Saturday, 10 February 2018

షేరోం కా షోర్ - 11 (शेरों का शोर) (ఉర్దూ షేర్ లకు తెలుగు అనువాదం)

11.1. जीने के लिए रोज़ हँस लेता हूँ..
मगर रोज़ थोड़ी थोड़ी ज़िन्दगी बेच लेता हूँ..
జీవించటానికి రోజూ నవ్వుకుంటాను..
కానీ రోజూ కొద్దిగ జీవితాన్ని అమ్ముకుంటాను..

11.2. किसान के लड़के ने अपने नाम के आगे डॉक्टर् जोड़ लिया...
गाँव मे हल ने कोने मे पड़े पड़े दम तोड़ दिया..
రైతు కొడుకు తన పేరుకు ఓ డాక్టర్ తగిలించుకున్నాడు..
పల్లెలో నాగలి మూలపడి ఊపిరి విడిచింది..

11.3. कोशिशें की समझदार बनने की..
लेकिन खुशियाँ बेवकूफियों से ही मिली...
చాలా ప్రయత్నించాను, తెలివికలవాడిని కావాలని..
కానీ సంతోషాలు వెర్రిచేష్టల నుంచే దొరికాయి..

11.4. बता, किस कोने में सुखाऊँ तेरी यादें..
बरसात बाहर भी है, और भीतर भी है..
చెప్పు, ఏ మూల ఆరబెట్టుకోమంటావు నీ జ్ఞాపకాలను?..
వర్షం బయటా ఉంది, లోపలా ఉంది..

11.5. ऐ बादल, मेरी आँखे तुम रख लो..
कसम सें बड़ी माहिर हैं बरसने में..
ఓ మేఘమా, నా కన్నులను నీవు ఉంచుకో..
కురవటంలో భలే నేర్పరులివి, నిజంగా...

11.6. वाह वाह बोलने की आदत डाल लो..
मैं मोहब्बत में अपनी बरबादियाँ लिखने वाला हूँ..
వాహ్ వాహ్ అనటం (మెచ్చుకోవటం) అలవరుచుకోండి..
నేను ప్రేమలో నా నాశనాలను (వర్ణించి) వ్రాయబోతున్నాను..

11.7. हमें आदत नहीं हर एक पे मर मिटने की..
तुझे में बात ही कुछ ऐसी थी दिल ने सोचने की मोहलत ना दी..
నాకు ప్రతీ వారి పై పడి చావటం అలవాటు లేదు..
నీలో ఏముందో మరి, నా మనసు ఆలోచించుకునే అవకాశమే ఇవ్వలేదు..

11.8. किसी पर मर जाने से शुरु होती है मोहब्बत..
इश्क ज़िन्दा लोगों का काम नहीं..
ఎవరిమీదో (మనసు) పడి చావటంతోనే మొదలవుతుంది ప్రేమ..
ఇది బ్రతికి ఉన్నవారు చేసే పని కాదు..

11.9. राख से भी आयेगी खुशबू मोहब्बत की..
मेरे ख़त को तुम यूँ सरेआम जलाया न करो..
బూడిద లోనుంచి కూడా వస్తుంది ప్రేమ పరిమళం..
నా ఉత్తరాన్ని ఇట్లా అందరి మధ్య తగలబెట్టబోకు..

11.10. न जाने कैसे आग लग गई बहते हुए पानी में..
हमने तो बस कुछ खत बहाऐ थे उसके नाम के..
పారే నీటిలో ఎట్ల నిప్పు అంటుకుందో మరి..
నేను తన పేరిట కొన్ని ఉత్తరాలను వదిలానందులో, అంతే..

11.11. दिन गुज़र जाता है तपते हुए सूरज की तरह..
शाम आती है तो ढल जाने को जी चाहता है...
రోజంతా మండే సూరీడిలా గడుస్తుంది..
సాయింత్రమైతే అస్తమించాలనిపిస్తుంది..

11.12. एक बाज़ी के सिवा क्या निकली..
ज़िंदगी भी तो इक जुआ निकली..
ఒక పందెం తప్ప ఇంకేంటిటా?..
జీవితం కూడా ఒక జూదమని తేలింది..

11.13. ये किस मोड़ पर ले आए हालात मुझे..
लोग दुआ देते हैं या ख़ैरात मुझे..
పరిస్థితులు నన్ను ఏం మలుపుకు తెచ్చేశాయి?..
జనాలు నా మంచి కోరుతున్నారా, లేక దానమిస్తున్నారా?..

11.14. शुक्र मना जिंदगी तुझपे अहसान किया है..
तुझपे मेरे क़त्ल का इल्ज़ाम नहीं है..
ఓ జీవితమా, నీకు ఉపకారం చేశాను..
నీ పై నా హత్యానేరం మోపటం లేదు..

11.15. दूसरा मौका सिर्फ़ कहानियाँ देती हैं..
ज़िंदगी नहीं..
రెండవ అవకాశం కేవలం కథలే ఇస్తాయి..
జీవితం ఇవ్వదు..

11.16. यारों, आईने को क्या खबर इस भेद की..
एक चेहरा चेहरे के अंदर भी होता है..
నేస్తాలూ, అద్దానికేం తెలుసు తేడా?..
ఈ ముఖం వెనక కూడా ఒక ముఖం ఉంటుందని..

11.17. कहीं मैं डूबने से बच न जाऊँ, सोचकर ऐसा..
मेरे नज़दीक से होकर कोई तिनका नहीं निकला..
ఎక్కడ నేను మునగకుండా బ్రతికిపోతానో అని..
ఒక్క పరక కూడా నాకు దగ్గరగా కదలలేదు..

11.18. आदत बना ली मैं ने, खुद को तकलीफ़ देने की..
ताकि जब अपना कोई तकलीफ़ दे, तो तकलीफ़ ना हो..
నన్ను నేను కష్టపెట్టుకోవటం అలవాటు చేసుకున్నాను..
ఎప్పుడైనా నా సొంతవారు కష్టపెడితే కష్టం కలగకుండా ఉండాలని..

11.19. वो मेरी होगी तो लौट आएगी, एक दिन मेरे पास..
हम जिसे प्यार करते हैं उसे क़ैद नहीं करते..
తను నాకు చెందితే తిరిగి వస్తుంది ఒకనాటికి..
నేను ప్రేమించే వారిని నిర్బంధించను..

11.20. लोग कहते हैं की ईद आई हैं..
तुम आ जाओ तो यकीन आ जाये..
జనాలంటున్నారు పండగ వచ్చిందని..
ఏది, నువ్వు వస్తే కదా నమ్మకం కుదిరేది..

11.21. बहुत खूबसूरत है ना वहम ये मेरा..
कि तुम जहाँ भी हो, सिर्फ मेरे हो..
నా ఈ అపోహ చాలా అందంగా ఉంది కదా..
నువ్వెక్కడున్నా నాకు మాత్రమే సొంతమని..

11.22. है इश्क़ तो फिर असर भी होगा..
जितना है इधर, उधर भी होगा..
ప్రేమ ఉంటే ప్రభావం పడుతుంది..
ఇక్కడ ఎంత ఉందో, అక్కడా అంతే ఉంటుంది..

11.23. धमकियाँ देते हो जुदाई की..
उफ्फ, मुहोब्बत में बदमाशियाँ..
విడిపోతానని బెదిరిస్తున్నావా..
ఉఫ్, ప్రేమలో ఇంత అల్లరా?..

11.24. लम्हों की दौलत से दोनों महरूम रहे..
मुझे चुराना न आया, तुम्हें कमाना न आया..
ఘడియల నిధి ఇద్దరికీ దొరకకుండా అయిందే..
నాకు దొంగిలంచటం రాలేదు, నీకు సంపాదించటం రాలేదు..

11.25. कभी फुर्सत मिले तो सोचना ज़रूर..
एक लापरवाह लड़का क्यों तेरी परवाह करता था..
ఎప్పుడైనా తీరిక దొరికితే తప్పక ఆలోచించు..
నిశ్చింతగా ఉండే యువకుడు ఎందుకు నీగురించి చింత పడేవాడు అని..

11.26. ज़हर का भी अपना हिसाब है..
मरने के लिए ज़रा सा और जीने के लिए बहुत सारा पीना पड़ता है..
విషానికి కూడా తనదైన ఒక లెక్క ఉంటుంది..
చావటానికి కొద్దిగా, బ్రతకటానికేమో చాలా తాగాల్సి ఉంటుంది..

11.27. उसकी जुदाई को लफ़्ज़ों में कैसे बयान करें..
वो रहता दिल में, धडकता दर्द में, और बहता अश्क में..
తనతో విడిపోవటాన్ని మాటల్లో ఎట్లా చెప్పేది..
అతడుండేది మనసులో, స్పందించేది నెప్పిలో, కారేది కన్నీటిలో..

11.28. उसके दिल पर भी क्या खूब गुज़री होगी..
जिसने इस दर्द का नाम मोहब्बत रखा होगा..
వాడి మనసుకు కూడా ఎంత బాధ కలిగి ఉండవచ్చో..
ఈ వేదనకు ప్రేమ అని పేరు పెట్టినవాడికి..

11.29. क़ाश कोई ऐसा हो,जो गले लगा कर कहे..
तेरे दर्द से मुझे भी तकलीफ़ होती है..
ఎవరైనా దగ్గరగా హత్తుకుని ఇట్లా అనేవారుంటే బాగుండు..
నీ నెప్పి నాకూ కష్టం కలిగిస్తుందని..

11.30. किसी ने यूँ ही पूछ लिया हमसे कि दर्द की कीमत क्या है..
हमने हँसते हुए कहा, पता नहीं कुछ अपने मुफ्त में दे जाते हैं..
ఎవరో ఊరికే ఇట్లా అడిగేశారు, వేదన వెల ఎంత అని..
నేను నవ్వి అన్నాను, ఏమో తెలియదు, కొందరు సొంతవారు ఉత్తగనే ఇచ్చేస్తుంటారని..

11.31. आदत हो गयी है तेरे क़रीब रहने की..
तेरी साँसों की खुशबू वाला इत्र मिलता ही नहीं कहीं..
అలవాటైపోయింది, నీకు దగ్గరగా ఉండటం..
నీ శ్వాసల్లో ఉండే సుగంధం వంటి అత్తరు దొరకనే దొరకదు కదా..

11.32. कुछ इस तरह मैंने ज़िन्दगी को आसान बना दिया
किसी से माफ़ी मांग ली किसी को माफ़ कर दिया
ఇదిగో, ఈవిధంగా నా జీవితాన్ని తేలిక పరుచుకున్నాను..
కొందరిని క్షమాపణ కోరాను, కొందరిని క్షమించేశాను..

11.33. दुश्मन से क्या लड़ेंगे..
अपनों से तो फुर्सत मिले..
శత్రువులతో ఏం యుద్ధం చేయను?..
సొంతవారితో తీరిక దొరికితే కదా..

11.34. अपने कमाए हुए पैसों से खरीदो..
शौक अपने आप कम हो जायेंगे..
సొంతగా సంపాదించిన పైకంతో కొనుక్కో..
సరదాలు వాటికవే తగ్గిపోతాయి..

11.35. वफ़ादार और तुम, ख़्याल अच्छा है..
बेवफ़ा और हम इल्ज़ाम भी अच्छा है..
ఏంటి, నువ్వు నమ్మకస్తుడివా? ఊహ బాగుంది..
నేను మోసం చేశానా? నెపం కూడా బాగుంది..

11.36. बुरे वक़्त में ही सबके असली रंग दिखते हैं..
दिन के उजाले में तो पानी भी चांदी लगता है..
రోజులు బాగోనప్పుడే జనాల అసలు రంగు బయట పడుతుంది..
పగటి వెలుగులో నీరు కూడా వెండిలా మెరుస్తుంది..

11.37. मेरा बस चले तो तेरी अदायें खरीद लूँ
अपने जीने के वास्ते तेरी वफायें खरीद लूँ..
कर सके जो हर वक्त दीदार तेरा
सब कुछ लुटा के वो निगाहें खरीद लूँ..
నాకే వల్లైతే నీ విలాసాలను కొనేయనా
నేను జీవించటానికై నీ నిజాయితీని కొనేయనా..
ఎప్పుడు కావాలన్నా హాయిగా చూసుకోవటానికి
ఉన్నదంతా పెట్టైనా నీ చూపులు కొనేయనా..

11.38. मैं ने वो खोया जो मेरा कभी था ही नहीं..
लेकिन तुमने वो खोया जो सिर्फ़ तुम्हारा था..
నేను పోగొట్టుకున్నది ఎన్నడూ నాది కానిదే..
కానీ నువ్వు పోగొట్టుకున్నది కేవలం నీకే సొంతమైన దాన్ని..

11.39. उसने पुछा के सबसे ज्यादा क्या पसन्द है तुम्हें..
हम बहुत देर तक उसे देखते रहे के शायद वो समझ जाये..
నీకు అన్నింటికన్నా ఏది ఇష్టం, అని తన ప్రశ్న..
నేను చాలాసేపు తనవంకే చూస్తుండిపోయాను, తనకు అర్థమైతుందేమోనని..

11.40. जो व्यस्त थे वो व्यस्त ही निकले..
वक्त पर फ़ालतू लोग ही काम आये..
పనులతో వీలు కానివారు వీలు కానివారే అయిపోయారు..
సమయానికి పనిలేనివారే పనికి వచ్చారు..

11.41. शब्द ही ऐसी चीज़ है जिसकी वजह से इंसान..
या तो दिल में उतर जाता है, या दिल से उतर जाता है..
మాటల కారణంగానే మనిషి..
మనసులోకైనా చేరిపోతాడు, మనసు బయటకైనా చేరతాడు..

11.42. पता नहीं कैसे पत्थर की मूर्ति के लिए जगह बना लेते हैं घर में..
वो लोग जिनके घर माता पिता के लिए स्थान नहीं होता..
ఇంట్లో రాతి మూర్తులకోసం ఎట్ల చోటు ఇస్తారో జనాలు..
తల్లిదండ్రులకు స్థానమే ఇవ్వరు వారు..

11.43. कभी काग़ज़ पे लिखा था तेरा नाम अनजाने में..
उससे बेहतर नज़्म, फिर कभी लिख नहीं पाया..
ఒకసారెప్పుడో తెలియకుండానే కాగితం మీద నీ పేరు వ్రాశాను..
దానికన్నా గొప్ప గీతం మరెప్పుడూ వ్రాయలేకపోయాను..

11.44. तेरी कमी खलती रहती है सदा..
एक बेनाम तस्वीर की तरह..
నీ లోటు ఎప్పుడూ కెలుకుతూ ఉంటుంది..
ఒక పేరులేని ఛాయాచిత్రం లాగా..

11.45. इश्क़ की गहराईयों में खूबसूरत क्या है..
मैं हूँ, तुम हो, और कुछ की ज़रूरत क्या है..
ప్రేమ లోతులలో అందమైనది ఏంటో..
నేనున్నాను, నీవున్నావు, వేరే అవసరం ఏంటో..

11.46. उलझा रही है मुझको, यही कश्मकश आजकल..
तू आ बसी है मुझमें, या मैं तुझमें कहीं खो गया हूँ..
ఈ అనిశ్చితత నన్ను తికమకపెడుతోంది ఈ మధ్య..
నీవు నాలోకి వచ్చి ఉండిపోయావా, లేక నేను నీలో ఎక్కడో మునిగిపోయానా..

11.47. अजीब सा मौसम है, आज ये मन बड़ा शांत हुआ है..
ऐसा लगता है दिल का मोहब्बत में देहान्त हुआ है..
విచిత్రమైన వాతావరణం, ఇవాళ ఈ మనసు చాలా ప్రశాంతంగా ఉంది..
ప్రేమకారణంగా గుండె చనిపోయిందో ఏమో అనిపిస్తోంది..

11.48. उसीसे पूछलो उसके इश्क़ की कीमत..
हम तो बस भरोसे पे बिक गए..
తననే అడుగు, తన ప్రేమ ధర ఎంతో..
నేనైతే విశ్వాసానికి అమ్ముడుపోయానంతే..

11.49. क्या माँगू खुदा से आप को पाने के बाद
किसका करू इंतेज़ार ज़िंदगी मे आपके आने के बाद..
क्यों प्यार पे जान लुटाते हैं लोग
आज मालूम हुआ हैं आप को पाने के बाद..
దేవుణ్ణి ఇంకేమి అడగను, నిన్ను పొందాక
జీవితంలో ఎవరి గురించి ఎదురుచూడను, నిన్ను పొందాక..
ప్రేమిస్తే జనాలెందుకు ప్రాణాలు విడుస్తారో
ఇప్పటికి తెలిసింది, నిన్ను పొందాక..

11.50. बुरे हैं हम तभी तो ज़ी रहे हैं..
अच्छे होते तो द़ुनिया ज़ीने नहीं देती..
మేము చెడ్డవారం, అందుకే జీవిస్తున్నాము..
మంచివారమై ఉంటే లోకం బ్రతకనిచ్చేది కాదు..

11.51. खुदा महफूज़ रखें आपको तीनों बलाओं से..
वकीलों से, हक़ीमों से, हसीनों की निगाहों से
న్యాయవాదులు, వైద్యులు, అందమైనవారి చూపులు..
భగవంతుడు మిమ్మల్ని ఈ మువ్వురినుండి కాపాడు గాక..

11.52. मौसम बदल गये जमाने बदल गये
लम्हों में दोस्त बरसों पुराने बदल गये..
दिन भर रहे जो मेरी मौहब्बत की छॉंव में
वो लोग धूप ढलते ही ठिकाने बदल गये..
కాలాలు మారాయి, లోకం మారింది
క్షణాలలో ఏళ్ళనాటి స్నేహాలు మారిపోయాయి..
రోజంతా నా ప్రేమ ఛాయలో ఉంటుండేవారు
పొద్దు గుంకే వేళ (ఎండ మాపు వేళ) మకాం మార్చేశారు..

11.53. ज़्यादा कुछ नहीं, बस, तेरा साथ चाहिए..
जमाने को जलाने के लिए बस इतना ही काफ़ी है..
ఎక్కువ ఏమీ అక్కరే లేదు, కేవలం నీ తోడు కావాలి..
లోకం ఈర్ష్యపడటానికి ఇంతే చాలు..
లోకాన్ని ఈర్ష్యపడేలాగ చేయటానికి ఇంతే చాలు..

11.54. ज़िन्दा रहो जब तक लोग कमियाँ ही निकालते हैं..
मरने के बाद जाने कहाँ से इतनी अच्छाइयाँ ढूँढ लाते हैं..
జీవించి ఉన్నంతకాలం జనాలు పొరపాట్లనే వెతుకుతారు..
చనిపోయాక ఎక్కడినుంచి ఇంత మంచిని వెతికి తెస్తారో..

11.55. है दर्द सीने में, मगर होंठों पे जज़्बात नहीं आते..
आखिर क्यों वापिस वो बीते हुए लम्हात नहीं आते..
వేదన ఉంది మనసులో, కానీ భావాలు పెదవుల మీదకు రావు..
ఎందుకో మరి, ఆ గడిచిపోయిన క్షణాలు తిరిగే రావు..

11.56. अगर यूँ ही कमियाँ निकालते रहे आप तो..
एक दिन सिर्फ खूबियाँ रह जाएँगी मुझमें..
ఇదేవిధంగా తమరు నా లోపాలను ఎత్తిచూపుతూ పోతే..
ఒకరోజు కేవలం మంచిగుణాలే మిగిలిపోతాయి నాలో..

11.57. ख़्वाइश बड़ी ही बेवफ़ा होती है..
पूरे होते ही बदल जाती है..
కోరిక చాలా మోసకారి..
తీరిపోతూనే మారిపోతుంది..

11.58. हुज़ूर एक हुक्म हम पे भी फ़रमाइये..
आ जाइये खुद या फिर हमें बुलाइये..
మహాప్రభూ, ఒక ఆజ్ఞ మాకు కూడా ఇవ్వండి..
మీరే ఇటు వచ్చేయండి, లేదా మమ్మల్నైనా పిలుచుకోండి.

11.59. बस ग़मों को गुमराह कर दो..
खुशियाँ खुद लौट आएँगी..
బాధలను దారి మళ్ళించేయి..
సంతోషాలు అవే తిరిగి వస్తాయి..

11.60. मुहब्बत में झुकना कोई अजीब बात नहीं..
चमकता सूरज भी तो ढल जाता है चाँद के लिए..
ప్రేమలో తల ఒగ్గటం విచిత్రమైన విషయమేం కాదు..
వెలిగే సూరీడు కూడా వెన్నెల కోసం కుంకిపోతాడు..

11.61. बादलों से कह दो अब इतना भी ना बरसे..
अगर मुझे उनकी याद आ गई, तो मुकाबला बराबरी का होगा..
మేఘాలకు చెప్పండి, అంతగా కురవవద్దని..
నాకు తను గుర్తొస్తే ఇంక పోటీ సమానంగా ఉంటుంది..

11.62. काँटो से बच बच के चलता रहा उम्र भर..
क्या खबर थी की चोट एक फूल से लग जायेगी..
ముళ్ళనుండి కాపాడుకుంటూ సాగాను జీవితమంతా..
నాకేం తెలుసు, ఓ పువ్వువల్ల గాయం అవుతుందని..

11.63. तस्वीर बना कर तेरी आस्माँ पे टाँग आया हूँ..
और लोग पूछते हैं आज चाँद इतना बेदाग़ कैसे है..
నీ చిత్రం పటం కట్టి ఆకాశానికి తగిలించాను..
జనాలు అడుగుతున్నారు, ఈ మచ్చ లేని వెన్నెలరేడేంటి, అని..

11.64. आईना जब भी उठाया करो..
पहले देखा करो फिर दिखाया करो..
అద్దం ఎప్పుడు తీసినా సరే..
మొదలు తాను చూసుకున్నాకే ఇతరులకు చూపించాలి..

11.65. जब तक रास्ते समझ में आते है..
तब तक लौटने का वक़्त हो जाता है..
దారులు అర్థం అయ్యేసరికి..
తిరిగి వెళ్లే వేళైపోయింది..

11.66. नादान लोग ही जीवन का मज़ा लेते हैं..
समझदारों को तो हमने हमेशा मुश्किलों में ही देखा है..
ఏమీ తెలియనివారే జీవితాన్ని ఆనందంగా గడుపుతారు..
తెలివైనవారిని ఎప్పుడూ నేను కష్టంలో ఉండటమే చూశాను..

11.67. वक़्त सब भुला देता है, लेकिन सच तो यह है कि..
इंसान की फितरत है वक़्त को भुला देने की..
కాలం అన్నింటిని మరిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే..
కాలాన్ని మర్చిపోవటం మనిషి నైజం..

11.68. तेरे गुस्से पर भी प्यार आता है हमें..
कोई तो है ज़िन्दगी में जो इतने हक से हमें धमकाता है..
నీ కోపం మీద సైతం నాకు ప్రేమ కలుగుతుంది..
జీవితంలో ఒక్కరైనా ఉన్నారు, హక్కుతో బెదిరించే వారు..

11.69. कोई मुझे भी पत्थर सा दिल ला दो यारों..
आखिर मुझे भी इंसानो की बस्ती में ही जीना है..
నాకూ ఎవరైనా రాతిగుండెను తెచ్చి పెట్టండి..
చివరకు నేనూ మనుషుల మధ్యలోనే బ్రతకాలి..

11.70. चेहरा बता रहा था कि मारा है भूख ने..
सब लोग कह रहे थे कि कुछ खा के मर गया..
ముఖం చూస్తే ఆకలితో చనిపోయాడని తెలుస్తోంది..
అందరేమో ఏదో తిని చనిపోయాడు అంటున్నారు..

11.71. मुझे इंतज़ार करना बेहद पसंद है..
ये वक़्त उम्मीद से भरा होता है..
నాకు నిరీక్షించటం చాలా ఈ ఇష్టం..
ఆ సమయం ఆశతో నిండి ఉంటుంది..

11.72. हर रात जान-बूझ कर रखता हूँ दर खुला..
कोई तो हो लूटेरा जो मेरे ग़म भी लूट ले..
ప్రతీ రాత్రి కావాలనే తలుపు తెరిచి ఉంచుతాను..
ఎవరైనా దోపిడీవాడు నా బాధను కూడా దోచుకుపోతే బాగుండు..

11.73. कभी पीठ पीछे आपकी बात चले तो घबराना मत..
बात उन्हीं की होती है, जिनमें कोई बात होती है..
నీ వెనక నీ గురించి చెప్పుకుంటుంటే కంగారు పడకు..
విశేషం ఉన్నవారి గురించే విశేషాలు చెప్పుకుంటారు జనం..

11.74. जिन्दगी के मज़े लो..
नहीं तो वक्त तो तुम्हारे मज़े लेता ही रहेगा..
జీవితాన్ని ఆనందించు..
లేదంటే కాలం నిన్ను ఆడిస్తునే ఉంటుంది..

11.75. तुम मेरी बातों का जवाब नहीं देते तो कोई बात नहीं..
आओगे जब हमारी कब्र परतो हमभी ऐसा ही करेंगे..
నీవు నా మాటలకు సమాధానం చెప్పకపోయినా ఫరవాలేదులే..
నా సమాధి వద్దకు వస్తావుగా, అప్పుడు నేనూ అదే చేస్తాను..

11.76. बुलंदियों को पाने कि ख्वाइश तो बहुत है मगर ..
दूसरों को रौंदने का हुनर कहाँ से लाऊं..
ఉన్నతస్థితులకు ఎదగాలని కోరిక చాలా ఉంది కానీ..
ఇతరులను తొక్కేసే ప్రతిభ ఎక్కడ తెచ్చేది?..

11.77. किसी की मजबूरियाँ पे न हँसिये..
कोई मजबूरियाँ ख़रीद कर नहीं लाता..
ఒకరి నిస్సహాయతను చూసి నవ్వకండి..
ఎవ్వరూ నిస్సహాయతను కొనుక్కుని తెచ్చుకోరు..

11.78. मुझसे दूरियाँ बनाकर तो देखो..
फिर पता चलेगा कितना नज़दीक हूँ मैं..
నన్ను దూరం చేసుకుని చూడు..
నేనెంత దగ్గరున్నానో తెలుస్తుంది..

11.79. कोई वकालत नहीं चलती ज़मीन वालों की ..
जब कोई फैसला आसमान से उतरता है ..
నింగినుండి నిర్ణయాలు దిగి వచ్చినప్పుడు..
నేలమీదున్న వారి వాదప్రతివాదాలేవీ (వకాల్తా) చెల్లవు..

11.80. मेरी आधी फिक्र आधे ग़म तो यूँ ही मिट जाते हैं..
जब प्यार से तू मेरा हाल पूछ लेती है..
నీవు ప్రేమతో కుశలం అడిగినప్పుడు..
నా బాధ, చింత సగానికి సగం సమసిపోతాయి..

11.81. कोई मज़बूत सी ज़ंजीर भेजो..
तुम्हारी याद पागल हो गई है..
ఏదైనా గట్టి ఇనుప సంకెల పంపు..
నీ జ్ఞాపకం పిచ్చి పట్టిపోయింది..

11.82. दौलत चाहे बेईमानी से घर आये..
पर उसकी पहरेदारी के लिए सबको इमानदार शक्स चाहिए..
సంపదలు అవినీతిపరుడి ఇంటికి చేరినప్పటికీ..
దాని కాపలా కోసం నిజాయితీపరుడే కావాలి..

11.83. जनाब, मत पूछिए हद हमारी गुस्ताखियों की..
हम आईना ज़मीं पर रखकर आसमां कुचल दिया करते है..
అయ్యా, హద్దు అడగకండి నా అఘాయిత్యాలకు..
అద్దాన్ని నేల మీద పెట్టి ఆకాశాన్ని తొక్కేస్తుంటాను..

11.84. किसी ने मुझसे पूछा कैसी है अब जिंदगी..
मैं ने मुस्कुरा कर जवाब दिया, वो खुश है..
ఎవరో అడిగారు, ఇప్పుడు జీవితం ఎట్లా ఉంది అని..
వారు సంతోషంగా ఉన్నారు- అన్నాను నేను నవ్వి..

11.85. ऐ खुदा, तुझ से एक सवाल है मेरा..
उसके चहेरे क्यूँ नहीं बदलते, जो इंसान बदल जाते हैं..
ఓ దేవుడా, నాదొక చిన్న ప్రశ్న..
మారిపోయిన మనుషుల ముఖాలెందుకు మారిపోవు?..

11.86. आखिर थक हार के लौट आया मैं बाज़ार से..
यादों को बंद करने के ताले कहीं मिले नहीं..
అలసిసొలసిపోయి తిరిగి వచ్చాను బజారు నుండి..
జ్ఞాపకాలకు మూసేయగలిగే తాళాలు ఎక్కడా దొరకలేదు..

11.87. ये जो तुमने खुद को बदला है..
ये बदला है, या बदला है..
నిన్ను నీవు మార్చుకున్నావు చూడు..
అది మారటమా, లేక పగతీర్చుకోవటమా?..

11.88. फ़ुरसत अगर मिले तो मुझे पढ़ना ज़रूर..
मैं नायाब उलझनों की मुकम्मल किताब हूँ..
తీరిక దొరికితే నన్ను తప్పక చదవండి..
నేను దుర్లభమైన సమస్యల సంపూర్ణ పుస్తకాన్ని..

11.89. तुम मिल गयी थी, तो खुदा नाराज़ हो गया था मुझसे..
कहता था, अब तो तू कुछ माँगता ही नहीं है..
నీవు దొరికావు, ఇక దేవుడు నా పై కోపించాడు..
ఇక నీవు నన్ను ఏమీ కోరటమే లేదే, అంటున్నాడు..

11.90. मेरे कंधे पर कुछ यूँ गिरे तेरे आंसू..
कि सस्ती सी कमीज़ अनमोल हो गयी..
నా భుజం పై నీ కన్నీరు పడుతూనే..
చౌకబారు చొక్కా కూడా అమూల్యమై పోయింది..

11.91. तुझे क्या पता कि मेरे दिल में कितना प्यार हैं तेरे लिए..
जो कर दूँ बयाँ तो तुझे नींद से नफरत हो जाए..
నీకేం తెలుసు, నా మనసులో నీకోసం ఎంత ప్రేమ ఉందో..
ఒకసారి వ్యక్తపరిచానో, నీకు నిద్ర అంటే అసహ్యం పుడుతుంది..

11.92. आओ, हम चाँद का क़िरदार अपना ले..
दाग अपने पास रख ले, और रोशनी बाँट दें..
రండి, మనం చందమామ పాత్ర పోషిద్దాం..
మచ్చ మన వద్దే పెట్టుకుని వెలుగును పంచుదాం..

11.93. ना जाने कैसे इम्तेहान है, अपने ये आजकल..
मुकद्दर, मोहब्बत और दोस्त, तीनों नाराज़ से रहते है..
ఏమో, ఈమధ్య ఇదేం పరీక్షా సమయమో..
అదృష్టం, ప్రేమ, నేస్తాలు- ముగ్గురూ కోపంగానే ఉంటున్నారు..

11.94. ए खुदा, मुसीबत में डाल दे मुझे..
किसी ने बुरे वक्त में साथ आने का वादा किया है..
దేవా, నన్ను కష్టాలపాలు చేయవా..
ఒకరు కష్టంలో తోడు ఉంటానని మాట ఇచ్చారు..

11.95. आज कल सब कहते हैं, मैं बुझा-बुझा सा रहता हूँ..
अगर जलता रहता तो कब का खाक हो जाता..
ఈమధ్య ఏంటో మలిగిపోయినట్టు ఉన్నానని అందరూ అంటున్నారు..
ఇంకా కాలుతూనే ఉంటే ఎప్పుడో బూడిదైపోయేవాడిని..

11.96. तुमसे मिलने का सबसे बड़ा फायदा ये हुआ ..
कि मुझे अपनी जिंदगी से प्यार हो गया है ..
నిన్ను కలవటం వల్ల నాకు కలిగిన మొదటి లాభం..
నాకు నా జీవితమంటే ప్రేమ కలిగింది..

11.97. मैं ने इस बहाने बोई नहीं दिल में उम्मीदें..
कि कौन जंगल में उगे पेड़ों को पानी देगा..
నేను మనసులో ఏ కోరికలను ఈ వంకతోనే నాటలేదు..
అడవిలో పెరిగే చెట్లకు నీరెవరు పోస్తారని?..

11.98. शुरू तो कर दी तलाश ख़ुद की..
अब तू मिले तो मैं भी मिलूँ..
ఇదిగో, మొదలుపెట్టాను నన్ను నేను వెతుక్కోవటం..
నీవు దొరికితే, ఇక నేనూ దొరుకుతాను..

11.99. दुनियाँ की हर चीज़ ठोकर लगने से टूट जाया करती है..
एक कामयाबी ही है जो ठोकर खा के ही मिलती है..
లోకంలో ప్రతీ వస్తువు దెబ్బలు తగిలితే విరిగిపోతుంది..
ఒక్క విజయం మాత్రమే (ఎదురు)దెబ్బలు తిన్నాకే లభిస్తుంది..

11.100. आईना देख क्या लिया मैंने.
अब कोई भी बुरा नहीं लगता..
అద్దం చూసుకున్నానో లేదో..
ఇంక నాకెవ్వరూ చెడ్డవారిగా కనిపించటం లేదు..

11.101. ज़िंदगी में कभी मुस्कुराने की दुआ ना देना..
मुझे पल भर मुस्कुराने की सज़ा मालूम है..
జీవితంలో ఎప్పుడూ చిరునవ్వు నవ్వాలని ప్రార్థన చేయకండి..
ఒక్క క్షణం చిరునవ్వు నవ్వటానికి పడే శిక్ష నాకు తెలుసు..

11.102. ख़ुशी का पल भी आएगा एक दिन..
ग़म भी तो मिल रहे हैं बिना तम्मना किये..
సంతోషఘడియలు కూడా దొరుకుతాయి ఒక రోజుకు..
కోరకుండానే బాధలు దొరుకుతున్నాయా లేదా?..

11.103. दिल तो रोज सजता हे एक नादान दुलहन की तरह..
और ग़म रोज़ चले आते है बाराती बनकर..
మనసు రోజూ అమాయకమైన పెళ్ళికూతురిలా తయారౌతుంది..
రోజూ బాధలు తరలి వస్తాయి పెళ్ళివారిలా..

11.104. तुम लिखते हो शिकायतें अपनी..
मैं पढता हूँ मोहब्बत तुम्हारी..
నీవు వ్రాసేది నీ వేదనలను..
నేను చదివేది నీ ప్రేమను..

11.105. मेरे हर बोल एक शेर है..
बस तुझे याद करने की देर है..
నా ప్రతీ పలుకూ ఒక కవితే..
నిన్ను స్మరించటమే ఆలస్యం..

11.106. हमारा तजुर्बा हमको सबक ये भी सिखाता है..
कि जो मक्खन लगाता है, वो ही चूना लगाता है..
మా అనుభవం మాకు ఈ పాఠమూ నేర్పుతుంది..
ఎవడు తేనె పూస్తాడో, వాడే సున్నమూ పూస్తాడు..
(ఎవడు చెట్లెక్కిస్తాడో వాడే గోతులూ తవ్వుతాడు)

11.107. जब दिल टूटे तेरा तो मेरे पास चले आना..
मुझे अपने जैसे लोगों से मोहब्बत बहुत है..
మనసు విరిగినప్పుడు నా వద్దకు వచ్చేసేయి..
నాకు నావంటి వారంటే చాలా ప్రేమ..

11.108. और तो कुछ नहीं चाहिए मुझे तुझसे, ऐ ज़िन्दगी..
बस वो एक शख़्स लौटा दे, जो मुझे तुझसे भी प्यारा है..
నీనుంచి ఇంక వేరే ఏమీ కోరను, ఓ జీవితమా..
నాకు నీకన్నా ఎక్కువ అయిన ఆ వ్యక్తిని తిరిగి ఇవ్వు..

11.109. ये आईने ना दे सकेंगे तुझे, तेरे हुस्न की खबर..
कभी मेरी आँखों से आकर पूछ, के कितनी हसीन है तू..
ఈ దర్పణాలు నీకు నీ అందాన్ని గురించి ఏమీ చెప్పజాలవు..
ఎప్పుడైనా నా కన్నులను అడుగు, ఎంత అందంగా ఉన్నావో నీవు..

11.110. देख पगली, एक ही शर्त पर खेलूँगा ये इश्क़ की बाज़ी..
मैं जीतूँ तो तुझे पाऊँ और हारूँ तो तेरा हो जाऊँ..
చూడు ఓ వెర్రిపిల్లా, ఒకే ఒక్క షరతు మీద ప్రేమ పందెం కాస్తాను..
నేను గెలిస్తే నిన్ను పొందాలి, ఓడితే నీవాడిని కావాలి..

11.111. बहुत थक जाता है इंसान आशक़ी के बाजार में..
इश्क के हिस्से में भी एक इतवार आना चाइये..
మనిషి బాగా అలసిపోతాడు ప్రణయం బజారులో..
ప్రేమకు కూడా ఓ ఆదివారం (శెలవురోజు) రావాలి..

11.112. लोग कहते हैं कि मेरा दिल पत्थर का है..
लेकिन कुछ लोग ऐसे भी थे, जो इसे भी तोड़ गए..
నా గుండె రాతిదని జనాలు అంటారు..
కానీ దీన్ని కూడా విరిచినవారు కొందరు ఉన్నారు..

11.113. तेरे प्यार का सिला हर हाल मे देंगे..
खुदा भी माँगे ये दिल तो टाल देंगे..
अगर दिल ने कहा तुम बेवफ़ा हो..
तो इस दिल को भी सीने से निकाल देंगे.
నీ ప్రేమకు అన్ని పరిస్థితులలో ప్రతిస్పందిస్తాను
ఖుదా వచ్చి మనసివ్వవా అని అడిగినా దాటేస్తాను..
ఒకవేళ నా మనసు నువ్వు మోసకారివి అన్నదా
దాన్ని కూడా ఈ ఛాతీ నుండి బయటకు లాగేస్తాను..

11.114. ठहाके छोड़ आये हैं अपने कच्चे घरों में हम..
रिवाज़ इन पक्के मकानों में बस मुस्कुराने का है..
విరగబడి నవ్వటం మా మట్టి ఇళ్ళలోనే వదిలి వచ్చాము..
ఈ పక్కా ఇళ్ళలో చిరునవ్వులు చిందించటమే ఆనవాయితీ..

11.115. कुछ तो बात है मेरी मेहमान-नवाजी में..
कि ग़म एक बार आते है तो जाने का नाम नहीं लेते..
ఏదో విశేషం ఉండే ఉంటుంది నా అతిథి మర్యాదలో..
ఒకసారి వచ్చిందంటే దుఃఖం వెళతానని అననే అనదు..

11.116. न चाहकर भी मेरे लब पर ये फ़रियाद आ जाती है..
ऐ चाँद सामने न आ, किसी की याद आ जाती है..
వద్దు అనుకుని కూడా పెదవుల మీద ఈ ప్రార్థన కదులుతుంది..
ఓ వెన్నెలా, నా ఎదుటకు రాకు, ఎవరో బాగా గుర్తుకు వస్తారు..

No comments:

Post a Comment