Thursday, 31 August 2017

షేరోం కా షోర్- 4 (शेरों का शोर) (ఉర్దూ షేర్లు తెలుగులో అనూదితం)

4.1. इक झलक देख लें तुझको तो चले जाएंगे..
कौन आया है यहां उम्र बिताने के लिए..
నిన్ను ఒక్క క్షణం అట్లా చూసి వెళిపోతాను..
ఇక్కడే జీవితాంతం గడపటానికి ఎవరొచ్చారు?..

4.2. आसानी से जो कोई मिल जाए तो वो किस्मत की बात है..
सूली पर चढ़कर भी जो ना मिले उसे मोहब्बत कहते है..
సులువుగా ఏదైనా దొరకటం అదృష్టాన్ని బట్టి ఉంటుంది..
శూల మీదెక్కినా దొరకనిదాన్నే ప్రణయం అంటారు..

4.3. हश्र-ऐ-मोहब्बत और अंजाम अब ख़ुदा जाने..
तुझ से मिलकर मिट जाना ही मेरा वजूद था..
ఈ ప్రేమ ప్రళయం, దాని పర్యవసానం భగవంతుడికే తెలియాలి..
నిన్ను కలిసి చెరిగిపోవటమే నా అస్తిత్వం అయింది..

4.4. गुफ्तगू उनसे होती यह किस्मत कहाँ..
ये भी उनका करम है कि वो नज़र तो आये..
వారితో మాట్లాడే అవకాశం దొరికేటంత అదృష్టం ఎక్కడ?..
కనీసం కంటికి కనిపించారు, అది కూడా భాగ్యమే..

4.5. ऐ उम्र, अगर दम है तो कर दे इतनी-सी खता..
बचपन तो छीन लिया, बचपना छीन कर बता..
ఓ వయస్సా, దమ్ముంటే ఈ తప్పు చేసి చూపించు..
పసిప్రాయాన్ని లాగేసుకున్నావు, పసితనాన్ని గుంజుకుని చూపించు..

4.6. जब सब तेरी मर्ज़ी से होता है ऐ खुदा..
तो ये बंदा गुनहगार कैसे हो गया?..
ఓ భగవంతుడా, అంతా నీ ఇచ్ఛతో జరిగేదైతే..
ఈ ప్రబుద్ధుడు పాపాత్ముడెట్లా అయ్యాడు?..

4.7. जलो वहाँ जहाँ जरूरत हो..
उजालों में चिरागों के मायने नहीं होते..
అవసరం ఉన్నచోట (కాలుతూ) వెలుగు..
వెలుగులున్నచోట దీపాల అవసరం ఉండదు..

4.8. हँसकर कबूल क्या कर ली हर सज़ा हमने..
दस्तूर ही बना लिया है दुनिया ने भी, इल्ज़ाम लगाने का..
చిరునవ్వుతో దండనను ఇట్లా ఒప్పుకున్నానో లేదో..
నెపం వేయటం అలవాటుగా చేసుకున్నది ప్రపంచం కూడా..

4.9. धोखे की ख़ासियत यही है जनाब..
ये यक़ीन के साथ मुफ़्त मिलता है..
మోసం విశేషం ఇదే సుమండీ..
ఇది నమ్మకంతోపాటు వెల చెల్లించకుండానే దొరుకుతుంది..

4.10. न जाने कितनी ही अनकही बातें साथ ले जाते हैं लोग..
सब गलत कहते हैं कि खाली हाथ चले जाते हैं लोग..
ఎన్ని మాటలను (బయటకు) అనకుండానే వెంట తీసుకువెళిపోతారో జనాలు..
ఉత్తచేతులతో వెళిపోయారని అందరూ చెప్పేది తప్పే కదా..

4.11. बदल जाऊं तो मेरा नाम वक्त रखना, थम जाऊं तो हालात
छलक जाऊं तो मुझे जज्बात कहना, महसूस हो जाऊं तो दोस्त समझना..
మారిపోతే కాలమని నా పేరు పెట్టండి, ఆగిపోతే పరిస్థితులు అనండి..
ఒలికిపోతే నన్ను భావం అనండి, అనుభూతి చెందితే నేస్తం అనండి..

4.12. मेरी हर शायरी मेरे दर्द को करेगी बयाँ ए ग़म..
तुम्हारी आँख ना भर जाएँ, कहीं पढ़ते पढ़ते..
నా ప్రతి కవిత నా నొప్పిని, పీడను వ్యక్తం చేస్తుంది..
నీ కళ్ళు నిండిపోతాయేమో, అవి చదువుతూ చదువుతూ..

4.13. कभी शाम होने के बाद, मेरे दिल में आकर देखना..
ख़यालों की महफ़िल सजी होती है और जिक्र सिर्फ तुम्हारा होता है..
ఎప్పుడైనా సాయంసమయంలో నా గుండెలోకి వచ్చి చూసుకో..
ఆలోచనల విందుసభ నడుస్తుంటుంది, అందులో నీ ప్రసంగం మాత్రమే ఉంటుంది..

4.14. कभी तुम पूछ लेना, कभी हम भी ज़िक्र कर लेगें..
छुपाकर दिल के दर्द को, एक दूसरे की फ़िक्र कर लेंगे..
ఒకసారి నీవు అడుగు, మరోసారి నేను అడుగుతాను..
మనసులో బాధను దాచుకుని, ఒకరికొకరం విచారించుకుందాం..

4.15. मोहब्बत और मुकद्दर में बरसों से ज़िद का रिश्ता है..
मोहब्बत जब भी होती है तो मुकद्दर रूठ ही जाता है..
ప్రేమ, అదృష్టం మధ్య తరాలుగా ఉన్నది పట్టుదలల అనుబంధం..
ప్రేమ ఎప్పుడు కలిగినా అదృష్టం అలుగుతుంది..

4.16. न जाने कब खर्च हो गये, पता ही न चला..
वो लम्हे, जो छुपाकर रखे थे जीने के लिये..
ఎప్పుడు ఖర్చయిపోయాయో తెలియనే తెలియలేదే..
జీవించటానికి దాచుకున్న ఆ క్షణాలు..

4.17. शतरंज मे वज़ीर और ज़िंदगी मे ज़मीर..
अगर मर जाए तो समझिए खेल ख़त्म..
చదరంగంలో మంత్రి, జీవితంలో ఆత్మాభిమానం..
చచ్చిపోయినట్లైతే ఇంక ఆట ముగిసినట్టే అర్థం..

4.18. हवस ने पक्के मकान, बना लिये हैं जिस्मों में..
और सच्ची मुहब्बत किराये की झोपड़ी में, बीमार पड़ी है आज भी..
కామపు పక్కా ఇళ్ళు కట్టేసుకున్నారు శరీరాలలో..
నిజమైన ప్రేమ కిరాయి గుడిసెలో ఒంట్లో బాగోక పడుంది, ఇవాళ కూడా..

4.19. सब मुझे ही कहते है की भूल जाओ उसे..
कोई उसे क्यूँ नहीं कहता की वो मेरी हो जाए..
అందరూ నాకు చెప్తారు, తనను మర్చిపొమ్మని..
ఎవ్వరూ తనతో ఎందుకనరు, నా వ్యక్తిగా కమ్మని?..

4.20. ये उड़ती ज़ुल्फें और ये बिखरी मुस्कान..
एक अदा से संभलूँ तो दूसरी होश उड़ा देती है..
ఈ గాలికెగిరే కురులు, ఈ విరిసిన చిరునవ్వు..
ఒక హావభావం నుంచి తేరుకునేలోపు, రెండవది మతి పోగొడుతుంది..

4.21. उसने शिद्दत से पूछा कौन सा तोहफा दूँ..
मैं ने कहा, वही शाम जो अब तक उधार है..
వారు చాలా కష్టంమీద అడిగారు, ఏం కానుక కావాలని..
నేనన్నాను- ఇప్పటిదాకా అప్పు ఉన్న ఆనాటి సాయంత్రమే ఇమ్మని..

4.22. याद रखना भी हिम्मत का काम है..
क्यों की भूल जाना तो आजकल आम है..
గుర్తుంచుకోవటమే ధైర్యంతో కూడినది..
ఎందుకంటే మర్చిపోవటం ఇవాళరేపు సామాన్యం..

4.23. ना जाने ये कौन सा तरीका है तेरा प्यार करने का..
तेरा दिल ही नहीं करता मुझसे बात करने का..
ప్రేమించేందుకు ఇదేం పద్ధతో ఏమో..
నాతో మాట్లాడలనే నీకు అనిపించదే..

4.24. कैसे कह दूँ कि बदले में कुछ मिला नहीं..
सबक भी कोई छोटी चीज़ तो नहीं..
బదులుగా ఏమీ దొరకలేదని ఎట్లా చెప్పను?..
పాఠం కూడా చిన్న వస్తువు కాదు కదా..

4.25. कॉल फ्री होने से क्या होता है साहिब..
दिलों में गुंजाइश भी तो होनी चाहिए बात करने के लिए..
కాల్ ఫ్రీ ఉండగానే ఏమవుతుందండి..
మనసులో మాట్లాడేందుకు అవకాశం ఉండాలి కదా..

4.26. ये चेहरा, ये रौनक ढल ही जायेगा एक उम्र के बाद..
पर हम मिलते रहेंगे ताउम्र यूँ हीं अल्फाजों के साथ..
ఈ ముఖం, ఈ అందం, సమసి పోతాయి, ఒక వయసు తరువాత..
కానీ మనం కలుస్తునే ఉందాం, జీవితమంతా, ఇట్లాగే ఈ మాటలతో..

4.27. कुछ शिकवे ऐसे थे साहिब..
जो खुद ही कहे और खुद ही सुने..
కొన్ని బాధలు ఎటువంటివంటేనండీ..
మనతోనే చెప్పుకుంటాము, మనమే వింటాము..

4.28. घर अपना बना लेते हैं, जो दिल में मेरे..
मुझसे वो परिंदे, कभी उड़ाये नहीं जाते..
నా మనసులో పక్షులు గూడు కట్టేసుకున్నాక,,
వాటిని నేనెప్పటికీ వెళ్ళగొట్టలేను..

4.29. मन को छूकर लौट जाऊँगा किसी दिन..
तुम हवा से पूछते रह जाओगे मेरा पता..
మనస్సును తాకి వెళిపోతాను ఏదో ఓ రోజు..
నీవు చిరుగాలిని అడుగుతూ ఉండిపోతావు నా చిరునామా..

4.30. अपने दिल की अदालत में ज़रूर जाएं..
सुना है, वहाँ कभी ग़लत फैसले नहीं हुआ करते..
మీ మనస్సు న్యాయస్థానానికి తప్పక పోండి..
అక్కడ తప్పుడు నిర్ణయాలు ఎప్పటికీ జరగవు అని విన్నాను..

4.31. शब्द भी क्या चीज़ है..
महके को लगाव, बहके तो घाव..
మాటలు కూడా భలే ఉంటాయి..
పరిమళిస్తే బంధాలు, తూలితే గాయాలు..

4.32. हमारी आँख अक्सर वही लोग खोलते हैं..
जिनपर हम आँखें बन्द करके भरोसा करते हैं..
చాలామటుకు, మన కళ్ళు ఎవరు తెరిపిస్తారంటే..
మనం ఎవరిమీద బాగా నమ్మకాన్ని పెట్టుకుంటామో వాళ్ళు..

4.33. शायर कहकर बदनाम ना करना मुझे दोस्तों..
मैं तो रोज़ शाम को दिनभर का हिसाब लिखता हूं..
కవినని చెప్పి నన్ను అపకీర్తి పాలు చేయకండి నేస్తాలూ..
నేను రోజూ సాయింత్రం ఆ దినమంతటి లెక్క వ్రాస్తాను..

4.34. किस लिए, देखते हो तुम आईना..
तुम तो ख़ुद से भी, ज्यादा ख़ूबसूरत हो..
ఎందుకు చూస్తావు నువ్వు అద్దాన్ని..
నీవు నీకన్నా కూడా ఎక్కువ అందంగా ఉన్నావు..

4.35. हाल मीठे फलों का मत पूछिए साहब..
रात दिन, चाकू की नोंक पे रहते है..
తీయని పండ్ల పరిస్థితి అడగకండి బాబూ..
పగలూ రాత్రీ చాకు అంచునే ఉంటాయి..

4.36. ग़म तो जनाब फ़ुरसत का शौक़ है..
ख़ुशी में वक्त ही कहाँ मिलता है..
బాధ అనేది తీరికవేళల్లోని మోజండీ బాబూ..
సంతోషంగా ఉన్నప్పుడు సమయమే ఎక్కడ దొరుకుతుంది?..

4.37. भरोसा क्या करना गैरों पर..
जब गिरना और चलना है अपने ही पैरों पर..
ఇతరులను నమ్మేదేంటి..
పడటం లేవటం మన కాళ్ళమీదే అయినప్పుడు..

4.38. रखा करो नज़दीकियां, ज़िन्दगी का कुछ भरोसा नहीं..
फिर मत कहना चले भी गए और बताया भी नहीं..
సామీప్యం ఉంచుతూ ఉండు, జీవితానికి ఏ నమ్మకం లేదు..
మళ్ళీ అనద్దు, వెళిపోయావు, చూడు, చెప్పనైనా లేదని..

4.39. फ़ितरत किसी की ना आज़माया कर..
ऐ जिंदगी, हर शख़्स अपनी हद में बेहद लाजवाब होता है..
ఎవ్వరి స్వభావాన్ని పరీక్షించబోకు..
ప్రతి వ్యక్తి తన పరిధిలో ఎల్లలు లేనంత నిరుపమానంగా ఉంటారు..

4.40. ए ख़ुदा आज दिल बहुत उदास है..
या तो मौत देदे या फिर जिंन्दगी देदे..
ఓ దేవుడా, ఇవాళ మనసు పరమ విరక్తమై ఉంది..
మరణమైనా ఇవ్వు, లేదంటే జీవితమైనా ఇవ్వు..

4.41. शर्म नहीं आती उदासी को ज़रा भी..
मुद्दतों से मेरे घर की महेमान बनी हुई है..
సిగ్గు రావటం లేదు దుఃఖానికి ఇంతైనా..
చాలా కాలాలుగా నా ఇంట అతిథిలా పడుంది..

4.42. जिस रफ़्तार से तू चल रही है ज़िंदगी..
सच कहूं तो चालान बनता है तेरी रफ़्तार का..
ఓ జీవితమా, నీవు ఎంత వేగంగా వెళుతన్నావంటే..
నిజం చెప్పాలంటే, నీ వేగానికి చాలాన్ పడాలి..

4.43. एक चाहत थी तेरे साथ जीने की..
वरना, मोहब्बत तो किसी से भी हो सकती थी..
ఒక కోరిక ఉండేది, నీతో కలిసి జీవిద్దామని..
లేదంటే ప్రేమదేం ఉంది, ఎవ్వరితోనైనా కలిగేదే..

4.44. जिंदगी ज़ख्मों से भरी है..
वक़्त को मरहम बनाना सीख लो..
జీవితం గాయాలతో నిండి ఉంది..
సమయాన్ని మందుగా చేసుకోవటం నేర్చుకో..

4.45. आज दिल कर रहा था, बच्चों की तरह रूठ ही जाऊँ, पर...
फिर सोचा, उम्र का तकाज़ा है, मनायेगा कौन..
ఇవాళ మళ్ళీ మనస్సంటోంది, పిల్లలలాగా అలగాలని, కానీ..
మళ్ళీ అనుకున్నాను- వయసు మీద పడింది, ఎవరు అనునయిస్తారు?..
(స్వతంత్రించాను)

4.46. लफ्ज़ जब बरसते हैं बन कर बूँदें..
मौसम कोई भी हो मन भीग ही जाता है..
మాటలు చినుకులై కురిసినప్పుడు..
ఋతువేదైనా మనస్సు తడిసిపోతుంది..

4.47. चिराग़ कैसे अपनी मजबूरियाँ बयाँ करे..
हवा ज़रूरी भी और डर भी उसी से है..
దీపం తన నిస్సహాయతను ఎట్లా వ్యక్తపరచాలి?..
గాలి అవసరమూ ఉంది, భయమూ దానినుంచే ఉంది..

4.48. जो लम्हा साथ हैं, उसे जी भर के जी लेना दोस्तों..
कम्बख्त ये जिंदगी भरोसे के काबिल नहीं है..
ఏ క్షణాలు నీ వెంట ఉన్నవో, వాటితోనే బ్రతికేయండి నేస్తాలూ..
ఈ జీవితానికి ఏ నమ్మకానికి పాత్రం కాదు..
శ్రీనివాస్ గారు --
మిత్రులారా, మీ దగ్గరున్న కొన్ని క్షణాలలో తనివితీరా జీవించండి
టక్కరి జీవితం ఇది. ఏ భరోసా లేదు.

4.49. हाँ, वादा तो था मौहब्बत का, हर हाल में रहेगी..
दिल टूटने का ज़िक़्र मगर उस बात में कब था..
ఔను, ప్రేమ మాట ఇచ్చింది, ప్రతి పరిస్థితిలో తోడు ఉంటానని..
కానీ ఆ వచనంలో మనసు విరుగుతుందనే సంగతి ఎక్కడుంది?..

4.50. इतना क्यों सिखाए जा रही हो ज़िन्दगी..
हमें कौनसी सदियाँ गुज़ारनी है यहाँ..
ఇంతగా పాఠాలెందుకు నేర్పుతున్నావే జీవితమా..
 ఏఁ, ఇక్కడ తరాల తరబడి గడపాలా ఏంటి?..

4.51. ज़िंदगी है बड़ी नादान इसलिए चुप हूँ,
दर्द ही दर्द सुबह शाम इसलिए चुप हूँ,
कहो तो कह दूं ज़माने से दास्तान अपनी,
उसमे आएगा तुम्हारा नाम इसलिए चुप हूँ..
జీవితం చాలా అమాయకమైనది, అందుకు మౌనంగా ఉన్నాను
చాలా నొప్పి, పగలూ, రాత్రి, అందుకు మౌనంగా ఉన్నాను
సరేనంటే, మరి చెప్పేయనా లోకంతో మన కథంతా..
అందులో నీ పేరూ వస్తుంది,అందుకు మౌనంగా ఉన్నాను.

4.52. शायरी भी एक खेल है शतरंज का..
जिसमे लफ़्ज़ों के मोहरे मात दिया करते हैं एहसासों को..
కవిత్వం కూడా ఒక చదరంగం ఆట..
ఇందులో మాటల పావులు అనుభూతులకు చెక్ మేట్ చేస్తుంటాయి..

4.53. खामोशियाँ कर दें बयाँ तो अलग बात है..
कुछ दर्द ऐसे भी हैं जो लफ़्ज़ों में उतारे नहीं जाते..
నిశ్శబ్దాలు (విషయాన్ని) బయటపెట్టేస్తే చేసేస్తే ఆ మాట వేరు..
కొన్ని బాధలు పదాలలోకి దింపలేనివి ఉంటాయి..

రా.సం---
మౌనాలు మాట్లాడి బయటపెడితే తప్ప,
చాలా బాధలు వ్యక్తం చేయలేనివి!

4.53. काग़ज़ के बेजान परिंदे भी उड़ते है..
जनाब, बस डोर सही हाथ में होनी चाहिए..
జీవంలేని కాగితపు పక్షులు కూడా ఎగురుతాయి..
(దారం) సూత్రం సరైనవారి చేతిలో ఉండాలి, అంతే..

4.54. कोशिश हज़ार की के इसे रोक लूँ मगर..
ठहरी हुई घड़ी में भी ठहरा नहीं ये वक्त..
వేల ప్రయత్నాలు చేశాను, దీన్ని ఆపాలని, కానీ..
ఆగిన గడియారంలో కూడా కాలం ఆగలేదు కదా..

4.55. मुझे तलाश है उन रास्तों की जहाँ से कोई गुज़रा न हो..
सुना है, वीरानों मे अक्सर जिंदगी मिल जाती है..
ఇదివరలో ఎవ్వరూ పయనించని దారుల కోసం వెతుకుతున్నాను..
జనహీనమైన (నిర్జన) చోట్ల జీవితం దొరుకుతుందని విన్నాను..

4.56. मोहब्बत की शतरंज में वो बड़ा चालाक निकला..
दिल को मोहरा बना कर हमारी जिन्दगी छीन ली..
ప్రేమ చదరంగం చాలా తెలివిగలదేనని తేలింది..
మనసును పావును చేసి నా జీవితాన్ని లాగేసుకుంది..

4.57. गलतफ़हमी की गुंजाईश नहीं सच्ची मोहब्बत में..
जहाँ किरदार हल्का हो, कहानी डूब ही जाती है..
అపార్థాలకు తావే లేదు నిజమైన ప్రేమలో..
పాత్ర బరువులేనిదైతే (తేలిపోయేదైతే) కథ మునిగిపోవటమే..
వ్యక్తిత్వం నాసిరకమైతే

4.58. बड़ी अजीब है ये मोहब्बत..
वरना अभी उम्र ही क्या थी शायरी करने की..
చాలా విచిత్రమైనది ఈ ప్రణయం..
లేకపోతే, అసలిప్పుడు వయసే ఎంతటా, కవిత్వం వ్రాయటానికి?..
రా.సం--
ఈ ప్రేమ మాయ ఎంత గాఢమైనదో కదా?!
కాకపోతే ఈ వయసేమిటి? ఆ కవితలేమిటి!?

4.59. तेरा आधे मन से मुझको मिलने आना..
खुदा कसम मुझे पूरा तोड़ देता है..
నీవు సగం మనస్సుతో నన్ను కలవాలని రావటం..
దైవప్రమాణంగా నన్ను పూర్తిగా విరిచేస్తుంది..

4.60. कोई तो आ के रुला दे कि हँस रहें हैं,
बहुत दिनों से ख़ुशी को तरस रहें हैं।
ఇంత నవ్వుతున్నాను, ఎవరైనా వచ్చి ఏడిపించండి..
చారారోజలుగా సంతోషం కోసం తపిస్తున్నాను..

4.61. आसुओं को पलकों में लाया न कीजिये,
दिल की बात हर किसी को बताया न कीजिये,
मुट्ठी में नमक लेकर घूमते है लोग,
अपने ज़ख़्म हर किसी को दिखाया न कीजिये..
కన్నీటిని కనురెప్పల మీదకు రానివ్వకండి,
మనసులో మాట అందరికి చెప్తుండకండి..
పిడికెడు ఉప్పు పట్టుకుని తిరుగుతుంటారు జనాలు,
మీ గాయాలను ప్రతిఒక్కరికి చూపించకండి..

4.62. जहाँ भी ज़िक्र हुआ सुकून का..
वहीं तेरी बाहों की तलब लग जाती है..
ఎక్కడ ప్రశాంతత గురించిన మాట వస్తుందో..
అక్కడ నీ బాహువుల కోసం అన్వేషణే ఉంటుంది..

4.63. मुझे मालूम है कि ये ख़्वाब झूठे हैं और ख़्वाहिशें अधूरी हैं..
मग़र ज़िंदा रहने के लिए कुछ ग़लतफ़हमियां ज़रूरी है..
నాకు తెలుసు, ఈ కలలు అబధ్ధాలు, ఈ కోరికలు అపూర్ణమైనవి..
కానీ జీవించటానికి కొన్ని అపోహలు కూడా అవసరమే..

4.64. अब ये न पूछना की ये अल्फ़ाज़ कहाँ से लाता हूँ...
कुछ चुराता हूँ दर्द दूसरों के, कुछ अपना हाल सुनाता हुँ..
ఇక ఈ మాటలు ఎక్కడి నుంచి తెస్తానని అడగకండి..
కొంత ఇతరుల వేదనను దొంగిలిస్తాను, కొంత నా పరిస్థితిని చెప్తాను..

4.65. कौन कहता है कि हम झूठ नहीं बोलते..
एक बार ख़ैरियत तो पूछ के देखिये..
ఎవరన్నారు, నేను అబద్ధం చెప్పనని?..
ఒకసారి కుశలం అడిగి అయితే చూడండి..

4.66. ‪धड़कनों में बसते है कुछ लोग..
ज़बान पे नाम लाना ज़रूरी नहीं होता..
గుండె చప్పుడులో నివాసముంటారు కొందరు..
మాటల్లోకి వారి పేరు తేవలసిన అవసరం లేదు..

4.67. मेरी रूह ग़ुलाम हो गई है तेरे इश्क़ में शायद..
वरना यूँ छटपटाना मेरी आदत तो ना थी..
నా అంతరాత్మ నీ ప్రేణయానికి దాసీ అయిపోయింది కాబోలు..
లేదంటే, ఇంతగా కొట్టుకోవటం నాకు అలవాటు లేదు..

4.68. बहुत से लोग कहते हैं मोहब्बत जान ले लेती है..
मोहब्बत जान नहीं लेती है, बिछड़ने पर यादें अंदर से तोड़ जाती हैं..
చాలామంది అంటారు, ప్రేమ ప్రాణాలు హరించేస్తుందని..
ప్రేమ ప్రాణం తీయదు, విడిపోయిన తరువాత జ్ఞాపకాలు లోపలినుంచి విరగగొడతాయి..

4.69. समेट लो इन नाज़ुक पलों को, न जाने ये लम्हे कल हो न हो,
चाहे हो भी ये लम्हें, क्या मालूम, शामिल उन पलों में हम हो न हो..
పోగు చేసుకోండి ఈ మృదువైన క్షణాలను, రేపు ఈ ఘడియలు ఉంటాయో లేదో..
ఈ ఘడియలు ఉన్నప్పటికీ, ఏం తెలుసు, ఆ క్షణాలలో మనం ఉంటామో ఉండమో..

4.70. उनकी याद आयी है, सांसों, जरा अहिस्ता चलो..
धड़कनों से भी इबादत में खलल पड़ता है..
వారు జ్ఞాపకం వచ్చారు, ఓ శ్వాసల్లారా, కాస్త నెమ్మది అవ్వండి..
గుండెచప్పుడు వల్ల కూడా ప్రార్థనలో ఆటంకం కలుగుతుంది..

4.71. चंद लफ़्ज़ों में सुनाऊं, मैं क्या अपनी दास्ताँ..
बन के तेरे दिल की धड़कन, खत्म कर दूं ये कमी..(भा.गु)
కొన్నే మాటలలో వినిపించేయనా నా కథను?..
నీ గుండెచప్పుడునై ఈ లోటును పూరించేయగలను..

4.72. इसे इत्तेफ़ाक़ समझो या दर्दनाक हक़ीक़त..
आँख जब भी नम हुई, वजह कोई अपना ही निकला..
దీన్ని యాదృచ్ఛికమనుకో, లేదా నొప్పించే వాస్తవమైనా అనుకో..
కళ్ళు ఎప్పుడు తడైనా, దాని కారణం నా అనుకున్నవారే అయినారు..

4.73. कौन कहता है अलग अलग रहते हैं हम और तुम..
हमारी यादों के सफ़र में हमसफ़र हो तुम..
ఎవరన్నారు, నీవూ నేనూ విడివిడిగా ఉంటామని?..
నా జ్ఞాపకాల పయనంలో తోటి బాటసారివి నీవు..

4.74. कौन कहता है के तन्हाईयाँ अच्छी नहीं होती..
बड़ा हसीन मौका देती है ये ख़ुद से मिलने का..
ఎవరన్నారు, ఒంటరితనాలు మంచివి కావని?..
చక్కని అవకాశాన్నిస్తాయి, మనను మనం కలవటానికి..

4.75. मैं शिक़ायत क्यों करूँ, ये तो क़िस्मत की बात है..
तेरी सोच में भी मैं नहीं, मुझे लफ्ज़ लफ्ज़ तू याद है..
నేను ఎందుకు గోడు చెప్పుకోవాలి, ఇది అదృష్టం బట్టి ఉంటుంది..
 నీ ఆలోచనలో నేను లేను, నా ప్రతీ మాటలో నీ స్మరణం ఉంది..

4.76. काश, बनाने वाले ने थोड़ी-सी होशियारी और दिखाई होती..
इंसान थोड़े कम और इंसानियत ज़्यादा बनाई होती..
సృష్టికర్త మరికాస్త వివేకం చూపితే బాగుండేది కదా..
మానవులను కొద్దిగా తక్కువ, మానవత్వాన్ని కాస్త ఎక్కువ సృష్టి చేయవలసింది..

4.77. मुझको छोड़ने की वजह तो बता देते..
मुझसे नाराज़ थे या मुझ जैसे हज़ारों थे..
నన్ను వదిలిపెట్టటానికి వెనక కారణం చెప్పు..
నా మీద కోపమా, లేక నావంటి వారు వేలల్లో ఉన్నారా?..
(ఈ విచారాన్ని నేను సహకరించటం లేదు. కేవలం విడిపోయాక ఇట్లా మాట్లాడతారని చెప్పటానికి.. అంతే. కాలిన గుండెకు అట్లాగే అనిపిస్తుంది.. ఆక్షేపించాలని)

4.78. रोता वही है जिसने महसूस किया हो सच्चे रिश्ते को..
वरना मतलब के रिश्तें रखने वाले को तो कोई भी नहीं रूला सकता..
నిజమైన అనుబంధాన్ని అనుభూతి చెందినవాడే ఏడుస్తాడు..
అవసరాన్ని బట్టి అనుబంధం పెట్టుకున్నవాడిని ఎవ్వరూ ఏడిపించలేరు..

4.79. दर्द की शाम है, आँखों में नमी है..
हर सांस कह रही है, फिर तेरी कमी है..
పీడాకరమైన సాయింత్రం ఇది, కన్నులలో తడి ఉంది..
ప్రతి శ్వాస అంటోంది, మళ్ళీ నీ లోటు తెలుస్తోందని..

4.80. वो सुर्ख होंठ और उनपर ज़ालिम अंगडाईयां..
तू ही बता, ये दिल मरता ना तो क्या करता..
ఎర్రని నీ పెదవులు, దాని పైన దయలేని ఒళ్ళు విరుపులు..
నువ్వే చెప్పు, ఈ గుండె పడి చావకపోతే ఇంకేం చేస్తుంది?..

4.81. मैं किसी से बेहतर करुं, क्या फर्क पड़ता है?..
मै किसी का बेहतर करूं, बहुत फर्क पड़ता है..
నేను ఒకరికన్నా మెరుగ్గా చేసినందువల్ల ఏం తేడా వస్తుంది?
నేను ఒకరిని మెరుగు పరిస్తే తప్పక చాలా తేడా వస్తుంది..

4.82. दोहरे चरित्र में नहीं जी पाता हूँ मैं..
इसलिए कई बार अकेला नज़र आता हूँ मैं..
రెండు వ్యక్తిత్వాలలో బ్రతకలేకపోతాను నేను..
అందువల్లే చాలాసార్లు ఒంటరిగానే కనిపిస్తాను నేను..

4.83. हिसाब-किताब हम से न पूछ अब, ऐ-ज़िन्दगी..
तू ने सितम नहीं गिने, तो हम ने भी ज़ख्म नहीं गिने..
ఇక నన్ను లెక్కాపత్రాలు అడగకు జీవితమా..
నీవు అన్యాయాలను లెక్కించలేదు, నేను గాయాలను లెక్కించటం లేదు..

4.84. शोर करते रहो तुम, सुर्ख़ियों में आने का..
हमारी तो खामोशियाँ भी एक अखबार हैं..
నీవు గొడవ చేస్తూ ఉండు, ముఖ్యవార్తలలోకి ఎక్కటానికి..
మావైతే మౌనాలు కూడా ఒక వార్తాపత్రికే..

4.85. सीख नहीं पा रहा हूँ मीठे झूठ बोलने का हुनर..
कड़वे सच से हमसे न जाने कितने लोग रूठ गये..
తీయని అబద్ధం చెప్పే కళ నేర్చుకోలేకపోతున్నాను..
చేదైన నిజాల వల్ల ఎందరో నా పై అలుగుతున్నారు..

4.86. दुआ करो की वो सिर्फ हमारे ही रहे..
क्यूंकि हम भी किसी और के होना नहीं चाहते..
తను నాకే చెందాలి అని ప్రార్థించండి..
ఎందుకంటే నేనూ ఎవ్వరికీ చెందాలని అనుకోవటంలేదు..

4.87. कश्ती के मुसाफ़िर ने समन्दर नहीं देखा,
आँखों को देखा पर दिल मे उतर कर नहीं देखा..
पत्थर समझते है मेरे चाहने वाले मुझे,
हम तो मोम है किसी ने छूकर नहीं देखा..
నావలో పయనించేవాడు సముద్రాన్ని చూడలేదు
కన్నులను చూశారు కానీ మనసులోకి దిగి చూడలేదు..
నేను బండరాతిని అనుకుంటారు నన్ను ఇష్టపడేవారంతా
నేను మైనాన్ని, నన్నెవరూ తాకి చూడలేదు..

4.88. यहाँ हर कोई रखता है ख़बर ग़ैरों के गुनाहों की..
अजब फ़ितरत हैं, कोई आइना नहीं रखता..
ఇక్కడ ప్రతీవారు ఇతరుల పాపాల గురించి తెలుసుకుంటారు ..
విచిత్రమైన ప్రవృత్తి, ఎవ్వరూ అద్దం పెట్టుకోరేఁ?

4.89. मिज़ाज अपना कुछ ऐसा बना लिया हमने..
किसी ने कुछ भी कहा, बस मुस्करा दिया हमने..
నా అలవాటు ఈ విధంగా చేసుకున్నాను..
ఎవరేమైనా అననీ, నవ్వి ఊరుకుంటాను నేను..

4.90. कसा हुआ हैं तीर हुस्न का, ज़रा संभलके रहियेगा..
नज़र नज़र को मारेगी, तो क़ातिल हमें ना कहियेगा..
సౌందర్యపు బాణం ఎక్కుపెట్టి ఉన్నది, కాస్త జాగ్రత్తగా ఉండండి..
చూపులు చూపులను కొడితే నాకు ఘాతుకం అంటగట్టద్దు..
(కొంచెం స్వతంత్రించాను)

4.91. ना खोल मेरे मकान के उदास दरवाज़े..
हवा का शोर मेरी उलझने बढ़ा देते है..
నా ఇంటి బాధాతలుపులు తీయకు..
గాలి హోరు నా సమస్యలను పెంచుతుంది..

4.92. तलब ऐसी कि सांसों में समा लूं तुझे..
किस्मत ऐसी कि देखने को मोहताज हूं तुझे..
ఊపిరిలో నిన్ను ఇముడ్చు(నింపు)కోనా అన్నంతటిది నా అవసరం..
ఒక చూపు చూడటానికి కూడా నోచుకోనిదేమో నా భాగ్యం..

4.93. कौन कहता है माँ का कलेजा दुनिया में सबसे नरम है..
मैंने बेटियों की विदाई में अक्सर पिता को टूटते देखा है..
ఎవరన్నారు తల్లి మనసు లోకంలో అన్నింటికన్నా మెత్తనని?..
కూతురి వీడుకోలులో ఎక్కువ తండ్రే విరిగిపోవటం చూశాను..

4.94. बेनूर सी लगती है तुमसे बिछड़ कर ये रातें..
चिराग तो जलते है मगर उजाला नहीं करते..
అందమే లేనట్టు ఉన్నాయి నిన్ను వీడిన ఈ రాత్రులు..
దీపాలు వెలుగుతున్నాయి, కానీ వెలుగునివ్వటం లేదు..

4.95. तेरे होने का जिसमें किस्सा है..
वही मेरी जिंदगी का बेहतरीन हिस्सा है..
నీకు చెందినప్పటి (నీవాడినైనప్పటి) కథ ఏది ఉందో..
అదే నా జీవితంలో అద్భుతమైన భాగం..

4.96. मुझे भी पता है कि तुम मेरी नहीं हो..
इस बात का बार बार एहसास मत दिलाया करों..
నాకూ తెలుగు నీవు నాదానివి కావని..
ఈ మాట మాటిమాటికీ దృష్టికి తేకు..

4.97. रेस चाहे गाड़ियों की हो या ज़िंदगी की..
जीतते वही लोग हैं, जो सही वक़्त पे गियर बदलते हैं..
పందెం బండ్లదైనా జీవితానిదైనా..
వేళకు గేర్ మార్చేవాడే గెలుస్తాడు..

4.98. याद महबूब की और शिद्दत गर्मी की..
देखते हैं, हमें कौन, बीमार करता है..
ప్రియవ్యక్తి స్మృతులు, ఎండాకాలం వేడిమి కాఠిన్యం..
చూద్దాం, ఏది నన్ను అనారోగ్యం పాలు చేస్తుందో..

4.99. जो भी दीवार उठाते हो वह गिर जाती है..
घर बरसते हुये पानी में बनाते क्यों हो..
ఏ గోడ లేపినా అది పడిపోతుంది..
కురిసే నీటిలో ఇంటిని కట్టటమే ఎందుకు?..

4.100. शायरी पढ़ने तक ही ताल्लुक रखते है लोग..
किसी ने अभी तक हमारी महबूबा का नाम तक नहीं पूछा..
కవిత్వం వినటం వరకే సంబంధం పెట్టుకుంటారు జనాలు..
ఎవ్వరూ ఇంతవరకు నా ప్రేయసి పేరే అడగలేదు..

4.101. दुआ कभी खाली नहीं जाती..
बस लोग इन्तज़ार नहीं करते..
ప్రార్థన ఎప్పుడూ ఉత్తగ పోదు..
జనాలు ప్రతీక్షించరు, అంతే..

4.102. कुछ अधूरी सी है हम दोनों की ज़िन्दगी..
तुम्हे सुकून की तलाश है, और मुझे तुम्हारी..
ఏదో అపూర్ణంగా ఉంది మనిద్దరి జీవితం..
నీకు ప్రశాంతత కావాలి, నాకు నీవు కావాలి..

4.103. मेरा क्या हाल है तेरे बिना कभी देख तो ले..
जी रहा हूँ तेरा भूला हुआ वादा बन कर..
నీవు లేక నా పరిస్థితి ఏంటో, ఎప్పుడైనా వచ్చి చూసుకో..
బ్రతుకుతున్నాను నీవు మరిచిపోయిన ప్రమాణాన్నై..

4.104. हादसे कुछ ज़िन्दगी में ऐसे हो गये..
हम समंदर से भी ज़्यादा गहरे हो गये..
జీవితంలో కొన్ని సంఘటనలు ఎట్లా జరిగాయంటే..
నేను సముద్రంకన్నా ఎక్కువ లోతుగా అయిపోయాను..

4.105. जिस के आने से मेरे ज़ख़्म भरा करते थे..
अब वो मौसम मेरे ज़ख़्मो को हरा करते हैं..
వేటి రాకతో ఇదివరలో నా గాయాలు మానేవో..
ఇప్పుడు ఆ ఋతువులే గాయాలను పచ్చి చేస్తున్నాయి..

4.106. उसके लहज़े के बदलने की कहानी को समझ कर..
अब भी, ऐ दिल, उसे चाहो तो तुम्हारी मर्ज़ी..
వారి మాటతీరు మార్చేసే కథను అర్థం చేసుకుని..
ఓ మనసా, ఇప్పుడు కూడా వారిని కోరితే నీ ఇష్టం..

4.107. तेरे करम तो हैं इतने कि याद हैं अब तक
तेरे सितम हैं कुछ इतने कि हमको याद नहीं
నీవు చేసిన మంచి ఎన్నంటే ఇంకా గుర్తు ఉన్నాయి..
నీవు చేసిన అత్యాచారాలు ఎన్నంటే (లెక్కలేనన్ని కనుక )గుర్తు లేవు..

4.108. दिल की ख़ामोशी पर मत जाओ..
राख के नीचे आग दबी होती है..
మనసు నిశ్శబ్దాన్ని నమ్మకు..
బూడిద కింద నిప్పు దాగి ఉంటుంది..

4.109. ए खुदा, कोई कसर बाक़ी है तो पूरी कर..
यूं किश्तों मे दर्द देकर मेरा इम्तहां न ले..
భగవంతుడా, ఏదైనా లోటు ఉంటే దాన్ని పూరించు..
ఇట్లా అంచెలంచెలుగా (చిన్న భాగాలుగా) నన్ను పరీక్షించకు..

4.110. जख़्म बन जानेँ की आदत है उसकी
रुला कर मुस्कुरानेँ की आदत है उसकी
मिलेंगे कभी तो खुब रूलायेंगे उसको,
सुना है रोते हूऐ लिपट जाने की आदत है उसकी
గాయంగా కావటం అలవాటు తనకు..
ఏడిపించి నవ్వటం అలవాటు తనకు..
ఎప్పుడైనా కలిసినప్పుడు బాగా ఏడిపింస్తాను తనను
ఏడుస్తూనే వచ్చేసి చుట్టేసుకోవటం అలవాటని విన్నాను, తనకు..

4.111. इंतज़ार तो हम तेरा सारी उमर कर लेंगे..
बस खुदा करे तू बेवफ़ा ना निकले..
జీవితమంతా ఎదురుచూడమన్నా చూస్తాను..
భగవంతుడి దయతో, నీవు వంచన చేసే రకం కాకపోతే చాలు..

4.112. उजड़ी हुई दुनिया को तू आबाद न कर,
बीते हुए लम्हों को तू याद न कर,
एक क़ैद परिंदे ने ये कहा हम से..
मैं भुल चुका हूं उड़ना मुझे आज़ाद न कर!
నాశనమైన లోకాన్ని సంపన్నం చేయకు..
గతించిన క్షణాలను జ్ఞాపకం చేయకు..
బంధనంలో ఉన్న ఒక పక్షి నాతో ఇట్లా అంది..
నేను ఎగరటం మర్చిపోయాను, నన్ను స్వతంత్రంగా చేయకు..

రా.సం-- వాడిన పువ్వును మళ్ళీ చిగురింపగోరకు
గడిచిన గతాన్ని మళ్ళీ జీవింపగోరకు
నన్నిలా పంజరంలో ఉండనీ
ఎగరడం మరచిన రెక్కలకు మళ్ళీ
స్వేచ్ఛ నివ్వాలని కోరకు

4.113. कुछ नेकियाँ ऐसी भी होनी चाहिए..
जिनका खुदा के सिवा कोई गवाह ना हो..
కొన్ని సత్కార్యాలు ఇట్లా కూడా చేయాలి..
వాటికి భగవంతుడు తప్ప వేరే సాక్ష్యం ఉండకూడదు..

4.114. ज़िन्दगी रोज़ कोई ताज़ा सफ़र मांगती है..
और थकान शाम को अपना घर मांगती है..
జీవితం ప్రతి రోజు ఏదో కొత్త పయనం అడుగుతుంది..
అలుపేమో సాయింత్రం తన ఇంటిని కోరుతుంది..

4.115. खुदा ने बड़े अजीब से दुनिया के रिश्ते बनाये हैं..
सबसे ज्यादा वही रोया है जिसने ईमानदारी से निभाये हैं..
ఈ లోకంలో బంధాలను భగవంతుడు చాలా విచిత్రంగా చేశాడు
నిజాయితీగా నిర్వహించినవాడే అందరికన్నా ఎక్కువ బాధపడ్డాడు..

4.116. जब तक दिल को ठोकर नहीं लगती,
सबको अपने प्यार पर नाज हुआ करता है..
మనసుకు ఎదురుదెబ్బ తాకనంతవరకు..
అందరికి వారి ప్రేమ మీద గర్వం ఉంటుంది..

No comments:

Post a Comment