Friday, 26 January 2018

షేరోం కా షోర్- 10 (शेरों का शोर) (ఉర్దూ షేర్ లకు తెలుగు అనువాదం)

10.1. मेरी हर आह को वाह मिली है यहाँ..
कौन कहता है दर्द बिकता नहीं है..
నా ప్రతి తల్లడింపుకు (అబ్బ) మెచ్చుకోలు (అబ్బో) లభించిందిక్కడ..
ఎవరన్నారు, నెప్పి అమ్ముడుపోదని?..

10.2. क़रीब इतना रहो कि रिशतों में प्यार रहे..
दूर भी इतना रहो कि आने का इन्तज़ार रहे..
అనుబంధాలలో ప్రేమ నిలిచేంత దగ్గరగానూ ఉండాలి..
రాకకై కాస్త ఎదురుచూపు మిగిలేంత దూరమూ ఉండాలి..

10.3. कितने वर्षों का सफ़र ख़ाक हुआ...
जब उसने पुछा, कहो कैसे आना हुआ..
ఇన్నేళ్ళ పయనం అంతా బూడిదే అయింది..
చెప్పు, దేనికై రాక?’ అని తను అడిగినప్పుడు..

10.4. बस, दो दिन की ये जिंदगानी है..
आज तेरी सुनी है, कल अपनी सुनानी है..
రెండు నాళ్ళ జీవితమిది..
ఇవాళ నీ మాట విన్నాను, రేపు నాది వినిపిస్తాను..

10.5. तुम मेरे पास थे, हो, और रहोगे..
खुदा का शुक्र है, यादों की कोई उम्र नहीं होती..
నీవు నా వద్దే ఉంటివి, ఉన్నావు, ఉంటావు..
దేవుడికి కృతజ్ఞతలు, జ్ఞాపకాలకు వయసు లేదు..

10.6. ख़ुदा की मोहब्बत को फ़ना कौन करेगा?..
सभी बन्दे नेक हों तो गुनाह कौन करेगा?..
దేవుడి ప్రేమను పరిపూర్ణం/నాశనం ఎవరు చేస్తారు?..
ప్రబుద్ధులందరూ మంచివారైతే ఇంక పాపం ఎవరు చేస్తారు?

ऐ ख़ुदा, मेरे दोस्तों को सलामत रखना..
वरना मेरी सलामती की दुआ कौन करेगा..
ఓ దేవుడా, నా నేస్తాలను భద్రంగా ఉంచు..
లేదంటే నా క్షేమంకోసం ప్రార్థన ఎవరు చేస్తారు?..

और रखना मेरे दुश्मनों को भी महफूज़..
वरना मेरी तेरे पास आने की दुआ कौन करेगा..
ఇంక నా శత్రువులను కూడా జాగ్రత్తగా ఉంచు..
లేదంటే నేను నీ వద్దకు చేరాలని మొక్కులు ఎవరు మొక్కుతారు?..
--ग़ालिब

10.7. अच्छा नहीं लगता ये मनहूस अलार्म को सुनकर उठना..
काश कोई जुल्फों से पानी झटक कर हमे भी जगाता..
రోజూ ఆ వెధవ అలారం వింటూ లేవటం బాగనిపించదు..
అబ్బ, నన్నూ ఒకరు కురుల కొసల నీటి బిందువులు చల్లి లేపితే బాగుండు..

10.8. जानता हूँ, मगर फिर भी पूछना चाहता हूँ..
तुम आइना देख के बताना, मेरी पसंद कैसी है..
తెలుసు, అయినా కానీ అడుగుతున్నాను..
ఓసారి అద్దం చూసి చెప్పు, నా ఎంపిక ఎట్లా ఉందో..

10.9. धडकनों को कुछ तो काबू में कर, ऐ दिल..
अभी तो पलकें झुकाई है, मुस्कुराना अभी बाकी है उनका..
స్పందనలు కాస్త నియంత్రించుకో ఓ హృదయమా..
ఇప్పుడే కనురెప్పలు వాల్చారు, వారు ఇంకా చిరునవ్వు చిందించలేదు..

10.10. मेरी smile का password हो तुम..
दोबारा मत पूछना कि मेरी कौन हो तुम....
నా చిరునవ్వుకు పాస్ వర్డువు నువ్వు..
మరోసారి అడగకు, నాకు నీవు ఏమవుతావని..

10.11. ज़माने भर की ईदों से हमें क्या वास्ता ग़ालिब..
हमारा चाँद दिख जाये, हमारी ईद हो जाये..
లోకంలో అందరి ఈద్ లతో మాకేం సంబంధం గాలిబ్..
మా చందమామ కనిపిస్తే, మాకు ఈద్ జరిగినట్టే..

10.12. भूतकाल भव्य था, और भविष्य उज्ज्वल है..
तकलीफ़ तो साली आज है...
గతం భవ్యంగా ఉండింది, భవిష్యత్తు ఉజ్జ్వలమే..
, కష్టం అంతా ఈ నేటి తోనే..

10.13. इक तुम भी ना, कितनी जल्दी सो जाते हो..
लगता है, इश्क को तुम्हारा पता देना पड़ेगा..
నువ్వూ, భలే త్వరగా పడుకుంటావే..
ఇక ప్రేమకు నీ చిరునామా చెప్పాల్సిందే అనిపిస్తోంది..

10.14. तजुर्बे ने शेरों को ख़ामोश रहना सिखाया..
क्यों कि दहाड़ कर शिकार नहीं किया जाता..
అనుభవమే సింహాలకు మౌనంగా ఉండటం నేర్పింది..
ఎందుకంటే గర్జిస్తూ వేటాడలేము కదా..

10.15. आओ, के तुम्हें देखकर इफ़्तार कर लें हम..
इक मुद्दत हो गई है, इन आँखों को रोज़ा रखे हुए..
రావోయి, నిన్ను చూసి ఇఫ్తార్ చేసుకుంటాను..
ఈ కన్నులు రోజా ఉండబట్టి చాలా ఏళ్ళైంది..

10.16. अगर जिन्दगी इतनी अच्छी होती तो हम इस दुनिया में रोते- रोते हुए न आते..
और यह जिन्दगी बुरी होती तो जाते-जाते लोगों को रुलाकर न जाते..
జీవితం అంత మంచిదే అయి ఉంటే, మనం ఏడుస్తూ లోకంలోకి వచ్చేవారం కాదు..
జీవితం అంత చెడ్డదై ఉంటే, పోతూ పోతూ జనాలను ఏడ్పించి వెళ్ళేవారమే కాదు..

10.17. थक गया करते-करते याद तुझको..
अब तुझे मैं याद आना चाहता हूँ..
అలసిపోయాను నిన్ను స్మరించీ స్మరించీ..
ఇంక నేను నీకు జ్ఞాపకం రావాలి అనుకుంటున్నాను..

10.18. क्यूँ भटकते हो सरेराह बारिश का लुत्फ़ लेने को..
कभी मेरी आँखों में ठहर के देखो, ये बेइंतहा बरसती है..
ఎందుకు బాట అంతా వెతుకుతూ తిరుగుతావు, వానజల్లును ఆనందించటానికి?..
ఎప్పుడైనా నా కన్నులలోకి వచ్చి నిలిచి చూడు, ఇవి ఎల్లల్లేనంతగా కురుస్తాయి..

10.19. तेरे तो सिर्फ़ दोस्त अच्छे होंगे ..
हमारे तो दुशमन भी दमदार होते है..
అయితే నీకు స్నేహితులే గొప్పవారై ఉండవచ్చు..
మాకైతే శత్రువులు కూడా సత్తా ఉన్నవారే..

10.20. तेरी जुदाई में और तो कुछ ना हो सका..
बस मोहब्बत से नफ़रत हो गयी..
నీవు విడిపోయాక ఎక్కువగా ఏమీ కాలేదు..
ప్రేమంటే ద్వేషం ఏర్పడింది-అంతే 

10.21. मुहब्बत में जिसे देखा रोता हुआ ही पाया है..
मुझे तो ये मुहब्बत किसी फ़कीर की बद्दुआ लगती है..
ప్రేమలో ఎవర్ని చూసినా ఏడుస్తూనే కనిపించాడు..
నాకు ఈ ప్రేమ ఒకానొక ఫకీరు పెట్టిన శాపమా అనిపిస్తుంది..

10.22. बोल दिया होता, तुम्हे दर्द देना है, ऐ ज़िदगी..
मोहब्बत को बीच में लाने की क्या ज़रूरत थी–..
నన్ను బాధ పెట్టాలనుందని చెప్పి ఉండాల్సింది, జీవితమా..
ప్రేమను మధ్యలోకి తేవటం దేనికి?..

10.23. बस, एक बार निकाल दो इस इश्क़ से, ऐ खुदा..
फिर जब तक जीयेंगे कोई खता न करेंगे..
దేవుడా, ఒక్కసారి నన్ను బయటకు రప్పించు, ఈ ప్రేమలోనుండి..
ఇంక జీవించి ఉన్నంతకాలం ఏ తప్పు చేయనే చేయను..

10.24. जब हम ग़लत होते हैं, तो समझौता चाहते हैं..
और दूसरे ग़लत होते हैं, तो हम न्याय चाहते हैं..
పొరపాటు మనదైతే మనకు ఒప్పందం కావాలిట..
అదే అవతలివాడి పొరపాటైతే మనకు న్యాయం కావాలిట..

10.25. वे बेईमान नेता-से हैं, हमारे दिल से खेलते हैं..
और हम भोली जनता-से हैं, हर बार उन्हीं को चुनते हैं..
తను అవినీతి పరుడైన నాయకుడిలా నా మనసుతో ఆడుకుంటారు..
నేనేమో అమాయక ప్రజలలా ప్రతీసారి తననే ఎంచుకుంటాను..

10.26. बस, यही सोचकर छोड़ दी, हमने ज़िद मोहब्बत की..
अश्क उनके बहे, या मेरे, रोयेगी तो मोहब्बत ही..
ఒక్కటే ఆలోచించి ప్రేమ పంతం విడిచిపెట్టాను..
కన్నీరు తనదైతేనేమి, నాదైతే నేమి, రోదించేది ప్రేమే కదా..

10.27. हम सुधर गये तो बहुत पछताओगे...
तुझसे मोहब्बत का जूनून ह़ी तो मेरी पहचान है...
నేను బాగుపడితే చాలా బాధపడతావు..
నీ ప్రేమోన్మాదమే నా గుర్తింపు కదా..

10.28. बहुत अँधेरा सा है दिल के कमरे में..
सोचता हूँ कुछ ख्वाब जलाए जाए..
చాలా చీకటిగా ఉంది గుండె గదిలో..
కొన్ని కలలకు నిప్పు పెట్టి రగిలించాలనుకుంటున్నాను..

10.29. तेरे हर दुख को अपना बना लूँ..
तेरे हर ग़म को दिल से लगा लूँ..
मुझे करनी आती नहीं चोरी वरना..
मैं तेरी आँखों से हर आँसू चुरा लूँ..
నీ ప్రతి దుఃఖాన్ని నాదిగా చేసుకోనా..
నీ ప్రతి బాధను నా మనసుతో తీసుకోనా..
నాకు దొంగతనం చేయటం రాదు, వచ్చి ఉంటే..
నీ కంటినుండి ప్రతి అశ్రువును దొంగిలించేయనా..

10.30. तुम्हे भूलना भी कोई मुश्किल है क्या?..
बस, मुझे मरने तक की मोहलत दे दो..
నిన్ను మర్చిపోవటం కూడా ఓ పెద్ద కష్టమా?..
చచ్చిపోయేదాకా కాస్త వ్యవధినివ్వు, చాలు..

10.31. ये ज़िन्दगी चल तो रही थी..
पर तेरे आने से मैं ने जीना शुरु किया..
ఈ బ్రతుకు అట్లా సాగుతూ ఉండేది..
నీవు వచ్చాకే నేను జీవించటం మొదలుపెట్టాను..

10.32. भगवान से कुछ मांगना ही है तो हमेशा अपनी माँ के सपने पूरे होने की दुआ माँगना..
तुम खुद ब खुद आसमान की ऊंचाइया छू लोगे..
భగవంతుడని ఏదైనా అడగాలనుకుంటే ఎప్పుడూ అమ్మ కలలను సాకారం చేయమని అడుగు..
నీకై నువ్వే ఆకాశపు అంచులను తాకుతావు..

10.33. गिनती ठीक से सीखा नहीं उस बच्चे ने..
मगर इतना मालूम है खुशियाँ बांटने से बढती हैं ..
లెక్కలు సరిగ్గా నేర్చుకోలేదు ఆ పిల్లవాడు..
కానీ, సంతోషాలు పంచుకుంటేనే పెరుగుతాయి, అని మాత్రం తెలుసు..

10.34. हर कोई पूछता है करते क्या हो तुम..
कि जैसे मोहब्बत कोई काम ही नहीं..
ప్రతీవాడు అడుగుతాడు, ఏం చేస్తుంటావు నువ్వు? అని..
అక్కడికేదో, ప్రేమ పనే కానట్టు..

10.35. कर जाते हैं शरारत क्योंकि थोड़े शैतान हैं हम..
कर देते हैं ग़लती क्योंकि इंसान हैं हम..
అల్లరి చేసేస్తాను, కాస్త గడుగ్గాయినే నేను..
పొరపాటు చేసేస్తాను, ఎందుకంటే మనిషిని నేను..

10.36. जज़बात पे क़ाबू, वो भी मोहब्बत में..
तूफ़ान से कहते हो, चुपचाप गुज़र जाओ..
భావాలపై నియంత్రణ, అదీ ప్రేమలోనా?..
నిశ్శబ్దంగా సాగిపోమని గాలివానతో అంటున్నావా?..

10.37. जो बिना कहे सुने भी दिल के बेहद क़रीब होते हैं..
ऐसे नाज़ुक एहसास बड़े नसीब से नसीब होते है...
ఏమీ చెప్పుకోకుండా కూడా మనసుకు దగ్గరగా ఉండటాలు..
అటువంటి మృదువైన భావాలు గొప్ప భాగ్యం వల్లే దొరుకుతాయి..

10.38. मासूमियत तुझमें है, पर तू इतना मासूम भी नहीं..
कि मैं तेरे क़ब्ज़े में हूँ और तुझे मालूम भी नहीं ..
అమాయకత్వం నీలో ఉంది, కానీ నీవు అంత అమాయకం కూడా ఏం కాదు..
నేను నీ నిర్బంధంలో ఉండటమూ, అది నీకు తెలియకపోవటమా?..

10.39. अपनी ज़िन्दगी के कुछ पल देदे मुझे..
आज न सही तू अपना कल देदे मुझे..
ख़ुशी दे या न दे तेरी मर्ज़ी..
अपना दर्द तो चल देदे मुझे...
నీ జీవితంలో కొన్ని క్షణాలను నాకివ్వు
ఈరోజు కాకపోయినా రేపటిని నాకివ్వు..
సంతోషాన్ని ఇస్తావో ఇవ్వవో నీ ఇష్టం
కనీసం నీ బాధనైనా నాకివ్వు..

10.40. कल रात मैं ने अपने दिल से भी रिश्ता तोड़ दिया..
पागल तेरे को भूल जाने कि सलाह दे रहा था..
నిన్న రాత్రి నా మనసుతో కూడా అనుబంధం తెంపేశాను..
వెర్రిది, నిన్ను మరచిపొమ్మని సలహా ఇస్తోంది నాకు..

10.41. दिल दुखाया करो, इजाज़त है..
भूल जाने की बात मत करना..
మనసును బాధపెట్టు, అనమతిస్తాను..
కానీ విడిచిపోతాననే మాట మాట్లాడద్దు..

10.42. मुझे आज साहिल पर रोने भी दो..
कि तूफान में मुस्कुराना भी है..
నన్ను ఈ రోజు (తీరికగా) తీరంపై రోదించనీ..
గాలివానల వేళ చిరునవ్వు నవ్వాల్సి ఉంది కదా..

10.43. रोज़ सोचती हूँ भूल जाऊँ तुम्हें..
फिर रोज़ ही ये बात भूल जाती हूँ..
ప్రతి రోజు నిన్ను మర్చిపోదామని అనుకుంటాను..
మళ్ళీ రోజూ ఈ మాట మర్చిపోతున్నాను..

10.44. हमारे आँसूं पोंछ कर वो मुस्कुराते हैं..
उनकी इस अदा से वो दिल को चुराते हैं..
हाथ उनका छू जाये हमारे चेहरे को..
इसी उम्मीद में हम खुद को रुलाते हैं..
నా కన్నీరు తుడిచి తను నవ్వుతాడు..
తను అట్లా చేయటం నాకెంతో ఇష్టం..
తన చేయి నా ముఖానికి తాకాలి..
ఈ ఆశతోనే నాకై నేను కన్నీరు తెచ్చుకుంటాను..

10.45. कुछ लोग सिखाते है मुझे मोहब्बत के क़ायदे कानून..
नहीं जानते वो इस गुनाह में हम सज़ा-ए-मौत के मुज़रिम हैं..
కొందరు నాకు ప్రేమ నియమాలు నేర్పుతుంటారు..
నేను అదే నేరానికి మరణశిక్ష అనుభవిస్తున్నానని వారికి తెలియదు..

10.46. किस तरह संभालोगे तुम जिंदगी के रिश्ते..
ज़रा सी एक जबान तो संभाली नहीं जाती..
జీవితంలో అనుబంధాలను జాగ్రత్తగా ఏం నిర్వహించుకుంటారు?..
చిన్న నాలుకను జాగ్రత్తగా చూసుకోవటం రాదు కానీ..

10.47. मिजाज़ अच्छा है आज हमारा..
ऐ दोस्त, सितम करना हो तो लौट आओ..
ఇవాళ నాకు కాస్త బాగనే ఉన్నట్టు అనిపిస్తోంది..
ఓ నేస్తమా, హింసించాలనుకుంటే తిరిగి రావచ్చు..

10.48. अपनी ज़िन्दगी की बस इतनी सी कहानी है..
कुछ हम खुद बर्बाद हुए थे और कुछ उनकी मेहरबानी है..
నా జీవితపు కథ ఇదిగో, ఇంతే ఇంత..
కొద్దిగా నేను చెడిపోయాను, కొంచెం ఏమో తన అనుగ్రహం..

10.49. लोग शोर से जाग जाते है..
मुझे तुम्हारी खामोशी सोने नहीं देती..
జనాలు అరుపుల వల్ల మేలుకుంటారు..
నన్ను నీ మౌనం పడుకోనివ్వదు..

10.50. अब आई हो तो थोड़ी देर ठहर के जाना..
तुम बरसात हो, कोई रूठी हुई महबूबा नहीं..
వచ్చావుగా, కాసేపు నిలువరాదా..
నీవు వర్షానివి, అలిగిన ప్రియురాలివి కాదు..

10.51. रुका हुआ है अज़ब धूप छाँव का मौसम..
गुज़र रहा है कोई दिल से बादलों की तरह..
ఎండా నీడల విచిత్ర వాతావరణం నిలిచి ఉంది..
మనసులో ఎవరో మేఘాలలా కదిలిపోతున్నారు..

10.52. मेरी मोहब्बत की बस इतनी सी कहानी है..
मैं उसका गुलाम और वो मेरी रानी है..
నా ప్రేమ కథ ఈ కొంచెమే, ఇంతే..
తనేమో నా రాణి, నేనేమో తన బానిసను..

10.53. बचपन चवन्नी से हरे नोट में बदल गया..
मगर बाज़ार बंद हो गया खुशियों का...
చిన్నతనం పావలా (చారానా) నుంచి కాగితాలలోకి మారిపోయింది..
కానీ సంబరాల దుకాణాలు (ఇక) మూసుకుపోయాయి..

10.54. पास होकर सितम करना तो आदत थी तुम्हारी..
अब यादो में रह कर क्यों जीना मुश्किल करते हो..
దగ్గర ఉండి హింసించటం నీకుటూ అలవాటే..
ఇప్పుడు జ్ఞాపకాలలో ఉండి కూడా ఎందుకు నా బ్రతుకును కష్ట పెడతావు..

10.55. अपने वजूद पे इतना तो यकीन है हमें कि..
कोई दूर तो हो सकता है हमसे, पर हमें भूल नहीं सकता..
నా అస్తిత్వం మీద ఇంత నమ్మకం అయితే నాకు ఉంది..
ఎవరైనా నాకు దూరం కాగలరు, కానీ నన్ను మరువలేరు..

10.56. दर्द को भी आधार से जोड़ दो साहब..
जिन्हें मिल गया हो उन्हें दुबारा ना मिले..
నెప్పిని కూడా ఆధార్ తో జోడించండి బాబూ..
ఒకసారి అందినవాడికి మరోసారి అందకుండా..

10.57. कभी मिल जाए कहीं वो कारीगर, तो मिलाना ज़रूर..
जिसने घड़ी बनायी, उसे वक़्त रोकना भी आता होगा..
ఎక్కడైనా ఆ కళాకారుడు కనిపిస్తే తప్పక ఓసారి కలవాలని ఉంది..
గడియారం తయారు చేసినవాడికి కాలాన్ని ఆపటం కూడా తెలిసే ఉండవచ్చు కదా..

10.58. कितना भी पकड़ लो, ये फ़िसलता ज़रूर है..
ये वक़्त हैं साहब, बदलता ज़रूर है..
ఎంత పట్టుకున్నా ఇధి జారిపోతుందండీ..
ఇది కాలం, తప్పక మారిపోతుందండీ..

10.59. मेरी बहती हुई आँखों में तेरे ख़्वाब की फ़स्ल..
बाढ़ के पानी में ये अंकुर मर न जाये कहीं..
కారుతున్న నా కన్నీటిలో నీ కలల పంట..
వరద నీటిలో ఈ పసిమొక్క చనిపోతుందేమో..

10.60. भगवान की अदालत में वकालत नहीं होती...
और यदि सज़ा हो जाये तो ज़मानत नहीं होती....
భగవంతుడి న్యాయస్థానంలో వాదనలుండవు..
ఒకవేళ శిక్షపడితే జామీను (అపరాధ రుసుం) మీద విడుదలకూడా ఉండదు..

10.61. कोई वादा नहीं फिर भी प्यार है..
जुदाई के बावजूद भी तुझपे अधिकार है.
तेरे चेहरे की उदासी दे रही है गवाही..
मुझसे मिलने को तू भी बेक़रार है.
వాగ్దానాలేం చేసుకోకుండానే ప్రేమ ఉంది..
విడిపోయినప్పటికీ నీ మీద అధికారం ఉంది..
నీ ముఖం పై ఉన్న విషాదం సాక్ష్యం చెబుతోంది..
నన్ను కలవాలని నీకూ ఆత్రుత ఉంది..

10.62. नहीं मिला कोई तुम जैसा आज तक..
पर ये सितम अलग है की मिले तुम भी नहीं..
నీవంటివారు ఎవ్వరూ దొరకలేదు ఈనాటి దాకా..
కానీ నువ్వూ లభించింది లేదనే ఆ హింస వేరు..

10.63. पलक से पानी गिरा है तो उसको गिरने दो..
कोई पुरानी तमन्ना पिघल रही है पिघलने दो..
కనురెప్ప నుండి కన్నీరు రాలుతోంది, రాలనీ..
ఒకానొక పాత కోరికో కరిగితోంది, కరగనీ..

10.64. दुआ करो कि सलामत रहे मेरी हिम्मत..
ये एक चराग़ कई आँधियों पे भारी है..
నా ధైర్యం క్షేమంగా ఉండాలని ప్రార్థించండి..
ఈ ఒక్క దీపం ఎన్నో గాలివానలకన్నా గట్టిది..

10.65. मैं क़तरा हो के तूफानों से जंग लड़ता हूँ..
मुझे बचाना समंदर की ज़िम्मेदारी है..
నేను శకలాలై గాలివానలతో యుద్ధం చేస్తున్నాను..
నన్ను రక్షించటం సముద్రం బాధ్యత..

10.66. ख़्वाहिश तो थी मिलने की, पर कभी कोशिश नहीं की..
सोचा के जब खुदा माना है तुझको, तो बिन देखे ही पूजेंगे..
నిన్ను కలవాలనే కోరిక ఉండేది, కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు..
దేవుడిలా భావించాను కనుక చూడకుండానే పూజిద్దామా అనిపించింది..

10.67. अजब तमाशे है दुनिया में यारों..
कौड़ियों में इज्जत और करोड़ों में कपड़े बिकते हैं..
లోకంలో విచిత్రమైన చిత్రాలున్నాయి నేస్తాలూ..
చిల్లిగవ్వలకేమో గౌరవం, కోట్లకేమో బట్టలు- అమ్ముడుపోతాయి ఇక్కడ..

10.68. किताबों के पन्नों को पलट के सोचता हूँ..
यूँ पलट जाए मेरी ज़िंदगी तो क्या बात है..
ख़्वाबों मे रोज़ मिलता है जो..
हक़ीकत में आए तो क्या बात है..
పుస్తకం పుటలను తిప్పుతూ ఆలోచిస్తాను..
ఇట్లాగే నా జీవితమూ తిరిగితే బాగుంటుంది కదా..
కలలో రోజూ వచ్చి కలిసేవారు
వాస్తవంలో కలిస్తే బాగుంటుంది కదా..

10.69. बहुत छाले हैं उसके पैरों में..
कम्बख़्त, वो ज़रूर उसूलों पर चला होगा..
వాడి కాళ్ళు బాగా పొక్కిపోయాయి..
పాపం, తప్పకుండా సిద్ధాంతాల మీద నడిచి ఉంటాడు..

10.70. आज उदासी ने भी हाथ जोड़कर कहा मुझसे..
तुझे तेरे प्यार का वास्ता, मेरा आशियाना छोड़..
ఇవాళ విషాదం చేతులు జోడించి నాతో అంది..
నీ ప్రేమ మీదొట్టు, ఇక నా గూటిని వదిలిపెట్టు, అని..

10.71. बचपन की ख्वाहिशें आज भी खत लिखती हैं मुझे..
शायद बेखबर इस बात से हैं कि वो, ज़िदगी अब इस पते पर नही रहती..
చిన్ననాటి కోరికలు ఈనాటికీ నాకు ఉత్తరాలు వ్రాస్తాయి..
బహుశ జీవితం ఇక ఆ చిరునామాపై ఉండటం లేదని దానికి వార్త అందలేదు..

10.72. हाल तो पुछ लूँ तेरा, पर डरता हूँ आवाज़ से तेरी..
जब जब सुनी हैं कमबख्त मोहब्बत ही हुई हें..
నీవెట్లా ఉన్నావని అడిగాలనుంది, కానీ నీ గొంతంటే భయం నాకు..
విన్న ప్రతీసారీ, అబ్బ, ప్రేమే కలుగుతుంది..

10.73. ये इश्क़ मोहब्बत की रिवायत भी अजीब है..
पाया नहीं है जिसको, उसे खोना भी नहीं चाहते..
ఈ ప్రేమ పద్ధతి కూడా భలే విచిత్రమైనది..
ఎవరినైతే పొందనే లేదో, వారిని పోగొట్టుకోవాలనీ అనుకోము..

10.74. वो खुद पर ग़ुरूर करते हैं, तो इसमें हैरत की कोई बात नहीं..
जिन्हें हम चाहते है वो आम हो ही नहीं सकते..
తనపై తనకంత గర్వం ఉందంటే అందులో ఆశ్చర్యం ఏం లేదు..
నేను కోరుకున్నవారు సామాన్యులు అయి ఉండరు కదా..

10.75. हमारा जीने का तरीक़ा थोड़ा अलग हैं..
हम उम्मीद पर नहीं अपनी ज़िद पर जीते है..
నేను జీవించే పద్ధతి కాస్త భిన్నమైనది..
ఆశ పెట్టుకుని కాదు, నా పట్టుదల పెట్టుకుని బ్రతుకుతాను..

10.76. पानी फेर दो इन पन्नों पर, ताकि धुल जाए स्याही सारी..
ज़िन्दगी फिर से लिखने का मन होता है कभी-कभी..
ఈ కాగితాల పై నీరు పోసేయండి, దీని మీది సిరా అంతా చెరిగిపోయేదాక..
జీవితాన్ని తిరిగి వ్రాయాలని అనిపిస్తుంది అప్పుడప్పుడూ..

10.77. कितनी जल्दी ज़िन्दगी गुज़र जाती है..
प्यास बुझती नहीं, बरसात चली जाती है..
तेरी याद कुछ इस तरह आती है..
नींद आती नहीं मगर रात गुज़र जाती है..
ఎంతత్వరగా జీవితం గడిచిపోతుందో..
దాహం తీరనే తీరదు, వర్షం వెలిసిపోతుంది..
నీ జ్ఞాపకం కూడా ఎట్లా వస్తుందంటే
నిద్ర రాదు కానీ రాత్రి గడిచిపోతుంది..

10.78. अभी तो साथ चलना है, समंदर की मुसाफत में..
किनारे पर ही देखेंगे, किनारा कौन करता है..
కలిసి నడవాల్సి ఇంకా ఉంది, సముద్రపు యానంలో..
తీరం మీదే తెలిసిపోతుంది, ఒడ్డునే ఎవరు ఉండిపోతారో..

10.79. नींद तो ठीक ठाक आई पर जैसे ही आँख खुली..
फिर वही ज़िन्दगी याद आई..
నిద్ర బాగనే పట్టింది, కానీ కన్నులు తెరవంగనే..
మళ్ళీ ఆ జీవితమే గుర్తుకు వచ్చింది..

10.80. दुआ कौन सी थी ज़हन में, याद नहीं, बस इतना याद है..
दो हथेलियाँ जुड़ी थी, एक मेरी थी, एक तुम्हारी थी..
ప్రార్థన ఏంటో గుర్తులేదు మెదడుకు, కానీ ఇంతే గుర్తుంది..
రెండు అరచేతులు జత చేరాయి ప్రార్థనకోసం, ఒకటి నాది, ఒకటి నీది..

10.81. हज़ार जवाबों से अच्छी है खामोशी..
ना जाने कितने सवालों की आबरू रखती है..
వేనవేల సమాధానాలకన్నా మౌనమే నయం..
ఎన్ని ప్రశ్నల మర్యాదను కాపాడుతుందో చెప్పలేము..

10.82. वो हमको पत्थर और खुद को फूल कह कर मुस्कुराया करते हैं..
उन्हें क्या पता कि पत्थर तो पत्थर ही रहते हैं, पर फूल ही मुरझा जाया करते हैं..
నేనేమో బండరాయినిట, తనేమో పువ్వును- అని చెప్పి నవ్వుతుంది..
తనకేం తెలుసు, రాయి రాయిగానే ఉండిపోతుంది, పువ్వులే వాడిపోతుంటాయని..

10.83. तसल्ली के भी नख़रे बहुत हैं..
लाख कोशिशें कर लो मिलती ही नहीं है..
తృప్తికి కూడా వేషాలు (నకరాలు) ఎక్కువ..
లక్ష ప్రయత్నాలు చేయి, దొరకనే దొరకదు..

10.84. दिल टूटा है तो अपनी ही ग़लती से..
उस ने कब कहा था की तू मुहब्बत कर..
మనసు విరిగిందంటే మన తప్పు వల్లే..
అదెప్పుడు అంది, నువ్వు ప్రేమించరా అని..

10.85. हाँ है, तो मुस्कुरा दे; ना है, तो नज़र फेर ले..
यूँ शरमा के आँखें झुकाने से उलझनें बढ़ रही हैं..
ఇష్టమైతే చిరునవ్వు చిందించు, ఇష్టం కాకపోతే చూపులు తిప్పేసుకో..
ఇట్లా సిగ్గుపడి కళ్ళు దించుకోవటంతో ఇబ్బంది పెరుగుతున్నది..

10.86. न तो अनपढ़ रहा, और न ही क़ाबिल हुआ मैं..
ख़ामखा, ऐ इश्क़, तेरे स्कूल में दाख़िल हुआ मैं..
అటు చదువూ అబ్బలేదు, ఇటు మొద్దుగానూ ఉండిపోలేదు..
ఓ ప్రేమా, అనవసరంగా నీ బడిలో చేరాను నేను..

10.87. ज़िन्दगी तो हमारी भी शानादार थी..
मगर मोहब्बत ने बीच में शरारत कर दी..
జీవితం మాది కూడా గొప్పగానే ఉండేది..
కానీ ప్రేమ మధ్యలో అల్లరి చేసింది..

10.88. यह भी अच्छा है कि हम किसी को अच्छे नहीं लगते..
चलो, कोई रोयेगा तो नहीं हमारे मरने के बाद..
నేను ఎవ్వరికీ నచ్చను, ఇదీ ఒకందుకు మంచిదే..
నేను చనిపోయాక ఎవ్వరూ ఏడవరు కదా..

10.89. मंजिलें क्या है रास्ता क्या है..
हौसला हो तो फासला क्या है..
లక్ష్యాలేంటి, మార్గాలేంటి..
దమ్ముంటే దూరాలేంటి..

10.90. नाकाम थीं मेरी सब कोशिशें उस को मनाने की..
पता नहीं कहां से सीखी ज़ालिम ने अदाएं रूठ जाने की..
తన అలక మాన్పేందుకు నా ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి..
ఈ అలిగే కళలు ఎక్కడ నేర్చుకుందో, కఠినురాలు..

10.91. शायरी वो नहीं लिखते हैं जो शराब से नशा करते हैं..
शायरी तो वो लिखते हैं जो यादों से नशा करते हैं..
మధువు మత్తును సేవించేవారు షాయరీ వ్రాయరు..
షాయరీ వ్రాసేది జ్ఞాపకాల మత్తును సేవించేవారే..

10.92. मैं हुआ बर्बाद अपने शौक से..
आप पर तो मुफ्त का इल्जाम है..
నేను నాశనమైంది నా సరదా వల్ల..
నీ పై ఉత్తగనే నెపం పడింది..

10.93. अब तो आँखों से भी जलन होती हैं मुझे..
खुली हो तो तलाश तेरी, बंद हो तो ख्वाब तेरे..
ఇంక కళ్ళు కూడా మంటలు పుడుతున్నాయి నాకు..
తెరిస్తే నీకోసం వెతుకులాట, మూస్తే నీ కలలు..

10.94. बड़ी गुस्ताख़ है तेरी यादें, इन्हें तमीज़ सिखा दो..
दस्तक भी नहीं देती, और दिल में उतर आती हैं..
నీ జ్ఞాపకాలకు భలే పొగరు, కాస్త మర్యాద నేర్పు..
(తలుపు) తట్టనే తట్టవు, మనసు లోపలకు వచ్చేస్తాయి..

10.95. तुम्हे याद कर लूँ तो मिल जाती है हर दर्द से निजात..
लोग यूं ही हल्ला मचाते हैं की दवाइयाँ महँगी हैं..
నిన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు,  ప్రతి నెప్పి నుండి ముక్తి దొరుకుతుంది..
జనాలు ఉత్తగనే గొడవ పెడతారు, మందులు ఖరీదైపోయాయని..

10.96. इस से बढकर तुमको और कितना करीब लाँऊ मैं..
कि तुमको दिल में रखकर भी मेरा दिल नहीं लगता..
ఇంతకన్నా మించి నిన్ను ఇంకెంత దగ్గరగా తెచ్చుకోను?..
నిన్ను మనసులో పెట్టుకుని కూడా మనసు నిలవటం లేదు..

10.97. तू मिले या न मिले, ये मेरे मुकद्दर की बात है..
सुकून बहुत मिलता है तुझे अपना सोचकर..
నిన్ను పొందటం పొందకపోవటం భాగ్యాన్ని బట్టి ఉంటుంది..
నిన్ను నా అనుకుంటే చాలు, చాలా తృప్తిగా ఉంటుంది..

10.98. हर फूल को रात की रानी नहीं कहते
हर किसी से दिल की कहानी नहीं कहते..
मेरी आँखों की नमी से समझ लेना
हर बात को हम जुबानी नहीं कहते..
ప్రతీ పువ్వును రేయిరాణి అనరు
ప్రతివారికి మనసులోమాట చెప్పుకోరు..
నా కన్నుల్లో తడి చూసి అర్థం చేసుకో
ప్రతీ మాటను నేను నోటితో చెప్పుకోను..

10.99. अब मैं कोई भी बहाना नहीं सुनने वाला..
तुम मेरा प्यार मुझे प्यार से वापस कर दो..
ఇంక నేను ఏ వంకలూ వినను..
నీవు నా ప్రేమను ప్రేమగా తిరిగి ఇవ్వాల్సిందే..

10.100. अब वो सामने भी आती है तो नज़रें झुक जाती है खुद-ब-खुद..
इन मासूम नज़रोंको किसी की नज़र लग गयी शायद..
ఇక తను ఎదురుపడినా చూపులు వాలిపోతాయి వాటికవే..
ఈ అమాయకమైన చూపులకు ఎవరిదో దృష్టి తగిలిందేమో..

10.101. लोग दिलको दर्द देते हैं..
और हम दर्द देने वाले को दिल देते हैं..
జనాలు మనసును బాధ పెడతారు..
నేను బాధ పెట్టేవారికి మనుసు ఇస్తాను..

10.102. दामन को आँसुओं से शराबोर कर दिया..
उसने मेरे इरादे को कमज़ोर कर दिया..
కొంగును కన్నీటితో తడిపేశాడు..
అతడు నా ఉద్దేశ్యాన్ని బలహీనపరిచాడు..

10.103. दो हिस्सों में बंटी हुई है जिन्दगी सारी..
अभी उम्र नहीं तुम्हारी, अब उम्र नहीं तुम्हारी..
రెండు భాగాలుగా చీలి ఉంటుంది జీవితం..
ఇప్పుడే ఆ వయసు కాదు, ఇక ఆ వయసు కాదు..

10.104. ज़िन्दगी की खरोचों से ना घबराइये ज़नाब..
तराश रही है खुद जिंदगी निखर जाने को..
జీవితం పెట్టే గాట్లకు భయపడకండి బాబూ..
స్వయంగా తాను మిమ్మల్ని చెక్కుతోంది, మెరిపించటానికి..

10.105. मेरे हक़ मे खुशिओं की दुआ करते हो..
तुम खुद मेरे क्यो नहीं हो जाते ..
నాకు ఆనందం కలగాలని ప్రార్తిస్తావు..
నువ్వే నాకెందుకు సొంతం కావు..

10.106. हमने तो खुद से इंतकाम लिया..
तुमने क्या सोचकर मुहब्बत की..
నేనైతే నామీద నేను పగతీర్చుకున్నాను..
మరి, నువ్వేం ఆలోచించి ప్రేమించావు?

10.107. मेरी नींदें उज़ाडने वाली..
ये बता अब तेरे ख्वाब कौन देखेगा..?
నా నిద్ర పోగొట్టేదానా..
ఇక నీ కలలెవరు కంటారో అది చెప్పు..

10.108. इतनी क्या जल्दी है मुझे छोड़ने की..
अभी तो हद बाकी है मुझे तोड़ने की..
నన్ను విడిచిపెట్టటానికి అంత తొందర ఏముంది?..
నన్ను విరవటానికి ఇంకా హద్దులు దాటాల్సి ఉంది..

10.109. आखिर गिरते हुऐ आँसुओं ने पूछ ही लिया..
निकाल दिया न मुझे उसके लिऐ जिसके लिए तू कुछ भी नहीं..
చివరకు రాలిపడే కన్నీరు అడగనే అడిగింది..
ఎవరికోసం నీవేమి కావో, వారి కోసం నన్ను రాల్చేశావే అని

10.110. ज़िन्दगी जख़्मों से भरी है, वक़्त को मरहम बनाना सीख लो..
हारना तो मौत के सामने फ़िलहाल जिंदगी से जीतना सीख लो..
జీవితం గాయాలతో నిండి ఉంది, కాలాన్ని (ఔషధం) లేపనంగా చేసుకోవటం నేర్చుకో..
ఎట్లాగూ చావు ఎదుట ఓడిపోక తప్పదు, ప్రస్తుతానికి జీవితం మీద గెలవటం నేర్చుకో..

10.111. निकाल दे दिल से ख्याल उसका..
यादें किसी की तक़दीर नहीं बदला करती...
మనసులోంచి తన ఆలోచనలను తీసి పారేయవోయి..
జ్ఞాపకాలు ఎవ్వరి భాగ్యాన్ని మార్చలేవు..

10.112. नये अमीरों के घर भूलकर भी मत जाना..
हर एक चीज़ की क़ीमत बताने लगते हैं..
కొత్తగా ధనవంతులైన వారి వద్దకు మర్చిపోయి కూడా పోవద్దు..
ప్రతీ వస్తువు ధర చెప్పటం మొదలుపెడతారు..

10.113. समझ नहीं आता कि उदासी के बाज़ार में..
कहाँ-कहाँ खर्च करूँ ख़ुशी..
దుఃఖపు దుకాణానికి పోతే, అర్థమే కాదు,
ఎక్కడెక్కడెక్కడని సంతోషాన్ని ఖర్చు చేయను?..

10.114. हो सके तो मुड़ के देख लेना, जाते जाते..
तेरे आने के भ्रम में ज़िन्दगी गुज़ार लेंगे..
వీలైతే ఓసారి వెనక్కు తిరిగి చూడు, పోతూ పోతూ..
నీవు తిరిగి వస్తావనే భ్రమలో జీవితాన్ని గడిపేస్తాను..

10.115. दो हिस्सों में बंट गये मेरे दिल के तमाम अरमान..
कुछ तुझे पाने निकले, कुछ मुझे समझाने निकले..
రెండు భాగాలలోకి చీలినవి నా మనసులో కోరికలు..
కొన్ని  నిన్ను పొందటానికి, కొన్ని నాకు నచ్చ చెప్పటానికి బయల్దేరాయి..

10.116. मेरे बस में हो तो लहरों को इतना हक़ भी ना दूँ..
लिखूँ नाम तेरा किनारे पे, और लहरों को छूने तक ना दूँ...
నా వశంలో ఉంటే అలలకు అస్సలు అవకాశం ఇవ్వను..
తీరాన నీ పేరు వ్రాసి అలలను తాకనైనా తాకనివ్వను..

No comments:

Post a Comment