Monday, 11 September 2017

షేరోం కా షోర్- 5 (शेरों का शोर) (ఉర్దూ షేర్ లకు తెలుగు అనువాదం)

5.1. इस बात का एहसास किसी पर ना होने देना..
के तेरी चाहतों से चलती है मेरी साँसें..
ఈ అనుభవం ఎన్నడూ ఎవ్వరికీ పొక్కనివ్వకూడదు..
తన ప్రేమతోనే మన ఊపిరి సాగుతున్నదని..

5.2. तेरे ज़ुल्म तय है और हमारी बर्दाश्त ज़ाहिर है..
तुम अपने फ़न में माहिर हो हम अपने फ़न में माहिर है..
నీ అన్యాయాలు (అఘాయిత్యాలు) నిశ్చితమైనవే, నా ఓర్పూ కనిపిస్తున్నదే..
నీవు నీ కళలో ఆరితేరావు, నేను నా కళలో ఆరితేరాను..

5.3. शौंक़ नहीं है मुझे अपने जज़्बातों को यूँ सरेआम लिखने का..
मग़र क्या करूँ, अब ज़रिया ही ये है, तुझसे बात करने का..
నా భావాలను ఇట్లా బాహాటంగా వ్రాసే మోజు నాకేం లేదు..
కానీ ఏం చేసేది? నీతో మాట్లాడేందుకు మిగిలిన మార్గం ఇదొక్కటే కదా..

5.4. साथ ना रहने से रिश्ते टूटा नहीं करते..
वक़्त की धुंध से लम्हे टूटा नहीं करते..
लोग कहते हैं कि मेरा सपना टूट गया..
टूटी नींद है, सपने टूटा नहीं करते
కలిసి ఉండనంత మాత్రాన అనుబంధాలు విరిగిపోవు..
కాలపు పొగమంచులో పడి ఘడియలు విరిగిపోవు..
జనాలంటారు నా కల చెదిరిపోయిందని..
చెదిరింది నిద్రే.. కలలు ఎన్నడూ విరిగిపోవు..

5.5. छोड़ तो सकता हूँ, मग़र छोड़ नहीं पाता उसे..
वो शख़्स मेरी बिगड़ी हुई आदत की तरह है..
వదలగలను, కానీ తనను వదలలేకపోతాను..
ఆ వ్యక్తి నా దురలవాటు వంటివారు..

5.6. दर्द बनकर ही रह जाओ हमारे साथ..
सुना है दर्द बहुत वक़्त तक साथ रहता है..
పోనీ, వేదనగానే ఉండిపో నాతో..
వేదన చాలా కాలంపాటు తోడుంటుంది అని విన్నాను..

5.7. कहाँ मिलेगा तुम्हे मुझ जैसा कोई..
जो तुम्हारे सितम भी सहे, और तुमसे मोहब्बत भी करे..
ఎక్కడ దొరుకుతారు నీకు నావంటి వారువరైనా?..
నీ అఘాయిత్యాలూ సహించి నిన్ను ప్రేమించేవారు?..

5.8. तेरे होने तक मैं कुछ ना था..
तेरा हुआ तो मैं बर्बाद हो गया..
నీకు చెందనంతవరకు నేనేమీ కాను..
నీకు చెందాక నాశనం అయిపోయాను..

5.9. जिनके दिल पे चोट लगती है ना दोस्तों..
वो आंखों से नहीं दिल से रोते है..
ఎవరి మనసుకు దెబ్బ తాకుతుందో..
వారు కళ్ళతో కాదు, మనసుతో ఏడుస్తారు..

5.10. ये आँखें हैं जो तुम्हारी, किसी ग़ज़ल की तरह खूबसूरत हैं..
कोई पढ़ ले इन्हें अगर इक दफ़ा, तो शायर हो जाए..
ఈ నీ కన్నులు ఒక గజల్ వలె అందంగా ఉన్నాయి..
ఎవరైనా వీటిని ఒక్కసారి చదివితే చాలు, కవి అయిపోతారు..

5.11. तू मुझमें पहले भी था, तू मुझमें अब भी है..
पहले मेरे लफ्जों में था, अब मेरी खामोशियों में है..
నీవు నాలో ముందూ ఉన్నావు, ఇప్పుడూ ఉన్నావు
మొదలు నా మాటల్లో ఉన్నావు, ఇప్పుడు నా మౌనాల్లో ఉన్నావు..

5.12. शाम ढले ये सोच के बैठे हम तेरी तस्वीर के पास..
सारी ग़ज़लें बैठी होंगी अपने-अपने मीर के पास..
సాయింత్రం కాంగనే నేను నీ ఛాయాచిత్రం వద్ద ఏమనుకుని కూర్చున్నానంటే..
అన్ని కవితలు తమ తమ లేఖకుల వద్ద కూర్చుని ఉండవచ్చు కదా అని..

5.13. ग़ालिब ने भी क्या खूब लिखा है..
दोस्तों के साथ जी लेने का मौक़ा दे दे..
 ऐ खुदा, तेरे साथ तो मरने के बाद भी रह लेंगें..
గాలిబ్ కూడా భలే మాట వ్రాశాడు..
స్నేహితులతో జీవించే అవకాశం ఇవ్వు..
 ఓ భగవంతుడా, నీతో నేను నా మృత్యువు తరువాత కూడా ఉండగలను..

5.14. मोहब्बत करने चला है, तो कुछ अदब भी सीख लेना ऐ दोस्त..
इसमें हंसते साथ हैं, पर रोना अकेले ही पड़ता है..
ప్రేమించటానికి బయలుదేరావు, కొన్ని పద్ధతులు కూడా తెలుసుకో నేస్తమా..
ఇందులో నవ్వగలిగేది కలిసే, కానీ ఏడవవలసింది మాత్రం ఒంటరిగానే..

5.15. अकेले हम बूँद हैं..
 मिल जाएं तो सागर हैं
अकेले हम धागा हैं..
 मिल जाएं तो चादर हैं
अकेले हम कागज हैं..
 मिल जाए तो किताब हैं..
ఒంటరిగా మనం బిందువులం..
కలిస్తే సింధువు అవుతాం..
ఒంటరిగా మనం దారాలం..
కలిస్తే దుప్పటి అవుతాం..
ఒంటరిగా మనం కాగితాలం..
కలిస్తే పుస్తకం అవుతాం..

5.16. किसी उदास मौसम में..
मेरी आँखों पे वो हाथ रख दे अपना..
और हँसती हुई कह दे..
पहचान लो तो हम तुम्हारे
ना पहचानो तो तुम हुमारे..
మనసు బరువుగా ఉన్నవేళ..
తను నా కళ్ళను తన చేతులతో కప్పేసి..
నవ్వుతూ అంటే బాగుండిట్లా..
నేనెవరో గుర్తు పడితే నేను నీకు చెందుతాను..
గుర్తు పట్టకపోతే నువ్వు నాకు చెందుతావు..

5.17. कभी आकर देखना मेरे दिल में..
कि कितनी फ़ुर्सत से टूटा है आशियाना मेरा..
ఎప్పుడైనా వచ్చి నా మనసులోకి తొంగి చూడు..
ఎంత తీరికగా విరిగి(చెదిరి)పోయిందో నా గూడు..

5.18. ख़ैर, कुछ तो किया उसने..
चलो, तबाह ही सही..
కానీలే, (నన్ను) ఏదో ఒకటి చేశారు..
నాశనమే అయినా కానీ..

5.19. ये जो तुम्हारी याद है ना..
बस एक यही मेरी जायदाद है..
ఈ నీ జ్ఞాపకం ఉన్నదే..
అదొక్కటే కదా నా ఆస్తి..

5.20. वही किस्सा वही तेरी बेरुखी और वही तुम..
एक ही एहसास हम कितनी बार लिखें?..
అదే కథ, అదే నీ అనాసక్తత, అదే నీవు..
ఒకే అనుభూతిని ఎన్ని సార్లు వ్రాయను?..

5.21. ज़िन्दगी भी आजकल जुदा जुदा सी लगती है..
साँस भी लूँ तो कम्बख़्त जख़्मों को हवा लगती है..
ఈ మధ్య జీవితం చేయి వీగినట్లుగా ఉంది..
శ్వాస తీసుకున్నా పాపం, గాయాలకు గాలి తగులుతున్నది..

5.22. उदास रातें, तन्हाई, अंधेरा, यादों की बैचेनी..
मुझे हर रोज़ यह सब सौंप कर सूरज डूब जाता है..
బాధాకరమైన రాత్రులు, ఒంటరితనం, చీకటి, జ్ఞాపకాల ఆదుర్దా..
నాకు ప్రతి రోజు వీటిని ఇచ్చి పొద్దు గుంకుతుంది..

5.23. वजह कुछ और थी, कुछ और ही बताते रहे..
अपने थे इसलिये, कुछ ज़्यादा ही सताते रहे..
కారణం ఒకటయితే, మరేదో చెప్తున్నారు..
మనవారే కదా అని కాస్త ఎక్కువగానే ఏడిపిస్తున్నారు..

5.24. खिलौना बन गयी हूँ उसके हाथों की..
रूठता वो है टूटती मैं हूँ..
తన చేతిలో ఆటబొమ్మనైపోయాను..
అలిగేది తను, విరిగేది నేను..

5.25. बहुत दिनों बाद उसे देखा..
दिल नहीं भरा, पर आँखें भर आईं..
చాలా కాలానికి తనను చూశాను..
మనసు నిండలేదు కానీ కన్నులు నిండి వచ్చాయి..

5.26. इतना भी दर्द ना दे ज़िन्दगी..
इश्क़ ही किया था कोई क़तल नहीं..
మరీ ఇంత బాధ పెట్టకే జీవితమా..
హత్య చేయలేదు, ప్రేమించాను..

5.27. आँसू वो ख़ामोश दुआएँ है..
जो सिर्फ़ रब्ब ही सुन सकता है..
కన్నీరు ఏ మౌన ప్రార్థనలంటే..
అవి భగవంతుడికి మాత్రమే వినిపిస్తాయి..

5.28. वादों से बंधी ज़ंजीर थी जो तोड़ दी मैं ने..
अब से जल्दी सोया करेंगे, मोहब्बत छोड़ दी मैं ने..
వాగ్దానాలతో కట్టిపడేసిన గొలుసులు తెంచేశాను నేను..
ఇక త్వరగా పడుకుంటాను, ప్రేమించటం మానివేశాను నేను..

5.29. हैरान हूँ मैं तुम्हारी हसरतों पर..
तुमने सब कुछ माँगा मुझसे, बस मुझे छोड़ कर..
ఆశ్చర్యపోతున్నాను నీ కోరికలు చూసి..
అన్నీ అడిగావు నానుంచి, ఒక్క నన్ను తప్ప..

5.30. कितना कुछ जानता होगा वो शख्स मेरे बारे में..
मेरे मुस्कुराने पर भी जिसने पूछ लिया की तुम उदास क्यों हो..
ఆ వ్యక్తి నాగురించి ఎంతగా ఎరుగునో కదా..
నేను చిరునవ్వు నవ్వినా, ఎందుకు బరువుగా ఉన్నావని అడిగేవారు..

5.31. मेरी ख़ामोशी में सन्नाटा भी है शोर भी..
तू ने देखा ही नहीं, मेरी आँखों में कुछ और भी है..
నా మౌనంలో నిశ్శబ్దం కూడా ఉంది, కోలాహలం కూడా ఉంది..
నీవు చూడనే లేదు, నా కళ్ళలో ఇంకేదో కూడా ఉంది..

5.32. ना जाने कितनी ख़्वाइशें दफ़न है इस दिल में..
कैसे दफ़नाओगे एक क़ब्रिस्तान को एक क़ब्र में..
ఎన్ని కోరికలు పాతిపెట్టబడి ఉన్నాయో ఈ గుండెలో..
ఒక సమాధిలో శ్మశానం మొత్తాన్ని ఎట్లా పాతిపెట్టగలవు?..

5.33. अजीब ज़ुल्म करती हैं तेरी यादें मुझ पर..
सो जाऊँ तो उठा देती हैं, जाग जाऊँ तो रुला देती हैं..
విచిత్రమైన అఘాయిత్యం చేస్తాయి నీ జ్ఞాపకాలు నామీద..
పడుకుంటే నిద్రలేపుతాయి, మేలుకుని ఉంటే ఏడిపిస్తాయి..

5.34. बहुत से रिश्ते इसलिए ख़त्म हो जाते है..
क्यूँ कि एक सही बोल नहीं पाता, दूसरा सही समझ नहीं पाता..
చాలా అనుబంధాలు ఈ కారణంగానే అంతమౌతాయి..
ఒకరు సరిగ్గా చెప్పలేకపోతారు, ఒకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు..

5.35. बरबाद कर देती है मोहब्बत हर मोहब्बत करने वालों को..
 क्यूं कि इश्क़ हार नहीं मानता, और दिल बात नहीं मानता..
ప్రేమించిన ప్రతి మనిషిని ప్రేమ నాశనం చేసేస్తుంది..
ప్రణయం ఓటమిని ఒప్పుకోదు, హృదయం (మన) మాటను ఒప్పుకోదు..

5.36. घाटे और मुनाफ़े का बाज़ार नहीं..
इश्क़ एक इबादत है, कारोबार नहीं..
లాభనష్టాల బజారు కాదు..
ప్రేమ ఒక ఆరాధన, వ్యాపారం కాదు..

5.37. लफ्ज़, अल्फ़ाज़, कागज़, किताब..
कहाँ कहाँ रखे हम तुम्हारी यादों का हिसाब..
వాక్యాలు, మాటలు, కాగితాలు, పుస్తకాలు..
ఎక్కడెక్కడ పెట్టుకోను నీ జ్ఞాపకాల లెక్కలు?..

5.38. अक्सर ठहर कर देखता हूँ मैं अपने पैरो के निशान..
वो भी अधूरे लगते है तेरे साथ के बिना..
ఎన్నోసార్లు ఆగి చూసుకుంటాను నా పాదాల చిహ్నాలను..
నీ తోడు లేక అవీ అపూర్ణంగా అనిపిస్తాయి..

5.39. कहते हैं बिना मेहनत के कुछ नहीं मिलता..
पता नहीं इतने ग़म पाने के लिए मैंने कौन सी मेहनत की थी..
కష్టపడకుండా ఏదీ దొరకదంటారు..
మరి నేను ఇంత బాధలను పొందటానికి ఏం శ్రమపడ్డానో తెలియదు..

5.40. हिसाब बराबर रहा चलो कोई ग़म नहीं..
हमारे पास तुम नहीं तुम्हारे पास हम नहीं..
లెక్క సక్రమంగానే నడుస్తున్నది, బాధేం లేదు..
నా వద్ద నీవు లేవు, నీ వద్ద నేను లేను..

5.41. तज़ुर्बा है मेरा, मिट्टी की पकड़ मजबूत होती है..
संगमरमर पर तो हमने पाँव फिसलते देखे हैं..
నా అనుభవం, మట్టి పట్టు గట్టిగా ఉంటుంది..
పాలరాయి మీద కాలు జారటమే చూశాను నేను..

5.42. खुद को‌ खुद से खोने लगा हूँ..
फिर से किसी का नाम‌ अपने नाम‌ के साथ जोड़ने चला हूँ..
నన్ను నేను పోగొట్టుకుంటున్నాను..
మరోసారి ఒకరి పేరుతో నా పేరును జోడించటానికి బయలుదేరాను..
(బుద్ధిహీనతకు పరాకాష్ఠ కదా?)

5.43. लोग भी बड़े अजीब होते है..
ग़लत साबित होने से पहले माफ़ी नहीं मांगते..
बल्कि तालुक तोड़ देते है.
జనాలు కూడా భలే విచిత్రంగా ఉంటారు..
తమ తప్పు నిరూపణమయ్యే ముందే క్షమార్పణ కోరరు, బంధం తెంపేసుకుంటారు..

5.44. ना जाने क्यों कोसते हैं लोग बदसूरती को..
बर्बाद करने वाले तो हसीन चेहरे होते हैं..
జనాలు రూపహీనతను ఎందుకు అసహ్యించుకుంటారో..
నాశనం చేసేవి అందమైన ముఖాలే అయి ఉంటాయి కదా..

5.45. दवा जब असर ना करे, तो नज़रें उतारती है माँ..
जनाब, ये हार कहाँ मानती है..
మందు పని చేయకపోతే దృష్టి తీస్తుంది అమ్మ..
ఆమె ఓటమిని ఎందుకు అంగీకరిస్తుందండీ..?

5.46. अकेले ही गुज़रती है ज़िन्दगी..
लोग तसल्लियाँ तो देते हैं पर साथ नहीं..
ఒంటరిగానే గడుస్తుంది జీవితం..
జనాలు ఆశ్వాసనం ఇస్తారు కానీ తోడు ఇవ్వరు..

5.47. कहाँ मिलता है कोई समझने वाला..
सब समझा कर चले जाते हैं..
ఎక్కడ దొరుకుతారు, అర్థం చేసుకునేవారు?
అందరూ అర్థం చేయించి (క్లాస్ లు పీకి) వెళిపోతారు..
రాముఅన్న--- అర్ధం చేసుకొనే వారేరీ?
అర్ధం చేయించే వారే అందరూ

5.48. अपना तो कोई दोस्त नहीं है..
सब साले कलेजे के टुकड़े है..
నాకైతే ఎవ్వరూ స్నేహితులు లేరు..
అందరూ నా హృదయపు (కాలేయం?) ముక్కలు..
రాముఅన్న--- దోస్తులేడుర్రు నాకు?
సాలె గాళ్ళందరు జిగర్ కె టుక్డె లే ఐరి

5.49. ज़्यादा कुछ नहीं बदला उम्र बढ़ने के साथ..
बचपन की ज़िद समझौतों में बदल जाती है..
పెద్దగా ఏమీ మారలేదు జీవితంలో..
చిన్ననాటి మొండితనం ఒప్పందాలలోకి మారుతుంది, అంతే.

5.50. दुनिया में सबसे ज्यादा वजनदार खाली जेब होती है..
चलना मुश्किल हो जाता है..
లోకంలో అన్నింటికన్నా బరువైనది ఖాళీ జేబు..
నడవటం కష్టమవుతుంది..

5.51. रख लो आइने हज़ार तसल्ली के लिए..
पर सच के लिए तो, आँखे ही मिलानी पड़ेगी..
వెయ్యి అద్దాలు పెట్టుకోండి తృప్తి కోసం..
కానీ నిజం తెలుసుకోవటానికి (సూటిగా) కన్నులు కలపక తప్పదు..

5.52. ख़ामोशी भी अच्छी है तेरी, एक उम्मीद तो रह जाती है..
तेरे ना कहने से, तेरा ना कहना ही ठीक है..
నీ మౌనం కూడా మంచిదే, ఒక ఆశ నిలిచిపోతుంది..
నీవు కాదనటంకన్నా ఏమీ అనకపోవటమే బాగుంది..

5.53. देने को तो दिए जाते है नज़राने बहुत..
है कोई चीज़ जो दिल का मुकाबला करे?..
ఇవ్వటానికేఁ, బోలెడు కానుకలు ఇవ్వవచ్చు..
కానీ మనసుకు పోటీ వచ్చేదేదైనా ఉందా?..

5.54. सहमी हुई है झोपड़ी, पानी के ख़ौफ़ से..
महलों की आरज़ू है की, बरसात तेज़ हो..
గుడిసె భయంతో ముడుచుకుపోతున్నది..
భవంతుల కోరికేమో వర్షం ఇంకా జోరుగా పడాలని..
రాముఅన్న--- చుక్క వానకే గుడిసెకు గుండె ఝల్లు
జడివాన కై భవనం వళ్ళు తృళ్ళు

5.55. संभाल के रखना अपनी पीठ को यारो..
शाबाशी और खंजर दोनों वहीं पर मिलते है..
మీ వీపును జాగ్రత్తగా ఉంచుకోండి నేస్తాలూ..
వెన్నుతట్టూ, వెన్నుపోటూ రెండూ అక్కడే లభిస్తాయి..

5.56. जुबां तीखी हो तो खंजर से गहरा जख्म देती है..
और मीठी हो तो वैसे ही कत्ल कर देती है..
మాట కటువుగా ఉందా, కత్తి కన్నా తీవ్రమైన గాయాన్ని చేస్తుంది..
తీయగా ఉంటే సునాయాసంగా హత్య చేసేస్తుంది..
రాముఅన్న-
కటువైన మాట గుండెను గాయం చేస్తుంది
తీపి తేనెల మాట మనిషినే మాయం చేస్తుంది

5.57. सकून की एक रात भी नहीं ज़िन्दगी में..
ख्वाइशों को सुलाओ तो यादें जाग जाती हैं..
హాయిగా ఉండే రాత్రి ఒక్కటీ లేదు జీవితంలో..
కోరికలను పడుకోబెడితే జ్ఞాపకాలు నిద్ర లేస్తాయి..

5.58. सारा जहाँ उसी का है जो मुस्कुराना जानता है..
रौशनी भी उसी की है जो शमा जलाना जानता है..
నవ్వటం ఎవడికి తెలుసో, లోకమంతా వాడిది..
దివ్వెను వెలిగించటం ఎవడికి తెలుసో, వెలుగు కూడా వాడిదే..

5.59. हर जगह मंदिर हैं लेकिन..
भगवान तो उसी का है जो सर झुकाना जानता हैं..
మందిరం ప్రతి చోటా ఉంది..
కానీ ఎవడు తలవంచటం నేరుస్తాడో, భగవంతుడు అతడివాడే

5.60. बोलने का हक़ छिना जा सकता है..
मगर ख़ामोशी का कभी नहीं..
మాట్లాడే హక్కును లాగేసుకోవచ్చు..
కానీ మౌనంగా ఉండే హక్కును ఎప్పటికీ తీసుకోలేరు..

5.61. एक खूबसूरत सा रिश्ता यूँ ख़तम हो गया..
हम दोस्ती निभाते रहे, और उसे इश्क हो गया..
ఒక అందమైన అనుబంధం అట్లా అంతమైంది..
మేము స్నేహం చేస్తున్నాము, తనకు ప్రేమ కలిగింది..

5.62. पिता की दौलत पर क्या घमंड करना..
मज़ा तो तब है जब दौलत अपनी हो और घमंड पिता करे..
తండ్రి ఆస్తుల పై గర్వమెందుకు?..
ఆస్తి మనదై తండ్రి గర్విస్తే, అది మజా అంటే..

5.63. नज़र अंदाज़ जितना करना है कर लो..
अन्दाज़ा उस दिन का भी कर लो जब हम नज़र नहीं आयेंगे..
ఎంత చూపులు తిప్పేసుకోవాలనిపిస్తే అంత తిప్పేసుకో..
కానీ నేను చూపులకు అందని రోజు గురించి కూడా అంచనా ఉంచుకో..

5.64. मैंने कुछ लोग लगा रखे हैं पीठ पीछे बात करने के लिए..
पगार कुछ नहीं है उनकी पर काम बड़ी ईमानदारी से करते हैं..
నా వెనక మాట్లాడేందుకు నేను కొందరిని పెట్టుకున్నాను..
జీతం ఏం ఇవ్వనక్కరలేదు, కానీ పని చాలా నిజాయితీగా చేస్తారు..

5.65. आफ़त नहीं, जो टल जाऊँगी..
आदत हूँ,  लग जाऊँगी..
ఆపదను కాను, తొలగిపోవటానికి..
అలవాటును, అంటుకుపోతాను..

5.66. एक ना एक दिन मंज़िल मिल ही जाएगी..
ठोकरें ज़हर थोड़े है, जो खा कर मर जाऊंगा..
ఏదో ఒక రోజు గమ్యం దొరుకుతుంది..
ఎదురుదెబ్బలు విషం కాదు కదా, తినగానే చచ్చిపోవటానికి..

5.67. अपनी मौत भी क्या मौत होगी..
यूँ ही मर जायेंगे एक दिन तुम पर मरते-मरते..
నా మరణం కూడా ఏం మరణంలే..
ఇట్లాగే చనిపోతాను ఒకరోజు, నీమీద పడి చస్తూ..
(భగవంతుడి గురించి ఇట్లా అనగలిగే శక్తి ఎవరికైనా ఉంటే వాడు తరించినట్టే)

5.68. कभी तुम्हारी याद आती है तो कभी तुम्हारे ख़्वाब आते हैं..
मुझे सताने के तुम्हे तरीक़े तो बेहिसाब आते है..
 ఒకసారి నీ జ్ఞాపకం వస్తుంది,  మరోసారి నీ కలలు వస్తాయి..
నన్ను ఏడిపించటానికి నీకు లెక్కలేనన్ని ఉపాయాలు తెలుస్తాయి..
(ఇట్లా ఇష్టదైవం ఏడిపించే రోజు భలే ఉంటుందిలే)

5.69. हज़ार बार ली है तुमने तलाशी मेरे दिल की..
बताओ कभी कुछ मिला है इसमें प्यार के सिवा..
వేల సార్లు నీవు నా మనసంతా సోదా చేశావు..
చెప్పు, ఎప్పుడైనా ఇందులో ప్రేమ కాక వేరొకటి దొరికిందా?..

5.70. सिर्फ़ दो ही वक़्त पर उसका साथ चाहिए..
एक तो अभी और एक हमेशा के लिये..
నాకు రెండేసమయాల్లో తన తోడు కావాలి..
ఒకటేమో ఇప్పుడు, ఇంకొకటేమో ఎప్పటికీ..
(దేవుడితో ఇట్లా అంటే పడిపోయి వచ్చేయడా?)

5.71. बहुत सोच कर अपनों से रूठा करो..
आजकल मनाने का रिवाज़ ख़त्म हो गया है..
బాగా ఆలోచించాకే సొంతవారి మీద అలగాలి..
నేడు రేపు అలక మాన్పించే పద్ధతి అంతమైపోయింది..

5.72. गिर रहा है दिन ब दिन इंसानियत का स्तर..
इंसान का दावा है कि हम हैं, तरक्की पर..
మానవత్వం స్థాయి రోజురోజుకు పడిపోతోంది..
మనిషేమో మేము ప్రగతి సాధిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాడు..

5.73. रोज़ खाने को बैठता हूँ तो मुझे एक बात सताती है..
ये चार रोटियाँ मुझे कैसे दिन-रात भगाती हैं..
ప్రతిరోజు తినటానికి కూర్చుంటే నన్నొక మాట తొలుస్తుంది..
ఈ నాలుగు మెతుకులు(రొట్టెలు) నన్ను పగలూ రాత్రీ ఉరికిస్తున్నాయి..

5.74. सुना है कि उसने खरीद लिया है करोड़ों का घर शहर में..
मगर आँगन दिखाने वो आज भी बच्चों को गाँव लाता है..
నగరంలో కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడని విన్నాను..
కానీ ఇంటివసారా (ముంగిలి) చూపించటానికి ఇవాళ కూడా పిల్లలను ఊరికి తీసుకుపోతాడు..

5.75. होने वाले ख़ुद ही अपने हो जाते हैं..
किसी को कहकर, अपना बनाया नहीं जाता..
కావాలనుకునేవారు తనకు తానుగా మనవారవుతారు..
నోటితో చెప్పి ఎవ్వరినీ మనవారుగా చేసుకోవటం కుదరదు..

5.76. कुछ उलझनें है राहों में, कुछ कोशिशें बेहिसाब..
बस इसी का नाम ज़िन्दगी है चलते रहिये, जनाब..
దారిలో కొన్ని ఆటంకాలున్నాయి, లెక్కలేని ప్రయత్నాలున్నాయి..
దీని పేరే జీవితం, అట్లా నడుస్తూ ఉండండి,  అంతే..
రాముఅన్న--- కొన్ని అడ్డుగోడలు,  అంతకు మించి దాటే యత్నాలు
ఇదే జీవిత బాట,  సాగిపో నేస్తమా సాగిపో

5.77. मेरी फ़ितरत में नहीं है किसी से नाराज़ होना..
नाराज़ वो होते हैं जिसे खुद पर ग़ुरूर होता है..
ఎవ్వరిపై కోపం రావటం నా స్వభావం కాదు..
తనపై తనకు గర్వం (అహంభావం) ఉన్నవారే కోపగించుకుంటారు..

5.78. ज़्यादा ख्वाहिशें मैं रखता नहीं ग़ालिब..
बस उतना देदे मालिक जितना डेरे वाले फक़ीर के पास था..
గాలిబ్,  ఎక్కువ కోరికలను నేను పెట్టుకోను
ఓ భగవంతుడా,  ఆ డేరా(?)లో సాధువు వద్ద ఉన్నంత నాకు ఇవ్వు..

5.79. सर झुकाने की खूबसूरती भी क्या कमाल की होती हैं..
धरती पर सर रखों और दुआ आसमान में कुबूल हो जाती हैं..
తలవంచుకోవటంలో అందం కూడా భలే అద్భుతంగా ఉంటుంది..
భూమి మీద తల పెడితే ప్రార్థన ఆకాశంలో అంగీకరించబడుతుంది..
(ఇది పరమత భావన. వారికి స్వర్గంలో దేవుడుంటాడు. మన దేవుడు అంతర్యామి కనుక *ప్రార్థన పైవాడికి చేరుతుంది* అనవచ్చు.)

5.80. एक बस तू ही नहीं मुझसे ख़फ़ा हो बैठा..
मैं ने जो संग तराशा वो ख़ुदा हो बैठा..
ఒక్క నీవే కాదు, నా పై అలిగి కోపంగా ఉన్నది..
నేను చెక్కిన పాలరాయి దేవుడిగా మారి కూర్చుంది..

5.81. कायनात की सबसे महंगी चीज़ एहसास है..
जो दुनिया के हर इंसान के पास नहीं होता..
ఈ లోకంలో అన్నింటికన్నా ఖరీదైనది అనుభూతి..
అది లోకంలో ప్రతి మనిషి వద్దా ఉండదు..

5.82. अगर आसमान वाले से आपके रिश्ते मज़बूत है तो..
ज़मीन वाले आप का कुछ नहीं बिगाड़ सकते..
పైవాడితో మీ అనుబంధం గట్టిగా ఉన్నట్లైతే..
కిందివారు మీకేమీ చెడు చేయలేరు..

5.83. फ़र्क़ बहुत है तेरी और मेरी तालीम में..
तूने उस्तादों से सीखा है और मैंने हालातों से..
నీ చదువు, నా చదువులో చాలా తేడా ఉంది..
నీవు గురువుల వద్ద నేర్చావు, నేను పరిస్థితుల వల్ల నేర్చాను..

5.84. कुछ लोग चप्पल के जैसे होते है..
साथ तो देते है पर पीछे से कीचड़ उड़ाते रहते है..
కొందరు చెప్పులలాగా ఉంటారు..
తోడు ఉంటారు, కానీ వెనక నుండి బురద వెదజల్లుతుంటారు..

5.85. अगर कोई चुप है तो इसका मतलब ये नहीं की उसे बोलना नहीं आता..
हो सकता है वो थप्पड़ मारने में यक़ीन रखता हो..
ఎవరైనా మౌనంగా ఉన్నారంటే దాని అర్థం వారికి సమాధానం ఇవ్వటం రాదని కాదు..
బహుశ ఈడ్చి చెంపదెబ్బ కొట్టటంపై వారికి ఎక్కువ నమ్మకం ఉండవచ్చు..

5.86. मत किया कर इतना गुरूर ऐ इंसान अपने आप पर..
ना जाने कितने मिटा डाले खुदा ने तेरे जैसे बनाकर..
ఓ మనిషీ, నీపై నీవంత గర్వం కలిగి ఉండకోయి..
నీబోటి ఎంతమందిని దేవుడు తయారు చేసి చెరిపేశాడో..

5.87. बहुत ही ऊँचा कलाकार हूं ज़िंदगी के रंगमंच का..
मजाल है देखने वालों को दर्द दिख जाए..
జీవితపు రంగస్థలం మీద చాలా గొప్ప కళాకారుణ్ణి..
నా బాధను చూసేటంత సామర్థ్యం చూసేవారికి ఉందా?..

5.88. रातों को चलती रहती हैं मोबाईल पर उँगलियाँ..
सीने पर किताब रखकर सोए ज़माना गुज़र गया..
రాత్రులలో చలవాణి మీద వేళ్ళు పరుగాడుతూ ఉంటాయి..
ఛాతిపై పుస్తకం పెట్టుకుని పడుకుని తరం గడిచిపోయింది..

5.89. मुझे क्या डराएगा मौत का मंज़र..
हमने तो जन्म ही कातिलों की बस्ती में लिया है..
చావు దృశ్యం నన్నేమి భయపెడుతుంది?..
నేను పుట్టటమే హంతకుల బస్తీలో పుట్టాను..
(శ్రీకృష్ణుడి డైలాగ్)

5.90. अक्सर दिखावे का प्यार ही शोर करता है..
सच्ची मोहब्बत तो इशारों में ही सिमट जाती है..
ప్రదర్శనల ప్రేమయే ఎక్కువగా గోల చేస్తుంది..
నిజమైన ప్రేమ సంకేతాలలోనే ఇమిడి ఉంటుంది..

5.91. ज़िन्दगी जीनी हैं तो तकलीफें तो होंगी..
वरना मरने के बाद तो जलने का भी एहसास नहीं होता..
జీవితం జీవించాలంటే కష్టాలైతే ఉంటాయి..
చనిపోయిన తరువాత నిలువునా కాలిపోయినా స్పృహ ఉండదు..

5.92. दुश्मन के सितम का खौफ़ नहीं हमको..
हम तो दोस्तों के रूठ जाने से डरते है..
శత్రువుల ఆరళ్ళ భయం లేదు నాకు..
స్నేహితులకు అలకలొస్తాయని భయపడతాను నేను..

5.93. आसमाँ पे ठिकाने किसी के नहीं होते..
जो ज़मीं के नहीं होते, वो कहीं के नहीं होते..
నింగిలో ఇళ్ళు ఎవ్వరికీ ఉండవు..
నేలకు చెందనివారు, ఎక్కడకూ చెందరు..

5.94. मुझसे नफ़रत करनी है तो इरादे मजबूत रखना..
ज़रा से भी चूके तो महोब्बत हो जायेगी..
నన్ను ద్వేషించాలంటే గట్టి సంకల్పం చేసుకో..
కాస్తైనా గురి తప్పావో, ప్రేమ కలుగుతుంది..

5.95. ख़्वाहिशों का कैदी हूँ,
मुझे हकीक़तें सज़ा देती हैं..
కోరికలకు బందీని,
నాకు వాస్తవాలు శిక్ష వేస్తాయి..

5.96. पाना है मुकाम, वो मुकाम अभी बाकी है..
अभी तो ज़मीन पै आये है, आसमान की उडान बाकी है..
ఓ గమ్యాన్ని చేరాలి, ఆ గమ్యం ఇంకా చేరవలసి ఉంది..
ఇప్పుడే కదా నేలపైకి వచ్చాము, నింగిలోకి ఎగరవలసింది ఉంది..

5.97. अकड़ती जा रही हैं हर रोज़ गर्दन की नसें..
आज तक नहीं आया हुनर सर झुकाने का..
మెడనరాలన్నీ రోజురోజుకు బిగుసుకుంటున్నాయి..
ఇప్పటిదాకా తలవంచే కళ రాలేదు..

5.98. हमारे जीने का तरीक़ा थोड़ा अलग है..
हम उमीद पर नहीं अपनी ज़िद पर जीते है..
నేను జీవించే పద్ధతి కాస్త వేరేగా ఉంటుంది..
ఆశ ఆధారంగా కాదు, పట్టుదల మీద జీవిస్తాను..

5.99. मेरी आँखों के जादू से अभी तुम कहाँ वाक़िफ़ हो..
हम उसे भी जीना सिखा देते हे जिसे मरने का शौक़ हो ..
నా కన్నుల మాయాజాలం నువ్వింకా ఎరిగిందే ఎక్కడ?..
చావాలనే మోజు ఉన్నవాడికి కూడా జీవించటం నేర్పిస్తాను..

5.100. मुझे अकड़ तो बचपन से ही बहुत है..
जब पैदा हुआ तो डेढ़ साल मैंने किसी से बात नहीं की..
పొగరు నాకు చిన్నతనం నుంచే చాలా ఉంది..
పుట్టినప్పుడు యేడనర్ధం వరకు ఎవ్వరితో మాట్లాడనేలేదు..

5.101. प्यार करता हूँ इसलिए फ़िक्र करता हूँ..
नफ़रत करूँगा तो जिक्र भी नहीं करूँगा..
ప్రేమిస్తున్నాను కనుకనే బెంగపడతాను..
ద్వేషించాననుకో, పేరు కూడా ఎత్తను..

5.102. ज़रा देखो तो ये दरवाज़े पर दस्तक किसने दी है..
अगर इश्क हो तो कहना, अब दिल यहाँ नहीं रहता..
కాస్త చూడు, తలుపు కొట్టినదెవరో..
ఒక వేళ ప్రణయం అయితే చెప్పు, ఈమధ్య మనసు ఇక్కడ ఉండటం లేదని..

5.103. ज़रा मुस्कराना भी सिखा दे ज़िन्दगी..
रोना तो पैदा होते ही सीख लिया था..
కాస్త నవ్వటం కూడా నేర్పించవే జీవితమా..
ఏడవటం పుట్టంగానే నేర్చుకున్నాము..

5.104. फ़लक की भी ज़िद है जहाँ बिजली गिराने की..
हमारी भी ज़िद है वहीं आशियां बनाने की..
ఆకాశం ఎక్కడ పిడుగులు కురిపిస్తానంటుందో..
అక్కడే ఇల్లు కట్టాలని నా మొండిపట్టుదల కూడా..

5.105. पराया धन होकर भी कभी पराई नहीं होती..
शायद इसीलिए किसी बाप से हंसकर बेटी की विदाई नही होती..
పరుల సొమ్ము అయ్యి కూడా పరాయి కాలేకపోతుంది..
అందుకే కూతురిని నవ్వుతూ సాగనంపటం ఏ తండ్రి వల్లా కాదు..

5.106. कुछ खास आंसू तो नहीं है मेरे पास यारों..
बस बातें जो भी करता हूँ, दिल से करता हूँ..
నా దగ్గర పెద్దగా కన్నీరు లేదు మిత్రులారా..
మాటలేవి మాట్లాడినా మనసునుండి మాట్లాడతాను, అంతే..

5.107. रहने चाहिए कुछ फ़ासलें..
क़द्र नज़दीकियों की समझने के लिए..
కొన్ని దూరాలు ఉండిపోవాలి..
కొన్ని దగ్గరితనాల విలువలను అర్థం చేసుకోవటానికి..

5.108. ग़ुलामी तो सिर्फ़ तेरे इश्क की करते हैं, वरना..
ये दिल तो पहले भी नवाब था, और आज भी नवाब है..
నీ ప్రేమకు బానిసత్వం చేస్తున్నాను..
లేదంటే ఈ మనసు ఇదివరకూ రారాజే, ఇప్పుడూ రారాజే..

5.109. ज़्यादा कुछ नहीं बदला उसके और मेरे बीच में..
पहले नफ़रत नहीं थी और अब प्यार नहीं है..
ఎక్కువగా ఏమీ మారలేదు నాకూ, తనకూ మధ్య..
మొదలు ద్వేషం ఉండేది కాదు, ఇప్పుడు ప్రేమ లేదు..

5.110. एक क़ब्रिस्तान के बाहर लिखा था सैकड़ों दफ़न है यहाँ..
जो सोचते थे कि दुनिया उनके बिना नहीं चल सकती..
ఒక స్మశానం బయట వ్రాసి ఉంది- వందలమంది సమాధి చేయబడ్డారిక్కడ..
వారు తాము లేనిదే లోకం నడవద అనుకునేవారు..

5.111. बेटी को चांद जैसा मत बनाओ कि हर कोई घूर घूरकर देखे..
किंतु बेटी को सूरज जैसा बनाओ ताकि घूरने से पहले सबकी नज़रें झुकजाएं..
కూతురిని చంద్రుడిలాగా పెంచకండి, ప్రతీవాడూ గుచ్చి గుచ్చి చూస్తాడు..
తనను సూర్యుడిలాగా తయారు చేయండి, గుచ్చి చూసే ముందరే చూపులు వాలిపోవాలి..

5.112. हँस के चल दूँ मैं कांच के टुकड़ों पर..
अगर दोस्त कह दे की ये तो मेरे बिछाए हुए फूल हैं..
నవ్వుతూ గాజుముక్కల మీద నడిచేస్తాను..
ఇవి నీకోసం పరిచిన పూలురా అని నేస్తాలు చెప్తే చాలు..

5.113. गिनती ठीक से सीखा नहीं..
मगर, इतना मालूम हैं खुशियाँ बांटने से बढती हैं..
లెక్కలు సరిగ్గా నేర్చుకోలేదు..
కానీ సంతోషాలు పంచుకుంటే పెరుగుతాయని మాత్రం తెలుసు..

5.114. हालात ने तोड़ दिया हमें कच्चे धागे की तरह..
वरना हमारे वादे भी कभी ज़ंजीर हुआ करते थे..
పరిస్థితులు నన్ను పొట్లాలదారం లా తుంచేశాయి..
లేదంటే నేను మాటిస్తే అవి ఇనపగొలుసుల్లా ఉండేవి..

5.115. कितना मुश्किल है ज़िन्दगी का ये सफ़र..
खुदा ने मरना हराम किया, लोगों ने जीना..
ఎంత కష్టమో ఈ జీవనపయనం..
దేవుడు చావడం నిషేదించాడు, మనుషులు జీవించటం దుర్భరం చేశారు..

5.116. भूखा पेट, खाली जेब, और झूठा प्रेम..
इंसान को जीवन में बहुत कुछ सिखा जाता है..
ఆకలి కడుపు, ఖాళీ జేబు, నటన ప్రేమ..
మనిషికి జీవితంలో చాలా నేర్పుతాయి..

No comments:

Post a Comment