Saturday, 6 January 2018

షేరోం కా షోర్- 7 (शेरों का शोर) (ఉర్దూషేర్లకు తెలుగు అనువాదం)

7.1. आज गुमनाम हूँ, तो जऱा फासला रख मुझसे..
कल फिर मशहूर हो जाऊँ तो कोई रिश्ता निकाल लेना..
ఇవాళ ఊరు పేరు లేదు, కనుక కాస్త ఎడంగా ఉండు..
రేపు మళ్ళీ పేరు వచ్చాక ఏదైనా అనుబంధం ఏర్పరుచుకో..

7.2. किसने कहा बढ़ती उम्र सुंदरता को कम करती है?..
ये तो बस, चेहरे से उतरकर, दिल में आ जाती है..
ఎవరన్నారు, పెరిగే వయసు అందాన్ని తగ్గిస్తుందని..
ఇది అట్లా ముఖం నుండి దిగి మనసులోకి వచ్చేస్తుంది..

7.3. अगर देखनी है क़यामत तो चले आओ हमारी महफ़िल में..
सुना है आज महफ़िल में वो बेनक़ाब आ रहे है..
ప్రలయాన్ని చూడాలని ఉంటే మా సభలోకి రావోయి..
ఇవాళ వారు మేలిముసుగు లేకుండా వస్తారట..

7.4. बहुत चुपके से दिया था, उसने गुलाब हमें..
कम्बख्त खुशबू ने कोहराम मचा दिया..
చాలా రహస్యంగానే నాకు గులాబి ఇవ్వటమైంది..
దాని పరిమళమే, అనవసరంగా రచ్చ చేసేసింది..

7.5. आज तो दिल भी धमकियाँ दे रहा है..
कर याद उसे वरना धड़कना छोड़ दूंगा ..
ఇవాళైతే నా గుండె బెదిరించేస్తోంది..
తనను గుర్తు చేసుకో, లేదంటే కొట్టుకోవటం ఆపేస్తానని..

7.6. पता नहीं कैसे परखता है मेरा भगवान मुझे..
इम्तिहां भी मुश्किल ही लेता है, और फेल भी होने नहीं देता..
నా ఈశ్వరుడు నన్నిట్లా ఎట్ల పరీక్షిస్తాడో తెలియదు కదా..
పరీక్ష కూడా కష్టమైందే పెడతాడు, విఫలం కూడా కానివ్వడు..

7.7. टूटता हुआ तारा सबकी दुआ पूरी करता है..
क्यों के उसे टूटने का दर्द मालूम होता है..
రాలిపడే చుక్క అందరి ప్రార్థనలూ తీరుస్తుంది..
ఎందుకంటే దానికి విరిగిపోవటంలో బాధ తెలుసు..

7.8. चंद दिनों की दोस्ती कुछ रोज की बात..
जाने तूझमे क्या है, ऐसा लगता है जैसे बरसों का हो साथ..
కొద్ది రోజుల స్నేహం, కొద్ది రోజుల మాటలు..
నీలో ఏమున్నదో మరి, ఏళ్ళ తరబడి తోడున్నట్టు అనిపిస్తుంది..

7.9. मैं दिखूँ न दिखूँ बस मुझे अहसासों में महसूस करना..
मैं लिखूँ न लिखूँ बस मुझे शब्दों में ही पढ़ लेना..
నేను కనిపించినా కనిపించకపోయినా నన్ను భావనలలో అనుభూతి చెందు..
నేను వ్రాసినా వ్రాయకపోయినా నన్ను పదాలలోనే చదువుకో..

7.10. जिसे चाहा काश वो हमारा होता,
ख्वाहिश का भी कोई किनारा होता..
ये सोच कर मैंने उसे रोका नहीं,
दूर ही क्यों जाता अगर वो हमारा होता..
కోరినవ్యక్తి నావారైతే బాగుండేది
కోరికకు కూడా హద్దు ఉంటే బాగుండేది..
ఈ మాట అనుకోని తనను ఆపలేదు నేను
నావారైతే దూరమే ఎందుకు పోయేవారు? అని..

7.11. नींदों पर मेरे कब्जा कर बैठे हो..
कम से कम ख्वाब तो मेरे नाम कर दो..
నిద్ర మీద అయితే ఆక్రమణం చేసుకున్నావు..
కనీసం కలలనైనా నా పేర మార్చరాదా?..

7.12. आंखों में गर हो गुरूर तो इंसान को इंसान नहीं दिखता..
जैसे छत पर चढ़ जाओ तो अपना ही मकान नहीं दिखता..
కళ్ళల్లో పొగరుంటే (కళ్ళు నెత్తికెక్కితే) మనిషికి మనిషి కనిపించడు..
మిద్దె మీదకు పోతే మన ఇల్లే మనకు కనిపించదు కదా..

7.13. हमने तुम्हे चाहा है इबादत की तरह..
तुम पत्थर बनो ये देवता क्या फर्क..
నేను నిన్ను కోరాను, దేవతోపాసన లాగా..
ఇక నీవు రాయివైతే ఏంటి, దేవతవైతే ఏంటి తేడా?..

7.14. मिलता तो बहुत कुछ है इस ज़िन्दगी में..
बस हम गिनती उसी की करते है, जो हासिल ना हो सका..
ఈ జీవితంలో (మనకు) చాలా దొరుకుతుంది..
అయితే ఏది దొరకలేదో, దాన్నే మనం లెక్కిస్తాము..

7.15. कौन कैसा है , ये ही फ़िक्र रही तमाम उम्र..
हम कैसे हैं, ये कभी भूल कर भी नहीं सोचा..
ఎవరు ఎటువంటివారు, అనే బాధే ఆయువంతా..
నేను ఎట్లా ఉన్నాను, అనేది మర్చిపోయి కూడా ఆలోచించలేదు..

7.16. बहुत जिये उनके लिये जिनको हम पसंद करते थे..
अब जीना है उनके लिए जो हमें पसंद करते है..
నేను ప్రేమించేవారి కోసం చాలా జీవించేశాను..
ఇకమీదట నన్ను ప్రేమించేవారికోసం జీవించాలి..

7.17. अपना दर्द सबको न बताएं साहब..
मरहम एक आधे घर में होता है,
नमक घर घर में होता है..
మీ బాధ అందరికి చెప్పకండి బాబూ..
మందు ఎవరో ఒకరిద్దరి వద్దే ఉంటుంది..
ఉప్పు ప్రతి ఇంటా ఉంటుంది..

7.18. कुछ नहीं मिलता, दुनिया में मेहनत के बग़ैर..
मेरा अपना साया भी मुझे धूप मे आने के बाद मिला..
శ్రమ లేకుండా ఏదీ దొరకదు లోకంలో..
నా నీడ కూడా నాకు ఎండలోకి వెళ్ళాకనే దొరికింది..

7.19. दोस्तों, जिंदगी में कभी भी अपने किसी हुनर पे घमंड मत करना..
क्यों कि पत्थर जब पानी में गिरता है तो अपने ही वजन से डूब जाता है..
జీవితంలో ఎప్పుడూ మీలోని ఏ ప్రతిభకూ గర్వించకండి, నేస్తాలూ..
ఎందుకంటే రాయి కూడా నీటిలో పడితే తన బరువు వల్లే మునుగుతుంది..

7.20. कभी कभी रिश्तों की कीमत वो लोग समझा देते है..
जिनसे हमारा कोई रिश्ता ही नहीं होता है..
ఒక్కోసారి అనుబంధాల విలువ మనకు..
మనతో ఏ అనుబంధమూ లేనివారు తెలియచేస్తారు..

7.21. बडा गजब किरदार हैं मोहब्बत का..
अधूरी हो सकती हैं पर खत्म नहीं..
చాలా విచిత్ర పాత్ర ప్రేమది..
సగంగా ఉంటుంది, కానీ పూర్తి కాదు..

7.22. किसी से दूर रहकर भी किसी को सोचते रहना..
किसी के पास रहने का तरीका ये भी होता है..
ఒకరికి దూరంగా ఉండి వారి గురించి ఆలోచిస్తూండటం..
ఇది కూడా ఒకరికి దగ్గరగా ఉండే మార్గం..

7.23. ज़िन्दगी में ऊंचा उठने के लिए किसी डिग्री की जरूरत नहीं..
अच्छे शब्द ही इंसान को बादशाह बना देते है..
జీవితంలో ఎత్తుకు ఎదగటానికి ఏ డిగ్రీలు అవసరం లేదు..
మంచి మాటలే మనిషిని చక్రవర్తిగా చేసేస్తాయి..

7.24. जख्म हैं कि दिखते नहीं..
मगर ये मत समझिये कि दुखते नहीं..
గాయాలున్నాయి, కానీ కనిపించవు..
అట్లాగని నెప్పి పుట్టవు అనుకోకండి..

7.25. ज़ख़्म-ए-दिल पर हाँथ रखकर मुस्कुराना इश्क़ है..
याद रखना याद करना और याद आना भी इश्क़ है..
గుండె గాయాలపై చేయి పెట్టుకుని చిరునవ్వు నవ్వటం ప్రేమ..
గుర్తు పెట్టుకోవటం, గుర్తు చేసుకోవటం, గుర్తు రావటం కూడా ప్రేమ..

7.26. गुलाबों से मोहब्बत है जिन्हें उनको खबर कर दो कि..
चुभने वाले कांटे भी बहुत अरमान रखते हैं..
గులాబీలను ప్రేమించేవారికి కాస్త ఈ మాట చెప్పండి..
గుచ్చుకునే ముళ్ళు కూడా చాలా కోరికను కలిగి ఉంటాయి..

7.27. भीड़ की आदत नहीं मुझे..
थोड़े में जीना सीख लिया है मैं ने..
జనసమ్మర్దం నాకు అలవాటు లేదు..
కొద్దిలో జీవించటం నేర్చుకున్నాను నేను..

7.28. जी करता है मुफ़्त में ही उसे अपनी जान भी दे दूँ..
इतने मासूम खरीददार से क्या लेनदेन करना..
తనకోసం ఉత్తగనే ప్రాణాలిచ్చేయాలి అనిపిస్తుంది..
కొనేవారు ఇంత అమాయకమైతే ఇంక బేరాలేంటి ఆడేది?..

7.29. तय है बदलना, हर चीज़ बदलती है इस जहाँ में..
किसी का दिल बदल गया, किसी के दिन बदल गये..
మారటం మాత్రం ఖాయం, ప్రతీదీ మారుతుంది లోకంలో..
ఒకరిది మనసు మారుతుంది, ఒకరి రోజులు మారిపోతాయి..

7.30. तासीर इतनी ही काफी है की वो मेरा दोस्त है..
क्या ख़ास है उसमे ऐसा कभी सोचा ही नहीं..
తను నా నేస్తం, ఇంత ప్రభావం చాలు..
తనలో ఏం గొప్పతనం ఉంది, అని ఎన్నడూ ఆలోచించలేదు..

7.31. सिमट गया मेरा प्यार भी चंद अल्फाजों में..
जब उसने कहा मोहब्बत तो है पर तुमसे नहीं..
నా ప్రేమ కొన్ని పదాలలో ఇమిడిపోయింది..
ప్రేమ ఉంది, కానీ నీ మీదకాదు, అని తను అన్నప్పుడు..

7.32. सिर्फ इतना ही फर्क पड़ा है चेहरे की हँसी पर...
पहले आती थी अब लाते हे..
కేవలం ఇంతే తేడా ముఖం మీద చిరునవ్వులో..
ఇదివరకు వచ్చేది, ఇప్పుడు తెస్తున్నాము..

7.33. साहिल पे बैठे, यूँ सोचता हूँ आज, कौन ज़्यादा मजबूर है..
ये किनारा, जो चल नहीं सकता, या वो लहर, जो ठहर नहीं सकती..
తీరం పై కూర్చుంటే ఇవాళ అనిపించింది..
ఎవరు ఎక్కువ నిస్సహాయులా అని..
నడవలేని ఈ ఒడ్డా? లేక ఆగలేని ఆ అలలా?

7.34. वक़्त के एक दौर में, इतना भूखा था मैं..
कुछ न मिला तो, धोखा ही खा गया..
ఈ కాలపు ఒత్తిడిలో ఎంతో ఆకలితో ఉన్నాను..
ఏమీ దొరకలేదని ఎదురుదెబ్బలైనా తినేశాను..

7.35. ख्वाब तो सब मीठे देखे थे ताज्जुब है..
आँखों का पानी खारा कैसे हो गया..
కలలైతే తీయనివే కన్నాను, అయినా విచిత్రం..
కంటిలో నీరు ఉప్పగా ఎందుకు అయిందో..

7.36. तुम मेरे हो जाओ ऐसी जिद नहीं करूंगा..
मैं तुम्हारा हो चुका हूं ये हक से कहूंगा..
నీవు నాదానివి కా అని పట్టు పట్టను..
నేను నీవాడిని అయిపోయానని మాత్రం హక్కుతో అంటాను..

7.37. खूबियाँ इतनी तो नहीं हम में
कि किसी के दिल मे हम घर बना पाएंगे..
पर भुलाना भी आसान ना होगा हमे
साथ कुछ ऐसा निभा जाएंगे..
నాలో పెద్ద గొప్ప గుణాలేమీ లేవు
ఒకరి మనసులో గూడు కట్టుకుపోయేంతగా..
కానీ నన్ను మర్చిపోవటం కష్టం కావచ్చు
తోడు నీడగా ఉండటం అంతగా ఉంటుంది..

7.38. चल आ तेरे पैरों पर मरहम लगा दूं ऐ मुक़द्दर..
कुछ चोटे तुझे भी आई होगी, मेरे सपनो को ठोकर मारकर..
ఇటు రా, నీ కాళ్ళకు లేపనం రాస్తాను, ఓ భాగ్యమా..
కొన్ని గాయాలు నీ కాలికి కూడా అయి ఉంటాయి, నా కలలను తన్నినందువల్ల..

7.39. आरज़ू होनी चाहिए किसी को याद करने की
लम्हे तो अपने आप मिल जाते हैं
कौन पूछता है पिंजरे में बंद परिंदों को,
याद वही आते हैं जो उड़ जाते हैं
ఎవరినైనా గుర్తుచేసుకోవాలనే కోరిక ఉండాలి
తీరికక్షణాలు తమకై తామే దొరుకుతాయి..
ఎవరు అడుగుతారు, పంజరంలో బందీ అయి ఉన్న చిలకను?
ఎవరు ఎగిరిపోతారో వారే గుర్తుకు వస్తారు..

7.40. शायर बना डाला इस अधूरी मोहब्बत् ने..
यदि पूरी होती तो हम नाचीज़ भी सुन्दर ग़ज़ल होते..
ఈ అపూర్ణ ప్రేమ నన్ను షాయర్ (చిన్నకవి)ని చేసింది..
ఒకవేళ పూర్తే అయి ఉంటే ఈ తుచ్ఛుడి గజళ్ళు కూడా వెలువడేవి..

7.41. सुना है, तेरे सामने सब हार जाते हैं..
ऐ इश्क़, तू इलेक्शन क्यूँ नहीं लड़ता..
నీ ఎదుట అంతా ఓడిపోతారని విన్నానే..
ఓ ప్రేమా, నీవు (రాజకీయ) ఎన్నికలలో ఎందుకు పాల్గొనవు?..

7.42. दोस्तों के दिल में रहने की इज़ाज़त नहीं मांगी जाती...
ये तो वो जगह है जहां कब्जा किया जाता है..
స్నేహితుల మనస్సులలో ఉండటానికి అనుమతి అడగటం ఉండదు..
ఇది (నేరుగా) ఆక్రమణం చేసుకోవలసిన చోటు..

7.43. तो क्या हुआ जो दोस्त नहीं मिलते हमसे..
मिला तो रब भी नहीं पर इबादत कहां रुकी हमसे..
స్నేహితులు కలవకపోతే మాత్రం ఏమిటంటా?..
దేవుడు కూడా నాకు దొరకలేదు, అయినా ప్రార్థన ఎక్కడ ఆగింది?..

7.44. तुम भी मिट्टी से बने हो और मैं भी हूँ खाक की..
जलते हो जख्मों से तो जलाते क्यों हो ?..
నీవూ మట్టితోనే తయారైనావు, నేనూ దుమ్ముతోనే అయ్యాను..
గాయాలకు నీకూ కాలుతుంటే, మరి (నన్ను) కాల్చటం ఎందుకుట?..

7.45. एक दुसरे से बस जलते रहो..
ठण्ड बिलकुल नहीं लगेगी..
ఒకరిని చూసి ఒకరు (ఈసుతో) కాలుతుండండి..
ఏమాత్రం చలి వేయదింక..

7.46. आँसू जानते हैं कौन अपना है, तभी अपनों के आगे निकलते हैं..
मुस्कुराहट का क्या है, ग़ैरों से भी वफ़ा कर लेती है..
కన్నీటికి తెలుసు ఎవరు తనవారో, అందుకే తనవారి ఎదుటే కదులుతాయి..
చిరునవ్వుదేం ఉంది? పరులతో కూడా నమ్మకం ఏర్పరుచుకుంటుంది..

7.47. दौलत से मोहब्बत तो नहीं थी मुझे लेकिन..
बच्चों ने खिलौनों की तरफ़ देख लिया है..
సంపదలంటే నాకు ప్రేమేం లేదు..
కానీ పిల్లలు బొమ్మల వంక చూసేశారు..

7.48. कोई अच्छा इलाज बता दे सनम,
तेरे ख्यालो की बीमारी हो गई है !!
ఏదైనా మంచి మందు చెప్పు ప్రియతమా..
నీ ఆలోచనలనే అస్వస్థతకు గురైనాను..

7.49. इतना भी हसीन मौसम मत कर ऊपर वाले..
ज़रूरी नहीं सबके पास पकौड़े बनाने वाली बीवी हो..
ఇంత అందమైన వాతావరణం కూడా చేయకు దేవుడా..
అందరి వద్దా పకోడీలు చేసిపెట్టే భార్య ఉండితీరాలని లేదు కదా..

7.50. ऐसा नहीं कि दिल में तेरी तस्वीर नहीं थी..
पर हाथो में तेरे नाम की लकीर नहीं थी..
మనసులో నీ రూపం లేకకాదు..
కానీ ఈ చేతులలో నీ పేర గీత లేక..

7.51. जो महसूस करते हैं बयाँ कर देते हैं..
हमसे लफ़्ज़ों की दगाबाज़ी नहीं होती..
ఏది భావిస్తే అది మాట్లాడేస్తాను..
మాటల మోసాలు నా వల్ల కావు..

7.52. ज़िन्दगी में सारा झगड़ा ही ख़्वाहिशों का है..
ना तो किसी को ग़म चाहिए और, ना ही किसी को कम चाहिए..
జీవితం లో పోట్లాట అంతా కోరికలదే..
ఎవ్వరికీ ఏ బాధా వద్దు, ఏదీ తక్కువా వద్దు..

7.53. हर रोज़ हर वक़्त तेरा ही ख्याल..
ना जाने किस कर्ज़ की किस्त हो तुम..
ప్రతిరోజు, అన్ని వేళలా నీ ఆలోచనలే..
ఏనాటి అప్పుకు వడ్డీవో నీవు..

7.54. ग़म-ए-दुनिया भी ग़म-ए-यार में शामिल कर लो..
नशा बढ़ता है शराबें जो शराबों में मिलें..
లోకపు దుఃఖంలో స్నేహితుల దుఃఖాన్ని కలుపుకో..
మద్యంలో మద్యం కలిస్తే మత్తు ఎక్కువగా ఉంటుంది..

7.55. आसमाँ, ऐसा भी क्या ख़तरा था दिल की आग से..
इतनी बारिश एक शोले को बुझाने के लिए..
ఓ ఆకాశమా, మనసులో నిప్పుతో అంత ప్రమాదం ఏం ఉందిటా?..
ఇంత వర్షమా, ఒక్క జ్వాలను ఆర్పటానికి?..

7.56. बचपन भी कितना खूबसूरत था..
तब खिलौनै ही ज़िन्दगी थे,
आज ज़िन्दगी ही खिलौना है..
చిన్నతనం ఎంత అందంగా ఉండేదో..
అప్పట్లో బొమ్మ(లాట)లే జీవితంగా ఉండేది,
ఇప్పుడు జీవితమే బొమ్మ(లాట) అయిపోయింది..

7.57. बड़ी बरकत है तेरे इश्क़ में जब से हुआ है..
और कोई दूसरा दर्द ही नहीं होता..
ఎంతో వృద్ధి కలిగింది నీ ప్రేమలో పడినప్పటినుండి..
ఇంక వేరే నెప్పీ ఏదీ తెలియ రాదు..

7.58. ख़्वाब लफ़्ज़ों में ढल नहीं सकते..
काश आँखें पढ़ा करे कोई..
కలలు మాటల్లో ఇమడవు కదా..
అబ్బ, ఎవరైనా కళ్ళు చదివితే బాగుండు..

7.59. मत कर यक़ीन यहाँ पलभर की मुलाकात पर..
ज़रूरत ना हो तो लोग यहाँ सालों के रिश्ते भूल जाते है..
ఇక్కడ క్షణికమైన కలయికల మీద నమ్మకం ఉంచకండి..
అవసరం లేకపోతే జనాలిక్కడ ఏళ్ళపాటు ఉన్న అనుబంధాలను మరిచిపోతారు..

7.60. हर मायूस को हँसाने का कारोबार है अपना..
दिलों का दर्द खरीद लेते हैं, बस यही रोज़गार है अपना..
నిరాశపడే ప్రతీవారిని నవ్వించే వ్యాపారం మనది..
మనసుల్లో బాధలను కొనేసుకుంటాము, ఇదే ఉద్యోగం మాది..

7.61. ख़्वाहिशों का मोहल्ला बहुत बड़ा होता है..
बेहतर है हम ज़रूरतों की गली में मुड़ जाएँ..
కోరికల వీథి చాలా పెద్దగా ఉంటుంది..
అవసరాల సందునుండి తిరిగి వెళ్ళటమే నయం..

7.62. ज़्यादा ख़्वाहिशें नहीं ए जिंदगी तुझसे..
बस अगला कदम पिछले से बेहतरीन हो..
ఎక్కువ కోరికలు లేవు జీవితమా నీ మీద..
పోయిన అడుగు కంటే వచ్చే అడుగు నయంగా ఉంటే చాలు..

7.63. मुफ़्त में नहीं सीखा उदासी में मुस्कराने का हुनर..
बदले में ज़िन्दगी की हर ख़ुशी तबाह की है..
ఉత్తగనే నేర్చుకోలేదు, బాధలో నవ్వే కళను..
బదులుగా జీవితంలోని ప్రతీ సంతోషాన్ని నాశనం చేసుకున్నాను..

7.64. मिली है जिंदगी तो कुछ मकसद भी रखिए जनाब..
सिर्फ सासें गवाना ही जिंदगी तो नहीं..
జీవితం దొరికింది అంటే ఏదో ఓ ఆశయం పెట్టుకోండి..
కేవలం శ్వాసలు పోగొట్టుకోవటమే జీవితం కాదు కదా..

7.65. स्वयं को स्वयं के अंदर ही ढूंढना पड़ता है..
बाकी सब चीज़ के लिए तो गूगल है..
తనను తాను తనలో వెతుక్కోవాల్సిందే..
మిగితాదంతా గూగుల్ లో దొరుకుతుంది..

7.66. मुस्कुराती जेबों में अक्सर गीले रूमाल मिलते है..
हसरतें छुपाने के हुनर उनमें कमाल मिलते हैं..
చిరునవ్వు చిందించే (వారి) జేబులలో రుమాళ్ళు తడిగా ఉంటాయి..
కోరికలను దాచుకునే కళలు వారిలో అద్భుతంగా కనిపిస్తాయి..

7.67. शीशा तो टूट के अपनी कशिश बता देता हैं..
दर्द तो उस पत्थर का हैं जो टुटने के काबिल भी नहीं..
అద్దమైతే పగిలి తన ఒత్తిడిని వ్యక్తం చేస్తుంది..
(నిజంగా) నెప్పి అంటే కనీసం విరగటం కూడా చేతకాని రాయిది..

7.68. तुम्हारे पास भी कम नहीं, मेरे पास भी बहुत है..
ये परेशानियाँ आजकल फुरसत में बहुत है..
నీవద్దా తక్కువ లేవు, నా వద్ద చాలా ఉన్నాయి..
ఈ బాధలు ఇవాళరేపు బాగా తీరికగా ఉన్నట్టున్నాయి..

7.69. मुद्दतें हो गयी लफ़्ज़ों में हरारत हुए..
सुना है लोग आज-कल उँगलियों से बातें करते हैं..
మాటలు వేడెక్కి చాలాఏళ్ళు అయింది..
ఈమధ్య జనాలు వేళ్ళతో మాట్లాడుతున్నారుటా కదా..

7.70. मुझको ढूंढ लेती है रोज़ एक नए बहाने से..
तेरी याद वाक़िफ़ हो गयी है मेरे हर ठिकाने से..
ఏదో ఒక కొత్త వంకతో నన్ను వెతికేసుకుంటుంది..
నీ జ్ఞాపకానికి నేనుండే ప్రతి చోటూ తెలిసిపోయింది..

7.71. हम मुस्कुरा कर छुपा लेते हैं ग़म अपना..
लोग हमें खुश देख कर हम जैसा बनने की दुआ करते हैं..
నేను చిరునవ్వుతో నా బాధను దాచుకుంటాను..
జనాలు నేను సంతోషంగా ఉండటం చూసి, నాలాగ ఉండాలని ప్రార్థిస్తారు..

7.72. किसी से रिश्ता क्या है, ये हमें मालूम हो ज़रूरी तो नहीं..
हाँ उस रिश्ते में कितना अपनापन है, ये महसूस होना ज़रूरी है...
ఎవరితో అనుబంధం ఏంటో మనకు తెలియాల్సిన అవసరం లేదు కదా..
ఆ అనుబంధంలో ఎంత ఆత్మీయత ఉందో దాన్ని అనుభూతి చెందటం అవసరం..

7.73. वही तुम, वही किस्सा और वही तेरी बेरुखी..
एक ही एहसास, हम कितनी बार लिखें..
అదే నీవు, అదే కథ, అదే నీ పట్టించుకోకపోవటం..
ఒకే భావన, నేను ఎన్ని సార్లు వ్రాయను?

7.74. क्या वाकई रिश्ते बीड़ी जैसे हो गए हैं..
टाइम पे फूँक न मारो तो कमबख़्त बुझ जाते हैं..
ఏంటి, నిజంగా అనుబంధాలు బీడీలాగా అయిపోయాయా?..
సమయానికి ఊదకపోతే ఛ, మలిగేపోతాయి..

7.75. ऐ जिंदगी, तू खेलती बहुत है खुशियों से..
हम भी इरादे के पक्के हैं मुस्कुराना नहीं छोडेंगे..
ఓ జీవితమా, నీవు బాగా ఆడుకుంటావు సంతోషాలతో..
నేను కూడా ఆలోచనలో గట్టినే, చిరునవ్వు నవ్వటం మానను..

7.76. बेवक्त दो बुँदे क्या बरसी और बादल क्या छा गये..
किसी को जाम, तो किसी को कुछ नाम याद आ गये..
వేళ కాని వేళ రెండు చినుకులు పడి, మబ్బులు కమ్మాయో లేదో..
ఒకరికి మద్యం, మరొకరికి ఎవరివో పేరు గుర్తుకు వచ్చాయి..

7.77. उम्र को हराना हो तो शौक सदा ज़िंदा रखिए..
घुटने चलें ना चलें, मन उड़ता परिंदा रखिए..
వయసును ఓడించాలంటే అభిరుచులను బ్రతికించి ఉంచుకోండి..
మోకాళ్ళు కదిలినా కదలకపోయినా మనసును ఎగిరే పక్షిగా ఉండనివ్వండి..

7.78. उड़ा देती है नींदे कुछ ज़िम्मेदारियां घर की..
रात मे जागने वाला हर शख़्स आशिक़ नहीं होता..
కొన్ని ఇంటి బాధ్యతలు నిద్రను ఎగరగొడతాయి..
రాత్రికి మేలుకునే ప్రతీ వ్యక్తీ ప్రేమికుడు కానవసరం లేదు..

7.79. एक उम्र वो थी कि जादू में भी यक़ीन था..
एक उम्र ये है कि हक़ीक़त पर भी शक़ है..
ఒక వయసు ఉండేది, ఇంద్రజాలంలో కూడా నమ్మకం ఉండేది..
ఒక వయసు వచ్చింది, వాస్తవం మీద కూడా అనుమానమే..

7.80. मुझको क्या हक, मैं किसी को मतलबी कहूँ..
मै खुद ही ख़ुदा को, मुसीबत में याद करता हूँ..
ఎవరినైనా స్వార్థపరులని అనటానికి నాకేం హక్కు?..
నేను కూడా భగవంతుని కష్టంలోనే గుర్తు చేసుకుంటాను..

7.81. दोष कांटो का कहाँ, हमारा है जनाब..
पैर हमने रखा, वो तो अपनी जगह पे थे..
ముళ్ళ తప్పు ఎక్కడ? తప్పు నాదేనండీ..
కాలు నేను పెట్టాను, అవి (తాము) ఉన్నచోటే ఉన్నాయి..

7.82. लफ्ज़ तो सारे सुने सुनाए हैं, ए सनम..
अब तू मेरी ख़ामोशी में ढूंढ ज़िकर अपना..
అన్ని మాటలూ విన్నవే, వినిపించినవే, ఓ ప్రియతమా..
ఇక నీవు నీ (గురించిన) ప్రస్తావన నా మౌనంలో వెతుక్కో..

7.83. मैखाने पे आऊंगा मगर पिऊंगा नहीं साकी..
ये शराब मेरा गम मिटाने की औकात नहीं रखती..
మద్యశాలకు వస్తాను, కానీ తాగను, సాకీ..
నా బాధను పోగొట్టేంత సత్తా ఈ మద్యానికి లేదు..

7.84. अपनों को आज़मा के तो देखिये हुज़ूर..
कसम से दुश्मनों से मोहब्बत कर बैठेंगें..
సొంత వారిని పరికించి చూడండి మహాప్రభో..
ఒట్టు, శత్రువులను ప్రేమించటం మొదలు పెడతారు..

7.85. दोस्तीमें ना रखा करो, हिसाब नफ़े और नुकसान का..
ज़िन्दगी की पाठशाला में, गणित का कमज़ोर होना अच्छा है..
స్నేహంలో లాభనష్టాల లెక్కలు పెట్టుకోవద్దు..
జీవిత పాఠశాలలో గణితంలో బలహీనంగా ఉండటమే మంచిది..

7.86. हजारों ग़म हो फिर भी मैं खुशी से फूल जाता हूँ..
जब हंसती मेरी माँ, मैं हर ग़म भूल जाता हूँ..
వేల బాధలున్నా నేను సంతోషంతో పొంగిపోతాను..
మా అమ్మ నవ్వినప్పుడు నా బాధలన్నీ మరచిపోతాను..

7.87. घर का आईना भी, अब हक़ जता रहा है..   
ख़ुद तो वैसा ही है, पर मेरी उम्र बता रहा है..
ఇంట్లో అద్దం కూడా తన హక్కును వాడుకుంటోంది..
తను మారలేదు కానీ నా వయసును చూపిస్తోంది..

7.88. चेहरे पर सुकून तो बस दिखाने भर का है..
वरना बेचैन तो हर शख्स ज़माने भर का है..
ముఖం మీద హాయి చూపించుకోవటానికి, అంతే..
మొత్తం లోకంలో ప్రతీ వ్యక్తీ వ్యాకులంగానే ఉన్నాడు..

7.89. शोहरत बेशक चुपचाप गुज़र जाये..
कम्बख़्त बदनामी बड़ा शोर करती है..
గొప్ప పేరు మౌనంగానే వెళిపోతుంది..
కానీ ఛ, ఈ చెడ్డపేరు చాలా గొడవ చేస్తుంది..

7.90. लम्हे बेचकर, पैसे तो आ गये..
अब बताओ, किस दुकान पे ख़ुशी मिलेगी..
క్షణాలను అమ్మి డబ్బులైతే వచ్చాయి..
ఇక చెప్పు, ఏ దుకాణంలో సంతోషం లభిస్తుంది?..

7.91. वो साथ थे तो मानो जन्नत थी जिंदगी..
अब तो हर सांस जिंदा रहने की वजह पूछती है..
తను తోడుండగా జీవితం స్వర్గంలా ఉండేది..
ఇప్పుడు ప్రతీ శ్వాస బ్రతికి ఉన్నందుకు కారణం అడుగుతున్నది..

7.92. उलझे जो कभी हमसे तो, तुम सुलझा लेना..
तुम्हारे हाथ में भी रिश्ते का एक सिरा होगा..
ఎప్పుడైనా నాతో చిక్కు వస్తే నీవు తీసేసేయి..
అనుబంధపు కొస నీ చేతిలో కూడా ఒకటి ఉంటుంది..

7.93. किसी भी मौसम मे खरीद लीजिये जनाब..
मोहब्बत के ज़ख़्म हमेशा ताजे ही मिलेगें..
ఏ కాలంలో అయినా కొనుక్కోండి..
ప్రేమ గాయాలు ఎప్పుడూ తాజాగానే ఉంటాయి..

7.94. खुद को बेच डाला हमने, फिर भी ना मिली..
बाज़ारे-मुहब्बत में वफ़ा सबसे मंहगी निकली..
నన్ను నేను అమ్ముకున్నాను, అయినా దొరకలేదు..
ప్రేమ బజారులో విశ్వాసం అన్నింటికన్నా ఖరీదైనదని తేలింది..

7.95. इबादत का मज़ा तो इसी में है..
के खुदा से जब माँगा जाए तो खुदा को ही माँगा जाये..
ప్రార్థన లో ఉన్న ఆనందం ఎప్పుడంటే..
అడగాలనుకున్నప్పుడు దేవుడి నుండి దేవుడినే కోరినప్పుడు..

7.96. तुम शहर की रवायत से अंजान हो दोस्त..
यहां याद रहने के लिए याद दिलाना पड़ता है..
నగరం (పద్ధతి) గురించిన మాటొకటి నీవు ఎరుగవు మిత్రమా..
ఇక్కడ (నిన్ను) గుర్తు పెట్టుకోవటానికి (వారికి నువ్వే) గుర్తు చేయవలసి వస్తుంది..

7.97. कहते है कि रिश्तों में थैंक्स और सॉरी नहीं होना चाहिए..
लेकिन हकीकत में ये दो लवज़ ही है जो रिश्ते को बचाते हैं..
అనుబంధాలలో థాంక్యూ సారీలు ఉండకూడదంటారు..
కానీ నిజానికి ఈ రెండు మాటలే అనుబంధాలను కాపాడతాయి..

7.98. कैसे कह दूँ कि अब थक गया हूँ मैं..
न जाने घर में कितनों का हौसला हूँ मैं..
అలసిపోయానని ఎట్లా అనను?..
నేను ఇంట్లో ఎందరికి ధైర్యాన్నో మరి..

7.99. होती है कितनी तकलीफ कब्र के नीचे,
ये ऊपर से फूल चड़ाने वाले क्या जाने,
दिल टूटता है तब चलती है कलम,
ये वाह वाह करने वाले क्या जाने..
సమాధి (బొంద) లోపల ఎంత కష్టంగా ఉంటుందో
పైనుండి పూలు పెట్టేవారు ఏం ఎరుగుదురు?..
హృదయం పగిలితేకానీ కలం కదలదు
వాహ్ వాహ్ అని మెచ్చుకునే వారు ఏం ఎరుగుదురు?..

7.100. उम्र कहती है चलो अब संजीदा हुआ जाये..
दिल कहता है अब बची ही कितनी है..
चलो कुछ नादानियां की जाएँ..
వయసు అంటుంది, ఇంక గంభీరంగా కావాలని
మనసంటుంది, ఇంక మిగిలిందే ఎంతని?..
పద, ఏవైనా పిల్ల(అమాయకపు, తెలియని)చేష్టలు చేద్దామని..

7.101. आओ, आज महफ़िल सजाते हैं..
तुम्हें लिखकर तुम्हें ही सुनाते हैं..
రా, ఈ రోజు కవితాగోష్ఠిని పెట్టుకుందాం..
నిన్ను (గూర్చి) వ్రాసి నీకే వినిపిస్తాను..

7.102. तमाम उलझनों में रहते हैं..
कौन कहता है ,हम अकेले हैं..
పూర్తిగా సమస్యలలో పడి ఉంటాను..
ఎవరన్నారు, నేను ఒంటరినని?

7.103. अगर जींदगी मे कुछ पाना हो..
तो तरीके बदलो, ईरादे नहीं..
జీవితంలో ఏదైనా సాధించాలంటే..
పద్ధతి మార్చుకో, కోరికను (ఆశయాన్ని) కాదు..

7.104. खरीद लेंगे सबकी सारी उदासियाँ दोस्तों..
सिक्के हमारे मिजाज़ के चलेंगे जिस रोज..
అందరి అన్ని బాధలను కొనేసుకుంటాను మిత్రులారా..
నా స్వభావపు నాణాలు చెల్లే సమయం వచ్చినప్పుడు..

7.105. ये ख्वाहिशों के काफ़िले भी कमाल होते है..
कम्बख़्त, गुज़रते वही से है जहा रास्ते नहीं होते..
ఈ కోరికల తండాలు కూడా భలే విచిత్రంగా ఉంటాయి..
దౌర్భాగ్యం, దారులు లేనివైపునుంచే పోతుంటాయి..

7.106. उम्र ढलने पर समझ में ज़िन्दगी आने लगी..
जब सिमटने लग गए पर आसमाँ खुलने लगा..
వయసు పైబడ్డాక జీవితం అర్థంకావటం మొదలైంది..
రెక్కలు ముడుచుకుపోయేవేళ ఆకాశం పరుచుకోసాగింది..

7.107. सहम सी गयी है ख्वाइशें..
जरूरतों ने शायद उनसे ऊँची आवाज़ में बात की होगी..
కోరికలు భయంతో ముడుచుకుపోయాయి..
అవసరాలు బహుశ వాటికన్నా గట్టిగా మాట్లాడిఉంటాయి..

7.108. कितनी मासूम तमन्ना है..
नाम अपना तेरी आवाज़ में सुनूँ..
ఎంత అమాయకమైన కోరికో కదా..
నా పేరును నీ గొంతులో వినాలి అని..

7.109. इश्क तो हमेशा से खुबसूरत है..
दाग तो उसमें ख्वाहिशें लगाती हैं..
ప్రేమ ఎప్పుడూ అందమైనదే..
కోరికలే దానికి మరకలు పూస్తాయి..

7.110. पूछ रही है आज मेरी हर शायरी मुझसे..
कहाँ गए वो दीवाने जो वाह वाह किया करते थे..
నా ప్రతీ కవితా నన్ను నిలదీస్తోంది..
ఏరి, ఎటు పోయారు ఆ వాహ్ వాహ్ అని పొగిడేవారంతా?..

7.111. हाथ बाँधे क्यों खड़े हो हादसों के सामने..
हादसे कुछ भी नहीं है हौसलों के सामने..
చేతులు కట్టుకుని ఎందుకు నిలబడ్డావు దుర్ఘటనల ఎదుట?..
ధైర్యం ముందు దుర్ఘటనలు ఏపాటివి?..

7.112. जलो वहाँ जहाँ जरूरत हो..
उजालों में चिरागों के कोई मायने नहीं होते..
అవసరం ఉన్నచోట వెలుగునింపు..
వెలుగులు ఉన్నవేళ దీపాలు ఏ విలువా చేయవు..

7.113. गुनहगारों की आँखों में झूठे ग़ुरूर होते हैं..
यहाँ शर्मिन्दा तो सिर्फ़ बेक़सूर होते हैं..
నేరస్తుల కన్నుల్లో అవాస్తవపు పొగర్లు ఉంటాయి..
ఇక్కడ కేవలం నిర్దోషులే (అభిమానంతో) సిగ్గు పడతారు..

7.114. एक Station जैसी है जिन्दगी मेरी..
यहाँ लोग तो बहुत है पर अपना कोई नहीं..
నా జీవితం ఒక స్టేషనువంటిది..
ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు, కానీ నా అనేవారెవరూ లేరు..

7.115. मेरी खामोशियों में भी फसाना ढूँढ लेती है..
बड़ी शातिर है दुनिया मजा लेने का बहाना ढ़ूँढ लेती है..
నా మౌనాలలో నుండి కూడా కథలను వెతికేసుకుంటుంది..
లోకం చాలా తెలివిగలది, కాలక్షేపానికి వంకలు వెతుక్కుంటుంది..

7.116. जो आपकी ख़ुशी के लिए हार मान ले..
आप उसे से कभी जीत नहीं सकते..
మీ సంతోషం కోసం (తమ) ఓటమిని ఒప్పుకునేవారు..
అటువంటివారితో ఎన్నడూ మీరు గెలవలేరు..

No comments:

Post a Comment