2.1. साँवरिया काश मैं तेरी आशिकी में नीलाम हो
जाऊं..
आखिरी बोली तेरी हो और मैं तेरे नाम हो जाऊं..
ఓ నల్లనయ్యా, నీ ప్రేమలో నేను వేలం (లో అమ్ముడు)
అయిపోవాలి గాక..
చివ్వరి పాట నీది అయ్యి, నేను నీ వాడిగా
అయిపోవాలి గాక..
2.2. मिट्टी का बना हूँ महक उठूँगा..
बस तू इक बार बेइन्तहा बरस के तो देख..
మట్టితో తయారైనాను, పరిమళించేస్తాను..
ఒకే ఒక్కసారి అపరిమితంగా (వాన) కురిసి అయితే చూడు..
2.3. मुठ्ठियों में क़ैद हैं जो खुशियाँ वो बांट
दो यारों..
ये हथेलियां तो इक दिन वैसे भी
खुल ही जानी हैं..
పిడికిట్లో బంధింపబడి ఉన్న సంతోషాలను పంచేసేయండి..
ఈ అరచేతులు ఏదో ఒక రోజు ఎటూ తెరుచుకోపోయేవే..
2.4. तिरंगे ने मायूस होकर सियासत को पूछा कि ये
क्या हाल हो रहा है ?..
मेरा लहराने में कम और कफ़न में ज्यादा इस्तेमाल
हो रहा है..
మువ్వన్నెల పతాకం బాధతో ప్రభుత్వాన్ని అడిగింది, ఏంటి ఈ పరిస్థితి
అని..
నేను ఎగరవేయటానికి తక్కువగా, శవావరణ వస్త్రంగా
ఎక్కువగా ఉపయోగపడుతున్నాను అని..
2.5. आँखे बंद करने से मुसीबत नहीं टलती..
और मुसीबत आए बिना आँखे नहीं खुलती..
కళ్ళు మూసుకొన్నంత మాత్రాన కష్టం తీరిపోదు..
కష్టం రానంతవరకు కళ్ళు తెరుచుకోవు..
2.6. कोई बेसबब, कोई बेताब
कोई चुप, कोई हैरान..
ऐ जिंदगी, तेरी महफ़िल के
तमाशे ख़त्म नहीं होते..
ఒకరు అకారణంగా, మరొకరు ఆదుర్దాగా, వేరొకరు మౌనంగా,
ఇంకొకరు
ఆశ్చర్యంగా (ఉన్నారు)..
ఓ జీవితమా, నీ సభలో తమాషాలు అంతమే కావు కదా..
2.7. ये नादानी भी, सच में
बेमिसाल है..
अँधेरा दिलों में है, और
दीपक मंदिरो में जलाते है..
(मन्दिर संसार का दिल है)
ఈ అవివేకం కూడా అసమానమైనది, నిజంగా..
అంధకారం మనసులలో ఉంది, దీపాలు గుళ్ళలో
వెలిగిస్తున్నారు..
(నా సమాధానం-- గుడి ప్రపంచానికి మనసు కదా)
2.8. रोज़ रोज़ जलते हैं, फिर
भी खाक़ न हुए..
अजीब हैं कुछ ख़्वाब भी,
बुझ कर
भी राख़ न हुए..
ప్రతీ రోజూ కాలుతున్నాయి, అయినా నాశనం
కాలేదు..
విచిత్రమైనవి కొన్ని కలలు, ఆరిపోయి కూడా బూడిద
కాలేదు..
2.9. पानी में अक्स देखकर खुश हो रहे थे हम..
पत्थर किसी ने मार कर मंज़र बदल दिया..
నీటి లో ప్రతిబింబం చూసుకుని సంతోషిస్తున్నాము మేము..
ఎవరో రాయి విసిరి దృశ్యం మార్చి పారేశారు..
2.10. क्या बेचकर हम तुझे खरीदें, ऐ ज़िन्दगी?..
सब कुछ तो गिरवी पड़ा है,
ज़िम्मेदारी के बाज़ार में..
దేనిని అమ్మి నిన్ను కొనను, ఓ జీవితమా..?
ఉన్నదంతా కుదువ పెట్టి ఉన్నది కదా- బాధ్యతల బజారులో..
2.11. कोई तो बरसात ऐसी हो जो तेरे संग बरसे..
तन्हा तो मेरी आँखें हर रोज बरसती है..
ఏదో ఓ వర్షం నీవు తోడుగా కురిసేది ఉంటే బాగుండు కదా..
ఒంటరిగా అయితే నా కన్నులు రోజూ కురుస్తాయి..
2.12. हसरतें तो हसरतें ही रही, कब किस की हुई पूरी
कहीं ना कहीं रही अधूरी..
बस उम्र का संदूक पूराना होता गया, और हसरतों की ओढ़नी नई रही..
కోర్కెలు కోర్కెలుగానే ఉండిపోయాయి, ఎవ్వరివీ ఎన్నడూ
తీరినది లేదు..
ఎక్కడో అక్కడ అసంపూర్తిగా ఉండిపోయాయి..
ఆయువనే పెట్టె పాతదిగా అయిపోతూ ఉంది..
కోర్కెల తొడుగు కొత్తగానే ఉండిపోతోంది..
2.13. नाम तो काँटों का ही लगेगा, ये सोचकर..
कई बार फूल भी चुपचाप ज़ख्म दे जाते है..
పేరు ముళ్ళకే కదా వచ్చేది అని అనుకుని..
చాలాసార్లు పువ్వులు కూడా మౌనంగా గాయాలు చేసి పోతాయి..
2.14. लीज़ पर मिली है ये ज़िंदगी..
रजिस्ट्री के चक्कर में ना पड़ें...
జీవితం లీజ్ కు (అద్దెకు) దొరికింది..
రెజిస్టర్ (కొనుగోలు) చేసుకుందామనే చక్రంలో పడకండి..
2.15. शीशा कमज़ोर बहुत होता है..
मगर सच दिखाने से घबराता नहीं है..
అద్దం చాలా బలహీనంగా ఉంటుంది (బలహీనమైనది)..
కానీ నిజం చెప్పటానికి ఎప్పుడూ భయపడదు..
2.16. ज़रुरतें तो कभी ख़त्म नहीं होती, सुकून ढूँढिये..
और वो तो फ़क़ीरों के दर पर ही नसीब होता है..
అవసరాలు ఎప్పటికీ తీరవు, శాంతిని వెతకండి..
అది సాధువుల స్ననిధిలోనే లభ్యమవుతుంది..
2.17. मैं शून्य हूँ, मुझे
पीछे ही रखना..
मेरा फ़र्ज सिर्फ आपकी कीमत बढ़ाना है..
నేను సున్నాని.. నన్ను వెనకే పెట్టండి..
నా బాధ్యత నీ విలువను పెంచటమే..
2.18. मुस्कुराया करो, इसीलिए
नहीं कि आपके पास मुस्कुराने का कारण है..
इसलिए क्योंकि, दुनिया को रत्ती
भर फर्क नहीं पड़ता आपके आंसुओं से..
నవ్వుతూ ఉండండి, మీ దగ్గర నవ్వటానికి కారణం
2.19. कुछ रिश्ते मुनाफ़ा नहीं देते..पर
ज़िन्दगी को अमीर बना देते हैं..!
కొన్ని అనుబంధాలు లాభాలను ఇవ్వవు..
కానీ జీవితాన్ని సుసంపన్నం (ధనవంతంగా) చేస్తాయి..
2.20. अपने खिलाफ बातें, मैं
अक्सर खामोशी से सुनता हूँ..
जवाब देने का हक मैं ने वक्त को दे रखा हैं..
నాకు విరుద్ధంగా వచ్చే మాటలను నేను మౌనంగా వింటాను..
సమాధానం చెప్పే హక్కు నేను కాలానికి విడిచి ఉన్నాను..
2.21. झरनों से मधुर संगीत न सुनाई देता..
अगर राहों में उनके पत्थर न होते..
జలపాతాల సంగీతం మధురంగా వినిపిస్తూ ఉండేది కాదు..
దారిలో (బండ)రాళ్ళు లేకపోయి ఉంటే...
2.22. डुबो देते है कश्ती को उन के ही मांझी..
ये अलग दौर है, यहाँ
तुफानों की ज़रूरत नहीं..
నావలను వాటి నావికులే ముంచేస్తారు..
ఈ కాలమే వేరు, ఇక్కడ తుఫానులతో పనిలేదు..
2.23. हर रोज गिरकर भी, मुकम्मल
खडे हैं..
ऐ जिंदगी देख, हमारे हौसले
तुझसे भी बडें है..
ప్రతిరోజు కింద పడి కూడా పూర్తిగా నిలబడ్డాము..
ఓ జీవితమా, చూడు, మా ధైర్యాలు నీకన్నా పెద్దవి..
2.24. जो आपके पास है, उसकी
क़द्र करें..
यहाँ तो आसमान के पास भी, खुद
की जमीं नहीं है..
మీ వద్ద ఉన్నదాన్ని విలువ ఇచ్చి చూసుకోండి..
ఇక్కడ నింగి వద్ద కూడా తన సొంత నేల లేదు..
2.25. इस दुनिया में जितनी भी अच्छी बातें हैं..
सब कही जा चुकी हैं, अब सिर्फ अमल करना बाकी है..
ఈలోకంలో మంచి మాటలెన్ని ఉన్నాయో
అవన్నీ ఇదివరకే చెప్పేశారు..
కేవలం వాటిని అమలు చేయటమే మిగిలి ఉంది,..
2.26. बड़ी अजीब सी बादशाही है, दोस्तों के प्यार में..
ना उन्होंने कभी कैद में रखा, न हम कभी फरार हो पाए..
చాలా విచిత్రమైన రాజరికం ఉంటుంది స్నేహితుల ప్రేమలో..
వారు ఎన్నడూ నన్ను నిర్బంధించలేదు,
(అయినా కానీ) నేనూ ఎన్నడూ పారిపోలేకపోయాను..
2.27. लोग इन्तज़ार करते रहें कि हमें टूटा हुआ
देखें..
और हम थे कि सहते सहते पत्थर हो गए..
మేము విరిగిపోతే చూడాలని జనాలు ప్రతీక్షిస్తూ ఉండిపోయారు..
మేమేమో భరించి భరించి బండరాయిగా అయిపోయాము..
2.28. लफ्ज़ों के दाँत नहीं होते, पर ये काट लेते हैं..
दीवारें
खड़े किये बगैर बाँट देते हैं..
మాటలకు పళ్ళు ఉండవు..
అయినా కొరుకుతాయి (బాధపెడతాయి)
గోడలు లేపకుండానే విడగొడతాయి..
2.29. जिस दिन मरोगे अपने साथ एक पेड़ भी लेकर
जलोगे..
प्रकृति का जो कर्ज़ है वो तो चूका दो यारों..
जीते जी दो पेड़ तो लगा दो यारों..
చనిపోయిన రోజు నీతో
ఒక చెట్టును (కట్టెలను) కూడా తీసుకుపోతావు
ప్రకృతికి ఉన్న ఋణాన్ని తీర్చుకో, మిత్రమా
బ్రతికి ఉండగా ఓ చెట్టైనా పెట్టు నేస్తమా..
2.30. वक्त की एक आदत बहुत
अच्छी है..जैसा भी हो, गुजर
जाता है..
కాలానికి ఓ మంచి అలవాటు ఉంది..
ఏది ఎట్లా ఉన్నా గడిచిపోతుంది..
2.31. नेक लोगों की संगत से हमेशा भलाई ही मिलती
हे..
क्योंकि, हवा जब फूलों से
गुज़रती है,
तो वो भी खुश्बुदार हो जाती है..
మంచివారి సాంగత్యంలో ఎప్పుడూ మంచే లభిస్తుంది..
ఎందుకంటే గాలి పూవుల మీది నుంచి వీచినప్పుడల్లా
అది కూడా సుగంధితమవుతుంది..
2.32. गुलाबों से किसी ने पूछा कि ये काँटे
तुम्हें सताते तो नहीं..
गुलाबों ने कहा, ये अन्दर
की बातें हम किसी को बताते नहीं..
గులాబీలను ఎవరో అడిగారు- ఈ ముళ్ళు మిమ్మల్ని బాధపెట్టవా,
అని..
గులాబీలు అన్నాయి- ఇవి ఆంతరంగిక విషయాలు, మేము ఎవ్వరితో
చెప్పము, అని..
2.33. एक दिल मेरे दिल को जख़्म दे गया..
एक फूल जो काँटों से भी गहरी चुभन दे गया..
ఒక మనసు నా మనసుకు గాయం చేసింది..
ఒక పువ్వు ముల్లు కన్నా లోతుగా గుచ్చి పోయింది..
2.34. यूँ खाली पलकें झुका देने से नींद नहीं
आती..
सोते वही लोग है जिनके पास किसी की यादें नहीं
होती..
ఊరికే రెప్పలు వాల్చినంత మాత్రాన నిద్ర రాదు..
ఎవరి వద్ద ఎవ్వరి స్మృతులూ ఉండవో, వారే నిద్రపోతారు..
2.35. दोस्त नाराज़ हो गए कितने..
इक ज़रा आइना दिखाने में..
ఎందరు స్నేహితులు కోపం చెందారో..
కాస్త అద్దం చూపించినంతలోనే..
(అద్దం చూపటం అంటే వాస్తవం తెలియచెప్పటం.. అనే
వ్యంగ్యార్థం.. వాళ్ళ ముఖాలు వారికి కనిపించవు.. మనం చూపించామని మన పై కోపం.. వారి
ముఖాలు అట్లా ఉన్నాయని కాదు.. మన వల్ల అవి వాస్తవంగా కనిపంచాయి అని)
2.36. दो गज से ज़रा ज़्यादा जगह देना कब्र में
मुझे..
किसी की याद में करवट बदले बिना मुझे नींद नहीं
आती..
రెండు గజాలకన్నా ఎక్కువ స్థానం ఉంచండి నా సమాధి (బొంద)లో..
ఒకరి స్మరణలో (పక్క మీద) పొర్లనిదే నాకు నిద్ర రాదు..
(కరవట్ - అంటే పక్క మీద పొర్లుడు.
బొంద కాక మంచి పదమేదైనా ఉంటే చెప్పండి)
2.37. जो दिल में शिकवे और ज़ुबान पर शिकायत कम
रखते हैं..
वही हर रिश्ता निभाने का दम रखते हैं..
మనసులో క్షమాభావం, మాటలో షికాయతు లేకుండా ఉండేవారే..
ప్రతి అనుబంధాన్ని నిర్వహించే ధైర్యం (దమ్ము) కలిగి
ఉంటారు..
2.38. एक हसरतें है कि दम भरने नहीं देती..
एक ज़रूरतें है जो ये दम निकलने नहीं देती..
ఒకవైపు కోరికలు ఊపిరి సలపనివ్వవు..
ఒకవైపు అవసరాలు ఊపిరి పోనివ్వవు..
2.39. कैसे करूँ मैं साबित कि तुम याद बहुत आते
हो..
एहसास तुम समझते नहीं, और
अदाएं हमें आती नहीं..
ఎట్లా నిరూపించను నువ్వు బాగా గుర్తుకు వస్తావని..
అనుభూతులు నీకు అర్థం కావు, జిమ్మిక్కులు నాకు
రావు..
2.40. बता किस कोने में, सुखाऊँ
तेरी यादें..
बरसात बाहर भी है, और भीतर
भी है..
చెప్పు, ఏ మూలకు ఎండబెట్టమంటావు నీ గుర్తులను..
వర్షం బయట కూడా పడుతున్నది, లోపల కూడా ఉన్నది..
2.41. न अपनों से खुलता है, न ही गैरों से खुलता है..
ये जन्नत का दरवाज़ा है, मेरी
माँ के पैरो से खुलता है..
తనవారితో తెరుచుకోదు, ఇతరులతో
తెరుచుకోదు..
ఇది స్వర్గపు తలుపు, నా తల్లి పాదాలతో
తెరుచుకుంటుంది..
2.42. दुनिया में सिर्फ दो प्रतिशत लोग धूप में
जलते हैं..
बाकी तो सब एक दूसरे से जलते हैं..
లోకంలో రెండుశాతం మందే ఎండలో కాలుతారు..
మిగిలినవారంతా ఒకరంటే ఒకరు (ఈర్ష్యలతో) కాలుతారు..
2.43. पद सिर्फ एक सम्बोधन देता है..
इज्जत पाने के लिए क़ाबिल होना पड़ता है..
పదవి కేవలం ఒక సంబోధన మాత్రమే ఇస్తుంది..
గౌరవం పొందటానికి అర్హులు కావలసి ఉంటుంది..
2.44. मुझे नींद का शोकीन ज्यादा तो नहीं..
लेकिन तेरे ख्वाब ना देखूँ तो गुज़ारा नहीं
होता..
నాకు నిద్రపోవాలన్న అలవాటు ఎక్కువేం లేదు..
కానీ నీ స్వప్నాలను చూడకపోతే నాకు (జీవితం) గడవదు..
2.45. उसे इंतजार से क्या शिकायत..
जो तेरे इंतजार पे खत्म हो..
ప్రతీక్ష అంటే వాడికి ఏం బాధ ఉంటుంది..
ఎవరి ప్రతీక్ష నీ వద్దకు వచ్చి సంపూర్ణమవుతుందో..
2.46. कैसे हो पायेगी अच्छे इंसान की पहचान..
दोनों ही नकली हो गए हैं आंसू और मुस्कान..
ఇంక మంచి మనిషిని గుర్తించేదెట్లా..
రెండూ నకిలీవే అయ్యాయి.. కన్నీరు, చిరునవ్వు..
2.47. कब तक रहेगी आस ये ख़्वाबों के सितारों
की..
सूखा पडा चमन मेरा चाहत में बहारों की..
కలల తారకల ఆశ ఎప్పటివరకు నిలుస్తుంది?...
వసంతాల కోరికతో నా తోట ఎండిపడి ఉన్నది..
2.48. ख़ामोशी छुपाती है ऐब और हुनर दोनों..
शख़्सियत का अंदाज़ा गुफ़्तगू से होता है..
మౌనం దాస్తుంది, తప్పులు గొప్పలు రెండిటిని..
వ్యక్తిత్వం గురించిన ఊహ పలకరిస్తేనే (సంభాషణతోనే)
వస్తుంది..
2.49. दर्द आवाज़ छीन लेता है…
ख़ामोशी बेवजह नहीं होती..
బాధ/నెప్పి కంఠస్వరాన్ని లాగేసుకుంటుంది..
మౌనం అకారణంగానే చోటు చేసుకోదు..
2.50. तरस जाओगें हमारे लबों से सुनने को एक एक
लफ्ज़..
प्यार की बात तो क्या, हम
शिकायत भी नहीं करेंगे..
ఒక్క పలుకు కూడా నానుంచి వినటానికి తపించిపోతావు..
ప్రేమతో మాట్లాడటం కాదు కదా, కనీసం షికాయితు కూడా
చేయను..
2.51. कितना खुशनुमा होगा वो मेरे इंतज़ार का
मंज़र भी..
जब ठुकराने वाले मुझे फिर से पाने के लिये आँसू
बहायेंगे..
ఎంత ఆనందకరంగా ఉంటుందో, ఆ నా ప్రతీక్షించిన
దృశ్యం కూడా..
నన్ను కాదన్న (వదులుకున్న) వారు మళ్ళీ నన్ను పొందటానికి
కన్నీరు కార్చేవేళ..
2.52. कहते है कब्र मे सुकून की नींद आती है..
अजीब बात है की ये बात जिंदा लोगों ने कही..
బొందలో హాయిగా నిద్ర పడుతుందని అంటారు-..
విచిత్రమేమంటే ఈ మాట బ్రతికి ఉన్నవారు అన్నారు..
2.53. शब्दो में बटोर लू सारे जज़्बात को
यह मुमकिन नहीं रिश्तों के दरमियान
హృదయభావాన్నంతా (వేదననంతా) మాటలలో పోగు చేయటం..
సాధ్యం కాదు అనుబంధాల మధ్యన..
2.54. बहुत ही खूबसूरत होती है एक तरफ़ा
मोहब्बत..
ना ही कोई शिकायत होती है और..
ना ही कोई बेवफ़ा कहलाता है..
చాలా అందంగా ఉంటుంది ఏక పక్షపు ప్రణయం..
ఏ షికాయతూ ఉండదు, ఎవరూ నమ్మకద్రోహి అనిపించుకోడు..
2.55. कैसे भूलेगा वो मेरी बरसों की चाहत को..
दरिया अगर सूख भी जाये तो भी रेत से नमी नहीं
जाती..
ఎట్లా మరపుకు తెచ్చుకుంటాడు, నా సంవత్సరాల
ప్రేమను..
నది ఇంకి(ఎండి)పోయినా ఇసుకలో నుంచి తడి పోదు..
2.56. उसकी यादों ने मुझे पागल बना रखा है,
कहीं मर ना जाऊं कफ़न सिला रखा है..
मेरा दिल निकाल लेना दफ़नाने से पहले,
वो ना दब जाए जिसे दिल मे बसा रखा है..
అతడి/ఆమె స్మరణ నన్ను పిచ్చిగా చేసేస్తున్నది..
చచ్చిపోతానేమోనని శవవస్త్రం కుట్టించుకున్నాను..
బొందపెట్టే ముందు నా గుండెను బయటకు తీసేయండి..
లేదా, గుండెల్లో దాచుకున్నవారు ఒత్తుకుని (నొక్కుకుని) పోవచ్చు..
లేదా గుండెల్లో దాచుకున్నవారికి ఊపిరి ఆడకపోవచ్చు..
2.57. अब मौत से कह दो कि नाराज़गी खत्म कर ले..
वो बदल गया है जिसके लिए हम ज़िंदा थे..
ఇక మృత్యువుకు చెప్పండి, అలక మానెయ్యమని..
ఎవరికోసం నేను జీవించి ఉన్నానో, వారు మారిపోయారు..
2.58. यूँ तो हादसों में गुजरी है हमारी
ज़िंदगी..
हादसा ये भी कम नहीं कि हमें मौत ना मिली..
జీవితం చాలా (ప్రమాదకర)సంఘటనలతో గడవటం అయితే ఉన్నదే..
చావు దొరకలేదు నాకు, ఈ సంఘటన కూడా ఏం
తక్కువ కాదు..
2.59. लोग कहते है चाँद का टुकड़ा तुम्हें..
पर मैं कहता हूँ चाँद भी टुकड़ा है तुम्हारा..
జనాలంటారు, నీవు చందమామలో ఓ అంశభాగానివని (ముక్క)..
నేనంటాను, చందమామ కూడా నీలో అంశభాగమేనని..
2.60. कलम के कीड़े हैं हम जब भी मचलते हैं..
खुरदुरे कागज पे रेशमी ख़्वाब बुनते हैं..
లేఖని పురుగులం మేము, ఎప్పుడు అల్లరి
చేసినా..
గరుకైన కాగితం పై (జరీ)పట్టు కలలను అల్లుతాము..
2.61. सामान बाँध लिया है मैंने भी अब बताओ
दोस्त..
वो लोग कहाँ रहते है जो कहीं के नहीं रहते..
సామాన్లు సర్దుకున్నాను నేను కూడా, ఇక చెప్పు నేస్తమా..
ఎక్కడివారూ కానివారు (ఎవరికి చెందనివారు) ఎక్కడ ఉంటారో..
2.62. ज़ब्त कहता है ख़ामोशी से बसर हो जाये..
दर्द की ज़िद है कि दुनिया को खबर हो जाये..
స్వాధీనత్వం అంటుంది, మౌనంగా గడిపేద్దాం
అని..
బాధ జిద్దు చేస్తుంది, ప్రపంచానికి
తెలిసిపోవాలని..
2.63. हम ख़ामोशी से देते हैं ख़ामोशी का जवाब..
कौन कहता हैं अब हम बात नहीं करते..
మేము మౌనానికి మౌనంతో సమాధానం చెప్తాము..
ఎవరన్నారు, మేమిప్పుడు మాట్లాడటం మానేశామని..
(తిప్పి చెప్పితే- ఎవరన్నారు మేము మాట్లాడుకోవట్లేదని?
మౌనానికి
జవాబు మౌనంగా ఇస్తున్నాను కదా? --శ్రీ.వూ)
2.64. उदास हो जाने की वजह तो हजारों हैं..
मगर खुश होने को उसका एक ख़्याल ही काफ़ी है..
బాధపడటానికి కారణాలు (పది)వేలు ఉన్నాయి..
కానీ సంతోషపడటానికి అతడి స్మరణ ఒక్కటి చాలు..
2.65. खुदकुशी हराम है साहब..
मेरी मानो तो इश्क़ कर लो..
ఆత్మహత్య మహాపాపం సుమండీ..
నా మాట విని, ప్రేమించండి..
2.66. ना जाने मेरी मौत कैसी होगी..
पर ये तो तय है तेरी बेवफाई से बेहतर होगी..
నా మరణం ఎట్లా ఉంటుందో, ఏమో..
కానీ ఒకటి నిశ్చితం, నీ విశ్వాసఘాతం
కన్నా నయంగానే ఉంటుంది..
2.67. उनको लगता है उनकी गलतियाँ हमें नज़र नहीं
आती..
हम ख़ामोशी से देखते है उन्हें अपनी नजरों से
गिरते हुए..
తన తప్పులు నాకు కనిపించవు అని తనకు అనిపిస్తుంది..
నేను మౌనంగా చూస్తాను, తను తన చూపుల్లోనే
దిగజారిపోవటం..
2.68. उम्र भर यही गलती करते रहे ग़ालिब..
धूल चेहरे पर थी और हम आयना साफ करते रहे..
జీవితమంతా ఇదే తప్పు చేస్తుండిపోయాను గాలిబ్..
దుమ్ము ముఖం పై ఉంది, నేను అద్దం
తుడుస్తుండిపోయాను..
2.69. उनसे बिछड़े तो मालूम हुआ मौत क्या चीज़
है..
ज़िन्दगी वो थी जो हम उनकी महफ़िल में गुज़ार आए..
తననుంచి విడిపోయాక తెలిసింది, చావంటే ఏంటో..
తన సాంగత్యంలో గడిపి వచ్చానే, అది జీవితం అంటే..
2.70. कई शाम गुज़र गई, कई
राते गुज़र गई..
ना गुज़रा तो सिर्फ एक लम्हा, वो तेरे इंतज़ार का..
చాలా సాయింత్రాలు గడిచాయి, చాలా రాత్రులు
గడిచాయి..
గడవనిది ఒకే క్షణం, నీ ప్రతీక్షది..
2.71. गर यक़ीन न हो तो बिछड़ कर देख लो..
तुम मिलोगे सबसे मगर हमारी ही तलाश में..
నమ్మకం లేదంటే విడిపోయి (ప్రయత్నించి) చూసుకో..
నువ్వు అందరిని కలుస్తావు, కానీ నన్ను
వెతుకులాడతావు.. (నా అన్వేషణలో)
2.72. एहसान किया है आपने मुझ बदनसीब पर..
दिल को जो दर्द के काबिल बना दिया..
ఈ దౌర్భాగ్యునికి తమరు చాలా ఉపకారం చేశారు..
గుండెను నెప్పికి (భరించేందుకు) యోగ్యంగా చేసారు..
2.73. शिकवे मुझे भी जिंदगी से है, साहब..
पर मौज में जीना है, इसलिए
शिकायते नहीं करता..
జీవితంతో షికాయతులు నాకూ ఉన్నాయి సుమండీ..
కానీ ఉల్లాసంగా బ్రతకాలి కనుక షికాయతు చేయను..
2.74. अहसान दोनों का ही था, मकान पर..
छत ने जता दिया, नींव ने
छुपा लिया..
ఇంటి మీద ఉపకారం రెండిటిదీ ఉంది..
పైకప్పు ప్రదర్శించింది, పునాది దాచుకుంది..
2.75. मोहब्बत और मौत दोनों बिन बुलाए मेहमान
होते है..
कब आजाए कोई नहीं जानता..
लेकिन दोनों का एक ही काम है
एक को दिल चाहिए दुसरी को धड़कन..
ప్రేమ, మృత్యువు రెండూ పిలవకుండా వచ్చే అతిథులే..
ఎప్పుడు వస్తాయో ఎవ్వరికీ తెలియదు..
కానీ రెండిటిదీ ఒకటే పని..
ఒకదానికి హృదయం కావాలి, రెండవదానికి
హృదయస్పందన కావాలి..
2.76. हमसे ना पूछो हमारे महबूब की सादगी..
नज़रे भी हम पर थी और परदा भी हमी से था..
నన్ను అడగవద్దు నా ప్రియురాలి అమాయకత్వం గురించి..
చూపులూ నా మీదే, ముసుగు కూడా నా నుంచే..
2.77. खोए हुए तो हम खुद है ,
और देखो ना हम ढूंढने तुम्हें निकले है..
పోగొట్టుకున్నది (నన్ను) నేను..
కానీ చూడు, బయల్దేరింది నిన్ను వెతకటానికి
2.78. तुमसे ही रूठ कर तुम्ही को याद करते हैं..
हमे तो ठीक से नाराज़ होना भी नही आता..
నీ మీద అలిగి నిన్నే స్మరిస్తాను..
నాకు సరిగ్గా అలగటం కూడా రాదు..
2.79. फिर नींद से जाग कर इधर उधर ढूँढता हूँ
तुम्हें..
क्यूँ के ख्वाब में इतने क़रीब चले आते हो तुम..
మళ్ళీ నిద్ర నుంచి మేల్కొని అటూ ఇటూ వెతుకుతా నిన్ను..
కలలో అంత దగ్గరగా వచ్చేస్తావు నువ్వు..
2.80. काग़ज़ पे तो अदालते चलती है..
हमें तो तेरी आँखो के फ़ैसले मंज़ूर है..
కాగితాల మీద న్యాయాలయాలు నడుస్తాయి..
నాకు నీ కన్నుల నిర్ణయాలు అంగీకారాలు..
2.81. वो कहते है मत रो तुम्हरा दर्द
Waste होता है..मैं ने भी कहा
पगले, मेरा दर्द तो हर
ग्रूप में copy paste होता है..
వారంటారు, ఏడవకు, నీ ఆవేదన వేస్ట్ అవుతుంది అని..
నేనన్నాను, వెర్రివాడా, నా ఆవేదన ప్రతి గ్రూపులో కాపీ పేస్ట్ అవుతుంది అని..
2.82. मिज़ाज में थोड़ी सख़्ती लाज़िमी है
हुज़ूर..
लोग पी जाते समंदर अगर खारा नहीं होता..
స్వభావంలో కాస్త కటుత్వం కూడా అనివార్యమండీ..
సముద్రమే కనుక క్షారం కాకపోయి ఉంటే, జనాలు మింగేసేవారు..
(తాగేసేవారు)
2.83. लोग कहते हैं की पागल
का कोई भरोसा नहीं..
जनाब, कोई ये नहीं समझता
की भरोसे ने ही उसे पागल किया है..
జనాలంటారు, పిచ్చివాడి విషయంలో ఏదీ నమ్మలేమని..
అయ్యా, ఆ నమ్మకమే వాడిని పిచ్చివాడిని చేసిందని ఎవ్వరూ
తెలుసుకోరు..
2.84. न हथियार से मिलती है, न अधिकार से मिलती है..
दिलो में जगह साहेब, अपने
व्यवहार से मिलती है..
ఆయుధంతో దొరకదు, అధికారంతో దొరకదు..
ఇది మనసులో చోటండీ బాబూ, మన వ్యవహారంచేతే
దొరుకుతుంది..
2.85. तुम हमे जान पाओ तुम्हे इतनी फ़ुर्सत कहाँ
थी..
और हम तुम्हे भुला पाते इतनी हममे जुर्रत कहा
थी..
నీవు నన్ను అర్థం చేసుకోగలిగేంత తీరిక నీకేది..
నేను నిన్ను మర్చిపోగలిగేంత సాహసం నాలో ఏది..
2.86. एक ही समझने वाली थी मुझे..
अब वो भी समझदार हो गई..
నన్ను తెలుసుకునే (అర్థం చేసుకునే) వ్యక్తి ఒక్కతే ఉండేది..
ఇప్పుడు ఆమె కూడా తెలివిగలదై పోయింది..
2.87. ज़रा सी फुर्सत निकाल कर हमारा क़त्ल ही
कर दो..
यूँ तेरे इन्तजार में तड़प-तड़प के मरना हमसे
नहीं होता..
కాస్త తీరిక చేసుకుని వచ్చి నన్ను హత్య చేసేసేయరాదా..
నీకై ఎదురుచూస్తూ కొట్టుకుని చావటం నా వల్ల కావటం లేదు..
2.88. अगर एहसास बयाँ हो जाते लफ्जों से..
तो फिर कौन करता तारीफ़ ख़ामोशियों की..
అనుభావాలు మాటలతో వ్యక్తమయిపోగలిగి ఉంటే..
నిశ్శబ్దాల ప్రశంస ఎవరు చేసేవారు?..
2.89. तुम बदलो तो मजबूरियां हैं बहुत..
हम बदले तो बेवफा हो गये..
నువ్వు మారితే ఎంతో నిస్సహాయత అట..
నేను మారితే నమ్మకద్రోహినైనానే.. (దగాకోరు, కృతఘ్నుడు)
2.90. ये जो आपके बिखरे हुए बाल है..
बिल्कुल वैसा ही हमारे दिल का हाल है..
నీ ఈ విరబోసిన కురులు ఉన్నాయి కదా..
సరిగ్గా అట్లాగే నా మనసు పరిస్థితి ఉన్నది..
2.91. देखके देख लिया अपनो में सभी बेगानों को
मत ही पूछा करो दिलजलों के अफ़सानों को..
सबक सीख
लिया, तजुर्बा भी बहुत पाया है
आँधियां क्या हैं जब झेल लिया तूफानों को..
నావారిలో ఉన్న పరాయివారిని అందరినీ చూసేసుకున్నాను..
అసలు అడగవద్దు, మనసు కాలినవారి వృత్తాంతాలను..
చాలా పాఠాలు నేర్చాను, ఎంతో అనుభవాన్నీ
పొందాను..
తుఫానులనే తట్టుకున్నాను, సుడిగాలలు ఒక లెక్ఖా??..
2.92. टूट कर चाहना और फिर टूट जाना..
बात छोटी है मगर जान निकल जाती है..
విరిగిపోయాక ప్రేమించటం, మరోసారి
విరిగపోవటం..
చిన్నవిషయమే, కానీ ప్రాణాలు పోతాయి..
2.93. रात की गहराई आँखों में उतर आई
कुछ ख्वाब थे और कुछ मेरी तन्हाई
ये जो पलकों से बह रहे हैं हल्के हल्के
कुछ तो मजबूरी थी कुछ तेरी बेवफाई.
రేయిలోని లోతులు కన్నులలోకి కరిగాయి..
కొన్నేమో నా కలలు, మరి కొంత నా ఒంటరితనం..
ఈ కనురెప్పల నుండి నెమ్మదిగా జాలువారుతున్నవే..
అది కొంత నా నిస్సహాయత, కొంత నీ
విశ్వాసఘాతము..
2.94. तुम चाहो तो मेरा सब कुछ ले लो..
बस खुद को मेरे नसीब में लिख दो..
నువ్వు కావాలంటే నా సర్వస్వం తీసేసుకో..
కానీ నిన్ను నువ్వు నా భాగ్యంలో వ్రాసేసుకో..
2.95. यूँ चेहरे पर उदासी ना ओढिये साहब..
वक़्त ज़रूर तकलीफ का है..
लेकिन कटेगा मुस्कुराने से ही..
అట్లా ముఖం పై బాధ కప్పుకోకండి..
సమయం కష్టమయమైనదే..
కానీ గడిచేది చిరునవ్వుతోనే..
2.96. शायरियों से बुरा लगे तो बता देना
दोस्तों..
मोहबब्त बाँटने के लिए लिखती हूँ, इश्क करने के लिए नहीं..
కవితలు నచ్చకపోతే చెప్పేసేయండి మిత్రులారా..
ప్రేమను పంచుకుందామని వ్రాస్తాను, ప్రేమవ్యవహారాలు
నడపాలని కాదు..
2.97. न माँझी, न रहबर,
न हक में हवाएँ
है कश्ती भी जर्जर, ये
कैसा सफ़र है..
अलग ही मज़ा है फ़कीरी का अपना
न पाने की चिंता न खोने का डर है..
నావికుడు లేడు, మార్గదర్శకుడు లేడు
నావ జర్జరమైంది, ఏం పయనం ఇది..
పేదరికంలో కూడా వింతైన సంతోషం..
పొందాలనే చింత లేదు, పోగొట్టుకుంటామనే
బాధ లేదు..
2.98. कितने कमाल की होती है ना दोस्ती..
वजन होता है लेकिन बोझ नहीं होती..
ఎంత అద్భుతమైనదో కదా స్నేహం..
బరువు ఉంటుంది, కానీ భారం కాదు..
2.99. सीख ली जिसने अदा गम में मुस्कुराने की..
उसे क्या मिटायेंगी गर्दिशे जमाने की..
బాధలో నవ్వగలిగే కళ నేర్చుకున్నవాడిని..
సమాజపు సుడిగుండాలు ఏం రూపుమాపుతాయి?..
2.100. उम्मीद वक्त का सबसे बड़ा सहारा है.
जो हौंसला हो तो मौजों में भी किनारा है..
కాలంయొక్క చాలా పెద్ద సహకారం ఆశ..
ధైర్యం ఉంటే తరంగాలలో కూడా తీరమున్నది..
2.101. तुझ से ही था वज़ूद मेरा..
अब कहीं लापता सा हूँ मैं...
నీతోనే ముడిపడినది నా అస్తిత్వం..
ప్రస్తుతం అదృశ్యం (కనిపించుట లేదు) అన్నట్టు ఉన్నాను
నేను..
2.102. जो कभी आ ही नहीं पाया..
इंतज़ार उस का ही रहता है..
ఎవరైతే ఎప్పుడూ రాలేకపోయారో..
ప్రతీక్ష వారి గురించే ఉంటుంది..
2.103. बहुत दिन हुए हम तीनों साथ नहीं मिले..
तुम, मैं और वक़्त..
చాలా కాలంగా మనం ముగ్గురం కలవలేదు..
నువ్వూ, నేనూ, సమయం..
2.104. मुश्किल से कह दो, उलझा
ना करें हम से..
हमें हर हालात में जीने का हुनर आता है..
కష్టానికి (పోయి కాస్త) చెప్పండి, మాతో
పెట్టుకోవద్దని..
మాకు ప్రతీ పరిస్థితిలో జీవించే కళ తెలుసు..
2.105. याद रखना ही मोहब्बत में नहीं है सब
कुछ..
भूल जाना भी बड़ी बात हुआ करती है..
జ్ఞాపకం పెట్టుకోవటమే ప్రేమలో సర్వస్వం కాదు.
మర్చిపోగలగటం కూడా చాలా పెద్ద విషయం..
2.106. लोग कहते है कि पत्थर-दिल रोया नहीं
करते..
फिर पहाड़ों से ही झरने क्यूँ बहा करते है?..
జనాలంటారు, రాతిగుండెలు ఏడవవని..
మరి కొండరాళ్లలో నుండి జలపాతాలెట్లా వస్తున్నాయో..
2.107. वो पिला कर जाम लबों से अपनी मोहब्बत
का..
अब कहते हैं नशे की आदत अच्छी नहीं होती..
వారు తమ పెదవులతో ప్రేమ అనే మద్యాన్ని తాగించి..
ఇప్పుడు అంటున్నారు, మత్తు సేవించటం మంచిది
కాదని..
2.108. हम ने रोती हुई आँखों को हसाया है सदा..
इस से बेहतर इबादत तो नहीं होगी हमसे..
మేము రోదించే కన్నులకు చిరునగవులు అందించాము..
ఇంతకన్నా గొప్ప ఆరాధన మా వల్ల కాదు..
2.109. इतनी दिलक़श आँखें होने का, ये मतलब तो नहीं..
कि, जिसे देखो, उसे दिवाना कर दो..
ఇంత ఆకర్షకమైన కళ్ళు ఉన్నాయి అంటే, దాని అర్థం..
చూసిన ప్రతివారిని
విక్షిప్తులను (పిచ్చివారిని) చేయాలని కాదు కదా..
2.110. वो पिला कर जाम लबों से अपनी मोहब्बत
का..
अब कहते हैं नशे की आदत अच्छी नहीं होती..
వారు తమ పెదవులతో ప్రేమ అనే మద్యాన్ని తాగించి..
ఇప్పుడు అంటున్నారు, మత్తు సేవించటం
మంచిది కాదని..
2.111. मोहब्बत हमारी भी बहुत असर रखती है..
बहुत याद आयेंगे जरा भूल के तो देखो..
మా ప్రేమ కూడా చాలా ప్రభావం కలిగి ఉంటుంది..
చాలా గుర్తుకు వస్తాము, కాస్త మర్చిపోయి
అయితే చూడు..
2.112. नफ़रत के बाज़ार में मोहब्बत बेचते है..
कीमत में सिर्फ और सिर्फ दुआ ही लेते है..
ద్వేషపు విపణిలో (బజారులో) ప్రేమను అమ్ముతాము..
ప్రతిగా కేవలం ప్రార్థన మాత్రమే తీసుకుంటాము..
2.113. अजीब सा हाल है कुछ इन दिनों तबियत का..
ख़ुशी ख़ुशी नहीं लगती और ग़म बुरा नही लगता..
చాలా వింతైన పరిస్థితి ఈ మధ్య ఆరోగ్యానిది..
సంతోషం సంతోషంగా అనిపించదు, బాధ కూడా చెడుగా
అనిపించదు..
2.114. खुशनसीब कुछ ऐसे हो जाये..
तुम हो हम हो और इश्क हो जाये..
ఏదో ఇట్లా అదృష్టవంతులం అయిపోవాలి..
నువ్వున్నావు, నేనున్నాను, ప్రేమ కలగాలి..
2.115. जो उनकी आँखों से बयां होते हैं..
वो लफ्ज़ शायरी में कहाँ होते हैं..
వారి కన్నుల నుండి ఏది వ్యక్తమవుతుందో..
అది కవిత్వంలో ఎక్కడిది?..
2.116. परवाह नहीं अगर ये जमाना खफ़ा रहे..
बस इतनी सी दुआ है, दोस्त
मेहरबां रहे।
లోకం కోపంగా ఉన్నా ఫరవాలేదులే..
స్నేహితులు దయ చూస్తే చాలు, అని ప్రార్థన..
No comments:
Post a Comment