9.1. बहुत नाकाम शख्स हूँ मैं..
पहले तुझे पाने में नाकाम रहा..
फिर तुझे भुलाने में..
పూర్తిగా విఫలుడిని నేను..
మొదలు నిన్ను పొందటంలో విఫలమైనాను..
తరువాత నిన్ను మర్చిపోవటంలో..
9.2. बीतता वक़्त है, लेकिन..
खर्च हम हो जाते हैं..
గడిచేది కాలమే..
కానీ వ్యయమైపోయేది మనం..
9.3. कुछ अलग सा है हमारी मोहब्बत का हाल..
तेरी चुप्पी और मेरे ख़ामोश सवाल..
కాస్త భిన్నంగా ఉంది మన ప్రేమ పరిస్థితి..
(ఒకవైపు) నీ మౌనం, (మరోవంక) నా నిశ్శబ్ద ప్రశ్నలు..
9.4. ज़िंदगी एक आइने की तरह है..
ये तभी मुस्कुराऐगी जब आप मुस्कुराओगे ..
జీవితం అద్దం లాంటిది..
మీరు నవ్వినప్పుడే అదీ నవ్వుతుంది..
9.5. कितने अनमोल होते हैं ये मोहब्बत के रिश्ते
भी..
कोई याद ना भी करे, फिर भी
इंतज़ार रहता है ..
ఎంతో అమూల్యమైనవి ఈ ప్రేమానుబంధాలు కూడా..
గుర్తు చేసుకునేవారెవరూ లేకపోయినా నిరీక్షణ సాగుతుంటుంది..
9.6. काश पलट के पहुँच जाऊँ बचपन की उन वादीओं
में..
जहाँ ना कोई ज़रूरत थी, और
ना कोई ज़रूरी था..
చిన్నప్పటి ఆ లోయలలోకి తిరిగి వెళిపోవాలని ఉంది..
ఏ అవసరమూ లేదక్కడ, కావాల్సినవారెవ్వరూ లేరక్కడ..
9.7. कोई नहीं आऐगा मेरी जिदंगी में तुम्हारे
सिवा..
एक मौत ही है जिसका मैं वादा नहीं करता..
నీవు తప్ప ఎవ్వరూ రారు నా జీవితంలోకి..
చావొక్కటే ఉంది, దానిని గురించి మాత్రం మాటివ్వలేను..
9.8. ऐ ज़िंदगी, अब तू ही
रूठ जा मुझसे..
ये रुठे हुए लोग, मुझसे
मनाए नहीं जाते..
ఓ జీవితమా, ఇక నీవే నాపై అలుగు..
ఈ అలిగినవారిని బుజ్జగించటం నావల్ల కావట్లేదు..
9.9. हम ना रहें भी तो हमारी यादें वफ़ा करेंगी
तुम से..
ये ना समझना की तुम्हें चाहा था बस दो दिन के
लिए ..
నేను ఉండకపోయినా నా జ్ఞాపకాలు నీతో పాటు నిలిచిపోతాయి..
ఏదో నిన్ను రెండు నాళ్ళకోసం ప్రేమించానని అనుకోకు..
9.10. मेरी जिंदगी का खेल शतरंज से भी मज़ेदार
निकला..
मैं हारा भी तो अपनी हीं रानी से..
నా జీవితపు చదరంగం ఆట ఇంకా రసవత్తరమైందిలే..
ఓడినా నేను ఓడింది నా రాణి చేతిలోనే..
9.11. खुद को मेरे दिल में ही छोड़ गए हो...
तुम्हे तो ठीक से बिछड़ना भी नहीं आता..
నిన్ను నువ్వు నా మనసులోనే మరిచి వెళ్ళావు..
నీకు సరిగ్గా విడిపోవటం కూడా రాదే..
9.12. गीले कागज़ कि तरह है ज़िन्दगी अपनी..
कोई जलाता भी नहीं, और कोई
बहाता भी नहीं..
తడి కాగితం వంటిది నా జీవితం..
కాల్చనూ కాల్చరెవరూ, (నీటిలో) తేల్చనూ
తేల్చరు..
9.13. ऐ दिल, सो जा,
कसम से कोई नहीं..
दरवाज़ा सिर्फ़ तेज़ हवा से खुला है..
ఓ మనసా, పడుకో, ఒట్టు, ఎవ్వరూ లేరు..
తలుపు గాలి వేగానికి తెరుచుకుందంతే..
9.14. दुश्मनों को हराओ या ना हराओ..
लेकिन उनके सामने ज़रूर मुस्कुराओ..
శత్రువులను ఓడించినా ఓడించకపోయినా ఫరవాలేదు..
వారి ఎదుట తప్పకుండా చిరునవ్వు నవ్వాలి..
9.15. कुछ अरमान उन बारिश कि बूंदों की तरह होते
हैं..
जिनको छूने की ख़्वाहिश में हथेलिया तो गीली
होजाती..
पर हाथ हमेशा खाली रह जाते हैं..
కొన్ని కోరికలు వానచినుకుల వంటివి..
వాటిని తాకాలనే కోరికతో అరచేతులు తడి అవుతాయి..
కానీ చేతులు ఖాళీగానే ఉండిపోతాయి..
9.16. बस इतनी-सी उम्र का तलबदार है ’मजबूर’..
न मरूँ तेरे पहले, न जीयूँ
तेरे बाद..
‘మజ్బూర్’ అడిగే ఆయువు ఇంతే..
నీకన్నా ముందు చావనూ వద్దు, నీ తరువాత బ్రతకనూ
వద్దు..
9.17. मैं रात भर जन्नत की सैर करता रहा यारों..
सुबह आँख खुली तो सर माँ के कदमों में था..
నేను రేయంతా స్వర్గంలో విహరించాను నేస్తాలూ..
ఉదయం కన్నులు తెరవంగానే తల అమ్మ పాదాల వద్ద ఉంది..
9.18. जब भी बही खाते निकलेंगे तेरे मेरे क़र्ज़
के..
तुझ पे मेरी मोहब्बत उधार निकलेगी और मुझ पे
तेरे सितम..
నీదీ, నాదీ అప్పుల పద్దు ఎప్పుడు తెరుచుకున్నా..
నీవు నాకు ప్రేమ అప్పుపడి ఉంటావు, నేను నీకు ఆరడి
(అప్పుపడతాను)..
9.19. सिर्फ़ रिश्ते टूटा करते हैं साहब..
मुझे तो उनसे इश्क़ हुआ है...
తెగేవి అనుబంధాలు మాత్రమే సుమండీ..
నాకు కలిగింది తనపై ప్రేమ..
9.20. सबूत गूनाहों के होते हैं..
बेगुनाह मुहब्बत का क्या सबूत दूँ..
సాక్ష్యాలుండేది నేరాలకు..
నిరపరాధమైన ప్రేమకు ఏ సాక్ష్యం చూపను?..
9.21. ए मोहब्बत, तुझे
पाने की कोई राह नहीं...
तू तो उसे ही मिलेगी, जिसे
तेरी परवाह नहीं..
ఓ ప్రేమా, నిన్ను పొందే దారేది లేదుగా..
నీగురించి పట్టనివారికే నీవు దొరుకుతావు..
9.22. जुबाँ न भी बोले तो मुश्किल नहीं..
फिक्र तब होती है जब खामोशी भी बोलना छोड़ दें..
నోటితో పలకకపోయినా కష్టం అనిపించదు..
మౌనం కూడా మాట్లాడటం మానేస్తేనే చింత కలుగుతుంది..
9.23. लिख देना ये शब्द मेरी कब्र पे दोस्तों..
कि मौत अच्छी है पर दिल का लगाना अच्छा नहीं..
నేస్తాలూ, నా సమాధి (బొంద)పై ఇట్లా వ్రాయండి..
చావే నయం, మనసు పారేసుకోవటం మంచిది కాదు అని..
9.24. कुछ मुलाकातें दरवाज़े खोल जाती है..
या तो दिल के या तो आँखों के..
కొన్ని కలయికలు తలుపులను తీసి పోతాయి..
మనసువైనా కావచ్చు, కళ్లవైనా కావచ్చు..
9.25. मैं हर रात सारी ख्वाहिशों को खुद से पहले
सुला देता हूँ..
मगर ये हर सुबह मुझसे पहले जाग जाती हैं
నేను ప్రతీ రాత్రి కోరికలన్నింటినీ నాకన్నా ముందే పడుకోబెట్టేస్తాను..
కానీ ఇవి ప్రతి ఉదయం నాకన్నా ముందే నిద్ర లేస్తాయి..
9.26. लोग कहते हैं, ‘दुआ
क़ुबूल होने का भी वक़्त होता है’..
हैरान हूँ मैं ‘किस वक़्त
मैंने तुझे नहीं माँगा’..
జనాలంటారు- ‘ప్రార్థన తీరేందుకు కూడా ఒక సమయం రావాల’ని..
‘నేను నిన్ను కోరుకోనిది ఏ వేళలో అబ్బా?’- అని
ఆశ్చర్యపోతున్నాను..
9.27. लोग अक्सर शोर में नींद ना आने की शिकायत
करते हैं...
एक मैं हूँ, मुझे तेरी
ख़ामोशी सोने नहीं देती..
జనాలు గోలలో నిద్రరాదని ఇబ్బంది పడుతుంటారు..
నాకేమో నీ మౌనం నిద్ర పట్టనివ్వటం లేదు..
9.28. भरने को तो हर ज़ख्म भर जाएँगे..
कैसे भरेगी वो जगह जहाँ तेरी कमी होगी..
మానటానికేమి?, అన్ని గాయాలూ మానిపోతాయి..
కానీ నీవు లేని చోటు నీ లోటు ఎట్ల తీరుతుంది?..
9.29. मैं कहता था ना कि वक्त ज़ालिम होता है..
देख लो हक़ीक़त से ख्वाब हो गए तुम भी..
నేనన్నానా లేదా, కాలం కనికరం లేనిదని..
చూడు, వాస్తవం నుండి కలవైపోయావు నీవు..
9.30. कोई कह दे गमों से अब तो बाँध लो सामान अब
अपना..
बहुत दिनों से रुका मेहमान किसी को अच्छा नहीं
लगता..
ఈ బాధలకు ఎవరైనా చెప్పండి, ఇక మీ సామాను
సర్దుకోండని..
ఎక్కువ కాలం ఉండిపోయే అతిథి ఎవ్వరికీ నచ్చరు..
9.31. मुद्दतों बाद जब उनसे बात हुई, तो बातों बातों में मैंने कहा..
कुछ झूठ ही बोल दो, और वो
हँस के बोले, तुम्हारी याद बहुत आती है..
ఎంతో కాలానికి తనతో మాట్లాడినప్పుడు, మాటల సందర్భంలో
నేనన్నాను-
అబద్ధమేదైనా చెప్పరాదా?- అంటే నవ్వుతూ తను
అన్న మాట- నీవు బాగా గుర్తుకు వస్తావ-ని..
9.32. मेरी नज़र से कभी खुद को देखना..
तुम खुद ही खुद पे फिदा हो जाओगे..
నా కళ్ళతో ఎప్పుడైనా నిన్ను నువ్వు చూసుకో..
నీ మీద నీవే మనసు పారేసుకుంటావు..
9.33. गिला-शिकवा ही कर डालो के कुछ वक्त कट
जाये ..
लबों पे आप के ये खामोशी अच्छी नहीं लगती ..
ఏవైనా నా మీద అభియోగాలే చెప్పవచ్చు కదా, కాస్త కాలక్షేపం
అవుతుంది..
నీ పెదాలకు మౌనం ఏమాత్రం నప్పటం లేదు..
9.34. ना वो मिलते हैं, ना
हम रुकते हैं..
पता नहीं, रास्ता ग़लत है,
या मंज़िल..
తనేమో లభించే అవకాశం లేదు, నేనేమో ఆగను..
దారే తప్పో, లక్ష్యం తప్పో- అర్థం కావటంలేదు..
9.35. एहसास-ए-मुहब्बत के लिए बस इतना ही काफ़ी
है..
तेरे बगैर भी हम तेरे ही रहते हैं..
ప్రేమానుభూతికోసం ఇంత అయినా చాలు..
నీవు లేకపోయినా నేను నీకే చెంది ఉండిపోతాను..
9.36. कितने मज़बूर हैँ हम तकदीर के हाथों..
ना तुम्हें पाने की औकात रखते हैं, और ना तुम्हें खोने का हौंसला...
నాదెంత నిస్సహాయతో విధి చేతిలో..
నిన్ను పొందేంత స్థాయీ లేదు, నిన్ను
పోగొట్టుకోగలిగే ధైర్యమూ లేదు..
9.37. मत पूछो कैसे गुज़रता है हर पल तुम्हारे
बिना..
कभी बात करने की हसरत, कभी
देखने की तमन्ना..
ప్రతి క్షణం నీవు లేక ఎట్లా గడుస్తుందో చెప్పలేను..
ఓసారి మాట్లాడాలనే కోరిక, మరొకప్పుడు చూడాలనే
ఆకాంక్ష..
9.38. दर्द भी तुम, दवा भी
तुम..
इबादत भी तुम, ख़ुदा भी
तुम...
चाहा भी तुमको, और पाया भी
नहीं..
साथ भी तुम, और जुदा भी
तुम..
నెప్పివీ నీవే, మందువూ నీవే..
ఆరాధనా నీవే, దేవతవూ నీవే..
కోరింది నిన్నే కానీ పొందింది లేదు..
తోడున్నదీ నీవే, వీడిందీ నీవే
9.39. अब भी बाकी है थोड़ी-सी चाहत उसमें मेरे
लिए..
पहले भी कईं बार ये धोखा हुआ है मुझे ..
ఇంకా తనలో నా పై కోరిక కాస్త మిగిలి ఉంది..
ఇదివరకు కూడా చాలాసార్లు నాకు ఈ భ్రమ కలిగింది..
9.40. कहाँ से लायें अपनी बेगुनाही के पक्के
सबूत..
दिल, दिमाग और नज़र,
सब कुछ तो तेरी क़ैद में है..
నేను నిర్దోషిననటానికి గట్టి సాక్ష్యాధారాలను ఎక్కడి నుండి
తేగలను?..
మనసు, మెదడు, దృష్టి- అన్నీ నీ నిర్బంధంలోనే కదా ఉన్నాయి..
9.41. तेरी हर याद से शुरु होती है मेरी हर सुबह..
फिर ये कैसे कह दूँ कि मेरा दिन खराब रहा..
నీ ప్రతీ జ్ఞాపకంతో మొదలవుతుంది నా ప్రతి ఉదయం..
మరి, నాకు ఈ రోజు బాగ గడవలేదని ఎట్లా అనగలను?..
9.42. एक वो पगली है- जो मुझे समझती ही नहीं..
और यहाँ जमाना- मेरे शेर पढ़कर दीवाना हुआ जा
रहा है..
ఓ పక్క ఆ వెర్రిది- నన్నుఅర్థమే చేసుకోదు..
మరోపక్క ఈ లోకం- నా షేర్లు చదివి మనసుల పారేసుకుంటున్నారు..
9.43. मैं ने ज़िन्दगी से कुछ नहीं माँगा तेरे
सिवा ...
और ज़िन्दगी ने मुझे सब कुछ दिया तेरे सिवा..
నేను జీవితంలో ఇంకేదీ కోరలేదు, నిన్ను తప్ప..
జీవితం నాకన్నీ ఇచ్చింది, నిన్ను తప్ప..
9.44. माँग लूँ यह मन्नत कि फिर यही जहाँ मिले..
फिर वही गोद, फिर वही माँ
मिले..
ఈలోకమే తిరిగి దొరకాలని కోరిక కోరతాను..
మళ్ళీ అదే ఒడి, మళ్ళీ ఈ అమ్మే దొరకాలి నాకు..
9.45. मेहनत कर ली अपनी हैसीयत थी जितनी..
अब बारी तक़दीर की है हैसियत दिखाने कि..
నా సత్తాకు తగినట్టు శ్రమ పడ్డాను..
ఇంక సత్తా చూపవలసిన వంతు భాగ్యానిది..
9.46. कुछ ज़ख्म सदियों बाद भी ताज़ा रहते हैं
जनाब..
वक़्त के पास भी हर मर्ज़ की दवा नहीं होती..
కొన్ని గాయాలు ఏళ్ళ తరువాత కూడా కొత్తగా ఉంటాయి సుమండీ..
కాలం వద్ద కూడా ప్రతి బాధకూ మందు ఉండదు..
9.47. आज तोहफ़ा लाने निकला था शहर में तेरे
लिए..
कम्बखत खुद से सस्ता कुछ ना मिला..
నీకోసం కానుక తేవాలని ఊరంతా తిరిగినాను..
కానీ, ఛ, నాకన్నా తక్కువలో ఏదీ దొరకలేదు..
9.48. साहिल के सुकूं से किसे इन्कार है लेकिन..
तूफ़ान से लड़ने में मज़ा और ही कुछ है..
తీరంపై ఉండే హాయిని ఎవరు కాదన్నారు?..
కానీ తుఫాన్లతో పోరాడే మజాయే వేరు..
9.49. तू हकीकत-ए-इश्क है, या कोई फ़रेब..
ज़िन्दगी में आती नहीं, ख़्वाबों
से जाती नहीं..
నీవు ప్రేమ వాస్తవానివేనా, లేక మోసానివా?..
జీవితంలోకి వచ్చేదీ ఉండదు, కలలనుండేమో పోనే పోవు..
9.50. वो जान गया हमें दर्द में भी मुस्कुराने
की आदत है..
इसलिए वो रोज़ नया दुःख देता है मेरी ख़ुशी के
लिए..
నాకు నెప్పి ఉన్నా కూడా నవ్వటం అలవాటని అతడికి
తెలిసిపోయింది..
ఇందుకే రోజూ కొత్త బాధలను ఇస్తాడు, నా సంతోషం కోసం..
9.51. मेरी बातों में मेरी यादो में..
हिसाब करके देखो बेहिसाब हो तुम..
నా మాటలలో నా జ్ఞాపకాలలో..
లెక్క వేసుకుని చూసుకో, లెక్కలేనంత
నీవున్నావు..
9.52. मेरे चुप रहने से नाराज़ ना हुआ करो..
कहते हैं, टूटे हुए लोग
हमेशा ख़ामोश हुआ करते हैं..
నేను మౌనంగా ఉన్నానని కోపం తెచ్చుకోకు..
(మనసు) విరిగిపోయినవాళ్ళు నిత్యం మౌనంగానే ఉంటారని అంటారు..
9.53. अगर वह मौत भी बन जाए..
तो भी, हम उससे मिलने की
दुआ करेंगे..
తను మృత్యువుగా అయినా సరే..
నేను తనను కలవాలనే ప్రార్థిస్తాను..
9.54. इतना तो किसी ने चाहा भी न होगा..
जितना मैंने सिर्फ सोचा है तुम्हें ..
నేను నీ గురించి ఆలోచించినంతగా..
ఎవరూ (ఎవరినీ) కోరుకుని కూడా ఉండరు..
9.55. लिख दूँ तो लफ्ज़ तुम हो.. सोच लूँ तो
ख़्याल तुम हो..
माँग लूँ तो मन्नत तुम हो.. चाह लूँ तो मोहब्बत
भी तुम हो..
వ్రాశానంటే మాటవు నీవు, ఆలోచిస్తే భావనవు
నీవు..
అడిగితే మొక్కువు నీవు, కోరుకుంటే ప్రేమవూ
నీవే..
9.56. शिकायते तो बहुत है तुझसे, ऐ जिन्दगी..
पर जो दिया तू ने, वो भी
बहुतों को नसीब नहीं...
చెప్పుకోవలసినవి (బాధలు) చాలా ఉన్నాయి నీతో, ఓ జీవితమా..
కానీ నీవు (నాకు) ఇచ్చినంత కూడా చాలామందికి భాగ్యం ఉండదు..
9.57. रेगिस्तान भी हरा होता है..
जब पर्स नोटों से भरा होता है..
ఎడారి కూడా పచ్చగా ఉంటుంది..
స్యూతం (పర్సు) డబ్బుతో నిండి ఉంటే..
9.58. जब धन होगा खाते में..
तब सब रहेगे नाते में..
ఖాతాలో ధనం ఉంటే..
ప్రతివారు బంధుత్వం నిలుపుకుంటారు..
9.59. पानी में तैरना सीख ले मेरे दोस्त..
आँखों में डूबने वालों का अंजाम बुरा होता है ..
నీటిలో ఈదటం నేర్చుకో మిత్రమా..
కన్నులలో మునిగే వారి పరిణామం దారుణంగా ఉంటుంది..
9.60. दिल धोखे में है..
और धोखेबाज़ दिल में ...
మనసు అపోహలో ఉంది..
మోసకారేమో మనసులో ఉన్నాడు..
9.61. वो नदी थी वापस मुड़ी नहीं..
मैं समंदर था आगे बढ़ा नहीं..
ఆమె నది, తిరిగి వెనక్కు మళ్ళలేదు..
నేను సముద్రాన్ని, ముందుకు సాగలేకపోయాను..
9.62. हजारों साल बीते, पर
इसका खारापन नहीं जाता..
न जाने किसके आंसू हैं, समंदर,
तेरे पानी में..
వేనవేల ఏళ్ళు గడిచిపోయాయి, కానీ దీని ఉప్పదనం
పోదు..
సముద్రమా, ఏమో, నీ నీటిలో ఎవరి కన్నీరు నిండిందో..
9.63. ना जाने किस मिट्टी को मेरे वजूद की
ख्वाइश थी..
मैं उतना तो बना भी न था, जितना
मिटा दिया गया हूँ..
ఏమో, ఏ మట్టికి నా అస్తిత్వం కావాలనే ఆకాంక్ష ఉన్నదో..
నన్ను చెరిపేసినంతగా (తుడిచేసినంతగా) నేను తయారు కూడా
కాలేదు..
9.64. तेरी आँखों की तौहीन है ये जरा सोचो ...
तुम्हारा चाहने वाला शराब पीता है ..
నీ కన్నులకే అవమానం, కాస్త ఆలోచించు..
నిన్ను కోరుకునేవాడు మధువు తాగుతాడు..
9.65. कोई उसे जा के कह दो कि मैं साँस लेना
चाहता हूँ ..
वो मेरे वजूद से अपनी यादों की रस्सियां खोल दे..
ఎవరైనా తనతో వెళ్ళి చెప్పండి, నేను ఊపిరి
పీల్చుకుందామనుకుంటున్నాను..
నా అస్తిత్వం నుండి తన జ్ఞాపకాల తాళ్ళను విప్పేయమనండి..
9.66. कुछ फ़ुर्सत के लम्हों का इंतज़ार करता
हूँ..
पूरे दिन खुद को ख़र्च करके, मैं पूरा शाम..
तुझपे खर्च करने का इंतज़ार करता हूँ...
కొన్ని విరామక్షణాల కోసం నిరీక్షిస్తాను..
రోజంతా నన్ను నేను ఖర్చు పెట్టుకని, సాయంత్రమంతా
నీమీద ఖర్చు పెట్టటానికి ప్రతీక్షిస్తాను..
9.67. सुनो, महफूज कर लो न
हमें खुद में..
के बिन तेरे, बेवजह बिखर
रहे हैं हम..
వినవోయి, నీలో నన్ను కాస్త భద్రపరచుకోవూ?..
నీవు లేక అకారణంగా చెదిరిపోతున్నాను..
9.68. अपने लफ़्ज़ों पर ग़ौर कर के बता..
लफ्ज़ कितने थे, तीर कितने
थे..
నీ మాటలపై దృష్టిపెట్టి ఓసారి చెప్పు..
అందులో వాక్కులెన్ని, బాణాలెన్ని?..
9.69. ज़हर के असरदार होने से कुछ नहीं होता
दोस्त..
खुदा भी राज़ी होना चाहिए मौत देने के लिये...
విషంలో శక్తి ఉండగానే సరిపోదు, నేస్తమా..
మృత్యువును ఇవ్వటానికి దేవుడు కూడా సిద్ధంగా ఉండాలి..
9.70. वक़्त बहुत कुछ छीन लेता है..
खैर मेरी तो सिर्फ़ मुस्कुराहट थी..
కాలం ఎన్నో లాగేసుకుంటుంది..
పోన్లే, నాది చిరునవ్వు ఒక్కటే కదా..
9.71. अपने पैरों पर खड़े होकर मरना..
घुटने टेक कर जीने से कहीं बेहतर है..
తన కాళ్ళ మీద తాను నిలబడి చనిపోవటం..
మోకాళ్ళ బేరానికి వచ్చి జీవించటానికన్నా చాలా నయం..
9.72. उठाना खुद ही पड़ता है, थका टुटा बदन अपना..
कि जब तक साँसे चलती हैं, कन्धा
कोई नहीं देता..
అలసి, విరిగిన మన తనువును మనమే పైకి లేపుకోవాలి..
శ్వాసలు ఆడుతున్నంతవరకు ఎవరూ భుజాలపై (పాడె) మోయరు..
9.73. चलने दो ज़रा आँधियाँ हकीकत की..
न जाने कौन से झौंके में अपनों के मुखौटे उड़
जाएं..
వాస్తవపు గాలివానలు చెలరేగనీగాక..
ఏమో, ఏ వాటుకు సొంతవారి ముఖాల పై ముసుగులు తొలగుతాయో..
9.74. कठपुतली के दर्द को भला किसने जाना है?..
डोर नचाती है, खुश होता
ज़माना है..
తోలుబొమ్మ బాధ ఎవరికి తెలిసింది కనుక?..
దారం ఆడిస్తుంటుంది, లోకం సంబరపడుతుంది..
9.75. किसी को नींद आती है, मगर ख़्वाबों से नफ़रत है..
किसी को ख़्वाब प्यारे हैं मगर वो सो नहीं
सकता..
ఒకరికి నిద్ర పడుతుంది కానీ కలలంటే ద్వేషం..
మరొకరికి కలలంటే మక్కువే, కానీ నిద్ర పట్టదు..
9.76. अरे ये बद्दुआयें किसी और के लिए रख..
मोहब्बत का मरीज़ हूँ, खुद
ब खुद मर जाऊँगा..
ఈ శాపనార్థాలు వేరెవరి కోసమైనా పెట్టుకో..
నేను ప్రేమ రోగిని, నాకై నేనే చచ్చిపోతాను..
9.77. काश के होता ये दिल पत्थर का यारों..
खुद घायल हो जाते, चोट
पहुँचाने वाले..
అబ్బ, ఈ హృదయం పాషాణమైతే బాగుండేది, నేస్తాలూ..
గాయపరచాలనుకునేవాడే దెబ్బతినేవాడు..
9.78. खुद को भूल न जाऊँ, भटक
न जाऊँ कहीं..
एक टुकड़ा आइना जेब में रखता हूँ अक्सर..
నన్ను నేను మరిచిపోయి దారి తప్పుతానేమో అని..
ఎప్పుడు ఒక అద్దం ముక్క నా జేబులో పెట్టుకుంటాను..
9.79. मैं ने कब कहा कीमत समझो तुम मेरी..
हमें बिकना ही होता तो यूँ तन्हा ना होते..
నేనెప్పుడన్నాను, నా విలువ తెలుసుకోమని?..
అమ్ముడు పోవాలనే అనుకుంటే ఇట్ల ఒంటరిగా ఉండేదే కాదు..
9.80. ज़िन्दगी भर कोई साथ नहीं देता, यह जान लिया हमने..
लोग तो तब याद करते हैं जुब वह खुद अकेले हों..
జీవితాంతం ఎవ్వరూ తోడు నిలవరు, ఇది తెలుసుకన్నాను
నేను..
తాము ఒంటరిగా ఉంటేనే జనాలు గుర్తు చేసుకుంటారు..
9.81. नींद से क्या शिकवा जो आती नहीं रात भर..
कसूर तो उन सपनों का है जो सोने नहीं देते..
రాత్రంతా రాని నిద్ర మీద ఏం అలక?..
తప్పంతా నిద్రపోనివ్వని ఆ కలలది..
9.82. इतनी दूरियां ना बढ़ाओ, थोड़ा सा याद ही कर लिया करो..
कहीं ऐसा ना हो कि, तुम
बिन जीने की आदतसी हो जाए..
ఇంత దూరాలు పెంచబోకు, కాస్త జ్ఞాపకం
చేసుకుంటుండు..
మళ్ళీ నువ్వు లేకుండా బ్రతికేయటం అలవాటు అయిపోతే కష్టం..
9.83. अजीब सी आदत, और गज़ब
की फितरत है अपनी ..
नफ़रत हो या मोहब्बत, बड़ी
शिद्दत से करते हैं ..
నాది ఓ విచిత్రమైన అలవాటు, మాచెడ్డ గుణం..
ద్వేషమైనా, ప్రేమైనా చాలా ప్రబలంగా చేస్తాను..
9.84. भरोसा बहुत बडी पूँजी है, यूँ ही नहीं बाँटी जाती..
यह- खुद पर रखो तो ताकत, और
दूसरे पे रखो तो कमजोरी बन जाता है..
నమ్మకం చాలా పెద్ద పెట్టుబడి, ఊరికెనే పంచటానికి
కాదు..
ఇది- తనపై పెట్టుకుంటే బలం, పక్కవారి పై పెడితే
బలహీనతగా పరిణమిస్తుంది..
9.85. दर्द भी वो दर्द जो दवा बन जाये
मुश्किलें बढ़ें तो आसाँ बन जाये..
जख़्म पा कर सिर झुका देता हूँ
जाने कौन पत्थर ख़ुदा बन जाये..
నెప్పి కూడా ఓ మందు అయిపోతే బాగుండు,
కష్టాలు పెరిగినా తేలిక అయిపోతే బాగుండు..
గాయం తగలంగానే తల వంచేస్తాను
ఏమో, ఏ రాయి దేవుడు అయిపోతే బాగుండు..
9.86. एक ही बात इन लकीरों में अच्छी है..
धोखा देती हैं मग़र रहती हाथों में ही हैं ..
ఈ గీతలగురించి ఒక్కటే మాట భలే నచ్చుతుంది..
మోసం చేస్తాయి, కానీ చేతిలోనే ఉంటాయి..
9.87. मैं तेरे नसीब कि बारिश नहीं जो तुझपे बरस
जाऊँ..
तुझे तक़दीर बदलनी होगी मुझे पाने के लिए..
నేను భాగ్యపు చిరుజల్లును కాను, నీ మీద
కురిసిపోవటానికి..
నన్ను పొందాలంటే నువ్వు అదృష్టాన్ని మార్చుకోవాలి..
9.88. कुछ नहीं था मेरे पास खोने को..
लेकिन जबसे तुम मिले हो डर गया हूँ मैं..
నావద్ద ఏమీ లేదు, పోగొట్టుకోవటానికి..
కానీ నీవు దొరికింది మొదలు, నేను
భయపడుతున్నాను..
9.89. जो दिल के आईने में हो वो ही प्यार के
काबिल ..
वरना दीवार के काबिल तो हर तस्वीर होती है..
మనసు అద్దంలో నిలిచినవారే ప్రేమకు పాత్రులు..
గోడమీద పెట్టేందుకు సరిపడేదే ప్రతి చిత్రం..
9.90. हज़ार ग़म मेरी फ़ितरत नहीं बदल सकते..
क्या करूँ, मुझे आदत हे
मुस्कुराने की..
వెయ్యి బాధలైనా నా అల్లరిగుణాన్ని మార్చలేవు..
ఏం చేసేది, నాకు చిరునవ్వు నవ్వటం అలవాటు..
9.91. बात नफ़रत की होती तो शिद्दत से करते..
मोहब्बत से तो अपना 36 का
आंकड़ा है..
ద్వేషం సంగతైతే చాలా పద్ధతిగా చేస్తాను..
ప్రేమ అంటే మనకు పరమ విముఖత..
(హిందీ అంకెలలో ३६ ఇట్లా వ్రాస్తారు.
ఒకటినొకటి చూసుకోవు. కనుక విరుద్ధంగా ఉండేవాటికి ఉపమానంగా ఇది వాడతారు.)
9.92. मुझ से मिलना तो तेरे ही नसीब में था
शायद..
इतनी हसीन तो मेरे हाथों की लकीरें नहीं थी..
నన్ను కలవటం నీ భాగ్యంలోనే ఉందో ఏమో..
నాచేతి గీతలు ఇంత అందమైనవి కావు..
9.93. मैं ने तक़दीर पे यक़ीन करना छोड़ दिया है
..
जब इंसान बदल सकते हैं, तो
ये तकदीर क्यों नहीं...
నేను భాగ్యాన్ని నమ్మటం మానేశాను..
మనుషులు మారిపోగా లేనిది అదృష్టం ఎందుకు మారకూడదు?..
9.94. महरम न सही एक जख़्म ही दे दो..
महूसस तो हो के कोई हमें भूला नहीं..
(లేపనం) మందు ఇవ్వకు, పోనీ ఒక గాయమే
చేయరాదా?..
నన్ను మరువని వారొకరున్నారని అనుభూతి అయినా చెందనీ..
9.95. मैं चीज़ महंगी और महान बेचता हूँ..
लेाग ईमान बेचते हैं और मैं मुसकान बेचता हूँ..
నేను చాలా ఖరీదైన గొప్ప వస్తువును అమ్ముతాను..
జనాలు నైజాన్ని అమ్ముతారు, నేను చిరునవ్వును
అమ్ముతాను..
9.96. कितना भी कर ले, चाँद
से इश्क़...
रात के मुक़द्दर में अँधियारे ही लिखे हैं..
ఎంతైనా చంద్రుని ప్రేమించనీ గాక..
రాత్రి అదృష్టంలో చీకట్లే వ్రాసి ఉన్నవి..
9.97. कुछ लोग किस्मत की तरह होते हैं, जो दुआ से मिलते हैं..
और कुछ लोग दुआ की तरह होते हैं, जो किस्मत बदल देते हैं..
కొందరు భాగ్యంలాంటి వారు, ప్రార్థన చేస్తే
దొరుకుతారు..
కొందరు ప్రార్థన వంటివారు, భాగ్యాన్ని
మారుస్తారు..
9.98. ज़िन्दगी तो बस इम्तहान ले रही थी..
हम कम्बख़्त उसे मज़ाक समझ बेठे..
జీవితం పరీక్షిస్తున్నదంతే..
ఛ, నేనేమో అది వినోదమనుకున్నా..
9.99. ज़ंज़ीर बदली जा रही थी..
मैं समझा था, रिहाई हो गयी
है..
సంకెళ్ళు మారుతున్నాయంతే..
నేను విడుదలైనానేమో అనుకున్నాను..
9.100. खुशबू कैसे ना आये मेरी बातों से यारों..
मैं ने बरसों से एक ही फूल से मोहब्बत की है..
నా మాటల నుండి సువాసన రాకుండా ఎట్లుంటుంది మిత్రులారా..
నేను ఏళ్ళపాటు ఒకే పువ్వును ప్రేమించాను..
9.111. हाल पूछती नहीं दुनिया ज़िंदा लोगों का..
चले आते हैं ज़नाज़े पे बारात की तरह..
బ్రతికిఉన్నవారిని లోకం ఎట్లున్నావని అడగదు..
అంతిమయాత్రకు మాత్రం పెళ్ళికి తరలి వచ్చినట్టు వస్తారు..
9.112. मरने वाले को रोने वाले हज़ार मिल
जायेंगे मगर..
जो जिंदा है उसे समझने वाला एक भी नहीं मीलता..
చచ్చినవాడిపై బడి ఏడవటానికి వేలమంది దొరుకుతారు..
కానీ బ్రతికి ఉన్నవాడిని అర్థం చేసుకునేవారు ఒకరూ దొరకరే..
9.113. चलो छोड़ दो हमको मगर इतना बता दो
के तुम मुझे याद करते थे या वक़त बरबाद करते
थे..
సరే, నన్ను విడిచి పెట్టేసేయి, కానీ ఈ మాట
చెప్పవా..
నన్ను గుర్తుచేసుకునేదా, లేక సమయం వృథా
చేసుకునేదా?..
9.114. झूठ कहते हैं लोग कि मोहब्बत सब कुछ छीन
लेती है..
मैंने तो मोहब्बत करके.. ग़म का खजाना पा लिया ..
ప్రేమ ఉన్నదంతటినీ లాగేసుకుంటుందని అబద్ధం చెప్తారు జనాలు..
నేను ప్రేమించి దుఃఖం నిధిని పొందాను..
9.115. उमर की राह मे रास्ते बदल जाते हैं
वक़्त की आँधी मे इंसान बदल जाते हैं
सोचते हैं आपको इतना याद ना करें
लेकिन आँख बंद करते ही इरादे बदल जाते है..
జీవితపు బాటలో దారులు మారిపోతాయి..
కాలపు గాలివానలో మనిషి నైజాలు మారిపోతాయి..
నిన్ను అంతగా గుర్తు చేసుకోకూడదు అనుకుంటాను..
కానీ కన్నులు మూసుకోగానే ఉద్దేశ్యాలు మారిపోతాయి..
9.116. अक्सर पूछते है लोग किसके लिए लिखते हो..
अक्सर कहता है दिल काश कोई होता..
అప్పుడప్పుడు అడుగుతారు జనాలు, ఎవరికోసం
వ్రాస్తుంటావోయని..
అప్పుడప్పుడు మనసంటుంది- అబ్బ, ఎవరైనా ఉంటే
బాగుండేదని..
No comments:
Post a Comment