3.1. तेरी बेरुख़ी ने छीन ली है शरारतें मेरी..
और लोग समझते हैं कि सुधर गया हूँ मैं..
నీ ప్రతికూలత నా అల్లరినంతా లాగేసుకుంది..
జనాలేమో నేను బాగుపడ్డాను అనుకుంటున్నారు..
3.2. साफ़ दामन का दौर तो कब का ख़त्म हुआ साहब..
अब तो लोग अपने धब्बों पर गुरूर करने लगे हैं..
మచ్చలేని కండువా (అంగవస్త్రం) కు కాలం వెళిపోయిందండీ..
ఈనాడు జనాలు తమ మచ్చల (మరకల) మీద గర్విస్తున్నారు.
3.3. जिसे देखो हवा में रहता है..
फिर ये ज़मीं पर इतनी भीड़ क्यों है..
ఎవరిని చూడు, గాలిలో తేలుతున్నారు..
అయినా ఈ నేల మీద ఇంత రద్దీ (జనసమ్మర్దం) ఎందుకున్నదో..
3.4. अगर मुझे समझना चाहते हो..
तो, बस अपना समझो..
ఒకవేళ నన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటే..
నీవాడిగా (అనుకో) అర్థం చేసుకో..
3.5. बेशुमार धोखों की सौगात मिलती है उन्हें..
जो इंसान दिल के साफ़ होते हैं..
అంతులేని మోసాల కానుక లభిస్తుంది..
స్వచ్ఛమైన మనస్సు కలవారికి..
3.6. होश तलक ज़िन्दगी में जश्न होना
चाहिए..
ख़ुशियाँ बन जायें राधिका मन कृष्ण होना चाहिए..
ఊపిరి ఉన్నంతవరకు జీవితంలో ఉత్సవం జరగాలి..
ఆనందాలు రాధికగా అయిపోవాలి, మనస్సు కృష్ణుడుగా
కావాలి..
3.7. इश्क है या इबादत अब कुछ समझ नहीं आता..
एक खुबसूरत ख्याल हो तुम जो दिल से नहीं जाता..
ఇది ప్రేమా, ఆరాధనా, ఇప్పుడు ఏమీ అర్థం కావటం లేదు..
మనసు లోనుంచి పోనేపోని ఒక అందమైన భావానివి (ఆలోచనవు) నీవు,.
3.8. निगाहों से भी चोट लगती है जनाब..
जब कोई देख कर भी अन्देखा कर देता है..
చూపులతో కూడా గాయమవుతుంది సుమండీ..
చూసి కూడా ఎవరైనా చూడనట్టు చేసినప్పుడు..
3.9. हम को मालूम है जन्नत की हक़ीक़त लेकिन..
दिल को बहलाने को ग़ालिब ये ख़याल अच्छा है..
స్వర్గపు వాస్తవం మాకూ తెలుసు, కానీ, ఓ గాలిబ్..
మనసును రంజింపచేసుకోవటానికి ఈ ఆలోచన బాగుంది కదా..
3.10. समुन्दर जैसा होना चाहती है
नदी ख़ुद को डुबोना चाहती है..
अब इस पत्थर को पानी बख़्श मौला
यह मेरी आँख रोना चाहती है..
సముద్రం లా కావాలని అనుకుంటున్నది
నది తనను తాను లయం చేసుకోవాలి అనుకుంటున్నది..
ఇక రాతికి నీరు పొందించు మౌలా
ఈ నా కన్ను ఏడవాలి అనుకుంటున్నది..
3.11. ऐ मेरी कलम, इतना सा अहसान कर दे..
कह ना पाई जो ज़ुबान, वो
बयान कर दे..
ఓ నా లేఖనీ, ఇంత ఉపకారం చేయి..
మాట దేనిని చెప్పలేకపోయిందో, దాన్ని
వ్యక్తపరుచు..
3.12. गिरते हुए आँसुओं को कौन देखता है..
झूठी मुस्कान के दीवाने हैं सब यहाँ..
రాలుతున్న కన్నీటిని ఎవరు చూస్తారు?..
ఇక్కడంతా లేని (అబద్ధపు) నవ్వులకు పడి చచ్చేవారే..
3.13. हर कदम पर ज़िन्दगी एक नया मोड़ लेती है..
कब न जाने किसके साथ एक नया रिशता जोड़ देती
है..
ప్రతి అడుగుకు జీవితం కొత్త మలుపు తిరుగుతుంది..
ఎప్పుడు, ఎవరితో కొత్త బంధం ఏర్పరుస్తుందో తెలియదు..
3.14. उदासियों की वजह तो बहुत है ज़िन्दगी में..
पर खुश रहने का मज़ा आपके ही साथ है..
బాధపడటానికి కారణాలు చాలా ఉన్నాయి జీవితంలో..
కానీ సంతోషపడటంలోని ఉల్లాసం మీతోనే ఉన్నది..
3.15. जब लगा था खंजर तो इतना दर्द ना हुआ..
ज़ख़्म का एहसास तो तब हुआ जब चलाने वाले पे
नज़र पड़ी..
బాకు పొడిచినప్పుడు అంత నెప్పి కలగలేదు..
గాయం అయిన అనుభూతి పొడిచినవాడి మీద దృష్టి పడినప్పుడు
కలిగింది..
3.16. तासीर किसी भी दर्द की मीठी नहीं होती ग़ालिब..
वजह यही है की आँसू भी नमकीन होते है..
గాలిబ్, ఏ నెప్పి యొక్క ప్రభావమూ తీయగా ఉండదు కదా..
అదే కారణంగా కన్నీరు కూడా ఉప్పగా ఉంటుంది..
3.17. मेरे टूटने का ज़िम्मेदार मेरा जौहरी ही है..
उसी की ये ज़िद थी की अभी और तराशा जाए..
నేను విరిగిపోవటానికి బాధ్యుడు నా స్వర్ణకారుడే..
నన్నింకా ఇంకా మెరుగుపెట్టాలనేది అతడి పట్టుదలే..
3.18. अपने रब के फैसले पर, भला शक केसे करूँ..
सजा दे रहा है गर वो, कुछ
तो गुनाह रहा होगा मेरा..
నా దేవుడి నిర్ణయంపై అనుమానం ఎట్లా పెట్టుకునేది..
నాకు దండన విధిస్తున్నాడంటే, ఏదో ఓ పాపం చేసే
ఉంటాను కదా..
3.19. दिल से बड़ी कोई क़ब्र नहीं है..
रोज़ कोई ना कोई एहसास दफ़न होता है..
హృదయాన్ని మించిన సమాధి లేదేమో..
ప్రతిరోజు ఏదో ఉపకారం పాతిపెట్టబడుతుంది..
అంటే మనం చేసిన ఉపకారాన్ని అవతలివాడు మర్చిపోతుంటాడు.. అనే
అర్థంలో తీసుకున్నా నేను
3.20. ये सुर्ख़ लब, ये रुख़सार, और
ये मदहोश नज़रें..
इतने कम फासलों पर तो मयखाने भी नहीं होते..
ఈ ఎర్రని అధరాలు, ఈ కపోలాల ఎరుపు, ఈ మత్తెక్కించే
చూపులు..
ఇంత తక్కువ దూరాలలో అయితే మద్యపానగృహాలు కూడా ఉండవే..
3.21. बहुत तेज़ दिमाग चाहिए, ग़लतियाँ निकालने के लिए..
लेकिन एक सुंदर दिल होना चाहिए, ग़लतियाँ कबूल करने के लिए..
తప్పులు వెలికి తీయటానికి చాలా తీక్ష్ణబుద్ధి కావాలి..
తప్పులు ఒప్పుకోవటానికి అందమైన మనసు కావాలి..
3.22. मुझे जवाब नहीं आते, उन्हें सवाल नहीं आते..
ख़ामोश गुफ़्तगू का मज़ा ही कुछ और है...
నాకు సమాధానాలు రావు, వారికి ప్రశ్నలు
రావు..
నిశ్శబ్దమైన సంభాషణలో (మౌనంగా మాట్లాడుకోవటంలో) ఆనందమే
వేరు..
3.23. किस्मतवालों को ही मिलती है पनाह दोस्तों के दिल में..
यूँ ही हर शख़्स जन्नत का हक़दार नहीं होता..
అదృష్టవంతులకే దొరుకుతుంది స్నేహితుల మనసుల్లో చోటు..
ఊరికెనే ప్రతివాడు స్వర్గానికి అధికారి కాలేడు..
3.24. करम ही करना है तुझको तो ये करम कर दे..
मेरे खुदा, तू मेरी
ख़्वाहिशों को कम कर दे..
నా మీద అనుగ్రహం చూపాలని ఉంటే ఈ ఉపకారం చేయి...
ఈశ్వరా, నీవు నా కోరికలను తగ్గించివేయి..
3.25. इत्तफ़ाक़ से तो नहीं हम टकराये..
थोड़ी साज़िश तो खुदा की भी होगी..
మనం పరస్పరం ఎదురుపడటం యాదృచ్ఛికమైతే అయి ఉండదు..
కొద్ది కుతంత్రం భగవంతుడిది కూడా ఉండి ఉంటుంది..
3.26. नशे में कौन नहीं है, मुझे बताओ ज़रा..
मै, इश्क और ग़म में,
चूर है सारा जहाँ..
మత్తులో ఎవరు లేరు, కాస్త చెప్పండి నాకు..
మద్యంలో, ప్రేమలో, బాధలో కూరుకుపోయి ఉంది లోకమంతా..
3.27. नज़र से नज़र मिलाकर, तुम नज़र लगा गए..
ये कैसी लगी नज़र, कि हम
हर नज़र में आ गए...
చూపులతో చూపులు కలిపి నీవు దృష్టి తాకించి పోయావు..
ఎటువంటి దిష్టి తగిలిందో, నేను అందరి
దృష్టిలోకి పడ్డాను..
3.28. रास्ता तो आदमी ही आदमी का काटता है..
बिल्लियाँ तो बस, यूँ ही
बदनाम हो गई हैं..
ఒకరి దారులు ఒకరు అడ్డుకునేది మనుషులే..
పిల్లులు ఊరికెనే చెడ్డపేరును పొందాయి..
3.29. तेरी आंखों के आईने में जब-जब देखी अपनी छाया..
खुद को पूरी क़ायनात से भी ज्यादा खूबसूरत
पाया..
నీ కన్నుల అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడల్లా..
నాకు నేను జగత్తంతటిలో అందరికన్నా అందంగా అనిపించాను..
3.30. जिन्हे सांसो की महक से इश्क महसूस ना हो..
वो गुलाब देने भर से हाल-ए-दिल क्या समझेंगे..
శ్వాసల సుగంధంలో ప్రేమ కనిపించనివారికి..
గులాబీలు ఇచ్చినంతమాత్రాన మనసు పరిస్థితిని (మనోభావాన్ని)
ఏం అర్థం చేసుకోగలరు?..
3.31. कौन कहता है कि मुसाफ़िर ज़ख़्मी नहीं होते..
रास्ते गवाह हैं, बस
कमबख़्त गवाही नहीं देते..
ఎవరన్నారు, యాత్రికులు గాయపడరని..
దారులు సాక్షులు, కానీ దుష్టులు, సాక్ష్యం చెప్పవు..
3.32. जिंदगी क़िस्मत से चलती है साहब..
दिमाग़ से चलती तो बीरबल बादशाह होता..
జీవితం భాగ్యంతో నడుస్తుంది సుమండీ..
మెదడుతో నడిస్తే బీర్బల్ చక్రవర్తి అయ్యేవాడు..
3.33. फ़ीकी है हर चुनरी, फ़ीका हर बन्धेज...
जो रंगता है रूह को, वो
असली रंगरेज़..
ప్రతి ఓణీ వెలిసిపోయిందే, ప్రతి బంధం
వెలిసిందే..
అంతరాత్మకు రంగువేసేదే నిజమైన అద్దకం..
3.34. बहुत सा पानी छुपाया है मैंने अपनी पलकों में..
जिंदगी लम्बी बहुत है, क्या
पता कब प्यास लग जाए..
నేను నా కనురెప్పలలో చాలా నీరు దాచుకున్నాను..
జీవితం సుదీర్ఘమైనది, ఏమో, దాహం ఎప్పుడైనా వేయవచ్చు
కదా..
3.35. जो तार से निकली है वो धुन सबने सुनी है..
जो साज़ पर बीती है वो दर्द किस दिल को पता..
తీగ నుండి కదిలిన నాదాన్ని అందరూ విన్నారు..
కానీ వాయిద్యం పడిన వేదన ఏ మనసుకు తెలుసు?..
3.36. शान से जीने का शौक है, वो तो हम जियेंगे..
बस तू अपने आप को सम्भाल,
हम तो यूँ ही चमकते रहेंगे..
దర్జాగా బ్రతికే అలవాటు (షోకు) నాకు, బ్రతికి తీరతాను..
నిన్ను నువ్వు జాగ్రత్తగ పెట్టుకో, నేను మెరుస్తూనే
ఉంటాను..
3.37. रिश्तों की जमावट आज कुछ इस तरह हो रही है..
बाहर से अच्छी सजावट और अन्दर से स्वार्थ की
मिलावट हो रही है..
ఈనాడు అనుబంధాల కూర్పు జరుగుతున్న విధానంబెట్టిదంటే..
బయటినుంచి చక్కని అలంకరణం, లోపల స్వార్థం తో
కల్తీ అవుతున్నది..
3.38. हर किसी को बुरी आदत होती हैं..
मेरी, तुम हो..
ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది..
నా వ్యసనానివి నువ్వు..
3.39. काश, एक ख़्वाहिश पूरी हो इबादत के बगैर..
वो आ कर गले लगा ले मेरी इजाज़त के बग़ैर..
ఒక్క కోరికైనా ప్రార్థన లేకుండా తీరితే బాగుండు..
వారు వచ్చి నా అనుమతి లేకుండా దగ్గరకు తీసుకుంటే బాగుండు..
3.40. रहने दे मुझे तुझमें उलझा हुआ ही
सुलझते हैं ग़र धागे तो अलग हो जाते हैं..
నన్ను నీలో(తో) పెనవేసుకుపోయి (చిక్కుపడిపోయి)
ఉండిపోనివ్వు..
దారాలు ముడులు వీడితే విడిపడిపోతాయి..
3.41. लोगों ने मुझमें इतनी 'कमियां' निकाल दी..
कि अब खूबियों के सिवाय मेरे पास कुछ बचा ही
नहीं..
జనాలు నాలో లోపాలు ఎన్ని బయటకు తీశారంటే..
ఇప్పుడు నాలో గొప్పతనాలు తప్ప వేరేమీ మిగలలేదు..
3.42. भूले बिसरे हुए ग़म फिर उभर आते हैं कई..
आईना देखें तो चेहरे नज़र आते हैं कई..
మరిచిపోయిన బాధలు మళ్ళీ ఉబికివస్తాయి ఎన్నో..
అద్దం చూస్తే ముఖాలు కనిపిస్తాయి ఎన్నో..
3.43. न तुम होश में हो न हम होश में हैं..
चलो मय-कदे में वहीं बात होगी..
నీవూ స్పృహలో లేవు, నేనూ స్పృహలో లేను..
పద, మద్యపానగృహానికి, అక్కడే మాట్లాడుకుందాం..
3.44. कोई भूला हुआ चहरा नज़र आए शायद..
आईना ग़ौर से तू ने कभी देखा ही नहीं..
మరుపుకొచ్చిన ముఖం ఏదో కనిపిస్తుందని ఏమో..
అద్దంవైపు ఎన్నడూ లోతుగా (గుచ్చి) చూడలేదు నీవు..
3.45. अभी मै काँच हूँ, इसलिये कुछ लोगों को चुभता हूँ..
पर ज़िस दिन आयना बना सब मुझे ही देखेंगे..
ప్రస్తుతం నేను గాజుముక్కను, అందుకే కొందరికి
గుచ్చుకుంటాను..
ఏ రోజున నేను అద్దాన్ని అవుతానో, ఆరోజు అంతా నన్నే
చూస్తారు..
3.46. करूँ क्यों फ़िक्र कि मौत के बाद जगह कहाँ मिलेगी..
जहाँ होगी महफ़िल मेरे यारों की मेरी रूह वहाँ
मिलेगी..
చచ్చిపోయాక చోటు ఎక్కడ దొరుకుతుందోనని దిగులు ఎందుకు పడాలి?..
ఎక్కడ నా మిత్రుల సాంగత్యం ఉంటుందో, అక్కడే ఈ జీవుడు
దొరుకుతాడు..
3.47. इतना सच बोल कि होंटों का तबस्सुम न बुझे..
रौशनी ख़त्म न कर आगे अँधेरा होगा..
నిజం ఎంత చెప్పాలంటే పెదవుల చిరునవ్వు చెరిగిపోనివ్వద్దు..
వెలుగును అంతం చేసుకోకు, ఆ పైన చీకటి
ఉంటుంది..
3.48. जो देखता हूँ वही बोलने का आदी हूँ..
मैं अपने शहर का सब से बड़ा फ़सादी हूँ..
ఏది చూస్తానో అదే మాట్లాడతాను..
నేను నా ఊళ్ళో అందరికన్నా గొప్ప గొడవలరాయుణ్ణి..
3.49. कुछ लोग जो ख़ामोश हैं ये सोच रहे हैं..
सच बोलेंगे जब सच के ज़रा दाम बढ़ेंगे..
కొందరు మౌనంగా ఉండేవారు ఇట్లా ఆలోచిస్తున్నారు..
సత్యానికి మంచి ధరపలికాక నిజం చెప్పాలి అని..
3.50. इश्क़ में कौन बता सकता है..
किस ने किस से सच बोला है..
ప్రేమలో ఎవరు చెప్పగలరు..
ఎవరు ఎవరితో నిజం చెప్పారో..
3.51. सही वक्त पर करवा देंगे हदों का एहसास..
कुछ तालाब खुद को समंदर समझ बैठे है..
సరైన సమయం వచ్చినప్పుడు హద్దులను తెలియపరుస్తాను..
కొన్ని చెరువులు వాటిని అవి సముద్రం అనుకుంటున్నాయి..
3.52. किसी के अंदर ज्यादा डूबोगे तो टूटना पड़ेगा..
यकीन ना हो तो Biscuit से
पूछ लो..
ఎవరిలోనైనా ఎక్కువగా మునిగామంటే విరిగివపోవలసి వస్తుంది..
నమ్మకం కుదరకపోతే బిస్కెట్టును అడగండి..
3.53. लफ़्जों की दहलीज़ पर घायल ज़ुबान है..
कोई तन्हाई से, तो कोई,
महफ़िल से परेशान है..
మాటల గుమ్మంలో నాలుక గాయపడినది..
ఒకరు ఒంటరితనంతో అయితే, మరొకరు నలుగురితో
బాధ పడుతున్నారు..
3.54. यूँ तो भीड़ क़ाफी हुआ करती थी महफ़िल में मेरी..
फिर मैं सच बोलता गया और लोग कम होते गए..
చెప్పాలంటే, నా సభలలో చాలా రద్దీ ఉంటుండేది..
ఇక నేను నిజాలు చెప్తూ పోయాను, రద్దీ తగ్గిపోతూ
వచ్చింది..
3.55. हर शख़्स ख़फ़ा मुझसे अंजुमन में था..
क्यों कि मेरे लब पर वही था जो मेरे मन में था..
సభలో ప్రతివారు నా పై కోపంగా ఉన్నారు..
ఎందుకంటే నా మనసులో ఏది ఉందో పెదవిపై అదే ఉంది..
3.56. किसी की आदत बन जाओ..
मोहब्बत खुद बन जाओगे...
ఒకరి అలవాటుగా మారిపో..
ప్రణయానివి స్వయంగా అయిపోతావు..
(భగవత్పరంగా చక్కని అర్థం కదా)
3.57. खूबियाँ इतनी तो नहीं हम में कि किसी के दिल में हम घर बना पाएंगे..
पर भुलाना भी आसान ना होगा हमें साथ कुछ ऐसा
निभा जाएंगे..
ఒకరి మనసులో గూడు కట్టుకునేంత గొప్ప లక్షణాలు నాలో లేవు..
కానీ మర్చిపోవటం సులువు కానంతగా మాత్రం నిర్వహిస్తాను..
3.58. खुद की नज़र से कभी अन्दर के खुदा को देखना..
तुम खुद ही खुद पे फ़िदा ना हो जाओ तो कहना..
నీ సొంత కళ్ళతో ఎప్పుడైనా లోపలి భగవంతుడిని చూడు..
నీ పై నీవే ముగ్ధుడివి కాకపోతే చెప్పు..
3.59. फ़िक्र ए ज़िन्दगी ने थोड़े फ़ासले बढ़ा दिए वरना..
सब यार साथ ही थे, अभी कल
की ही बात है..
జీవితంలో బాధ కాస్త దూరాలను పెంచింది, లేదంటేనా..
స్నేహితలందరూ నాతోడే ఉండేవారు, నిన్న మొన్నటి మాట..
3.60. शामिल थे जिंदगी में कुछ सस्ते लोग..
बस, सबक ज़रा महँगा देकर
चले गये..
జీవితంలో కొందరు నాసిరకం జనాలు తగిలారు..
పాఠమే కాస్త ఖరీదైనది నేర్పి పోయారు..
3.61. इलाईची के दानों सा मुक़द्दर है अपना..
महक उतनी ही बिखरती गई जितने पिसते गए..
कभी अपने लिये कभी अपनों के लिये...
యాలక్కాయ గింజల వంటి భాగ్యం మనది..
ఎంత నిలిగామో అంత సుగంధం వెదజల్లుతూ పోయాము..
ఒకసారి మాకోసం, మరోసారి ఇతరుల కోసం..
3.62. ग़रीबों पर तो मौसम भी हुकूमत करते रहते हैं..
कभी बारिश, कभी गर्मी,
कभी ठंडक का क़ब्ज़ा है..
పేదవారి మీద ఋతువులు కూడా అధికారం చేపడతాయి..
ఒకసారి వాన, ఒకసారి ఎండ, ఒకసారి చలి నిర్బంధిస్తాయి..
3.63. ऐ इश्क, मैं सुना था कि तू अन्धा है..
फ़िर रास्ता मेरे दिल का बताया किसने..
ఓ ప్రేమా, నీకు కళ్ళు లేవని విన్నాను..
మరి నా మనసు వైపు దారి ఎవరు చెప్పారు నీకు?..
3.64. यूँ तो सिखाने को जिंदगी बहुत कुछ सिखाती है..
मगर, झूठी हंसी हँसने का
हुनर तो मोहब्बत ही सिखाती है..
నేర్పటానికి జీవితం చాలా (పాఠాలు) నేర్పుతుంది..
కానీ లేని నవ్వు నవ్వే కళ మాత్రం ప్రేమనే నేర్పుతుంది..
3.65. मेरे पास ही था उनके जख्मों का मरहम..
मगर बड़े शहरों में कहाँ छोटी दुकान दिखाई देती
हैं..
నా వద్ద ఉంది, వారి గాయానికి మందు..
కానీ పెద్ద నగరాల్లో చిన్న దుకాణాలు ఎందుకు కనిపిస్తాయి?..
3.66. भूख से मुरझाये चेहरे, घर में कब तक देखता..
फाड़कर डिग्री मुझे मजदूर हो जाना पड़ा..
ఇంట్లో ఆకలితో ముడుచుకుపోయిన (అలమటించే) ముఖాలను ఎప్పటిదాక
చూడగలను?..
డిగ్రీ చింపేసి నేను పనివాడిని (శ్రమజీవిని) కావలసి
వచ్చింది..
3.67. ओस की बूँदें देखकर मुझे शक होता है..
ये आसमाँ भी तकिये में छिपकर रोता है..
తుషార బిందువులను చూసి నాకు అనుమానం వస్తుంది..
ఈ ఆకాశం కూడా దిండులోకి దాగి ఏడుస్తుందేమో..
3.68. हम से पूछो शायरी माँगती है कितना लहू..
लोग समझते है धंधा बङे आराम का हैं..
నన్ను అడుగు, షాయరీ (కవిత్వం) ఎంత రక్తం (కష్టం)
కోరుతుందో..
జనాలు అనుకుంటారు, ఈ వ్యాపారం చాలా హాయిగా ఉంటుందని..
3.69. कुर्सी है, तुम्हारा ये जनाज़ा तो नहीं है..
कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते..
ఇది కుర్చీ, నీ పాడె కాదు కదా..
ఏమీ చేయలేకపోతే పోయావు, దిగవెందుకు?..
3.70. मेरे न हो सको, तो कुछ ऐसा कर दो..
मैं जैसी थी, मुझे फिर से
वैसा कर दो..
నావాడివి కాకపోతే పోయావు, ఒక పని చేయి పోనీ..
నేను ఎట్లా ఉండేదాన్నో, నన్ను అట్లాగే
చేసేసేయి..
కదా- అందుకే కోరతారు మనుషులు. చేసేదంతా చేసి, పడేదంతా పడి.. మళ్ళీ
తిరిగి పాత స్థితి రావాలంటే ఎట్లా వస్తుంది
చెప్పండి.. లేనిది రానిది కోరటం మనిషి బలహీనత
జీవితం ఎన్నో సంకేతాలిస్తుంది.. లోకమూ చెప్తుంది. అనుభవమూ,
అంతరాత్మా
ఘోషిస్తాయి.. కానీ అప్పుడు ఎవ్వరూ
పట్టించుకోరు.. కాలింతరువాత కాలిందని ఏడుస్తారు
భగవంతుడు ఒక్కడి దగ్గర ఈ మాట అనను.. మేరే న హో సకో తో,
ముఝే
అప్ నా బనాలో అంటాను.. లేదా- ముఝే మార్ డాలో- అంటాను 😀
3.71. दबे होंठों को बनाया है सहारा अपना..
सुना है कम बोलने से बहुत मसलें सुलझ जाते है..
మూసిన పెదవులను నా ఆలంబనగా చేసుకున్నాను..
తక్కువ మాట్లాడితే చాలా సమస్యలు తీరిపోతాయని విన్నాను..
3.72. ऐ हवा.. तुझे क्या मालूम कितनी देर से सजे थे वो..
तू ने तो पल भर में आके बिखेर दिये बाल उनके..
ఓ గాలీ, నీకేం తెలుసు, ఎంత సేపటి నుంచి అలంకరించుకున్నారో వారు..
నీవు వచ్చి క్షణంలో వారి కురులను చెదరగొట్టేశావు..
3.73. क़दर होती है इंसान की ज़रूरत
पड़ने पर ही..
बिना ज़रूरत के तो हीरे भी तिजोरी में रहते है..
మనిషితో అసరం పడినప్పుడే విలువ ఉంటుంది..
ఏ అవసరం లేకుండా ఉంటే వజ్రాలు కూడా బీరువాలో ఉంటాయి..
3.74. बहुत लोग ये कहते है कि हम सब मिट्टी से बने है..
मैं बहुतों से मिला हूँ, जो
पत्थर के बने हैं..
చాలామంది అంటారు, మనం అంతా మట్టితో తయారైనామని..
నేను చాలామందిని కలిశాను, బండరాతితో
తయారైనవారిని..
3.75. हाथों में पत्थर नहीं, फिर भी चोट देती है..
ये जुबान भी अजीब है, अच्छे-अच्छों
के घर तोड़ देती है..
చేతిలో రాయి లేదు, అయినా గాయపరుస్తుంది..
ఈ నాలుక విచిత్రమైనది, మంచిమంచి వారి
ఇళ్ళను విరగ/పగలగొడుతుంది..
3.76. लोग वाक़िफ़ है मेरी आदतों से..
रूतबा कम ही सही पर लाजवाब रखता हूँ..
జనాలు నా అలవాట్లను ఎరుగుదురు.. (జనాలకు నా అలవాట్లు బాగా
తెలుసు)
హోదా తక్కువే అయినా, తిరుగులేనిదిగా
ఉంచుకుంటాను..
3.77. सुरमे की तरह पीसा है हमें हालातों ने..
तब जा के चढ़े है लोगों की निगाहों में..
పరిస్థితులు నన్ను కాటుకలాగా నూరేశాయి..
అప్పుడు కానీ జనాల కన్నులలోకి (ఎక్క)చేరలేదు..
3.78. लम्हे फ़ुर्सत के आएँ तो, रंजिशें भुला देना
दोस्तों..
किसी को नहीं खबर कि साँसों की मोहलत कहाँ तक
है..
తీరికవేళలు దొర్లినప్పుడు విరోధాలను మరిచిపోండి నేస్తాలూ..
ఎవ్వరికీ తెలియదు, ఊపిరి ఎంతకాలం నిలిచేనో..
3.79. बुरा तो तब लगता है..
जब प्यार अपना हो और बातें औरों की कर रहा हो..
చెడుగా అనిపించేదెప్పుండంటే..
మన ప్రియవ్యక్తులు ఇతరుల గురించి మాట్లాడినప్పుడు..
3.80. कभी-कभी यूँ ही चले आया करो दिल की दहलीज पर..
ऐ दोस्त, अच्छा लगता है
यूँ तन्हाइयों में तुम्हारा दस्तक देना..
అప్పుడప్పుడు ఇట్లాగే వచ్చేస్తుండు, మనస్సు గుమ్మం
లోనికి..
ఓ నేస్తమా, ఒంటరితనంలో నీవట్లా తలుపు తట్టటం బాగనిపిస్తుంది..
3.81. कड़क चाय और मजबूत रिश्तें
धीरे-धीरे बनते हैं..
గాఢమైన తేనీరు, ప్రగాఢమైన అనుబంధాలు..
నెమ్మదిగా తయారవుతాయి..
3.82. मसला तो सिर्फ़ एहसासों का है, जनाब..
रिश्ते तो बिना मिले भी सदियां गुज़ार देते
हैं..
సమస్య అనుభూతులతోనే సుమండీ..
అనుబంధాలదేం ఉంది, కలవకుండానే ఏళ్ళు గడిచిపోతాయి..
3.83. लकीरें तो हमारी भी बहुत ख़ास है..
तभी तो आप जैसे दोस्त हमारे पास है..
మా (చేతి)గీతలు కూడా విశేషమైనవే..
అందుకే కదా మీ వంటి నేస్తాలు మా వద్ద ఉన్నారు..
3.84. जितने दिन तक जी गई, बस उतनी ही है ज़िन्दगी..
मिट्टी के गुल्लकों की कोई उम्र नहीं होती..
ఎంతకాలం బ్రతుకుతామో అంతవరకే జీవితం..
మట్టి పిడతలకు వయసనేది ఉండదు..
3.85. विधाता की अदालत की वक़ालत बड़ी न्यारी है..
तू ख़ामोश रह, कर्म कर,
तेरा मुकद्दमा ज़ारी है..
విధాత న్యాయాలయం లో వకాల్తా చాలా విచిత్రమైనది..
నీవు మౌనంగా ఉండు, కర్మను చేయి, నీ కేసు విచారణలో
ఉన్నది..
3.86. देख कर मेरी आँखें एक फकीर कहने लगा..
पलकें तुम्हारी नाज़ुक है, ख़्वाबों
का वज़न कम कीजिये..
నా కన్నులను చూసి ఓ ఫకీరు అన్నాడు..
మీ కనురెప్పలు నాజూకుగా ఉన్నవి, కలల బరువు
తగ్గించుకోండని..
3.87. समझदार होने का ये नुकसान होता है कि..
दिल की हज़ारों ख्वाहिशें, दिल में ही रह जाती हैं..
అర్థంచేసుకునేవారు అయితే హాని ఏంటో తెలుసా..
మనసులోని వేల కోరికలు మనసులోనే ఉండిపోతాయి..
3.88. कहाँ खर्च करूँ अपने दिल की दौलत..
यहाँ तो सब भरी जेबों को सलाम करते हैं..
ఎక్కడ ఖర్చు చేయాలి నా మనసులో సంపదను..
ఇక్కడంతా నిండి ఉన్న జేబులకు నమస్కరిస్తారు..
3.89. परवाह नहीं चाहे जमाना कितना भी ख़िलाफ़ हो..
चलूँगा उसी राह पर जो सीधी और साफ हो..
కాలం ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే, ఫరవాలేదు..
నేను నడిచేది మాత్రం నేరుగా, సరైన దారిలోనే..
3.90. मेरी आवाज़ को महफ़ूज़ कर लो, मेरे दोस्त..
मेरे बाद बहुत सन्नाटा होगा तुम्हारी महफ़िल
में..
నా స్వరాన్ని పదిలపరుచుకో, నేస్తమా..
నా తదనంతరం మౌనం అలముకుంటుంది నీ సదస్సులో..
3.91. झुकने से रिश्ते बचते हो, तो झुक जाओ..
पर हर बार आपको ही झुकना पड़े तो रुक जाओ..
వంగినందువల్ల అనుబంధాలు నిలుస్తాయంటే వంగండి..
కానీ ప్రతీసారి మీరే వంగవలసి వస్తే ఆగిపోండి..
3.92. डाकखाने से कुछ खत आज लौट के आये..
लिखा था, इन जज़बातों का
कोई पता नहीं मिला..
తపాలా కేంద్రం నుండి కొన్ని ఉత్తరాలు తిరిగి వచ్చేశాయి..
దానిపై వ్రాసి ఉంది, ఈ భావాలకు చిరునామా
దొరకలేదు..
3.93. आराम से तनहा कट रही थी तो अच्छी थी..
ज़िंदगी, तू कहाँ दिल की
बातों में आ गयी..
హాయిగా ఒంటరిగా సాగుతుండగా బాగుండింది..
జీవితమా, నువ్వు కూడా ఈ మనసు మాటల్లోకి వచ్చేశావే..
3.94. दिल के सच्चे लोग कुछ एहसास लिखते है..
मामूली शब्दों में ही सही, कुछ खास लिखते है..
స్వచ్చమైన మనసున్నవారు కొన్ని భావాలను వ్రాస్తారు..
మామూలు మాటలలోనే అయినా చాలా గొప్పగా వ్రాస్తారు..
3.95. बूंदें कुछ यूं गिरी कि..
कुछ खयाल भीग गये..
చినుకులు కొన్ని ఇట్లా కురియంగానే..
కొన్ని ఆలోచనలు తడిసిపోయాయి..
3.96. मेरी दर्द की एक दुकान है..
जो सिर्फ अपनों की मेहरबानी से चलती है..
నాది బాధల దుకాణమొకటి ఉన్నది..
అది కేవలం సొంతవారి కరుణతోనే నడుస్తున్నది..
3.97. बहुत अन्दर तक तबाही मचाता है..
वो आँसू जो आँख से बह नहीं पाता..
చాలా లోతైన నాశనం చేస్తుంది..
కన్నీరై కంటి నుండి కారలేకపోయిన నీరు అది..
3.98. किस जगह रख दूँ मैं तेरी याद के चिराग को..
की रोशन भी रहे और हथेली भी ना जले..
ఎక్కడ పెట్టను నీ జ్ఞాపకాల దీపాన్ని..
వెలుగూ ఉండేటట్టు, చేయీ కాలకుండా..
3.99. ना डरा मुझे ऐ वक़्त, नाकाम होगी तेरी हर कोशिश..
ज़िन्दगी के मैदान में खड़ी हूँ, दुआओं का काफ़िला लेकर..
నన్ను భయపెట్టకు ఓ కాలమా, నీ ప్రయత్నాలు
విఫలమవుతాయి..
జీవితమనే మైదానంలో నిలిచాను, ప్రార్థనల సమూహాన్ని
అందుకుని..
3.100. घड़ी की टिक टिक को मामूली न समझो दोस्तों..
बस, यूँ समझ लीजिये कि
ज़िन्दगी के पेड़ पर कुल्हाड़ी के वार है..
గడియారపు టిక్ టిక్ ధ్వనిని మామూలుగా తీసుకోకండి నేస్తాలూ..
ఇట్లా అనుకోండి- అది జీవితమనే చెట్టుమీద గొడ్డలి పెట్టు
అని..
3.101. हसरत पूरी ना हों तो ना सही..
ख़्वाहिश करना कोई गुनाह तो नहीं..
కోరిక తీరకపోతే పోనీగాక..
కోరుకోవటం పాపమైతే కాదు కదా..
3.102. दिल में वो भीड़ है कि ज़रा भी नहीं जगह..
आप आइए मगर कोई अरमाँ निकाल के..
మనసులో ఎంత క్రిక్కిరిసి ఉందంటే ఇంతైనా చోటు లేదు..
(అయినా) మీరు రండి, కానీ ఏదైనా కోరిక తీసుకుని..
3.103. खुशमिजाज़ी भी मशहूर थी, हमारी सादगी भी कमाल थी..
हम शरारती भी बेइंतेहा थे, अब संजीदा भी बेमिसाल हैं..
మా సంతోషం కూడా ప్రసిద్ధమే, మా సరళత్వమూ
(సాదాతనమూ) అద్భుతమే..
మా అల్లరీ అపరిమితమే, ఇప్పుడు గాంభీర్యమూ
సాటిలేనిదే..
3.104. कर रहा था ग़म-ए-जहाँ का हिसाब..
आज तुम याद बे-हिसाब आए..
లోకంలో (నా) బాధను (లెక్కవేస్తున్నాను) కొలుస్తున్నాను..
ఇవాళ నువ్వు లెక్కలేనంతగా గుర్తుకు వచ్చావు..
3.105. वक्त तजुर्बा तो देता है..
पर मासूमियत छीन लेता है..
కాలం అనుభవాన్ని ఇస్తుంది..
కానీ అమాయకత్వాన్ని లాగేసుకుంటుంది..
3.106. रिश्तों की क़दर भी पैसों की तरह ही करनी चाहिए..
क्यों कि दोनों को कमाना मुश्किल है पर गँवाना
आसान..
అనుబంధాలకు డబ్బుకులాగే విలువనివ్వాలి..
ఎందుకంటే రెండిటిని సంపాదించటం కష్టం, పోగొట్టుకోవటం సులభం..
3.107. हम रूठ भी जाएं तो हमें मनाएगा कौन..
बस इसी फिक्र में खुश रहते हैं..
మేము అలిగినాకూడా మమ్మల్ని అనునయించేదెవ్వరు..
ఈ చింతతోనే సంతోషంగా ఉంటాము..
3.109. हम तो पागल है जो शायरी में ही दिल की बात कह देते है..
लोग तो गीता पे हाथ रखके भी सच नहीं बोलते..
మేము వెర్రివారము, కవిత్వంలోనే మనసులో మాట చెప్తున్నాము..
జనాలు గీతామాత పై చేయి పెట్టి కూడా సత్యం చెప్పరు..
3.110. तेरा नाम लूँ जुबां से तेरे आगे ये सिर झुका दूँ..
मेरा इश्क़ कह रहा है, मैं
तुझे खुदा बना दूँ..
నోటితో నీ పేరు అనుకోవాలి, నీ ఎదుట తలవంచాలి..
నా ప్రేమ అంటున్నది, నేను నిన్ను
దేవుణ్ణి చేసుకోవాలని..
3.111. मुस्करा कर देखो तो सारा जहाँ रंगीन है..
वर्ना भीगी पलकों से तो आईना भी धुधंला नज़र आता
है..
కాస్త చిరునవ్వు నవ్వి చూస్తే లోకమంతా అందమైనదే
(రంగులమయమే)..
లేదా, తడి కనురెప్పలతో చూస్తే అద్దం కూడా మసకగా కనిపిస్తుంది..
3.112. आदत थी मेरी सबसे हँस के बोलना..
मेरा शौक ही मुझे बदनाम कर गया..
అందరితో నవ్వుతూ మాట్లాడటం నా అలవాటు..
ఆ సరదాయే నాకు చెడ్డపేరు తెచ్చిపెట్టింది..
3.113. मुकद्दर क्या होता है यह तो मुझे मालुम नहीं..
पर 'तू' सबकी सुनता है, ये खबर पक्की है..
అదృష్టం అంటే ఏంటో అది నాకు తెలియదు..
కానీ నీవు అందరి మాటా వింటావు, ఈ వార్త
నమ్మదగినదే..
3.114. तहज़ीब में भी उसकी क्या ख़ूब अदा थी..
नमक भी अदा किया तो ज़ख़्मों पर छिड़क कर..
వారి మర్యాదలో కూడా ఏమి విశిష్టపద్ధతి ఉందో..
ఉప్పు తిన్న ఋణం తీర్చింది కూడా గాయాల మీద చల్లి..
3.115. वफ़ा करनी भी सीखो इश्क़ की नगरी में, ए दोस्त..
फ़क़त यूँ दिल लगाने से दिलों में घर नहीं
बनते..
ప్రేమనగరిలో మాటనిలుపుకోవటం కూడా నేర్చుకో నేస్తమా..
ఊరికే మనసు ఇవ్వంగానే మనసుల్లో ఇళ్ళు నిలబడవు..
3.116. यूँ ना बर्बाद कर मुझे, अब तो बाज़ आ दिल दुखाने से..
मै तो सिर्फ इन्सान हूँ, पत्थर
भी टूट जाता है, इतना आजमाने से..
ఇంతగా నాశనం చేయకు నన్ను, ఇకనైనా మనసు
నొప్పించటం ఆపు..
నేను మానవమాత్రుడిని, ఇంత పరీక్షిస్తే
బండరాయి సైతం విరిగిపోతుంది..
No comments:
Post a Comment