दस्तूर लिखूंगा..
నీకోసం ఓ పాట వ్రాస్తాను
అందులో లెక్కలేని నీ తప్పిదాలను వ్రాస్తాను..
చిన్ననాటి నీ ఆటబొమ్మలన్నీ విరిగిపోయాయి..
ఇక మనసులతో ఆడుకోవటం నీ పద్ధతని వ్రాస్తాను..

15.92 क्या पता तुम कब भूल जाओ ये मोहब्बत..
जिसे हम ज़िन्दगी और तुम एक लफ्ज़ कहते हो..
దేన్ని నేను జీవితమంటాను, నీవు ఒక పదమని అంటావో..
అట్టి ఈ ‘ప్రేమ’ను నువ్వు ఏ క్షణాన మర్చిపోతావో ఏమో..

15.93 आज मुझे राख समझकर मेरी हंसी उडा लोगे..
मेरे ख्वाब छुओगे जिस दिन अपने हाथ जला लोगे..
ఈనాడు నన్ను బూడిద గా భావించి వెక్కిరిస్తావు..
నా కలలను తాకిననాడు, నీ చేతులు కాలిపోగలవు..

15.94 अहमियत और दूरियों में अनोखा रिश्ता है..
दोनों एक साथ बढ़ती हैं..
గొప్పతనం, దూరం- వీటికి భలే విచిత్ర అనుబంధం..
రెండూ ఒకేసారి పెరుగుతాయి..

15.95 किसी को न पाने से ज़िंदगी खत्म नहीं हो जाती..
पर किसी को पाकर खो देने के बाद कुछ बाकी भी नहीं बचता..
ఒకరిని పొందనందువల్ల జీవితం అంతమైపోదు..
కానీ ఎవరినైనా పొంది పోగొట్టుకున్నాక మిగిలింది కూడా ఏమీ ఉండదు..

15.96 तकिये क़े नीचे दबा क़े रखे हैँ तुम्हारे ख़याल..
एक तेरा अक्स, एक तेरा इश्क़..
ढेरों सवाल और तेरा इंतज़ार..
దిండు కింద మడిచి పెట్టేశాను నీ గురించిన ఆలోచనలను..
ఒక నీ చిత్రాన్ని, ఒక నీ ప్రేమను,
గుట్టల కొద్దీ ప్రశ్నలను, నీ గురించిన ప్రతీక్షను..

15.97 मेरे ज़ख्म का अंदाज़ा ना लगा..
दिल का हर पन्ना दर्द की किताब है..
నా గాయాలను అంచనా వేయకు..
మనసులో ప్రతి పుటా బాధల గ్రంథమే..

15.98 निकाल दिया उसने हमें अपनी ज़िन्दगी से भीगे कागज़ की तरह..
ना लिखने के काबिल छोड़ा ना जलने के..
నన్ను తీసిపారేశారు వారు, తన జీవితం నుండి, తడిసిన కాగితంలా..
వ్రాతకూ పనికిరాను, కాలిపోవటానికీ కుదరదు..

15.99 कोई इल्ज़ाम रह गया हो तो वो भी दे दो..
पहले भी हम बुरे थे, अब थोड़े और सही..
ఏదైనా నెపం మిగిలితే అదీ వేసేసేయి..
మొదలూ చెడ్డవారమే, ఇక ఇంకొంత ఎక్కువైతే ఏంటి..

15.100 दो आँखो में दो ही आँसू..
एक तेरे लिए, एक तेरी खातिर..
రెండు కన్నులలో రెండే కన్నీటి చుక్కలు..
ఒకటి నీ కోసం, మరొకటి నీ కొరకు..

15.101 लोगों की बातें सुनकर छोड़ जाने वाले..
हम कितने बुरे थे तुम पता तो कर लेते..
జనాల మాటలు విని వదిలివెళ్ళే మనిషీ..
నాలో ఎంత చెడుందో స్వయంగా తెలుసుకోవలసింది కదా..

15.102 कुछ उनकी मजबूरियाँ, कुछ मेरी कश्मकश..
बस यूँ ही एक ख़ूबसूरत कहानी को खत्म कर दिया हमने..
కొంత తన అసహాయత, కొంత నా అసమంజసం..
దానితో ఒక అందమైన కథను అంతం చేశాము మేము..

15.103 आप भले अपनी जिंदगी से खुश नहीं हो
पर कुछ लोग ऐसे भी है जो
आप जैसी जिंदगी जीने के लिए तरसते है
మీకు మీ జీవితం సంతోషంగా లేకపోవచ్చు..
కానీ కొందరు మీ వంటి జీవితాన్ని
జీవించాలని కోరేవారూ ఉంటారు.. 

15.104 उस मोड़ से शुरू करनी है फिर से जिंदगी..
जहाँ सारा शहर अपना था और तुम अजनबी..
ఎక్కడైతే ఊరంతా నా సొంతం, నువ్వు ఏ మాత్రం పరిచయం లేవో..
మరోమారు జీవితాన్ని ఆ కోణంనుంచి మొదలుపెట్టాలనుంది..

15.105 बड़ी आसानी से दिल लगाये जाते हैं..
पर बड़ी मुश्किल से वादे निभाए जाते हैं..
చాలా సులవుగా మనసులిచ్చి పుచ్చేసుకుంటారు..
చాలా కష్టంమీద మాట నిలుపుకుంటారు..

15.106 दूरियों से ही एहसास होता है कि..
नज़दीकियाँ कितनी ख़ास होती है..
దూరాల వల్లే తెలుస్తుంది..
దగ్గరితనాలెంత గొప్పవో అని..

15.107 तुम्हारे बाद मेरा कौन बनेगा हमदर्द..
मैं ने अपने भी खो दिए, तुझे पाने की ज़िद में..
నీ తరువాత నాకెవరుంటారు, బాధను పంచుకునేవారు?..
నిన్ను పొందాలనే పట్టుదలలో నా సొంతవారిని కూడా పోగొట్టుకున్నాను..

15.108 तुम ही वजह मेरे खालीपन की..
और, तुम्ही गूंजते हो मुझमें हरदम..
నా శూన్యస్థితికీ నువ్వే కారణం..
నువ్వే మోగుతుంటావు నాలో ప్రతిక్షణం..

15.109 जब बेअसर से होने लगें मन्नतों के धागे..
समझ लो और इम्तिहान हैं इसके आगे..
ప్రార్థనలన్నీ వ్యర్థమవుతున్నాయంటే..
దగ్గరలో పరీక్ష ఉందని అర్థం..

15.110 बुरे हैं हम तभी तो जी रहे हैं..
अच्छे होते तो दुनिया कहाँ जीने देती..
చెడ్డవారం కాబట్టే బ్రతుకుతున్నాము..
మంచివారమైతే ప్రపంచం ఎక్కడ బ్రతకనిస్తుంది..

15.111 भुला देंगे तुमको ज़रा सब्र तो कीजिये..
आपकी तरह मतलबी बनने में थोड़ा वक़्त तो लगेगा हमें..
మర్చిపోతాను మిమ్మల్ని కాస్త ఓర్పు పట్టండి..
మీ లాగా స్వార్థపరులం కావటానికి కాస్తైనా సమయం పడుతుంది కదా..

15.112 अबकी बार सुलह करले मुझसे..
ए दिल, वादा करता हूँ..
कि फिर नहीं दूँगा तुझे किसी ज़ालिम के हाथों में..
ఈసారికి సంధిచేసుకో నాతో..
ఓ మనసా, మాటిస్తున్నాను..
ఇంకోసారి నిన్ను ఏ నిర్దయుల చేతిలో పెట్టను..

15.113 ऐ इश्क़, तेरा वक़ील बन के बुरा किया मै नें..
यहाँ हर शायर तेरे ख़िलाफ़ सबूत लिए बैठा हैं..
ఓ ప్రేమా, నీ తరఫు న్యాయవాదినై తప్పు చేశాను..
ఇక్కడ ప్రతీ కవి నీకు విరుద్ధంగా సాక్ష్యాధారాలు పెట్టుకుని కూర్చున్నాడు..

15.114 इरादा कतल का था तो मेरा सिर कलम कर देते..
क्यों इश्क़ में डाल कर तूने मेरी हर साँस पर मौत लिखदी..
హత్యచేయటం లక్ష్యమైతే నా తల తెగేయవలసింది..
ఎందుకు ప్రేమలో పడేసి నా ప్రతి ఊపిరిపై మృత్యువును వ్రాసేశావు?..

15.115 वो सुना रहे थे अपनी वफ़ाओं के किस्से..
हम पर नज़र पड़ी तो खामोश हो गए..
వారు వినిపిస్తున్నారు, తమ విశ్వస్తత గాథలు..
మా పై దృష్టి పడగానే మౌనం వహించారు..

15.116 उसने कहा, तुम मुझे ज़हर लगती हो..
मैंने भी बोल दिया, खा के मर जा..
అతనన్నాడు- నువ్వు నాకు విషంలా అనిపిస్తావని..
నేనూ అన్నాను- తిని చచ్చిపొమ్మని..

Friday, 8 June 2018

షేరోం కా షోర్-14 - (शेरों का शोर) ఉర్దూ షేర్ లకు తెలుగు అనువాదం

14.1. सुना है बहुत बारिश है तुम्हारे शहर में, ज़्यादा भीगना मत..
अगर धुल गयी सारी ग़लतफ़हमियाँ, तो बहुत याद आएँगे हम..
మీ ఊళ్ళో వానలు బాగా ఉన్నాయిట కదా, ఎక్కువగా తడవకు..
అపోహలన్ని కరిగిపోయాయంటే, నేను బాగా గుర్తు రాగలను..

14.2. दुख के दस्तावेज़ हो, या सुख की वसीयत..
ध्यान से देखेगे तो, नीचे ख़ुद के ही दस्तख़त मिलेंगे..
దుఖాల పత్రాలైనా, సుఖాల వీలునామాలైనా..
జాగ్రత్తగా చూస్తే కింద సొంత సంతకాలే కనిపిస్తాయి..

14.3. सीख तो उस बच्चे से लेनी चाहिए..
जो अपनों की मार खाके अपनों से ही लिपट जाता है..
నేర్చుకోవలసింది ఆ పిల్లవాడి నుంచి..
తనవారిచేత దెబ్బలు తిని, వారినే చుట్టేసుకుంటాడు..

14.4. ऐसे जियो जैसे कि ज़िंदगी तुम्हें नहीं मिली..
ज़िंदगी को तुम मिले हो..
జీవితం నీకు దొరకటం కాదు.
జీవితానికి నీవు దొరికావా అన్నట్టు జీవించు..

14.5. ताला लगा दिया दिल को,
अब तेरे बिन किसी का अरमान नहीं..
बंद होकर फिर खुल जाए, ये कोई दुकान नहीं..
తాళం పెట్టాను గుండెకు, ఇక నీవు తప్ప వేరెవరి కోరికా లేదు..
మూసేసి తిరిగి తెరవటానికి ఇదేమీ దుకాణం కాదు..

14.6. आदत मेरी अंधेरों से डरने की डाल कर..
एक शख्स मेरी जिंदगी को रात कर गया..
చీకట్లకు భయపడటం నాకు అలవాటు చేసి..
ఒకరు నా జీవితాన్ని రాత్రి గా మలచిపోయారు..

14.7. अब की बार आईना जरा बड़ा खरीदना..
ताकि तुम्हें अपने अलावा दूसरी चीजें भी दिखें..
ఈసారి అద్దం కాస్త పెద్దది కొనుక్కో..
 నీవు కాక వేరే వస్తువులు కూడా కనిపిస్తాయి..

14.8. बस एक दिन ना काफी है उसकी बंदिगी को..
जन्मों में भी न होगी गिनती पूरी उसकी रहमतों की..
ఒక్కరోజు సరిపోదు తన ఆరాధనకు..
తన ఉపకారాల లెక్క జన్మజన్మలకూ పూర్తికానిది..

14.9. बचपन में अम्मा ने छुआई थी जो कंधो से..
जहाजों पर चढ़ कर भी वो ऊंचाई मैं छू नहीं पाया..
చిన్నతనంలో అమ్మ భుజాల మీదుగా ఎక్కి తాకించినది..
విమానాలెక్కి కూడా ఆ ఎత్తులను అందుకోలేకపోయాను..

14.10. हर आदमी में थे दो चार आदमी पिन्हाँ..
किसी को ढूँडने निकला कोई मिला मुझ को..
ప్రతీ మనిషిలో నలుగురైదుగురు మనుషులు దాగి ఉన్నారు
ఒకరిని వెతకాలని కదిలితే మరొకరు దొరికారు నాకు..

14.11. कभी तन्हाई, कभी तड़प, कभी बेबसी, तो कभी इंतज़ार..
ये मर्ज़ भी क्या चीज हैं जिसे इश्क़ कहते हैं..
ఒకప్పుడు ఒంటరితనం, మరొకప్పుడు ఉద్వేగం,
ఒకసారి అసహాయత, ఇంకొకసారి ఎదురుచూపులు..
జనాలు ప్రేమ అని పిలిచే ఇదేం అస్వస్థతో..

14.12. बदलना तय है हर चीज़ का इस दुनिया में..
किसी का दिल बदलेगा, किसी के दिन बदलेंगे..
ప్రతీదీ మారటం ఖాయం ఈ లోకంలో..
ఒకరి మనసు మారుతుంది, ఒఖరి రోజులు మారతాయి..

14.13. सुई की नोक पर टिके है सारे रिश्ते..
जरा सी चूक हुई नहीं कि चुभकर लहूलुहान कर देते है..
సూది మొన మీద నిలిచి ఉన్నాయి అనుబంధాలన్నీ..
కొద్దిగా తప్పితే గుచ్చుకుని రక్తం కారుస్తుంటాయి..

14.14. जिन्दगी जब देती है तो एहसान नहीं करती..
और जब लेती है तो लिहाज़ नहीं करती..
జీవితం- ఇచ్చేవేళ పెద్ద ఉపకారాలేం చేయదు..
తీసుకునే వేళ ఏమాత్రం సంకోచించదు..

14.15. मुझ पर तू जो सितम करता है, बेवफ़ा समझकर ..
मैं भुला देता हूँ वो सब कुछ, तुझे खुदा समझकर ..
నన్ను మోసకారిగా భావించి నీవు పీడిస్తున్నా..
నిన్ను దేవుడుగా భావించి అదంతా మర్చిపోతున్నా..

14.16. मेरे किरदार को मेरे विस्तार से न जानो..
मैं जब पौधा था, तब भी बरगद ही था..
నాపాత్రను నా విస్తృతి వల్ల తెలుసుకోబోకు..
నేను మొక్కగా ఉన్నప్పుడూ మఱ్ఱిచెట్టునే..

14.17. तेरे करीब आकर बडी उलझन में हूँ..
मैं तेरे गैरों में हूँ, या फिर अपनो में हूँ..
నీ దగ్గరగా వచ్చి నేను పెద్ద సమస్యలో పడ్డాను..
నేను నీ సొంతవారిలో ఉన్నానా, పరాయివారిలోనా - అని..

14.18. इश्क़ मुहब्बत क्या है, मुझे नहीं मालूम..
बस, तुम्हारी याद बहुत आती है, सीधी सी बात है..
ప్రణయాలూ ప్రేమలేంటో నేనెరుగను..
నీవు బాగా గుర్తుకు వస్తావు, సూటిగా చెప్తే అంతే..

14.19. दिल की दहलीज़ पर रख कर तेरी यादों के चिराग़..
हमने दुनियां को मोहब्बत के उजाले बख्शे..
మనసు గడపమీద నీ జ్ఞాపకాల దీపం వెలిగించి పెట్టి..
నేను లోకానికి ప్రేమ కాంతులను పంచిపెట్టాను..

14.20. झूठ कहूँ तो लफ़्ज़ों का दम घुटता है..
सच कहूँ तो लोग खफ़ा हो जाते हैं..
అబద్ధమాడితే పదాలకు ఊపిరాగిపోతుంది..
నిజం చెప్తే జనాలకు అలక వచ్చేస్తుంది..

14.21. ये दोस्ती का गणित है साहब..
यहाँ दो में से एक गया तो कुछ नहीं बचता..
ఇది స్నేహం గణితం సుమండీ..
ఇక్కడ ఇద్దరిలోనుంచి ఒకరు వెళిపోతే ఏమీ మిగలదు..

14.22. ना मैं गिरा और ना मेरी उम्मीदों की मीनारें गिरी..
पर मुझे गिराने में कई लोग बार-बार गिरे..
నేనూ పడిపోలేదు, నా ఆశయాల శిఖరాలూ పడిపోలేదు..
నన్ను పడేయాలనుకున్నవారంతా మాత్రం మాటిమాటికీ పడిపోయారు..

14.23. बादशाह हो या मालिक, सलामी हम नहीं करते..
पैसे हो या कोई राजकुमारी, गुलामी हम नहीं करते..
రాజైనా యజమానైనా, వంగొంగి నమస్కారాలు చేయను..
పైసలైనా రాజకుమారే అయినా బానిసత్వం నేను చేయను..

14.24. तू नया नया है बेटे, मैं ने खेल पुराने खेले है..
जिन लोगों के दम पर तू उछलता है वो मेरे पुराने चेले है..
నువ్వు కొత్తవాడివి బాబూ, నేను చాలాపాత ఆటగాడిని..
ఎవరి బలంమీద నీవు ఎగురుతున్నావో, వారంతా నా పాత శిష్యులు..

14.25. जब हम रिश्तों के लिए वक़्त नहीं निकाल पाते..
तब वक़्त हमारे बीच से रिश्ता निकाल देता है..
మనం అనుబంధాల కోసం సమయం ఇవ్వలేనప్పుడు..
సమయం మన మధ్య అనుబంధాలను తొలగస్తుంది..

14.26. सांस रुक जाए मगर आंखें कभी बंद न हो..
मौत आए भी तो तुझे देखने की ज़िद खत्म न हो..
శ్వాసలు ఆగిపోయినా కన్నులు మూతలుపడద్దు..
చావు వచ్చినా, నిన్ను చూడాలనే పట్టుదల చచ్చిపోకూడదు..

14.27. बुरे वक़त में ही सबके असली रंग दिखते हैं..
दिन के उजाले में तो पानी भी चांदी लगता है..
కానికాలంలో అందరి అసలు రంగులు కనిపిస్తాయి..
పగటి వెలుగులో అయితే నీరు కూడా వెండిలాగే మెరుస్తుంది..

14.28. कभी किसी के जज्बातों का मज़ाक ना बनाना..
ना जाने कौन सा दर्द लेकर कोई जी रहा होगा..
ఎప్పుడూ ఎవ్వరి భావాలనూ పరిహసించవద్దు..
ఎవరు ఏ బాధల్లో జీవిస్తున్నారో తెలియదు కదా..

14.29. कौन कहता है खामोशियां खामोश होती है
जरूर इनमे कोई न कोई बात होती है..
इन्हें कभी गौर से सुन कर देखना क्या पता
ये वह कह दे जिनकी आपको लफ्जों में तलाश होती है..
ఎవరన్నారు నిశ్శబ్దాలు మౌనంగా ఉంటాయని
తప్పక వీటిలో ఏదో విషయం ఉంటుంది..
వీటిని ఎప్పుడైనా జాగ్రత్తగా వినండి- ఏమో
మాటల్లో మీరు వెతుక్కునేదంతా అవి చెప్పేయవచ్చు..

14.30. कुछ अजीब सा रिश्ता है उसके और मेरे दरमियाँ..
ना नफ़रत की वजह मिल रही है, ना मोहब्बत का सिला..
విచిత్రమైన అనుబంధం, తనకూ నాకూ మధ్య..
అటు ద్వేషం వెనక కారణం దొరకదు,
ఇటు ప్రేమకు ప్రతిఫలం దొరకదు..

[चाय एक शाकाहारी नशा है...
तो क्यों न शराब को छोड़कर चाय को जज्बातों से जोड़ते हैं... 5]
చాయి (తేనీరు) ఒక శాకాహారి మత్తు..
మరి మద్యాన్ని వదిలి చాయిని భావాలతో కలుపుకుందామా?.. 5]

14.31. एक तेरा ख़्याल ही तो है मेरे पास..
वरना कौन अकेले में बैठे कर चाय पीता है..
నీ జ్ఞాపకం ఒక్కటే ఉంది కదా నా దగ్గర..
లేదంటే ఒంటరిగా కూర్చుని తేనీరెవరు సేవిస్తారు?..

14.32. आज लफ़्ज़ों को मैं ने शाम की चाय पे बुलाया है..
बन गयी बात तो ग़ज़ल भी हो सकती है..
ఈరోజు పదాలను తేనీటివిందుకు పిలిచాను..
మాటలు కలిస్తే పాటలు కూడా కావచ్చు..

14.33. ठान लिया था कि अब और नहीं पियेगें चाय उनके हाथ की...
पर उन्हें देखा और लफ्ज़ बग़ावत कर बैठे..
గట్టిగా నిశ్చయించాను, వారి చేతి తేనీరు ఇకపై తాగద్దని..
కానీ వారిని చూసేసరికి మాటలు తిరగబడ్డాయి..

14.34. मिलो कभी चाय पर फिर क़िस्से बुनेंगे..
तुम ख़ामोशी से कहना हम चुपके से सुनेंगे..
ఎప్పుడైనా తేనీరు తాగేదగ్గర కలిస్తే కథలు చెప్పుకుందాం..
నీవు మౌనంగా చెప్పు, నేను గమ్మున వింటాను..

14.35. चाय के कप से उड़ते धुंए में मुझे तेरी शक़्ल नज़र आती है..
तेरे इन्ही ख़यालों में खोकर, मेरी चाय अक्सर ठंडी हो जाती है..
తేనీటి కప్పు నుండి వచ్చే ఆవిరిలో నీ ముఖం కనిపిస్తుంది..
నీ జ్ఞాపకాలలో పడి చాలాసార్లు నా చాయి చల్లారిపోతుంది..

14.36. शब्द और सोच दूरियाँ बढा देते है, क्योंकि..
कभी हम समझ नही पाते, और कभी समझा नही पाते..
మాటలు, ఆలోచనలు దూరాలను పెంచేవే, ఎందుకంటే..
ఒకపరి మనకు అర్థం కాదు, మరొక పరి అర్థం చేయించలేము..

14.37. ठोकर खा कर भी न संभले तो मुसाफ़िर का नसीब..
वर्ना पत्थरों ने तो अपना फर्ज़ निभा ही दिया था..
ఎదురుదెబ్బలు తిని కూడా సర్దుకోకపోతే బాటసారి భాగ్యం అంతే..
పాపం రాళ్ళైతే తమవంతు కర్తవ్యం నిర్వహించాయి కదా..

14.38. हम तो छोटे हैं, अदब से सर झुका लेंगे..
बड़े ये तय करलें, उनमें बड़प्पन कितना है..
మేము చిన్నవారము, గౌరవంతో తల వంచుతాము..
తమ పెద్దరికం ఎంత అనేది పెద్దలు నిర్ణయించుకోవాలి..

14.39. चलिए जिंदगी का जश्न कुछ इस तरह मनाते है..
कुछ अच्छा याद रखते है और कुछ बुरा भूल जाते है
రండి, జీవితంలో సంబరాలు ఇట్లా చేసుకుందాము..
కొంత మంచి గుర్తు చేసుకుందాము, కొంత చెడు మర్చిపోదాము..

14.40. दीवानगी के लिए तेरी गली में आते हैं, ऐ दोस्त..
वरना आवारगी के लिए सारा शहर पड़ा है..
ఉన్మాదం కోసం మీ వీథిలోకి వస్తాము, నేస్తమా..
అల్లరే చేయాలనుకుంటే ఊరంతా ఉంది..

14.41. देख मेरी आँखों में ख्वाब किसके हैं..
दिल में मेरे सुलगते तूफ़ान किसके हैं..
नहीं गुज़रा कोई आज तक इस रास्ते से हो कर..
फिर ये क़दमों के निशान किसके हैं..
చూడు నా కన్నుల్లో కలలెవ్వరివో
గుండెలో ఎగిసిపడే పెనుగాలులెవ్వరివో..
ఇంతదాకా ఈ దారిగుండా ఎవరూ పోనేలేదే..
మరి ఈ అడుగుల గుర్తులు ఎవ్వరివో..

14.42. मेरे लिखे लफज़ ही पढ़ पाया वो बस..
मुझे भी पढ़ पाए इतनी उसकी तालीम नहीं..
వారు నేను వ్రాసిన మాటలను చదివారంతే..
నన్ను కూడా చదివేంతగా వారు చదువుకోలేదు..

14.43. तुम अगर ख्वाब हो तो..
नींद हमें भी बहुत गहरी आती है..
నీవే కలవైతే..
నాకూ నిద్ర భలే మత్తుగా పడుతుంది..

14.44. ज़ख्म तो हम भी अपने दिल में तुमसे गहरे रखते हैं..
पर हम अपने ज़ख्मों पर मुस्कुराहट के पहरे रखते हैं..
నా గుండెగాయాలు నీకన్నా లోతుగా తగిలినవే..
కానీ ఆ గాయాలపై చిరునవ్వుల కాపలా ఉంచుతాను..

14.45. तेरी नीयत नहीं थी साथ चलने की..
वरना साथ निभाने वाले रास्ता देखा नहीं करते..
నీకు తోడు నడిచే ఉద్దేశ్యం లేదు..
లేదంటే తోడు వచ్చేవారు దారులు ఎటువంటివో చూసుకోరు..

14.46. देख कर तुमको अक्सर हमे ये एहसास होता है..
कभी कभी दुःख देने वाला भी कितना ख़ास होता है..
నిన్ను చూసి అప్పుడప్పుడూ భావన అనిపిస్తుంది..
బాధపెట్టేవారూ భలే ముఖ్యమైనవారే కదా అని..

14.47. लिखी कुछ शायरी ऐसी तेरे नाम से कि..
जिसने तुम्हे देखा भी नहीं उसने भी तेरी तारीफ़ कर दी..
నీ పై కవిత్వం ఏవిధంగా వ్రాశేశానంటే..
నిన్ను చూడనివారు కూడా నిన్ను పొగిడేశారు..

14.48. तयशुदा मुलाक़ातों में वो बात नहीं बनती..
क्या ख़ूब था राहों में अचानक सामने से आना तेरा..
అనుకుని కలిస్తే అందులో పెద్ద గొప్పగా ఏం ఉండదు..
దారిలో అనుకోకుండా నువ్వు ఎదురుపడటం ఎంత గొప్పగా ఉండెనో..

14.49. उनका इलज़ाम लगाने का अंदाज़ इतना बेहतरीन था..
कि हमने खुद ही अपने खिलाफ़ गवाही दे दी..
వారు నేరం ఆరోపించే శైలి ఎంత అద్భుతంగా ఉందంటే..
నేనే స్వయంగా నాకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పేసుకున్నాను..

14.50. हौंसलों का सबूत देना था..
इसलिए ठोकरें खाकर मुस्कुरा पड़े..
ధైర్యానికి సాక్ష్యం ఇవ్వాలని..
ఎదురుదెబ్బలు తిని చిరునవ్వు నవ్వేశాను..

14.51. अब कहां दुआओं में वो बरक्कतें, वो नसीहतें, वो हिदायतें..
अब तो बस जरूरतों का जलूस हैं, मतलबों के सलाम हैं..
దీవెనలలో ఆ అభివృద్ధి కోరటాలు,
మంచి చెప్పటాలు, దారిచూపటాలు ఇప్పుడెక్కడ..
ఇప్పుడంతా అవసరానికి ఆర్భాటాలు, స్వార్థాల నమస్కారాలు..

14.52. राज़-ए-हक़ीकत जानने वाले देखिये क्या कहते हैं..
दिल को मेरा दिल नहीं, उनकी तमन्ना कहते हैं..
వాస్తవంగా రహస్యం ఎరిగినవారేమంటున్నారో చూడండి..
మనసు నా మనసు కాదట, అది వారి కోరిక అట..

14.53. मुझें बहुत प्यारी है तुम्हारी दी हुई हर निशानी..
चाहें वों दिल का दर्द हो या आँखों का पानी..
నీవిచ్చిన ప్రతీ గుర్తూ నాకెంతో ప్రియమైనది..
అది మనసుకైన గాయమైనా, కంట ఒలికే నీరైనా..

14.54. कौन कहता है कि दूरियां किलोमीटरों में नापी जाती हैं..
खुद से मिलने में भी उम्र गुज़र जाती है..
కిలోమీటర్ల లెక్కలో దూరాలను కొలుస్తారని ఎవరన్నారు?..
తనను తాను కలవాలన్నా జీవితకాలం గడుస్తుంది..

14.55. दुश्मन भी मेरे मूरीद हैं शायद,
वक़्त बेवक़्त मेरा नाम लिया करते हैं..
गली से गुजरते हैं खंजर लिए हुए,
रूबरू हों तो सलाम किया करते हैं...
శత్రువులు కూడా నా శిష్యులో ఏమో
వేళా పాళా లేకుండా నా పేరును తలుస్తారు..
బాకులు పట్టుకుని వీథిలో తిరుగుతారు
ఎదురుపడగానే మాత్రం చేతులు జోడిస్తారు..

14.56. उसे भूल कर जिया तो क्या जिया..
दम है तो उसे पाकर दिखा..
लिख पथरों पर अपनी प्रेम कहानी..
और सागर को बोल, दम है तो इसे मिटाकर दिखा..
తనను మరిచి బ్రతికితే ఏం బ్రతికినట్టు?
సత్తా ఉంటే తనను పొంది చూపించు..
రాళ్ళమీద నీ ప్రేమకథను వ్రాయి
సముద్రంతో చెప్పు, సత్తా ఉంటే దీన్ని చెరిపి చూపించమని..

14.57. उसको बिछड़ने का तरीका भी नहीं आता..
जाते जाते खुद को मेरे दिल में छोड़ गया..
తనకు విడిపోయే పద్ధతి కూడా తెలియదు..
వెళ్తూ కూడా తనను తాను నా మనసులోనే విడిచి వెళ్ళాడు..

14.58. ज़िंदगी का फलसफा भी कितना अजीब है..
शामें कटती नहीं और साल गुज़रते चले जा रहे हैं..
జీవితవాస్తవం కూడా భలే విచిత్రమైనది..
సాయింత్రాలేమో గడవవు, ఏళ్ళు సాగిపోతునే ఉంటాయి..

14.59. इश्क़ है तो शिकायत न कीजिए..
और शिकवे हैं, तो मोहब्बत न कीजिए..
ప్రేమ ఉంటే తప్పులెంచద్దు..
తప్పులెంచేదుంటే ప్రేమించవద్దు..

14.60. मरने को मर भी जाऊँ कोई मसला नहीं..
लेकिन ये तय तो हो कि अभी जी रही हूँ मैं..
చచ్చిపోవాలంటే చనిపోగలను, పెద్ద సమస్య కాదు..
కానీ ఇప్పుడు జీవించి ఉన్నాననేది తేలాలి కదా..

14.61. हर एक राज़ कह दिया बस एक जवाब ने..
हमें  सिखाया वक़्त ने, तुमको क़िताब ने..
ప్రతీ రహస్యాన్నీ విప్పేసింది, ఒకే ఒక్క సమాధానం..
నాకు నేర్పింది కాలం, నీకు నేర్పినవి పుస్తకాలు..

14.62. वो लम्हा ज़िन्दगी का बड़ा अनमोल होता है..
जब तेरी बातें तेरी यादें तेरा माहौल होता है..
నీ మాటలు, నీ గుర్తులు, నీ వాతావరణం ఉన్నప్పుడు..
జీవితపు ఆ క్షణం భలే అమూల్యమైనది..

14.63. हिलते लबों को तो दुनिया जान लेती है..
मुझे उसकी तलाश है जो मेरी ख़ामोशी पढ़ ले..
కదిలే పెదవులను ప్రపంచమంతా తెలుసుకుంటుంది..
నా మౌనాన్ని చదివేవారు నాకు కావాలి..

14.64. बात इतनी सी थी कि तुम अच्छे लगते थे..
अब बात इतनी बढ़ गयी है कि तुम बिन कुछ अच्छा नहीं लगता..
నీవు బాగనిపించావు- విషయం చిన్నదే..
ఇప్పుడు ఎంత పెరిగిపోయిందంటే, నీవు లేక ఏదీ నచ్చటం లేదు..

14.65. बस्ती का पता जंगल बताएगा
दानिशवरों को रास्ता पागल बताएगा..
मैला लिवास देखकर ये फैसला ना कर
मैं कौन सा दरख़्त हूँ फल बताएगा..
ఊరికి దారెటో అడవి చెప్తుంది
బిచ్చగాళ్ళకు దారి పిచ్చివాడు చూపుతాడు..
మాసినబట్టలు చూసి నిశ్చయానికి రాకు
నేనేం చెట్టునో (నే కాసిన) పండు చెప్తుంది..

14.66. इतने मशरूफ़ कहाँ हो गए तुम..
आजकल दिल तोड़ने भी नहीं आते..
అంత గొప్పగా ఏం పనిలో పడ్డావేంటి?..
ఈమధ్య మనసు విరచటానికి కూడా రావటం లేదే..

14.67. लफ्ज़ बीमार से पड़ गये है आज कल..
एक खुराक तेरे दीदार की चाहिए..
ఈ మధ్య మాటలు జబ్బున పడ్డాయి..
ఒక మాత్ర నీ దర్శనం కావాలి..

14.68. मैं रोज़ लफ़्ज़ों में बयान करता हूँ अपना दर्द..
और सब लोग सिर्फ़ वाह-वाह कह कर चले जाते है..
నేను నా నెప్పిని రోజూ మాటల్లో వ్యక్తం చేస్తాను..
జనాలేమో వాహ్ వాహ్ మాత్రం అని వెళిపోతారు..

14.69. कसूर उनका नहीं हमारा ही है..
हमारी चाहत ही इतनी थी कि उनको गुरूर आ गया..
తప్పు తనది కాదు, నాదే..
నా ప్రేమే ఎంత ఉందంటే, తనకు పొగరు పెరిగింది..

14.70. वो रोया तो बहुत होगा खाली कागज़ देख कर..
ज़िन्दगी कैसी बीत रही है उसने पूछा था ख़त में
ఖాళీ కాగితం చూసి తను బాగా ఏడ్చి ఉండవచ్చు..
జీవితం ఎట్లా గడుస్తోందని ఉత్తరంలో అడిగారు..

14.71. अगर परछाइयाँ कद से और
बातें औकात से बड़ी होने लग जाए तो..
समझ लीजिए सूरज ढलने ही वाला है..
నీడలు మనిషి ఎత్తును మించి
మాటలు మర్యాదను మించి వచ్చినప్పుడు
సూర్యుడు అస్తమిస్తున్నాడని తెలుసుకోవాలి..

14.72. एक नफ़रत ही है जिसे दुनिया लम्हों में जान लेती है..
वरना चाहत का पता लगने में तो ज़माने बीत जाते हैं..
ద్వేషమొక్కటే, జనాలకు క్షణాలలో అర్థమైతుంది..
ప్రేమను తెలుసుకునేలోపేమో ఏళ్ళు గడిచిపోతాయి..

14.73. बचा ही मुझमें क्या, दिल महबूब ले गया..
और दर्द में लिखे अल्फ़ाज़ लोग चुरा ले गये...
నాలో మిగిలిందేమిటి, మనసును ఇష్టమైనవ్యక్తి తీసుకువెళిపోయారు..
బాధలో వ్రాసుకున్న పదాలను జనాలు ఎత్తుకుపోయారు..

14.74. शतरंज का एक शर्त बहुत ही उम्दा है..
चाल कोई भी चलो, पर अपनों को नहीं मार सकते..
చదరంగంలో ఒక నియమం చాలా ఉన్నతంగా ఉంటుంది..
ఏ ఎత్తు వేసినా సొంత పక్షంవారిని చంపలేము..

14.75. न जाने जिंदगी का ये कैसा दौर है..
इंसान खामोश हैं और ऑनलाइन कितना शोर है..
జీవితంలో ఇదెక్కడి పరిస్థితో..
మనిషి మౌనంగా ఉన్నాడు, ఆన్ లైన్ లో ఎంత గోలనో..

14.76. कुछ लोग इतने ढीठ होते हैं कि
जितना मर्जी उनको भाड़ में भेज दो
वापिस आ ही जाते हैं..
కొందరు ఎంత నిర్దయులంటే
ఎంతగా వారిని ఏట్లోకి పంపినా
మళ్ళీ చక్కా తిరిగి వచ్చేస్తారు..
(నుడికారం కోసం స్వతంత్రం తీసుకున్నాను)

14.77. फ़िज़ा में ज़हर भरा है, ज़रा संभल कर चलो..
मुख़ालिफ़ आज हवा है, ज़रा संभल कर चलो..
कोई देखे न देखे बुराइयाँ अपनी..
खुदा तो देख रहा है, ज़रा संभल कर चलो..
పరిసరాలలో విషం నిండిం ఉంది, జాగ్రత్తగా వెళ్ళు
ఈవేళ గాలి విరుద్ధంగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళు..
ఎవరు చూసినా చూడకపోయినా, మన తప్పులన్నీ
పైవాడు చూస్తున్నాడు, కాస్త జాగ్రత్తగా వెళ్ళు..

14.78. ले जाती है मोहब्बत उन राहों पर..
जहाँ दिए नहीं, दिल जलाए जाते हैं..
ప్రేమ ఆ దారులలోకి తీసుకుపోతుంది..
అక్కడ దీపాలు(లో ఒత్తులు) కాదు, మనసులు కాలతాయి..

14.79. तुझे झूठ बोलना हमने ही सिखाया है..
तेरी हर बात सच मान कर..
నీకు అబద్ధాలాడటం నేనే నేర్పాను..
నీ ప్రతీ మాటను నిజం అ భావిస్తూ..

14.80. तुझे देखे बिना तेरी तस्वीर बना सकता हूँ..
तुझसे मिले बिना तेरा हाल बता सकता हूँ..
है मेरी दोस्ती में इतना दम..
तेरी आँख का आँसू आपनी आँख से गिरा सकता हूँ..
నిన్ను చూడకుండానే నీ చిత్రాన్ని గీయగలను
నిన్ను కలవకుండానే నీ పరిస్థితి చెప్పగలను..
నా స్నేహంలో ఎంతో సత్తువ ఉందంటే
నీ కంటి కన్నీటిని నా కంట ఒలికించగలను..

14.81. मैं तो वक़्त से हारकर सर झुकाएँ खड़ा था,
सामने खड़े कुछ लोग ख़ुद को बादशाह समझने लगे..
నేను కాలానికి ఓడి తలవంచి నిలిచాను..
ఎదుట నిలిచిన కొందరు తమను తాము చక్రవర్తులు అనుకోసాగారు..

14.82. घर अंदर ही अंदर टूट जाते हैं..
मकान खड़े रहते हैं बेशर्मों की तरह..
ఇళ్ళు లోలోపలే విరిగిపోతున్నాయి..
కట్టడాలు నిలిచి ఉన్నాయి సిగ్గులేనివారిలా..

14.83. सिमटते जा रहे है दिल और जज़्बात के रिश्ते..
समझौता करने में जो माहिर है बस वही धनवान है..
మనసు, భావోద్వేగాల అనుబంధాలు సమసిపోతున్నాయి..
ఒప్పందం చేసుకోవటంలో సమర్థుడే ధనవంతుడు..

14.84. बस एक चेहरे ने तन्हा कर दिया हमें..
वरना हम खुद में एक महफ़िल हुआ करते थे..
ఒకే ఒక్క ముఖం నన్ను ఒంటరి చేసింది..
లేదంటే నాలో నేనే ఒక సభలా ఉండేది..

14.85. शब्द तो यदा-कदा चुभते ही रहते हैं सबके..
जब मौन चुभ जाए किसी का तो सम्भल जाना चाहिए..
మాటలు ఏదో ఒకప్పుడు అందరివీ గుచ్చుకుంటాయి..
ఒకరి మౌనం గుచ్చుకున్నప్పుడు జాగ్రత్త పడాలి..

14.86. किसी ने मुझसे पूछा तुम्हारा शौक क्या है..
मैं ने हंस कर कहा नफ़रत करने वालों से मोहब्बत करना..
ఒకరు నన్ను అడిగారు, నీకు నచ్చిన పనేంటి అని..
నేను నవ్వి అన్నాను, ద్వేషించేవారిని ప్రేమించటం అని..

14.87. छू न पाया मेरे अंदर की उदासी कोई..
मेरे चेहरे ने बहुत अच्छी अदाकारी की है..
నాలోపలి వేదనను ఎవరూ తాకలేకపోయారు..
నా ముఖం చాలా బాగా అభినయించింది..

14.88. मेरे शब्द बस आपको परेशानियों में मुस्कुराहट दे शकते है..
जिंदगी जीने का सलीका आपको आपकी उलझने ही सिखायेंगी...
నా మాటలు కేవలం మీకు బాధల మధ్య నవ్వును తెప్పించగలవు..
జీవితాన్ని జీవించే పద్ధతి మీకు మీ కష్టాలే నేర్పుతాయి..

14.89. वही शख़्स मेरे लश्कर से बग़ावत कर गया..
जीत कर सल्तनत जिसके नाम करनी थी..
ఎవడి పేర గెలిచాక రాజ్యాన్నిరాద్దామనుకున్నానో..
నా సైన్యంలోనుండి వాడే విప్లవం చేశాడు..

నా సైన్యం మధ్యనుండి ఒకడు విప్లవం చేశాడు..
గెలిచాక వాడి పేరనే ఈ రాజ్యం ఇద్దామనుకున్నాను

14.90. जब से सभी के अलग अलग मकान हो गए...
पुरा बचपन साथ बिताने वाले भाई भी,
आज एक दूसरे के मेहमान हो गए...
ఇళ్ళు వేరు వేరైపోయినది మొదలు..
చిన్నతనమంతా కలిసి గడిపిన సొంత అన్నతమ్ములు కూడా
ఒకరికొకరు అతిథులైపోయారు..

14.91. हर रोज़ गिरते हैं पत्ते मेरे फिर भी..
हवाओं से बदलते नहीं रिश्ते मेरे..
ప్రతిరోజు నా ఆకులు రాలిపోతుంటాయి..
అయినా గాలులతో నా అనుబంధం మారిపోదు..

14.92. ढलती उम्र के साथ सब कुछ भूलने का डर है..
अपना नाम भी भूल जाऊँ, ग़म नहीं, बस तेरा नाम याद रहे.. (स्वीयं)
వాలిపోయే వయసుతో అంతా మరుపుకు వస్తుందని భయం..
నా పేరు మర్చిపోయినా ఫరవాలేదు, నీ పేరు గుర్తుంటే అదే చాలు.. (స్వీయం)

14.93. अदब अगर सीखना ही है तो कलम से सीखो..
जब भी चलती है सर झुकाकर चलती है..
మర్యాద నేర్వాలంటే కలాన్ని చూసి నేర్చుకో..
ఎప్పుడు కదిలినా తల వాల్చి సాగుతుంది..

14.94. अजीब तमाशा लगा रखा है लोगों ने..
बेवफाई करो तो रोते है, और वफ़ा करो तो रुलाते हैं..
విచిత్రమైన వేషాలేస్తారు జనాలు కూడా..
మోసం చేస్తే ఏడుస్తారు, విశ్వాసంగా ఉంటే ఏడిపిస్తారు..

14.95. लोग शोर से जाग जाते हैं और..
मुझे एक शख़्स की ख़ामोशी सोने नहीं देती..
జనాలు సద్దు చేస్తే మేలుకుంటారు..
నన్నేమో ఒకరి మౌనం నిద్రపోనివ్వటం లేదు..

14.96. हमारी चर्चा छोड़ो दोस्तों, हम ऐसे लोग हैं जिन्हें..
नफ़रत कुछ नहीं कहती और मोहब्बत मार डालती है..
నా చర్చ వదిలేయండి నేస్తాలు..
మా వంటివారిని ద్వేషం ఏమీ అనదు, కానీ ప్రేమ చంపేస్తుంది..

14.97. अखबार तो रोज़ आता है घर में..
बस अपनों की ख़बर नहीं आती..
వార్తపత్రిక రోజూ ఇంటికి వస్తుంది..
కానీ సొంతవారి కబురే ఏమీ రాదు..

14.98. अरे कितना झूठ बोलते हो तुम..
खुश हो और कह रहे हो मोहब्बत भी की है..
అరె, ఎంత పచ్చి అబద్ధాలాడతావు నువ్వు..
ఓ పక్క ఆనందంగా ఉన్నావు, ప్రేమించానని కూడా చెప్తున్నావే..

14.99. बारिश के बाद तार पर टंगी आख़री बूंद से पूछना..
क्या होता है अकेलापन..
వానపడ్డాక తీగకు వేలాడే చివ్వరి చినుకును అడుగు..
ఒంటరితనమంటే ఏమిటని..

14.100. किसे इल्ज़ाम दे, अपने जज़्बातों के क़त्ल का?..
समझदार बनने का शौख तो हमे ही था..
నా భావోద్వేగాల హత్యకు ఎవరిని బాధ్యులను చేసేది?..
వివేకిని కావాలనే మోజు నాకు కదా ఉన్నది..

14.101. उसने कहा हमसे, हम तुम्हें बर्बाद कर देंगे..
हमने मुस्कुरा के पूछा, क्या तुम भी मोहब्बत करोगे अब हमसे?..
నిన్ను నాశనం చేస్తాను- అని తను నాతో అన్నప్పుడు..
నేనడిగాను నవ్వి, ఏఁ? ఇహ నువ్వూ నన్ను ప్రేమిస్తావా ఏం? అని..

14.102. मेरी यादों की कश्ती उस समुन्दर में तैरती है..
जहाँ पानी सिर्फ़ और सिर्फ़ मेरी पलकों का होता है..
నా జ్ఞాపకాల నావ ఆ సముద్రంలో తేలుతుంది..
అక్కడ నీరంతా కేవలం నా కనురెప్పల నిండిందే..

14.103. तुम नफ़रतों के धरने क़यामत तक जारी रखो..
मैं मोहब्बत से इस्तीफ़ा मरते दम तक नहीं दूँगा..
నువ్వు ద్వేషాల సమ్మెలు మృత్యువు వరకు చేపట్టు..
నేను ప్రేమ కు రాజీనామా చచ్చేదాకా ఇవ్వను గాక ఇవ్వను..

14.104. इतनी मोहब्बत से क्यूँ निहार रहे हैं हमें..
सोच लो खुद के भी नहीं रहोगे आप..
ఇంత ప్రేమగా ఎందుకు చూస్తావు న?..
ఆలోచించుకో, నువ్వు నీకు సైతం కాకుండా పోతావు..

14.105. सुबह से दौड़ रही है चाकू लेकर पगली मेरे पीछे..
मैँ ने तो मज़ाक में कहा था कि, दिल चीर के देख, तेरा ही नाम होगा..
ఉదయం నుండి ఆ వెర్రిది చాకు పట్టుకుని నా వెనక పరిగెత్తుతోంది..
నేను హాస్యానికి అన్నాను- గుండె కోసి చూడు, నీ పేరే ఉంటుందని..

14.106. तू मेरे जनाज़े को कन्धा ना देना..
ज़िन्दा ना हो जाऊँ फिर कहीं तेरा सहारा देख कर..
నువ్వు నా శవయాత్రలో పాడెకు చేయి వేయకు..
నేను నీ చేయూతను పొంది మళ్ళీ బ్రతికేస్తానో ఏమో..

14.107. मैं ज़हर तो पी लूँ शौक से तेरी ख़ातिर..
पर शर्त ये है कि, तुम सामने बैठकर साँसों को टूटता देखो..
నేను హాయిగా విషం తాగేస్తాను, నీ కోసం..
ఒకే షరతు, నువ్వు ఎదుట కూర్చుని ఈ శ్వాసలు తెగటం చూడాలి..

14.108. हमारी किस्मत तो आसमान पे चमकते सितारों की तरह है..
लोग अपनी तमन्ना के लिए हमारे टूटने का इंतज़ार करते है..
మా భాగ్యం ఆకాశాన మెరిసే చుక్కలవంటిది..
తమ కోరిక తీరాలని జనాలు మేము రాలిపోయేందుకు ఎదురుచూస్తారు..

14.109. कितनी प्यारी है ना सनम हम दोनों की जोड़ी..
तुम समझदार थोडे, मैं नासमझ थोड़ी..
ఎంత బాగుందో కదా ప్రియా, మనిద్దరి జోడీ..
నీకు గ్రహింపు తక్కువ, నాకు అమాయకత్వం ఎక్కువ..

14.110. क़ाश कोई ऐसा हो, जो गले लगा कर कहे..
तेरे दर्द से मुझे भी तकलीफ़ होती है..
నీ నెప్పి నన్ను బాధపెడుతుంది- అని..
దగ్గరగా హత్తుకుని అనేవారుంటే బాగుండేది కదా..

14.111. तेरे बिना जीना मुश्किल है..
ये तुझे बताना और भी मुश्किल है..
నువ్వు లేక బ్రతకటం కష్టం..
నీతో ఆ మాట చెప్పటం ఇంకా కష్టం..

14.112. उजड़ने न दे ए ख़ुदा किसी के आशियाने को..
बहुत वक़्त लगता है एक छोटा सा घर बनाने को..
దేవుడా, ఎవ్వరి ఇంటినీ కూలిపోనివ్వకు..
చిన్న ఇల్లు కట్టుకోవటానికి కూడా ఎంతో కాలం పడుతుంది..

14.113. मेरी नींद भी मेरी दुश्मन हो गयी..
ख्वाबों में भी मुझे तुमसे मिलने नहीं देती..
నా నిద్ర నా శత్రువైపోయింది..
కనీసం కలలలో కూడా నిన్ను కలవనివ్వటం లేదు..

14.114. वो मेरी तन्हाइयों का हिसाब क्या देगी..
जो खुद ही सवाल है वो जवाब क्या देगी..
నా ఒంటరితనాల లెక్కలు తనేం అప్పగించగలదు?..
ప్రశ్నే తానైనప్పుడు సమాధానం ఏం ఇవ్వగలదు?..

14.115. ऐ दिल, थोड़ी सी हिम्मत कर ना यार..
दोनों मिल कर उसे भूल जाते है..
మనసా, కాస్త ధైర్యం చేయవే..
ఇద్దరం కలిసి తనను మర్చిపోదాం..

14.116. है परेशानियाँ यूँ तो बहुत सी ज़िंदगी में..
तेरी मोहब्बत सा मगर कोई तंग नहीं करता..
బాధలైతే ఎన్నో ఉన్నాయి జీవితంలో..
కానీ నీ ప్రేమలాగా ఏదీ ఏడిపించదు..