Saturday, 6 January 2018

షేరోం కా షోర్- 6 (शेरों का शोर) (ఉర్దూ షేర్లకు తెలుగు అనువాదం)

6.1. सच से मैं ने कल कहा क्यों आखिर हो मौन..
हँसकर बोला प्रेम से, सच सुनता है कौन?
సత్యాన్ని నేను అడిగాను, ఎందుకింత మౌనంగా ఉన్నావని..
నవ్వి, ప్రేమగా అడిగింది- సత్యం ఎవరు వింటారు? అని..

6.2. इश्क़ एक बहुत ज़हरीला जंगल है साहब..
यहां सांप नहीं हमसफ़र डसा करते हैं..
ప్రేమ అనేది గొప్ప విషమయమైన అడవి బాబూ..
ఇక్కడ పాములు కాదు, సహచరులు కాటు వేస్తుంటారు..

6.3. दुनिया में छोड़ने जैसा कुछ है तो..
दुसरों से उम्मीद करना छोड़ दो..
లోకంలో ఏదైనా వదిలిపెట్టాలి అనుకుంటే..
ఇతరుల నుండి ఆశించటం వదిలిపెట్టాలి..

6.4. एहतियात बहुत ज़रूरी है..
चाहे सड़क पार कर रहें हों या हद..
సావధానత చాలా అవసరం..
రోడ్డు దాటుతున్నా సరే, హద్దు దాటుతున్నా సరే..

6.5. हम बुरे ही भले अब..
जब अच्छे थे तब कौन से मैडल मिल गए..
నేను చెడ్డగానే బాగున్నా ఇప్పుడు..
మంచిగా ఉన్నప్పుడు ఏం పతకాలు దొరికాయని?..

6.6. अब डर लगता है मुझे उन लोगों से..
जो कहते है, मेरा यक़ीन तो करो..
ఇప్పుడు నాకు భయం వేస్తుంది వారిని చూస్తే..
ఎవరైతే, ‘నన్ను నమ్ముఅంటారో..

6.7. तुझे तो मोहब्बत भी तेरी औक़ात से ज्यादा की थी..
अब तो नफ़रत की बात है, सोच ले तेरा क्या होगा..
నిన్ను ప్రేమించటం కూడా నీ స్థాయికన్నా ఎక్కువే చేశాను..
ఇప్పుడు ద్వేషించే మాట వచ్చింది, ఆలోచించుకో, నీ గతి ఏమవుతుందో..

6.8. हम दुश्मनों को भी बड़ी शानदार सज़ा देते हैं..
हाथ नहीं उठाते, बस नज़रों से गिरा देते हैं..
మేము శత్రువులకు కూడా గొప్ప శిక్ష వేస్తాము..
చేయి ఎత్తము, చూపుల(తో) నుండి పడేస్తాము..

6.9. प्यार आज भी तुझसे इतना ही है..
बस तुझे एहसास नहीं और हमने जताना ही छोड़ दिया..
నీమీద ప్రేమ ఈనాడూ అంతే ఉంది..
నీకేమో అనుభూతి లేదు, నేనేమో చూపటం మానేశాను..

6.10. मेरे बर्दाश्त करने का अंदाज़ा तू क्या लगाये..
तेरी उम्र से कहीं ज़्यादा मेरे जिस्म पर जख़्मों के निशाँ हैं..
నా భరించేశక్తిని నీవేమి అంచనా వేయగలవు?..
నీ వయసుకన్నా మించి నా శరీరం మీద గాయాల గుర్తులున్నాయి..
నా ఒంటిపై గాయాలు నీకున్న ఏళ్ల కన్నా ఎక్కువే

6.11. हक़ से दो तो तेरी नफ़रत भी कुबूल है हमें..
ख़ैरात में तो हम तुम्हारी मोहब्बत भी न लें..
హక్కుగా ఇస్తే నీ ద్వేషం కూడా నాకు సమ్మతమే..
భిక్ష గా వేస్తే నీ ప్రేమ కూడా తీసుకోను..

6.12. मिल सके आसानी से, उसकी ख़्वाहिश किसे है?..
ज़िद तो उसकी है, जो मुकद्दर में लिखा ही नहीं..
సులువుగా దొరికితే, దాని కోరిక ఎవరికి ఉంటుంది?..
భాగ్యంలో వ్రాసి లేనిదాని గురించే కదా పట్టుదలంతా..

6.13. आसमान में उड़ने वाले ज़रा ये ख़बर भी रख..
जन्नत पहुँचने का रास्ता मिट्टी से ही गुज़रता है..
ఆకాశంలో ఎగిరే వాడా, ఈ మాట కాస్త గుర్తు పెట్టుకో..
స్వర్గానికి పోయే దారి మట్టి గుండానే పోతుంది..

6.14. मत पूछना मेरी शख़्सियत के बारे में..
हम जैसे दिखते हैं, वैसे ही लिखते है ..
నా వ్యక్తిత్వం గురించి అడగవద్దు..
నేను ఎట్లా కనిపిస్తానో అట్లాగే వ్రాస్తాను..

6.15. रेत पर नाम कभी लिखते नहीं,
रेत पर नाम कभी टिकते नहीं..
लोग कहते है कि हम पत्थर दिल हैं,
लेकिन पत्थरों पर लिखे नाम कभी मिटते नहीं..
ఇసకలో ఎన్నడూ పేర్లు వ్రాయరు
ఇసకమీద వ్రాసిన పేర్లు నిలవవు..
జనాలంటారు, నాది రాతి గుండె అని..
కానీ రాయి మీద వ్రాసిన పేర్లు ఎప్పుడూ చెరగవు..

6.16. अच्छे होते हैं बुरे लोग..
जो अच्छा होने का नाटक तो नहीं करते..
చెడ్డవారే చాలా మంచివారు..
కనీసం మంచివారిలాగా నటించరు కదా..

6.17. पिछले बरस था खौफ़ की तुझको खो ना दूँ कहीं..
अब के बरस ये दुआ है की तेरा सामना ना हो..
నిరుడు భయపడ్డాను, నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటానో అని..
ఈఏడు ప్రార్థిస్తున్నాను, నీవు ఎదురుపడవద్దని..

6.18. दुश्मनों से मोहब्बत होने लगी है..
जब से अपनों को आज़माते चले गए..
శత్రువులపై ప్రేమ కలిగింది..
నావారిని పరికిస్తూ పోయేకొద్దీ..

6.19. लहरों का सुकून तो सभी को पसंद है..
लेकिन तुफ़ानो में कश्ती निकालने का मज़ा ही कुछ और है..
అలల హాయి అందరికి ఇష్టమే..
కానీ సుడిగాలివానలలో పడవను బయటకు తీసే మజాయే వేరు..

6.20. सब्र रख ये मुसीबत के दिन भी गुज़र जायेंगे..
जो आज मुझे देख कर हँसते हैं कल मुझे देखते ही रह जायेंगे..
ఓపిక పట్టు, ఈ కష్టాలకాలం గడిచిపోతుంది..
ఇవాళ నన్ను చూసి నవ్వేవారే, రేపు అట్లా చూస్తుండిపోతారు..

6.21. आज कल लडकियाँ भी लड़कों से कम नहीं..
मजाल है कि घर का कोई काम कर ले..
నేడు రేపు అమ్మాయిలు కూడా అబ్బాయిలకంటే ఏం తక్కువ లేరు..
ఒక్కరికైనా ఇంట్లో పని చేసేంత సామర్థ్యముందా?

6.22. जो आपकी जिंदगी में कील बनकर बार-बार चुभे..
उसे एक बार हथौड़ी बन कर ठोक दो..
మీ జీవితంలో ఎవరు మాటిమాటికీ మేకులా అయ్యి గుచ్చుతారో..
వారిని ఒక్కసారి సుత్తి అయ్యి వేసి పెడితే సరి..

6.23. गुनगुनाना तो तक़दीर में लिखा के लाए थे..
खिलखिलाना दोस्तों ने तोहफ़े में दे दिया..
గొంతు కదపటం భాగ్యంలో వ్రాయించుకుని తెచ్చుకున్నాను..
నవ్వులజల్లులు కురవటం స్నేహితులు కానుకగా ఇచ్చారు..

6.24. फ़ासला भी ज़रूरी था, चिराग़ रौशन करते वक़्त..
ये तज़ुर्बा हाथ आया, हाथ जल जाने के बाद
కాస్త ఎడం కూడా అవసరమైంది, దీపాన్ని వెలిగించే వేళ..
ఈ అనుభవం చేతికి వచ్చింది, చేయి కాలిపోయాక..

6.25. नखरे तो सिर्फ मम्मी पापा उठाते हैं..
दुनिया वाले तो बस ऊँगली उठाते है..
మన వేషాలన్నీ అమ్మానాన్నలు మాత్రమే భరిస్తారు..
లోకులు కేవలం వేలు ఎత్తి చూపిస్తారు..

6.26. छोटे थे तो सब नाम से बुलाते थे..
बड़े हुए तो बस काम से बुलाते है..
చిన్నప్పుడు అందరూ పేరు పెట్టి పిలిచేవారు..
పెద్దైనాక కేవలం పనిపెట్టి (మీద) పిలుస్తారు..

6.27. जब चलना नहीं आता था तो लोग गिरने नहीं देते थे..
जब से संभाला है खुद को लोग गिराने की कोशिश करते हैं..
నడవటం రానప్పుడు జనాలు కింద పడనిచ్చేవారు కాదు..
నన్ను నేను సంబాళించుకున్నాక జనాలు పడేయాలని ప్రయత్నిస్తారు..

6.28. समझदार ही करते है अक्सर गलतियाँ..
कभी देखा है किसी पागल को मोहब्बत करते..
తెలివికలవారే ఎక్కువగా తప్పులు చేస్తారు..
ఎప్పుడైనా పిచ్చివాడు (ఒకరిని) ప్రేమించటం చూశారా?..

6.29. एक बार click तो करके देख..
बिना Loading के सीधा दिल में उतर जाऊंगा..
ఒక్కసారి క్లిక్ కొట్టైతే చూడు..
లోడింగ్ లేకుండా నేరుగా మనసులోకి దిగిపోతాను..

6.30. मेरा खुद से मिलने को जी चाहता है..
काफ़ी कुछ सुन रहा हूँ मैं अपने बारे में..
నాకు నన్నే కలావలని మనసైతోంది..
చాలా వింటున్నాను నా గురించి నేను..

6.31. उस मोड़ से शुरू करनी है फिर से जिंदगी..
जहाँ सारा शहर अपना था और तुम अजनबी..
మళ్ళీ జీవితాన్ని అక్కడ ప్రారంభించాలి..
ఎక్కడ ఊరంతా పరిచితులు, నీవు అపరిచితంగా ఉండేవారో..

6.32. दब के रहना सीखा नहीं किसी से..
चाहे अगला कितना भी बड़ा बदमाश क्यों ना हो..
ఎవ్వరి కిందా అణిగిఉండటం నేర్చుకోలేదు..
ఎదటివాడు ఎంత దుష్టుడైనా సరే..

6.33. कुछ सही तो कुछ ख़राब कहते है..
लोग हमे बिगड़ा हुआ नवाब कहते है
కొందరు మంచివాడని అంటారు, కొందరు చెడు చెప్తారు..
జనాలు నన్ను చెడిపోయిన నవాబు అంటారు..

6.34. झूठी शान के परिंदे ही ज्यादा फड़फड़ाते हैं..
बाज़ की उडान में कभी आवाज़ नहीं होती..
లేని గొప్పల పక్షులే ఎక్కువ రెక్కలు కొడతాయి..
గ్రద్ద ఎగిరితే ఎప్పుడూ శబ్దం రాదు..

6.35. जो बेहतर होता है उसे ईनाम मिलता है..
जो बेहतरीन होता है उसके नाम पर ईनाम होते हैं..
గొప్పవాడికి పురస్కారం దొరుకుతుంది..
మహాత్ముల పేరు మీద పురస్కారాలు ఇవ్వబడతాయి..
(స్వతంత్రించాను)

6.36. सुन रे दुश्मन, तू क्या जानेगा हमारी बदमाशी के आलम..
 जिस उम्र में तूने पतंगे काटी है बेटा, उस उम्र में हमने जेल काटी है..
వినరా శత్రువా, నాకేం తెలుస్తుంది, నా దుష్టత్వం..
నీవు పతంగులతో గడిపిన కాలపు వయసును నేను జైలులో గడిపాను..

6.37. सज़ा देनी हमे भी आती है, ओ बेख़बर..
पर तू तकलीफ़ से गुज़रे, ये हमे मंजूर नहीं
దండించటం నాకూ వస్తుంది, ఓ అమాయకుడా..
కానీ నీవు కష్టాన్ని ఎదుర్కోవటం నాకు సమ్మతం కాదు..

6.38. कुत्ते भौंकते है अपना वजूद बनाये रखने के लिये..
और लोगों की खामोशी हमारी मौजूदगी बयाँ करती है..
కుక్కలు మొరుగుతాయి తమ అస్తిత్వం నిలుపుకోవటానికి..
జనాల మౌనం మా ఉపస్థితిని తెలియచేస్తుంది..

6.39. हम समंदर हैं, हमें खामोश ही रहने दो..
ज़रा मचल गये, तो शहर ले डूबेंगे..
నేను సముద్రాన్ని, నన్ను మౌనంగా ఉండనివ్వు..
కాస్త రెచ్చిపోయానంటే నగరాన్ని తీసుకు ముంచేస్తాను..

6.40. मुलाकात ज़रुरी हैं, अगर रिश्ते निभाने हो..
वरना लगा कर भूल जाने से पौधे भी सूख जाते हैं..
కలవటం అవసరం, అనుబంధాలు నిలవాలంటే..
లేదంటే, పెట్టి మర్చిపోతే మొక్కలూ ఎండిపోతాయి..

6.41. मतलबी दुनिया के लोग खड़े है हाथों में पत्थर लेकर..
मैं कहाँ तक भागूँ, शीशे का मुकद्दर लेकर..
స్వార్థపు లోకంలో జనాలు చేతులలో రాళ్ళు పట్టుకుని నిలబడి ఉన్నారు..
నేనెక్కడి వరకు పరిగెత్తను, అద్దం వంటి అదృష్టాన్ని పట్టుకుని?..

6.42. हमने कहा जरा ठीक से तोलो
उसने कहा यह इश्क है साहब, 100-200 ग्राम इधऱ उधर तो चलता है..
నేనన్నాను- కాస్త జాగ్రత్తగా కొలువు అని..
తన మాట- ఇది ప్రేమ సుమండీ, వంద రెండొందల గ్రాములు అటూ ఇటూ నడుస్తుందిలే- అని..

6.43. कभी हमसे भी पूछ लो हाल-ए-दिल जनाब..
कभी हम भी कह सकें दुआ है आपकी..
ఎప్పుడైనా నన్నూ అడుగుతుండు, మనసు కుశలమా అని..
ఎప్పుడైనా నాకూ అనే అవకాశం ఇవ్వు, నీ (దయ) ప్రార్థన అని..

6.44. ये ना पूछना ज़िन्दगी ख़ुशी कब देती है..
क्योंकि शिकायतें तो उन्हें भी है जिन्हें ज़िन्दगी सब देती है..
జీవితం సంతోషాన్ని ఎప్పుడు ఇస్తుందని అడగద్దు..
ఎందుకంటే జీవితం అన్నీ ఇచ్చినవారికీ ఏదో ఒక వేదన ఉంటుంది..

6.45. वज़न तो सिर्फ हमारी इच्छाओं का है..
बाकी ज़िन्दगी बिलकुल हलकी फुलकी है..
బరువు కేవలం మన కోరికలదే..
మిగిలిన జీవితం మొత్తం తేలికగానే ఉంది..

6.46. गुरूर मत करना अपने रूप और रुपयों का..
क्योंकि मोर को अपने ही पंख का बोझ ऊपर उड़ने नहीं देता..
గర్వించవద్దు నీ రూపం ధనం చూసుకుని..
నెమలిని దాని రెక్కల బరువే పైదాకా ఎగరనివ్వదు..

6.47. मयखाने से पूछा आज, इतना सन्नाटा क्यों है..
मयखाना भी मुस्कुरा के बोला..
लहू का दौर है साहेब, अब शराब कौन पीता है..
మద్యపానగృహాన్ని అడిగానివాళ, ఇంత మౌనంగా ఎందుకు ఉందని..
అది నవ్వి చెప్పింది- రక్తం తాగే రోజులు, మద్యం ఎవడు తాగుతున్నాడండీ, అని..

6.48. वसीयतें अपने नाम लिखवा लेने से कुछ नहीं होता..
ये तो उड़ान तय करती है की आसमान किसका है..
వీలునామాలు తన పేరు మీద వ్రాయించుకున్నంత మాత్రాన ఏం కాదు..
నింగి ఎవరిది అనేది ఆకాశగమనమే నిర్ధారిస్తుంది..

6.49. शब्द भी हार जाते हैं कई बार जज्बातों से..
कितना भी लिखो कुछ ना कुछ बाकी रह जाता है..
చాలాసార్లు మాటలు కూడా ఓడిపోతాయి, భావాలతో..
ఎంత వ్రాసినా ఏదో ఒకటి మిగిలిపోతుంది..

6.50. एक गफ़लत सी बनी रहने दो हर रिश्ते में..
किसी को इतना न जानो कि जुद़ा हो जाये..
ఒక అసావధానత ఉండనివ్వు ప్రతి అనుబంధంలో..
విడిపోయేంతగా ఎవ్వరిని తెలుసుకోవద్దు..

6.51. पूरे की ख्वाहिश में ये इंसान बहुत कुछ खोता है..
भूल जाता है कि आधा चाँद भी खूबसूरत होता है..
నిండుతనం కావాలనే కోరికతో మనిషి చాలాపోగొట్టుకుంటాడు..
అర్ధచంద్రుడు కూడా అందంగా ఉంటాడనేది మనిషి మర్చిపోతాడు..

6.52. ताक़त अपने लफ़्ज़ों में डालो आवाज़ में नहीं..
क्यूंकि फ़सल बारिश से होती है बाढ़ से नहीं..
బలం నీ మాటలలో పెట్టుకో, గొంతులో కాదు..
ఎందుకంటే పంటలు వానలకు పండుతాయి, వరదలకు కాదు..

6.53. यूँ ही नहीं आती मिठास रिश्तों में..
गुलकन्द के लिये फूलों को मरना पड़ता है..
ఊరికెనే తీయదనం రాదు అనుబంధాలలో..
గుల్ కంద్* కోసం పూవులు చచ్చిపోవలసి ఉంటుంది..
(*గులాబీరేకులతో తయారు చేసే తీయని పదార్థం)

6.54. कभी तो हिसाब करो हमारा भी..
इतनी मोहब्बत भला कौन देता है उधार में..
ఎప్పుడైనా మా లెక్క కూడా కాస్త చూడు..
ఇంత ప్రేమను ఎవరిస్తారుటా అప్పుగా..

6.55. कितनी अजीब है मेरे अन्दर की तन्हाई भी..
हज़ारो अपने है मगर याद तुम ही आते हो..
ఎంత విచిత్రమైనది నా ఒంటరితనం కూడా..
వేలమంది నావారున్నారు, కానీ గుర్తు నీవే వస్తావు..

6.56. दिलो जान से करेंगे हिफ़ाज़त उसकी..
बस एक बार वो कह दे कि मैं अमानत हूं तेरी..
మనసుతో ప్రాణానికి ప్రాణంగా చేస్తాను తన రక్షణం..
తను ఒక్కసారి చెప్పనీ, నేను నీ సొత్తునని..

6.57. शख़्स तो मिल जाते हैं, हर रोज़ बहुत..
पर एक इंसान का मिल जाना, बड़ी बात है..
వ్యక్తులు చాలామంది దొరుకుతారు, ప్రతిరోజూ..
కానీ ఒక్క మనిషి దొరకటం చాలా గొప్ప విషయం..

6.58. मेरी रूह को छू लेने के लिए बस कुछ लब्ज ही काफी है..
कह दो बस इतना ही के तेरे साथ जीना अभी बाकी है..
నా అంతరాత్మను తాకటానికి కొన్ని మాటలు చాలు..
నీతో కలిసి జీవించటం ఇంకా మిగిలి ఉంది- అని ఇంతే చెప్పు..

6.59. मालूम सबको है कि जिंदगी बेहाल है..
लोग फिर भी पूछते हैं, "और सुनाओ क्या हाल है"..?
అందరికి తెలుసు జీవితం వికలంగా ఉందని..
అయినా జనాలు అడుగుతారు, “ఇంకేంటి సంగతులు?” అని..

6.60. हमारे दिल के दफ़्तर में तबादले कहाँ हुज़ूर..
यहाँ जो एक बार आया, बस यहीं रह गया..
మా మనస్సు కార్యాలయంలో స్థానాంతరాలెక్కడ, మహాప్రభో..
ఇక్కడకు ఓసారి వచ్చారంటే ఇంక ఉండిపోతారంతే..

6.61. फ़लक तक साथ चलने की न दुआ कीजिए..
ज़िंदा हूँ ज़मीं पर मैं, पहले यहाँ वफ़ा कीजिए..
స్వర్గం దాకా తోడు నడవటానికి ప్రార్థనలు చేయకండి..
భూమి మీద జీవిస్తున్నాను, మొదలు ఇక్కడ నమ్మకంగా ఉండండి..

6.62. अजीब दस्तूर है ज़माने का साहेब..
अच्छी यादें पेनड्राइव में..
और बुरी यादें दिल में रखते हैं..
విచిత్రమైన పద్ధతి లోకంలో..
మంచి స్మృతులు పెన్ డ్రైవ్ లో పెట్టుకుంటారు,
చెడు గుర్తులు మనస్సులో ఉంచుకుంటారు..

6.63. बहुत मुश्किल से करता हूँ तेरी यादों का कारोबार..
मुनाफ़ा बहुत कम है, पर गुज़ारा हो ही जाता है..
చాలా కష్టం మీద చేస్తాను నీ జ్ఞాపకాల వ్యాపారం..
లాభం చాలా తక్కువ, కానీ ఎట్లగో అట్ల గడుస్తుంది..

6.64. दो पैसे की धूप, चार आने की बारिश..
बारह मास में मौसम बेचता हूँ..
రెండు పైసల ఎండ, పావలా వాన..
పన్నెండు నెలలు నేను ఋతువును అమ్ముతాను..

6.65. वहम था कि सारा बाग अपना है,
तूफां के बाद पता चला,
सूखे पत्तों पर भी हक हवाओं का था..
తోట అంత నాదేనని ఒక అపోహ ఉండేది..
తుఫాను వచ్చి పోయాక తెలిసింది,
ఎండుటాకుల మీద కూడా అధికారం గాలులదేనని..

6.66. कुछ फ़ासले ऐसे भी होते हैं जनाब..
जो तय तो नहीं होते मगर नज़दीकियां कमाल की रखते हैं..
కొన్ని దూరాలు ఇట్లా కూడా ఉంటాయి సుమండీ..
అవి తరగవు కానీ అద్భుతమైన దగ్గరితనం ఉంచుతుంటాయి..

6.67. हर बात के जवाब में मुस्कराना ही अच्छा है..
क्योंकि अब हर किसी को गोली तो मारी नहीं जा सकती..
ప్రతిదానికి జవాబుగా నవ్వటమే మంచిది..
ఎందుకంటే ప్రతి వారిని బులెట్ తో కాల్చేయలేం కదా..

6.68. उतना ही बोलो जितना सुन सको..
लोग भी मुँह में जुबाँ रखते है, सिर्फ तुम ही नहीं..
ఎంత వినగలవో, అంతే మాట్లాడు..
జనాలకు కూడా నోట్లో నాలుక ఉంటుంది, నీకే కాదు..

6.69. दीदार की तलब हो तो नजरें जमाये रखना..
क्यों कि नक़ाब हो या नसीब सरकता जरूर है..
వారిని చూడాలని అవసరం ఉంటే కళ్ళు తిప్పకుండా ఉంచండి..
ఎందుకంటే మేలిముసుగైనా, భాగ్యమైనా తప్పక (పక్కకు) తొలగుతుంది..

6.70. जानते हो महोब्बत किसे कहते हैं ?
किसी को सोचना..
फिर मुस्कुराना और फिर आसू बहाते हुए सो जाना.
ప్రేమ అని దేనిని అంటారో తెలుసా?
ఎవరినైనా అనుకోవటం..
తరువాత నవ్వటం, ఇంక కన్నీరు కారుస్తూ పడుకోవటం..

6.71. चेहरे अजनबी हो जाये तो कोई बात नहीं..
लेकिन रवैये अजनबी हो जाये तो बडी तकलीफ़ देते हैं..
ముఖాలు అపరిచితంగా అయిపోతే ఫరవాలేదు..
కానీ వైఖరులు అపరిచితంగా అయితే చాలా కష్టాన్ని కలిగిస్తాయి..

6.72. शीशे की तरह आर पार हूँ..
फिर भी बहुत की समझों से बाहर हूँ..
అద్దంలా పారదర్శికత ఉన్నవాడిని..
అయినా చాలామందికి అర్థం కాను..

6.73. ख़ामोशी से अपनी पहचान बनाते रहो..
वक़्त खुद बताएगा तुम्हारा नाम..
మౌనంగ నీకు గుర్తింపు తెచ్చుకుంటూ పో..
కాలం తానే నీ పేరు చెప్తుంది..

6.74. जुबां कड़वी सही, पर दिल साफ़ रखता हूँ..
कौन, कब, कहाँ बदल गया सब का हिसाब रखता हूँ..
మాట చేదుగా ఉన్నా మనస్సు నిర్మలంగా ఉంచుకుంటాను..
ఎవరు ఎప్పుడు ఎక్కడ మారిపోయారో, అన్నింటి లెక్క ఉంచుకుంటాను..

6.75. वो पत्ता आवारा ना बनता तो क्या करता..
ना हवाओं ने बख्शा ना शाखाओं ने पनाह दी..
ఆ ఆకు ఊరికే గాలికి ఎగరకపోతే ఏం చేస్తుందిటా..
గాలులు దాన్ని వదలలేదు, కొమ్మలు దానికి రక్షణనివ్వలేదు..

6.76. उनकी नादानी की हद ना पूछिए जनाब..
हमें खोकर, हमारे जैसा ढूंढ रहे हैं वो..
వారి అవివేకం హద్దు అడగకండి అసలు...
నన్ను పోగొట్టుకుని నావంటి వారిని వెతుకుతున్నారు..

6.77. परखने से न जानोगे कभी भी शख्शियत मेरी..
मैं हर उस दिल में रहता हूँ जो मुझपे यकीं रखते..
పరికించినంతమాత్రాన నా వ్యక్తిత్వం అర్థంకాదు..
నామీద నమ్మకం ఉంచే ప్రతీవారి మనసులో నేనుంటాను..

6.78. इतना भी ग़ुमान न कर आपनी जीत पर, ऐ बेख़बर..
शहर में तेरे जीत से ज्यादा चर्चे तो मेरी हार के हैं..
ఓ వెర్రివాడా, ఇంత విర్రవీగకు నీ గెలుపు మీద..
నగరంలో నీ గెలుపుకన్నా నా ఓటమి గురించిన చర్చలే ఎక్కువ ఉన్నాయి..

6.79. चेहरे और पोशाक़ से आँकती है दुनिया..
रूह में उतरकर कब झाँकती है दुनिया..
ముఖం, బట్టలు చూసి అంచనా వేస్తుంది లోకం..
అంతరాత్మలోకి ఎక్కడ తొంగి చూస్తుంది లోకం..

6.80. यूँ चेहरे पर उदासी ना ओढिये साहब..
वक़्त ज़रूर तकलीफ़ का है लेकिन कटेगा मुस्कुराने से ही..
ముఖం మీద విషాదం ఇట్లా పరుచుకోనివ్వకండి..
కష్టకాలమే అయినా కానీ గడిచేది చిరునవ్వుతోనే..

6.81. जो कभी संघर्ष से परिचित नहीं होता..
इतिहास गवाह है, वो कभी चर्चित नहीं होता..
సంఘర్షణతో పరిచయం లేనివాడు ఎవడో..
వాడెప్పుడూ చర్చలలో ఉండడు, చరిత్ర సాక్ష్యం..

6.82. एक नज़र देख के सौ नुक्स निकाले मुझमें..
फिर भी मैं ख़ुश हूँ कि मुझे ग़ौर से देखा उसने..
ఒక్క చూపు చూసి వంద తప్పులు తీసి చూపారు నాలో..
అయినా సంతోషంగా ఉన్నాను, కనీసం జాగ్రత్తగా చూశారు నా వంక అని..

6.83. उम्मीदों का दामन थाम रहे हो, तो हौसला क़ायम रखना..
क्योंकि, जब नाकामियाँ चरम पर हों, तो कामयाबी बेहद करीब होती है..
ఆశల కొంగును పట్టుకుంటున్నావు, ఇక ధైర్యాన్ని ఉంచుకో..
ఎందుకంటే వైఫల్యాలు శిఖరం మీద ఉంటే సఫలత హద్దులేనంత దగ్గరగా ఉంటుంది..

6.84. वो मेरे दिल से बाहर निकलने का रास्ता न ढूँढ सके..
दावा करते थे जो मेरी रग-रग से वाक़िफ़ होने का..
వారు నా మనసులో నుండి బయటకు పోయే దారి వెతుక్కోలేకపోయారు..
నా అణువణువు సుపరిచితమని ఎవరైతే నమ్మకంగా చెప్పేవారో..

6.85. उदास नहीं होना, क्योंकि मैं साथ हूँ,
सामने न सही पर आस-पास हूँ..
पल्कों को बंद कर जब भी दिल में देखोगे,
मैं हर पल तुम्हारे साँसों के साथ हूँ..
బాధపడకు, నేను నీతోడు ఉన్నాను,
ఎదురుంగా లేకపోయినా, దగ్గరలోనే ఉన్నాను..
కనురెప్పలు వాల్చి ఎప్పుడు మనసులో చూసుకున్నా
నేను ప్రతిక్షణం నీ శ్వాసల్లో నీతోపాటు ఉన్నాను..

6.86. बदला जो रंग उसने हैरत हुई मुझे..
मौसम को भी मात दे गई, फ़ितरत जनाब की..
తను రంగులు మారిస్తే నాకు ఆశ్చర్యం కలిగింది..
ఋతువులును కూడా ఓడించింది, తన పద్ధతి..

6.87. कुछ ना चढ़ाओ नवरात्र में मां की थाली में..
पर याद रहे मां शब्द ना चढ़े किसी भी गाली में..
కావాలంటే ఏమీ పెట్టకండి, నవరాత్రిలో అమ్మవారి పళ్ళెంలో..
కానీ గుర్తుంచుకోండి, అమ్మ అనే పదం ఎవరి తిట్లలో లేకుండా చూసుకోండి..

6.88. पूरी ज़िन्दग़ी इत्र लगा लगा के मर गए..
फिर भी राख से सुगंध नहीं आयी..
జీవితమంతా పరిమళం పెట్టుకుని పెట్టుకుని చనిపోయాడు..
అయినా బూడిద నుండి సుగంధం రాలేదు..

6.89. जलेबी ने चुपके से मेरे कान में कहा..
खुद कितने भी उलझे रहो पर दूसरो को हमेशा मिठास दो..
జిలేబీ నెమ్మదిగా నా చెవులో చెప్పింది..
నీవెంత ఉండలు చుట్టుకుపోయి ఉన్నా, ఇతరులకు ఎప్పుడూ తీయదనాన్ని ఇవ్వు..

6.90. वो उम्र भर कहते रहे तुम्हारे सीने में दिल ही नहीं..
दिल का दौरा क्या पड़ा, ये दाग भी धुल गया..
వారు బ్రతుకంతా అంటుండిపోయారు నీకు గుండె లేదని..
గుండెపోటు ఏమంటూ వచ్చిందో, ఆ నింద కూడా చెరిగిపోయింది..

6.91. किताब मेरी, पन्ने मेरे और सोच भी मेरी..
फिर मैंने जो लिखे वो ख्याल क्यों तेरे..
పుస్తకం నాది, కాగితాలు నావి, ఆలోచనా నాదే..
అయిన్పపటికీ నేను వ్రాసిన భావాలు నీవి ఎందుకైనాయి?..

6.92. सफल रिश्तों के यही उसूल हैं..
वो सब भूलिए, जो फिजूल हैं..
సఫలవంతమైన అనుబంధాలకు ఇదే నియమం..
అనవసరమైనదంతా మర్చిపోండి..

6.93. भूलकर भी मुसीबत में न पड़ना कभी..
खामखां, अपने और परायो की पहचान हो जाएगी..
మర్చిపోయి కూడా కష్టంలో పడవద్దు ఎప్పుడూ..
అనవసరంగా మన ఎవరో పర ఎవరో తెలిసిపోతుంది..

6.94. मत पूछो कि मेरा कारोबार क्या है ?..
महोब्बत की छोटी सी दुकान है नफ़रत के बाज़ार में..
నా వ్యాపారం ఏంటని అడగవద్దు..
చిన్న దుకాణం, ప్రేమ ది, ద్వేషాల బజారులో..

6.95. शायरी मेरा शौक नहीं..
ये तो मोहोब्बत की कुछ सज़ाएं है..
కవిత్వం నా మోజు కాదు..
ప్రేమించినందుకు కొన్ని దండనలుంటాయి, అంతే..

6.96. अगर फ़ुर्सत के लम्हों मे तुम मुझे याद करते हो तो अब मत करना..
क्योंकि मैं तन्हा जरूर हूँ, मगर फ़िजूल बिल्कुल नहीं..
తీరికవేళల్లో నన్ను గుర్తు చేసుకుంటావు, ఇకపై అట్లా చేయకు..
ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నానే కానీ పనిలేకుండా లేను..

6.97. खुशबू क्यों ना आये मेरी बातों से यारों..
मैंने बरसों से एक ही फूल से जो मोहब्बत की है..
నా మాటలనుండి పరిమళం ఎందుకు రాదు నేస్తాలూ..
నేను ఏళ్ళుగా ఒకే పువ్వును ప్రేమించాను..

6.98. करेगा ज़माना भी हमारी क़दर एक दिन..
बस ये वफ़ादारी की आदत छूट जाने दो..
లోకం కూడా ఒకరోజు నాకు విలువనిస్తుంది..
ఇదిగో, ఈ విశ్వాసపాత్రత అలవాటు పోతే చాలు..

6.99. मुस्कुराने के बहाने जल्दी खोजो वरना..
ज़िन्दगी रुलाने के मौके तलाश लेगी..
చిరునవ్వు నవ్వేందుకు వంకలు వెతకండి..
లేదంటే జీవితం ఏడిపించే అవకాశాలు దొరకబుచ్చుకుంటుంది..

6.100. आज कल शरीफ़ केवल वही लोग हैं..
जिनके मोबाईल में password नहीं होता हैं..
ఇవాళ రేపు మర్యాదస్తులంటే..
చరవాణిలో కూటపదం (పాస్ వర్డ్) లేనివారు..


6.101. खुद पूछो अपने दिल से कि मुझको भुलाना चाहता है..
अगर वो हाँ कह दे तो कसम से मोहब्बत छोड़ दूँगा..
స్వయంగా నీ మనసును అడుగు, నన్ను మర్చిపోవాలని అనుకుంటుందా..
ఒకవేళ సరే అంటే, సత్య ప్రమాణంగా ప్రేమను విడిచిపెడతాను..

6.102. थोड़ी-सी तो ख़ुद्दारी भी लाज़मी थी..
उसने बात नहीं की तो हमने भी छोड़ दी..
కొద్దిగైనా అహం ఉండటం అవసరం కదా..
తను మాట్లాడలేదు, అందుకే నేనూ మానేశాను..

6.103. हम जैसे सिरफिरे ही इतिहास रचते हैं..
समझदार तो केवल इतिहास पढ़ते हैं..
మావంటి తలతిరిగినవారే చరిత్ర వ్రాస్తారు..
బుద్ధిమంతులు కేవలం చరిత్ర చదువుకుంటారు..

6.104. लगता हे बारिश भी मयखाने जाती हे..
कभी गिरती, कभी संभलती, कभी लड़खडा के आती है..
బహుశ వాన కూడా మద్యపానగృహానికి పోతుందేమో..
ఒకసారి పడుతుంది, ఒకసారి ఆగుతుంది, ఒక్కోసారి తడపడుతూ కురుస్తుంది..

6.105. यूँ न झाँको इस कदर मेरी रूह के अन्दर..
कुछ ख़्वाहिशें मेरी वहाँ बे-लिबास रहती हैं..
ఇంతగా నా అంతరాత్మలోకి తొంగి చూడబోకు..
కొన్ని కోరికలు అక్కడ వస్త్రహీనంగా ఉంటాయి..

6.106. हम तो नरम पत्तों की शाख़ हुआ करते थे..
छीले इतने गए कि खंज़र हो गए..
నేను మెత్తని ఆకుల కొమ్మనై ఉండేదాన్ని..
ఎంతగా చీల్చారంటే పిడిబాకులా అయిపోయాను..

6.107. नफरतों के बाजार में जीने का अलग ही मजा है..
लोग रुलाना नहीं छोडते और जिंदादिल हँसना नहीं छोडते..
ద్వేషాల బజారులో జీవించటంలో సంబరమే వేరు..
జనాలు ఏడిపించటం మానరు, ఉత్సాహవంతులు (చిరు)నవ్వు నవ్వటం మానరు..
(జిందాదిల్ అంటే ఆనందంగా, సంతోషంగా, బాధలు పట్టించుకోకుండా ఉండేవారు..)

6.108. मिल जायेगा हमें भी कोई टूटके चाहने वाला..
अब शहर का शहर तो बेवफ़ा नहीं हो सकता..
నాకూ దొరుకుతారులే, ఎవరో ఒకరు, విరిగి/విరగబడి కోరుకునేవారు..
ఇహ మొత్తం నగరంలో అంతా మోసం చేసేవారే అయి ఉండరు కదా..

6.109. हवा गुज़र गयी, पत्ते हिले भी नहीं..
वो मेरे शहर मे आये और मिले भी नहीं..
గాలి వచ్చి పోయింది, ఆకులు కదలనైనా లేదు..
తను మా ఊరు వచ్చీ, కలవనైనా కలవలేదు..

6.110. वक़्त को भी हुआ है, ज़रूर, किसी से इश्क़..
जो वो बेचैन है इतना कि ठहरता ही नहीं..
కాలానికి కూడా ఎవరిపైనో ప్రేమ కలిగే ఉంటుంది..
ఎంతగా వ్యాకులత/అసహనం ఉందో, అసలు ఆగనైనా ఆగదు..

6.111. रेस वो लोग लगाते है जिसे अपनी किस्मत आजमानी हो..
हम तो वो खिलाड़ी है जो अपनी किस्मत के साथ खेलते है..
తన భాగ్యాన్ని పరీక్షించుకునేవారు రేస్ లు పరిగెత్తుతారు..
మేము భాగ్యంతోనే ఆటాడుకునే రకాలైన ఆటగాళ్ళం..

6.112. मैं ने कब कहा कीमत समझो तुम मेरी..
हमें बिकना ही होता तो यूँ तन्हा ना होते..
నేనెప్పుడు అన్నాను, నా విలువ తెలుసుకోమని..
నేను అమ్ముడు పోవాలనే అనుకుంటే ఇట్లా ఒంటరిగా ఉండిపోయేదే కాదు..

6.113. ये तो अच्छा है कि दिल सिर्फ सुनता है..
अगर कहीं बोलता होता तो क़यामत आ जाती..
మనసు కేవలం వింటుంది, అదే మంచిదైంది..
ఒకవేళ మాట్లాడేట్లైతే ప్రలయం వచ్చి పడేది..

6.114. ज़रूरी तो बहुत है इश्क ज़िन्दगी में मगर..
ये जानलेवा ज़रूरत भगवान किसी को न दें..
ప్రేమ జీవితంలో చాలా అవసరమైందే..
ఈ ప్రాణాంతకమైన అవసరాన్ని భగవంతుడు ఎవరికీ కలిగించకుండుగాక..

6.115. बिखरा वज़ूद, टूटे ख़्वाब, सुलगती तन्हाईयाँ..
कितने हसींन तोहफे दे जाती है ये अधूरी मोहब्बत..
చెదిరిన అస్తిత్వం, విరిగిన కలలు, కాల్చే ఒంటరితనాలు..
అపూర్ణమైన ప్రేమ ఎన్ని అందమైన కానుకలిచ్చి పోతుందో కదా..

6.116. मौहब्बत कोई तस्वीर नहीं जनाब, जो देख लोगे..
एक एहसास है जो चुपके से दिल में दस्तक देता है..
ప్రేమ చిత్రపటం కాదు, చూసుకుందాం అనుకోవటానికి..
అదొక భావన, దాక్కుని వచ్చి గుండెను తడుతుంది..

No comments:

Post a Comment