Monday, 16 April 2018

షేరోం కా షోర్-12 - (शेरों का शोर) ఉర్దూ షేర్ లకు తెలుగు అనువాదం

12.1. है दफ़न मुझ में मेरी कितनी रौनके मत पूछ..
उजड़ उजड़ कर जो बसता रहा, वो शहर हूँ मैं...
నాలో ఎన్ని సౌందర్యాలు భూస్థాపితమైపోయాయో అడగవద్దు..
ఎన్నోసార్లు పాడుపడిపోతూ వెలుస్తున్న నగరాన్ని నేను..

12.2. ज़ख़्मों के बावजूद मेरा हौसला तो देख..
तू हँसी, तो मैं भी तेरे साथ हँस दिया..
ఇంతగా గాయాలు అయ్యాక కూడా నా ధైర్యాన్ని చూడు..
నువ్వు నవ్వితే నీతో పాటు నేనూ నవ్వుతున్నాను..

12.3. ये मासूमियत का कौन सा अन्दाज़ है..
पर काट कर कह दिया, कि अब तुम आजाद हो..
ఇది ఎటువంటి అమాయకత్వపు శైలి?..
రెక్కలు కత్తిరించి ఇంక నుంచి నీకు విడుదల అనటం..

12.4. फ़ासला अब भी दो क़दमों का ही है..
पहले कदम कौन बढ़ाए तय ये नहीं है..
దూరం ఇప్పటికీ రెండు అడుగులే..
మొదటి అడుగు ఎవరేస్తారు, ఇదింకా నిర్ణయం కాలేదు..

12.5. खुशी देने वाले अपने तो होते ही है..
पर ग़म देने वाले भी अजनबी नहीं होते..
సంతోషాన్ని ఇచ్చేవారు సొంతవారే..
కానీ బాధ పెట్టేవారు కూడా అపరిచితులు కారు..

12.6. चलो, आज चक्कर लगाने जाते हैं दुश्मन की गली में..
देखना है, अपने दिल की धड़कने तेज़ होती है या दुश्मन की..
పద, ఇవాళ శత్రువు ఉండే వీథిలోకి ఓసారి పోయి వద్దాం..
వేగంగా కొట్టుకునేది నా గుండెనో, శత్రువుదో- చూడాలి..

12.7. मैं कभी बुरा नहीं था, उसने मुझे बुरा कह दिया..
फिर मैं बुरा बन गया, ताकि उन्हे कोई झुठा ना कह दे..
నేను చెడ్డవాణ్ణి ఎప్పుడూ కాను, కానీ తను నన్ను చెడ్డవాడు అంది..
నేను చెడ్డవాడినైనాను, తన మాట అబద్ధం కాకూడదని..

12.8. रोशनी में कुछ कमी रह गई हो तो बता देना..
दिल आज भी हाज़िर है जलने को..
వెలుగు ఏమైనా తక్కువ పడితే చెప్పు కాస్త..
గుండె ఈనాటికీ సిద్ధంగా ఉంది, కాలటానికి..

12.9. ऐ ख़ुदा, तू रोज़ मेरे गुनाह गिना करता है..
मुझे आने दे, तेरी नाइंसाफ़ियों का हिसाब भी हम करेंगे..
ఓ ఖుదా, నీవు రోజూ నా పాపాలను లెక్కపెడతావు కదా..
నన్ను రానివ్వు, నీ అన్యాయాల పద్దులన్నీ నేను చూపెడతాను..

12.10. जला रखे है मैं ने सौ दिये..
तुम आओ तो रोशनी हो..
వంద దీపాలను వెలిగించి ఉంచాను..
నీవు వస్తే కదా వెలుగొచ్చేది..

12.11. जिनका मिलना नहीं होता किस्मत में..
उनकी यादें कसम से कमाल की होती हैं..
భాగ్యంలో ఎవరి పొందు (వ్రాసిపెట్టి) ఉండదో..
నిజంగా, వారి జ్ఞాపకాలు అద్భుతంగా ఉంటాయి..

12.12. सब कुछ मिल जाये तो जीने का क्या मज़ा..
जीने के लिए कुछ कमी भी तो ज़रूरी है..
అంతా దొరికితే జీవించటంలో ఆనందం ఏం ఉంది..
జీవించటానికి ఏదో ఒక లోటు కావాలి..

12.13. उसे ये शिकवा कि मैं उसे समझ न सका..
और मुझे ये नाज़ के मैं जानता बस उसको था..
తనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని తన ఆరోపణ..
కానీ నేను ఎరిగినది తనను ఒక్కరినే అని గర్విస్తాను.

12.14. सजदों में गुज़ार दूँ अपनी सारी ज़िंदगी..
एक बार वो कह दे कि मुझे दुआओं से मांग लो..
జీవితమంతా తలవంచి ప్రణామాలతో గడిపేయగలను..
ప్రార్థనలు చేసి నన్ను పొందమని ఒక్కసారి తను అంటే చాలు..

12.15. कुछ खास नहीं बस इतनी सी है मोहब्बत मेरी..
हर रात का आखरी खयाल और हर सुबह की पहली सोच हो तुम..
పెద్ద గొప్పదేం కాదు, నా ప్రేమ- ఇంతదే..
ప్రతి రాత్రి చివరిగా, ప్రతి ఉదయం మొదటిగా కలిగే భావన నీదే..

12.16. मतलब की दुनिया थी, इसलिए छोड़ दिया सबसे मिलना..
वरना ये छोटी सी उम्र तन्हाई के काबिल नहीं थी..
స్వార్థపు లోకమిది, అందుకే అందరిని కలవటం మానేశాను..
అంతేకానీ ఈ చిన్న జీవితం ఒంటరితనానికి తగినది కాదు కదా..

12.17. शक़ तो था मोहब्बत में नुक़सान होगा..
पर सारा हमारा ही होगा ये मालूम न था ..
ప్రేమలో నష్టం వస్తుందని తెలుసు..
కానీ నష్టమంతా నాకే వస్తుందని తెలియదు..

12.18. वो मेरे साथ ही रहता है जहाँ तक जाऊँ..
मैं हूँ दरिया तो है वो शख्स किनारा मेरा..
ఎక్కడిదాకా పోయినా అతడు వెంటనే ఉంటాడు..
నేను నదిని అయితే, అతడు నా తీరం..

12.19. जहाँ से तेरा मन चाहे, वहाँ से मेरी जिन्दगी को पढ़ ले..
पन्ना चाहे कोई भी खुले, हर पन्ने पर तेरा ही नाम होगा..
ఎక్కడినుంచి కావాలంటే అక్కడి నుంచి చదువుకో..
ఏ పుట తెరిచినా ప్రతీ చోటా నీ పేరే వ్రాసి ఉంటుంది..

12.20. ये रास्ते ले ही जाएंगे मंजिल तक, तू हौसला रख..
कभी सुना है कि अंधेरे ने सुबह ना होने दी हो..
ఈ దారులే తీసుకుపోతాయి లక్ష్యం వరకు..
ఎప్పుడైనా విన్నారా చీకటి ఉదయాన్ని కానివ్వలేదని..

12.21. तुझसे अच्छे तो मेरे दुश्मन निकले...
जो हर बात पर कहते हैं, ‘तुम्हें नहीं छोड़ेंगे’..
నీకన్నా నా శత్రువులే భలే మంచివారే..
ప్రతీ మాటకు ముందు- నిన్ను వదలిపెట్టముఅంటారు..

12.22. अबकी बार तुम मिले तो पलके बंद ही रखेंगे..
ये बातूनी आँखें मुंह को कुछ बोलने नहीं देती..
ఈసారి నువ్వు కలిస్తే కనురెప్పలు మూసేసి ఉంచేస్తాను..
ఈ వాగుడు కళ్ళు నోటిని ఏమీ చెప్పనివ్వటం లేదు..

12.23. जुबाँ पर जिक्र नहीं आता उनका तो क्या हुआ..
आज भी उन्ही की हुकूमत मेरी हर एक सांस पर है..
మాటల్లో ప్రస్తావన రాకపోయినంత మాత్రాన ఏమైందిటా..
ఈనాటికి కూడా నా ప్రతీ శ్వాస మీద తన అధికారమే ఉంది..

12.24. तुम्हारी याद की बंदगी लग गयी वरना..
मेरे वजूद की उड़ जाती धज्जिया कितनी..
నీ స్మరణమనే ఆరాధనం అబ్బంది, లేదంటేనా..
నా అస్తిత్వం ఎన్నెన్ని శకలాలైయ్యేదో..

12.25. तुम कई बार मिल चुके होते ..
तुम जो मिलते अगर दुआओं से..
ప్రార్థనలతోనే నీవు దొరికేవాడివైతే..
ఇప్పటికి ఎన్నోసార్లు సొంతమయ్యేవాడివి..

12.26. मैं ने तो देखा था बस एक नज़र के खातिर...
क्या खबर थी कि रग रग मे समां जाओगे तुम...
నేను కేవలం ఒక్క చూపు అట్లా చూడాలని కళ్ళు కలిపానంతే..
నాకేం తెలుసు, నా అణువణువులో నీవు నిండిపోతావని..

12.27. आँखें थी जो कह गयी सब कुछ..
लफ्ज़ होते तो मुकर गए होते..
కన్నులు కాబట్టి అంతా పలికేశాయి..
మాటలై ఉంటే చెప్పలేకపోయేవి..

12.28. रोकने की कोशिश तो बहुत की पलकों ने..
पर इश्क मे पागल थे, आंसू खुदखुशी करते रहे..
కనురెప్పలు ఆపి పెట్టాలని చాలా ప్రయత్నించాయి..
కానీ ప్రేమలో పిచ్చి పట్టింది, కన్నీరు ఆత్మహత్య చేసుకుంటూనే ఉండిపోయింది..

12.29. बड़ी बे-वक़्त आती है आपकी याद, इठलाती हुई..
एक वक़्त इसका भी मुक़र्रर कर दीजिये आप..
తమ జ్ఞాపకం వేళ కాని వేళ వయ్యారాలు పోతూ వచ్చేస్తుందే..
కాస్త దానికి కూడా ఓ సమయం నిర్ధారిస్తే మంచిదేమో..

12.30. हमारे मनाने की अदा इतनी हसीं होगी कि..
तुम उम्र भर रूठे रहने को कोशिश करोगी..
నేను బుజ్జగించే శైలి ఎంత అందంగా ఉంటుందంటే..
నీవు జీవితమంతా అలిగి ఉండటానికి ప్రయత్నిస్తావు..

12.31. मुझे छोड़कर वो खुश हैं, तो शिकायत कैसी..
अब मैं उन्हें खुश भी न देखूं, तो मोहब्बत कैसी ?
నన్ను విడిచి తను సంతోషంగా ఉంటే ఇంక బాధ ఏంఉంది?..
తను సంతోషంగా ఉండటం కూడా నేను చూడలేకపోతే ప్రేమ ఏంఉంది?..

12.32. ज़रूरत दिन निकलते ही निकल पड़ती है ड्यूटी पर..
बदन हर शाम कहता है कि अब हड़ताल हो जाए ..
ఉదయం అవుతూనే అవసరం డ్యూటీకి బయల్దేరుతుంది..
శరీరం ప్రతీ సాయింత్రం అంటుంది, ఇంక సమ్మె చేసేస్తానని..

12.33. शीशे में डूब कर पीते रहे उस जाम को..
कोशिशें तो बहुत की मगर भुला न पाए एक नाम को ..
సీసాలో మునిగి ఆ నిషాను తాగుతునే ఉన్నాను..
ప్రయత్నాలెన్నో చేశాను, కానీ ఒకే ఒక్క పేరు మర్చిపోలేకపోయాను..

12.34. क्यों याद करेगा कोई बेवजह मुझे, ऐ खुदा..
लोग तो बेवजह तुम्हे भी याद नहीं करते..
ఓ ఖుదా, ఎందుకు గుర్తు చేసుకుంటారు నన్నెవరైనా?..
జనాలు అకారణంగా నిన్ను సైతం గుర్తు చేసుకోరు కదా..

12.35. आसान नहीं उस शख्स को समझना..
जो जानता सब कुछ हो पर खामोश रहे हर वक़्त..
విషయమంతా తెలిసీ మౌనంగా ఉండే వ్యక్తికి..
వివరించటం అంత సులువు కాదు..

12.36. जब अल्फ़ाज़ पन्नों पे शोर करने लगें..
समझ लेना सन्नाटे बढ़ गये हैं दिल मे..
కాగితాలపై పదాలు ఘోషపెట్టేస్తున్నాయంటే..
గుండెలో నిశ్శబ్దాలు పెరిగాయి అని అర్థం చేసుకోవాలి..

12.37. मेरी शराफ़त को तुम बुज़दिली का नाम न दो..
दबे न जब तक घोडा, बन्दूक भी खिलौना ही होती है..
నా మంచితనానికి చేతకానితనమని పేరు పెట్టకు..
ట్రిగర్ నొక్కనంతవరకు పిస్తోలు కూడా ఆటబొమ్మే..

12.38. ना रोक, कलम, मुझे दर्द लिखने दे..
आज तो दर्द रोयेगा, या दर्द देने वाला..
కలమా, నన్ను ఆపకు, వేదననంతా వ్రాయనివ్వు..
ఇవాళ ఎవరో ఒకరు ఏడుస్తారు- బాధైనా, బాధపెట్టినవాడైనా..

12.39. सोचने वालों की दुनिया..
दुनिया वालों की सोच से अलग होती है..
ఆలోచించే జనాల ప్రపంచం..
ప్రపంచం జనాల ఆలోచనలకంటే భిన్నంగా ఉంటుంది..

12.40. बड़े खुदगर्ज़ होते हैं ये गुब्बारे चंद साँसो में फूल जाते हैं..
थोड़ी सी ऊँचाई पर जाकर अपनी औकात भूल जाते हैं..
ఈ బుడగలు చాలా స్వార్థపూరితాలు, కొన్ని ఊదులకే ఉబ్బిపోతాయి..
కాస్త పైకి ఎగరగానే తమ పరిధిని మర్చిపోతాయి..

12.41. बड़े ग़ुरूर से गुज़र गई कल शाम मेरे शहर से आँधी..
वो पेड़ आज भी खड़े है जिन्हें झुकने का हुनर था..
చాలా పొగరుగా ఊళ్ళోకి వచ్చి పోయింది నిన్న రాత్రి గాలివాన..
వంగటం అనే కళ తెలిసిన ఆ చెట్లు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి..

12.42. ये हुस्न-ए-राज़ मुहब्बत छुपा रहा है कोई..
है अश्क आँखों में और मुस्कुरा रहा है कोई..
ఈ అందం వెనక రహస్యమైన ప్రేమను దాస్తున్నారెవరో..
కంట్లో కన్నీరు ఉంది, అయినా చిరునవ్వు చిందిస్తున్నారెవరో..

12.43. शायरी से ज्यादा प्यार मुझे कहीं नहीं मिला..
ये सिर्फ़ वही बोलती है, जो मेरा दिल कहता है..
షాయరీ (కవిత్వం) కన్నా ఎక్కువ ప్రేమ నాకెక్కడా దొరకలేదు..
నా మనసేమంటుందో ఇది అదే పలుకుతుంది..

12.44. यहाँ मेरा कोई अपना नहीं है..
चलो अच्छा है कुछ ख़तरा नहीं है ..
ఇక్కడ నా సొంతవారెవరూ లేరు..
హమ్మయ్య, ఇంక ఏ ప్రమాదమూ లేదు..

12.45. शान्त बैठा हूँ तो यह मत समझना कि आग नहीं है मेरे अंदर..
डरता हूँ कहीं समन्दर कम ना पड़ जाये इसे बुझाने के लिये...
ప్రశాంతంగా కూర్చున్నానని నాలో నిప్పు లేదనుకోవద్దు..
దీన్ని ఆర్పటానికి సముద్రమే తక్కువ పడుతుందేమోనని భయం..

12.46. ज़िंदगी, तेरे ख़्वाब भी कमाल के हैं..
तू गरीबों को उन महलों के सपने दिखाती है..
जिसमें अमीरों को नींद नहीं आती..
జీవితమా, నీ కలలు కూడా తమాషాగా ఉంటాయి..
ధనవంతులకు వేటిలో నిద్రే రాదో..
పేదవారికి ఆ భవంతుల స్వప్నాలు చూపుతావు నీవు..

12.47. मजबूरियाँ ओढ़ के निकलता हूँ घर से..
वर्ना शौक तो अब भी है बारिशों में भीगने का...
ఇంటినుండి నిస్సహాయతలను కప్పుకుని బయల్దేరతాను..
లేదంటే ఇప్పటికీ వర్షాల్లో తడిసే సరదా ఉంది..

12.48. आज़मा ले मुझको थोड़ा और, ऐ खुदा..
तेरा बंदा बस बिखरा हैं अब तक, टूटा नहीं..
నన్ను ఇంకొంత పరీక్షించుకో ఓ ఖుదా..
నీ దాసుడు చెదిరిపోయాడు, కానీ ఇప్పటికీ విరిగిపోలేదు..

12.49. बुलंदी की उडान पर हो तो ज़रा सबर रखो..
परिंदे बताते हैं कि आसमान में ठिकाने नहीं होते...
ఉవ్వెత్తులకు చేరేందుకు ఎగరాలనుకుంటే కాస్త ఓర్పు పట్టు..
పక్షులు చెప్తున్నాయి, ఆకాశంలోగూళ్ళు ఉండవుట..

12.50. मोहब्बत ज़िन्दगी बदल देती है..
मिल जाए तब भी, ना मिले तब भी..
ప్రేమ జీవితాన్ని మార్చేస్తుంది..
దొరికినప్పుడూ, అందనప్పుడూ కూడా..

12.51. दर्द सहने की अब कुछ यूँ आदत सी हो गयी है..
कि अब दर्द न मिले तो दर्द सा होता है..
ఇక నెప్పి భరించటం ఎంతగా అలవాటైపోయిందంటే..
ఇప్పుడు నెప్పి కలగకపోతే నెప్పి లాంటిది అనిపిస్తుంది..

12.52. अब तो शायद ही कोई मुझसे प्यार करे..
मेरी आँखों में साफ़ नज़र आने लगे हैं आप..
ఇప్పుడు నన్ను ఇక ఎవ్వరూ ప్రేమించరు..
నా కన్నుల్లో స్పష్టంగా కనిపిస్తున్నావు నీవు..

12.53. लोग कहते हैं, कि हम मुस्कराते बहुत है..
और हम थक गए दर्द छुपाते छुपाते..
నేను బాగా చిరునవ్వు నవ్వుతాను- అంటారు జనాలు..
నేనేమో అలసిపోయాను, నెప్పిని దాచీ దాచీ..

12.54. काश तू मेरी आँखों का आँसू बन जाए..
मैं रोना ही छोड़ दूँ तुझे खोने के डर से..
అబ్బ, నీవు నా కన్నుల్లో కన్నీటిగా మారినా బాగుండు..
నిన్ను పోగొట్టుకుంటానేమో అనే భయంతో ఏడవటం ఆపేస్తాను..

12.55. उनकी चाहत में हम कुछ यूँ बंधे हैं कि..
वो साथ भी नहीं और हम अकेले भी नहीं..
తన ప్రేమలో ఈవిధంగా బందీనైనాను..
తను తోడూ లేరు, నేను ఒంటరిగానూ లేను..

12.56. दे दिया इश्क़ की नौकरी से इस्तीफ़ा..
कि अभी उम्र नहीं इतने ग़म उठाने की..
ప్రేమ అనే ఉద్యోగానికి త్యాగపత్రం ఇచ్చేశాను..
బాధలు సహించే వయసు లేదింక..

12.57. तैरना तो आता था हमे मोहब्बत के समंदर मे लेकिन..
जब उसने हाथ ही नहीं पकड़ा तो डूब जाना अच्छा लगा..
ప్రేమసముద్రంలో ఈదటం నాకు తెలుసు కానీ..
తను చేయి పట్టుకోనేలేదు, ఇక మునిగిపోవటం నయమనిపించింది..

12.58. जो उड गये परिंदे उनका क्या अफसोस करें..
यहां तो पाले हुए भी गैरों की छतों पर उतरते हैं..
ఎగిరిపోయిన పక్షులకోసం బాధెందుకు?..
ఇక్కడ పెంచుకున్నవి కూడా పక్కవారి మిద్దెలపై వాలుతాయి..

12.59. कुछ चीज़े हम पुरानी छोड़ आए हैं..
आते आते उसकी आँखो मे पानी छोड़ आए हैं..
ये ऐसा दर्द है जो बया हो ही नहीं सकता
दिल तो साथ ले आए धड़कन छोड़ आए हैं
కొన్ని పాత వస్తువులు వదిలేసి వచ్చాను
వస్తూ వస్తూ తన కన్నుల్లో కన్నీరు వదిలేసి వచ్చాను..
ఈ బాధ ఎవరూ వివరించలేనిది
హృదయం వెంట తెచ్చుకున్నా, స్పందన వదిలేసి వచ్చాను..

12.60. मिटाना भी चाहूँ तो भी मिटा नहीं सकता..
उसका नाम अपने दिल से..
क्यूंकि मिटाए तो वो जाते हैं जो गलती से लिखे जाते हैं..
చెరపాలనుకున్నా చెరపలేను, తన పేరును ఈ మనసులోంచి..
పొరపాటున వ్రాసినదాన్ని కదా చెరిపేసేది..

12.61. मैं कल को, तलाशता रहा दिनभर..
और शाम होते-होते, मेरा आज डूब गया..
నేను రేపటిని వెతుకుతుండిపోయాను రోజంతా..
సాయింత్రం అవుతూనే ఈరోజు మునిగిపోయింది..

12.62. क्या खूब होता अगर दुख रेत के बने होते..
हथेली से गिरा देते और पैरों से उड़ा देते..
దుఖాలు ఇసుకతో చేసినవైతే ఎంత బాగుండేదో..
అరచేతులతో కూల్చివేసేవారం, కాళ్ళతో తన్నేసేవారం..

12.63. मिल जाए उलझनों से फुरसत तो जरा सोचना..
क्या सिर्फ फुरसतों मे याद करने तक का रिश्ता है हमसे..
సమస్యల నుండి తీరిక దొరికితే కాస్త ఆలోచించి చూడు..
నాతో అనుబంధం, ఊరికే తీరికవేళల్లో స్మరించుకునేంతనేనా?..

12.64. कभी कभी हाथ छुड़ाने की ज़रूरत नहीं होती..
लोग साथ रह कर भी, बिछड़ जाते है..
ఒక్కోసారి చేతులు విడిపించుకోవలసిన అవసరం లేదు..
జనాలు తోడు ఉంటూ కూడా విడిపోతుంటారు..

12.65. दिल के किसी कोने में रह ही जाते हैं..
कुछ लोग बड़े ही ज़िद्दी होते हैं..
మనసులో ఏదో మూలలో అట్లాగే ఉండిపోతారు..
కొందరు నిజంగా భలే మొండివారు..

12.66. यूँ तो कोई सबूत नहीं है कि तुम मेरे हो..
ये दिल का रिश्ता तो, बस, यक़ीन से चलता है..
ఆ మాటకొస్తే, నీవు నాకు చెందుతావనటానికి ఏ సాక్ష్యాధారం లేదు..
ఈ మనసు అనుబంధం కేవలం నమ్మకం మీద నడుస్తుంది కదా..

12.67. मै दीपक हूँ, मेरी दुश्मनी तो  सिर्फ़ अंधेरे से है..
हवा तो बेवजह ही मेरे ख़िलाफ़ है..
నేను దీపాన్ని, నా శత్రుత్వం కేవలం చీకటితోనే..
గాలి అకారణంగా నాకు విరుద్ధంగా ది..

12.68. आखिर देता मुझे ये कैसी सजा भी तू..
है गलती भी तेरी और खफ़ा भी है तू ..
నీవు అసలేంటి ఇట్లాంటి శిక్ష వేస్తావు నాకు..
తప్పు కూడా నీదే, అలక సైతమూ నీదేనా..

12.69. वो ज़ुल्म करते रहे, हम शिकार होते रहे..
हमें भी शौक़ था, ज़ालिम को आज़माने क़ा..
వారు అన్యాయం చేస్తూనే ఉన్నారు, నేను సహిస్తూనే ఉన్నాను..
క్రూరులను (హద్దు) పరీక్షించటం నాకూ మోజే..

12.70. मैं ने दिल के दरवाजे पर चिपका दी है एक चेतावनी..
फ़ना होने का दम रखना, तभी भीतर कदम रखना..
నేను సైతం మనసు తలుపు మీద ఓ హెచ్చరిక అంటించాను..
పూర్తిగా నాశనం అయ్యే సత్తా ఉంటేనే లోపలకు అడుగు పెట్టమని..

12.71. कमाई तो जनाज़े के दिन पता चलेगी..
दौलत तो कोई भी कमा लैता हे..
సంపాదించిందేంటో అంతిమయాత్ర నాడు తెలుస్తుంది..
ఆస్తులంతస్తులు ఎవ్వడైనా సంపాదించుకుంటాడు..

12.72. कभी भूख से बहुत गहरा रिश्ता रखता होगा..
वो जो आजकल अपनी रोटी बाँट कर खाता है ..
ఒకప్పుడు ఆకలితో గట్టి అనుబంధం ఉండిందేమో..
అతడు ఈనాడు తన అన్నాన్ని పంచుకుని తింటున్నాడు..

12.73. जब तमन्ना जवान होती है..
ज़मीं भी आसमान होती है..
కోరిక పరువంలో ఉన్నప్పుడు..
నేల కూడా నింగి అయి ఉంటుంది..

12.74. तू जरा हाथ मेरा थाम के देख तो सही ..
लोग जल जायेगें महफ़िल में, चिरागों की तरह ..
నీవు నా చేతిని పట్టుకునైతే చూడు..
జనాలు సభలో రగిలిపోతారు, దీపాలవలె..

12.75. यारा दिल की बातें जो तुम समझ जाते ..
इन आँखों को आंसुओं की जरूरत ना होती ..
నేస్తమా, నీవు మనసులో మాట అర్థం చేసుకుంటే..
ఈ కన్నులకు కన్నీటి అవసరం ఉండేది కాదు కదా..

12.76. चुपचाप चल रहे थे सफर-ए-हयात में..
तुम पर नजर पड़ी तो गुमराह से हो गये..
మౌనంగా సాగుతున్నాను జీవన గమనంలో..
నీపై చూపు పడింది, దారి తప్పినట్లైంది..

12.77. कहना ही पड़ा उसे शायरी पढ़ कर हमारी..
कंबख्त की हर बात मोहब्बत से भरी है..
నా షాయరీ చదివి తనకు ఈ మాట అనక తప్పలేదు..
, ప్రతీ మాటా ప్రేమతో నిండి ఉంది కదా..

12.78. चलते थे इस जहाँ में कभी सीना तान के हम..
ये कम्बख्त इश्क़ क्या हुआ घुटनो पे आ गए हम..
ఒకప్పుడు నిటారుగా నడిచేవాడిని..
ఈ ప్రేమ కలిగింది, మోకాళ్ళ మీదకు వచ్చాను..

12.79. शिकायत मौत से नहीं, अपनों से है साहब..
जरा सी आँख क्या लगी, कब्र खोदने लगे..
నాకు చావు అంటే ఏ ఇబ్బందీ లేదు, సొంతవారంటే ఉంది..
కాస్త కన్ను అంటిందో లేదో బొంద తవ్వటం ప్రారంభించారు..
(తురకవారు బొంద పెడతారు, హిందువులకదే- చితి పేర్చటం)

12.80. एक उसूल पर गुजारी है ज़िदगी मैं ने..
जिसको अपना माना उसे कभी परखा नहीं..
ఒక నియమం ప్రకారం గడిపాను జీవితం నేను..
ఎవరిని నా అనుకున్నానో, వారిని ఎన్నడూ పరికించలేదు..

12.81. वो दोस्त मेरी नज़र में बहुत मायने रखते है..
जो सही वक्त पर मेरे सामने आईने रखते है..
ఆ నేస్తాలు నాకెంతో ముఖ్యమైనవారు..
సరైన వేళకు నా ఎదుట అద్దం పెడతారు..

12.82. मंज़िले हमारे करीब से गुज़रती गयी जनाब..
और हम औरों को रास्ता दिखाने में ही रह गये..
గమ్యాలు నాకెంతో దగ్గరగా వచ్చి పోతుండిపోయాయండీ..
నేనేమో ఇతరులకు దారి చూపించటంలో మునిగి ఉన్నాను..

12.83. जिंदगी वक्त के बहाव में है,
यहां हर आदमी तनाव में है..
हमने लगा दी पानी पर तोहमत,
यह नहीं देखा कि छेद नाव में है..
జీవితం కాలపు ప్రవాహంలో ఉంది..
ఇక్కడ ప్రతి మనిషికీ ఒత్తిడి ఉంది..
మనం నీటి మీద నెపం మోపేశాము..
కానీ చూడనిదేంటంటే, ఛిధ్రం పడవలో ఉంది..

12.84. कुछ लोग पकौड़े जैसे होते है..
थोड़ा सा ध्यान ना दो तो जल जाते है..
కొందరు పకోడీలవలె ఉంటారు..
కాస్త దృష్టిపెట్టకపోతే మాడిపోతారు..

12.85. उम्र भर उठाया बोझ उस कील ने..
और लोग तारीफ़ तस्वीर की करते रहे..
జీవితమంతా ఆ మేకు బరువును మోసింది..
జనాలు మాత్రం ఆ చిత్పటాన్ని మెచ్చుకుంటూ ఉండిపోయారు..

12.86. रिश्तों को ठंड लगने का खतरा हो तो गर्माहट के लिए..
कुछ देर खामोशी की शॉल ओढ़ लेने में कोई हर्ज़ नहीं..
అనుబంధాలకు చలి పుడుతుందనే భయం ఉంటే, వెచ్చదనం కోసం..
కాసేపు మౌనమనే శాలువ కప్పుకోవటంలో నష్టం లేదు..

12.87. बात बस एक एहसास की है..
वरना कौन किस का क्या लगता हैं..
కేవలం అదొక భావన, అంతే..
లేకపోతే ఎవరు ఎవరికి ఏమవుతారు?..
 
12.88. उनके हाथ पकड़ने की मजबूती जब ढीली हुई तो एहसास हुआ..
शायद ये वही जगह है जहां रास्ते बदलने है..
తను చేతిని పట్టుకున్న పట్టు వదులు అయినప్పుడు అనిపించింది..
బహుశ ఇదే చోటి నుంచేమో దారులు వేరు కావలసింది అని..

12.89. मँज़िले बड़ी ज़िद्दी होती हैं, हासिल कहाँ नसीब से होती हैं..
मगर वहाँ तूफान भी हार जाते हैं , जहाँ कश्तियाँ ज़िद पर होती हैं..
గమ్యాలెంతో మొండిపట్టు గలవి, భాగ్యంచేత ఎక్కడ అందివస్తాయి?..
కానీ నావలు పట్టుదలపూనిన చోట పెనుగాలులు కూడా ఓడిపోతాయి..

12.90. इतना ऐतबार तो अपनी धड़कनों पर भी हमने न किया,
जितना आपकी बातों पर करते हैं..
इतना इंतजार तो अपनी साँसों का भी न किया,
जितना आपके मिलने का करते हैं..
నీ మాటలమీద పెట్టినంత నమ్మకం
నా గుండెచప్పుళ్ళమీద కూడా నేను పెట్టలేదు..
నీవు కలుస్తావని చేసినంత నిరీక్షణం
నా శ్వాసలకోసం కూడా చేయలేదు..

12.91. ग़लत फहमियों के सिलसिले इतने दिलचस्प हैं..
हर ईट सोचती है, दिवार मुझ पर टिकी है..
అపోహల పరంపరలు భలే ఆసక్తిగా ఉంటాయి..
గోడంతా నా బలంతోనే నిలిచిందని ప్రతీ ఇటుకా అనుకుంటుంది..

12.92. रात भर जलता रहा ये दिल उसी की याद में..
समझ नहीं आता दर्द प्यार करने से होता हैं या याद करने से..
రేయంతా ఈ మనసు తన స్మరణలో కాలుతుండిపోయింది..
వేదన కలిగేది ప్రేమించినందుకో, స్మరించుకున్నందుకో అర్థం కాదు..

12.93. इंसान को तब ही समझ में जीवन का सार आता है..
जब वह ज़माने से तो जीत, मगर खुद से हार जाता है..
మనిషికి జీవనసారం అర్థమయ్యేది ఎప్పుడంటే..
ప్రపంచంమీద గెలిచి తనతో తాను ఓడిపోయినప్పుడు..

12.94. कर्ज़ लेने की आदत तो ना थी हमारी..
पर पता नहीं, दिल सदा ही उनके पास ही गिरवी क्यों रहता है..
అప్పు తీసుకునే అలవాటు ఎప్పుడూ లేదు నాకు..
మరెందుకో, మనసు ఎప్పుడూ తన దగ్గరే తాకట్టులో ఉంటుంది..

12.95. जितनी भीड़ बढती जा रही है ज़माने में..
उतने ही लोग अकेले होते जा रहे है..
ఎంత రద్దీ పెరుగుతున్నదో లోకంలో..
మనుషులు అంతే ఒంటరిగా మిగులుతున్నారు..

12.96. मुफ़्त में रिश्ते भी नहीं निभाते लोग..
मुफ़्त तो यहाँ हवा भी नहीं मिलती..
एक साँस भी तब आती है..
जब एक साँस छोड़ी जाती है..
లాభంలేకుండా అనుబంధాలు పెట్టుకోరు జనాలు..
లాభంలేకుండా ఇక్కడ గాలి కూడా ఆడదు..
ఒక ఊపిరి కూడా ఇంకొక ఊపిరి వదిలితేనే వస్తుంది..

12.97. तेरे लिए कभी इस दिल ने बुरा नहीं चाहा..
यह और बात है कि मुझे यह साबित करना नहीं आया..
ఈ మనసు నీ చెడు ఎన్నడూ కోరలేదు..
దాన్ని నిరూపించుకోవటం రాలేదు నాకు, అది వేరే మాట..

12.98. फ़िर उसने मुस्कुरा के देखा मेरी तरफ़..
फ़िर एक ज़रा सी बात पर जीना पड़ा मुझे ..
మరోసారి తను నవ్వి నావైపు చూడటమైంది..
మళ్ళీ ఈ చిన్నమాటతో నేను జీవించవలసి వచ్చింది..

12.99. कुछ यादें दे गये हैं कुछ धोखे दे गये हैं..
जो कुछ भी दे गये हैं मेरे अपने दे गये हैं..
కొందరు జ్ఞాపకాలు ఇచ్చి పోయారు, కొందరు మోసపుచ్చి వెళ్ళారు..
ఏది చేసినా నా సొంతవారే చేసిపోయారు..

12.100. जाने क्यूँ बरसने से मुकर जाता है हर बार..
मेरे हिस्से में आया है जो टुकड़ा बादल का..
ఎందుకో వర్షించకుండా వెళిపోతుంది ప్రతీసారి..
నా వంతులో దొరికిన మబ్బుముక్క..

12.101. दबे होंठों को बनाया है सहारा अपना..
सुना है कम बोलने से बहुत कुछ सुलझ जाता है..
అణిచిన పెదవులనే నా ఆసరాగా చేసుకున్నాను..
తక్కువ మాట్లాడితే పరిష్కారమయ్యేవెన్నో అని విన్నాను..

12.102. कौन कहता है की खुदा दिखाई नहीं देता..
एक वो ही तो दिखता है जब कोई दिखाई नहीं देता..
ఎవరన్నారు, దేవుడు కనిపించడని?..
ఎవరూ కనిపించని వేళ ఒక్క ఆయనే కనిపిస్తాడు..

12.103. सोचता हूँ, धोखे से ज़हर दे दूँ..
सभी ख्वाहिशों को दावत पे बुला कर..
మోసంగా విషం పెట్టేసేయాలనుకుంటున్నాను..
కోరికలన్నింటినీ విందుకు పిలిచి..

12.104. तेरे प्यार की कोई दूसरी निशानी दे मुझे..
ये आँसू तो रोज़ गिर के सूख जाते हैं..
నీ ప్రేమకు గుర్తుగా వేరేదైనా ఇవ్వవా..
ఈ కన్నీటిబొట్లు రోజూ రాలి ఆరిపోతున్నాయి..

12.105. इश्क़ के चर्चे भले ही सारी दुनिया में होते होंगे..
पर दिल तो ख़ामोशी से ही टूटते हैं ..
ప్రేమ చర్చలు ప్రపంచమంతా జరుగుతుండవచ్చు..
కానీ గుండెలు మాత్రం మౌనంగానే పగులుతాయి..

12.106. मुबारकबाद तो देना चाहते थे हम, उनको, ईद की..
बीच में उनके फेंके पत्थरों की दीवार आ गयी..
వారికి పండగ శుభాకాంక్షలు చెప్పాలనే అనుకున్నాను..
కానీ మధ్యలో వారు విసిరిన రాళ్ళ గోడ అడ్డం వచ్చింది..

12.107. नहीं चाहिए मुझे ऐसा कोई तोहफा जो मेरी उम्र बढ़ा दे..
दे दे मुझे कोई ऐसी दुआ, जो मुझे चैन की नींद सुला दे..
నా ఆయుష్షును పెంచే ఉపహారాలేవీ నాకు అక్కరలేదు..
కాస్త హాయిగా నిద్రపట్టేందుకు ప్రార్థన ఏదైనా ఉంటే చేయి..

12.108. जिस दिन खुद से दोस्ती हो जायेगी..
इस कमबख्त अकेलेपन से निजात मिल जायेगी..
తనతో తనకు స్నేహం కుదిరిన రోజు..
ఈ ఒంటరితనం నుండి విముక్తి దొరుకుతుంది..

12.109. पत्तों सी होती है कई रिश्तों की उम्र..
आज हरे कल सूख जाएं..
क्यों ना जड़ों से सीखें, रिश्तेदारी निभाना..
ఆకులవలె ఉంటోంది అనుబంధాల ఆయువు..
ఇవాళ పచ్చగా ఉంటే, రేపు ఎండిపోతాయి..
వేర్లను చూసి ఎందుకు నేర్చుకోకూడదు, అనుబంధం నిర్వహించటం?..

12.110. जिसका ये ऐलान है कि वो मज़े में है..
या तो वो फ़कीर है, या फिर नशे में है..
తాము హాయిగా ఉన్నామని దండోరా వేసుకునేవారు..
ఫకీరైనా అయి ఉంటారు, మత్తులో అయినా ఉండి ఉంటారు..
(ఫకీర్= మహాత్ముడు, సంచారసాధువు, నిరుపేద)

12.111. मजबूत होने में मज़ा ही तब है..
जब सारी दुनिया कमज़ोर कर देने पर तुली हो..
రాటుదేలటం ఉల్లాసంగా అనిపించేదెప్పుడంటే..
ప్రపంచమంతా కలిసి బలహీనపరచాలని చూసే వేళ..

12.112. तुझ तक पहुंचा दे, वो राह नहीं मिलती..
हमने हर इक मोड़ से पूछा तेरा पता..
నీ వద్దకు చేర్చే దారే ఎటూ దొరకటం లేదు..
నేను ప్రతీ మలుపునూ అడిగాను నీ చిరునామా..

12.113. एक तेरी खामोशी ही जला देती है इस पागल दिल को..
बाकी सब बातें अच्छी है तेरी तस्वीर में..
ఒక్క నీ మౌనం కాలుస్తుంది ఈ పిచ్చి మనసును..
మిగితాదంతా మంచిదే నీ చిత్రపటంలో..

12.114. नर्म लफ़्ज़ों से भी लग जाती है चोटें अक्सर..
रिश्ते निभाना बड़ा नाज़ुक सा हुनर होता है..
మెత్తని మాటలకు కూడా గాయాలవుతాయి ఒక్కోసారి..
అనుబంధాలు నిలుపుకునే కళ చాలా గొప్పది..

12.115. इत्र से कपड़ों का महकाना कोई बड़ी बात नहीं है..
मज़ा तो तब है, जब आपके किरदार से खुशबू आये..
పరిమళంతో బట్టలకు సువాసన తెచ్చుకోవటం పెద్దవిషయం కాదు..
మీ వ్యక్తిత్వం పరిమళాలు వెదజల్లితే అది ఆనందకరం..

12.116. ये झूठ है कि मुहब्बत किसी का दिल तोड़ती है..
लोग खुद ही टूट जाते हैं, मुहब्बत करते-करते...
ప్రేమ మనస్సును విరుస్తుందనేది అబద్ధం..
జనాలే విరిగిపోతారు ప్రేమిస్తూ ప్రేమిస్తూ..

No comments:

Post a Comment