Sunday, 13 May 2018

షేరోం కా షోర్-13 - (शेरों का शोर) ఉర్దూ షేర్ లకు తెలుగు అనువాదం

13.1. काश ये मोहब्बत भी तलाक़ की तरह होती..
तेरे है तेरे है तेरे है कह कर तेरे हो जाते..
అబ్బ, ఈ ప్రేమ కూడా తలాక్ (విడాకుల)లా ఉంటే బాగుండు..
నేను నీకే సొంతం, సొంతం, సొంతం-అని చెప్పి నీకు సొంతమైపోయేది..

13.2. दिल बड़ा करो,
बड़ी बातें तो सभी कर लेते हैं..
మనసు విశాలం చేసుకో..
గొప్ప మాటలు అందరూ మాట్లాడతారు..

13.3. इतना खुश रहो के साला ग़म भी कहे..
ग़लती से मे यहा कहा आ गया..
ఎంత సంతోషంగా ఉండాలంటే, బాధ కూడా..
పొరపాటున ఎక్కడికి వచ్చానబ్బా- అనాలి..

13.4. तू रूठा रूठा सा लगता है, कोई तरकीब बता मनाने की..
मैं ज़िन्दगी गिरवी रख दूँगी, तूँ कीमत बता मुस्कराने की..
ఏంటి, ఏదో అలిగినట్టున్నావు, నచ్చచెప్పే ఉపాయం చెప్పవా..
నా జీవితం తాకట్టు పెట్టేస్తాను, నీ చిరునవ్వు ధరెంతో చెప్పవా..

13.5. दावे दोस्ती के मुझे नहीं आते यारों..
एक जान है जब दिल चाहें मांग लेना..
స్నేహాల ఒట్టులు నాకు రావు నేస్తాలూ..
ఒక్క ప్రాణం ఉంది, ఎప్పుడు మనసైనా తీసుకోండి..

13.6. इश्क का धंधा ही बंद कर दिया साहेब..
मुनाफे में जेब जले, और घाटे में दिल..
ప్రేమ వ్యాపారం మానేశాను సుమండీ..
లాభాల్లో జేబులు కాలాయి, నష్టాల్లో గుండెలు..

13.7. जरूरत तोड़ देती है इन्सान के घमंड को..
न होती मजबूरी तो हर बंदा खुदा होता..
అవసరం విరిచేస్తుంది మనిషి గర్వాన్ని..
నిస్సహాయత లేకపోతే ప్రతీవాడు దేవుడయ్యేవాడు..

13.8. जो लिबासों को बदलने का शौंक रखते थे..
आखिरी वक़्त ये भी न कह पाए कफ़न ठीक नहीं..
(రకరకాల) బట్టలు మార్చుకునే మోజు ఉన్నవారు..
చివరి నిముషంలో శవవస్త్రం బాగోలేదు అనలేకపోయారు..

13.9. उन्होंने जाते जाते बड़े गुरूर से कहा..
चल जा, तुझ जैसे बहुत मिलेंगे’..
हमने भी हंस के पूछा- मुझ जैसा ही क्यों चाहिए’..
వారు వెళిపోతూ ఎంతో పొగరుగా అన్నారు-
పోవోయ్, నీవంటివారు బోలెడుమంది దొరుకుతారు అని..
నేనూ అడిగాను నవ్వి, నావంటివారే ఎందుకు కావాలి? అని..

13.10. चलती हुई कहानियों के जवाब तो बहुत है मेरे पास..
लेकिन खत्म हुए किस्सों की खामोशी ही बेहतर है..
జరుగుతున్న కథలకు సమాధానాలు చాలా ఉన్నాయి నా వద్ద..
కానీ ముగిసిపోయిన గాథలకు నిశ్శబ్దమే మేలు..

13.11. प्यार करना हर किसी के बस की बात नहीं..
जिगर चाहिए अपनी ही खुशियां बर्बाद करने के लिए..
ప్రేమించటం ప్రతీ ఒకరూ చేయగలిగే పని కాదు..
తన సంతోషాలను నాశనం చేసుకోవాలంటే సత్తా చాలా కావాలి..

13.12. भरोसा जितना कीमती होता है..
धोका उतना ही महँगा हो जाता है..
నమ్మకం ఎంత విలువైనదవుతుందో..
మోసం అంతే ఖరీదైనది అవుతుంది..

13.13. वफ़ा के नाम पर तुमने सब कुछ लूट लिया..
अब दो चार साँसे छोड़कर क्यों एहसान करते हो मुझपर..
నమ్మకం పేరు మీద అంతా తీసేసుకున్నావు..
ఇప్పుడు కొద్ది శ్వాసలు వదిలిపెట్టి ఉపకారం ఎందుకు చేస్తున్నావు?..

13.14. रात की मुट्ठी में एक सुबह भी है ..
शर्त है कि पहले जी भर के अँधेरा तो देख..
రేయి పిడికిట్లో ఒక వేకువ (దాగి) ఉంది..
కానీ మొదలు మనసారా చీకటిని చూడాలని నియమం..

13.15. कुछ हसरतें अधूरी ही रह जायें तो अच्छा है..
पूरी हो जाने पर दिल खाली सा हो जाता है..
కొన్ని కోరికలు అసంపూర్ణంగా ఉంటేనే బాగుంటుంది..
పూర్తైపోగానే ఏంటో, గుండె ఖాళీగా అయిపోతుంది..

13.16. जिस घाव से खून नहीं निकलता..
समझ लेना वो ज़ख्म किसी अपने ने ही दिया है..
ఏ గాయానికి రక్తం రాదో..
అది సొంతవారెవరో చేశారని తెలుసుకో..

13.17. बंद कर दिया सांपों को सपेरे ने यह कहकर..
अब इंसान ही इंसान को डसने के काम आएगा..
పాములను పాములవాళ్ళు లోపలపెట్టేశారు..
ఇక మనిషిని కాటు వేయటంలో మనిషే పనికి వస్తాడని చెప్పి..

13.18. वो कागज़ आज भी फुलों की तरह महकता है..
जिस में, उसने मज़ाक में लिखा था, मुझे तुमसे मोहब्बत है..
ఆ కాగితం ఇప్పటికీ పువ్వుల్లా పరిమళిస్తుంది..
తను నవ్వులాటకు నువ్వంటే ఇష్టమని వ్రాసినదది..

13.19. अब अकेला नहीं रहा मैं यारों..
मेरे साथ अब मेरी तन्हाई भी है..
ఇక నేను ఒంటరిగా లేను నేస్తాలూ..
ఇప్పుడు నాతో పాటు నా ఒంటరితనమూ ఉంది..

13.20. जीत हासिल करनी हो तो काबिलियत बढाओ..
किस्मत की रोटी तो कुत्ते को भी नसीब होती है..
గెలుపు పొందాలంటే సామర్థ్యం పెంచుకో..
అదృష్టంతో వచ్చే మెతుకులు కుక్కకు కూడా అందుతాయి..

13.21. जब मेरी नब्ज़ देखी हकीम ने, तो ये कहा..
कोई ज़िन्दा है इस में, मगर ये मर चुका है..
నా నాడీ చూసినప్పుడు వైద్యుడు అన్నాడు..
ఎవరో వీడిలో జీవిస్తున్నారు, వీడు మాత్రం చనిపోయాడని..

13.22. फुरसत मिले तो चाँद से मेरे दर्द की कहानी पूछ लेना..
एक वही तो है हमराज़ मेरा, तेरे सो जाने के बाद..
తీరిక దొరికితే చంద్రుని అడుగు నా వేదన కథలు..
నీవు నిదురించాక, అతడే కదా నా దగ్గరితోడు
(హమ్రాజ్- రహస్యాలు పంచుకునేవాడు)

13.23. वैसे तो एक आँसू ही बहा के मुझे ले जाए..
ऐसे कोई तूफ़ान हिला भी नहीं सकता..
ఒక కన్నీటిబొట్టు కూడా నన్ను తన ప్రవాహంలో తీసుకువెళిపోతుంది..
అదే, ఒక పెనుగాలి మళ్ళీ కదిలించనైనా కదిలించలేకపోతుంది..

13.24. कुछ रिश्तों के नाम नहीं होते..
कुछ रिश्ते नाम के ही होते हैं..
కొన్ని అనుబంధాలకు పేర్లు ఉండవు..
కొన్ని అనుబంధాలు పేరుకు మాత్రమే ఉంటాయి.

13.25. आईना भला कब किसी को सच बता पाया है..
जब भी देखो दांया तो बायां नज़र आया है..
అద్దం ఎవరితోనైనా ఎప్పుడు నిజం చెప్పింది కనుక?..
ఎప్పుడు చూసినా కుడిని ఎడమగానే చూపించింది..

13.26. बड़ा घाटे का सौदा है सदा ये साँस लेना भी..
बढ़े है उम्र ज्यूँ-ज्यूँ ज़िंदगी कम होती जाती है..
ఎప్పుడూ ఊపిరి పీల్చుకోవటం కూడా పెద్ద నష్టం తెచ్చే వ్యాపారమే..
వయసు పెరిగినకొద్దీ ఆయువు తగ్గిపోతుంటుంది..

13.27. काश ये इश्क भी चुनावों की तरह होता..
हारने के बाद विपक्ष से दिल भरके बहस तो कर लेते..
ఈ ప్రేమ కూడా ఎన్నికలలాగా ఉంటే బాగుండేది..
ఓడిపోయాక విపక్షంవైపునుంచి మనసారా వాదమైనా చేసేది..

13.28. कागज़ पे रख कर रोटियां खायें भी तो कैसे..
खून से लथपथ आता है अखबार आज कल..
కాగితం మీద పెట్టుకుని రొట్టెలు తినమంటే ఎట్లా..
ఈమధ్య రక్తంతో తడిసి వస్తున్నది వార్తపత్రిక..

13.29. जितना छिड़का है तूने ज़ख़्मों पे..
उतना खाया नहीं नमक तेरा..
గాయాలపై ఎంత చల్లావో..
నీ ఉప్పు అంత నేను తిననేలేదే..

13.30. झूठ बाज़ार मेँ बेखौफ़ बिकता रहा..
मैंने सच कहा तो जान के लाले हो गए..
బజారులో భయంలేకుండా అమ్ముడుపోతోంది అబద్ధం..
నేను నిజం చెప్తే ప్రాణాలమీదకు వచ్చింది..

13.31. देख इतना मुझे कि तेरी ही नज़र लग जाए मुझे..
अच्छा लगता है तेरी ही नज़र से मर जाना..
బాగా దృష్టి తగిలేదాకా నన్ను చూస్తూనే ఉండవా..
నీ దృష్టి తగిలే చచ్చిపోవటం బాగనిపిస్తుంది..

13.32. अपनी रूह तेरे जिस्म में छोड़ आये..
गले मिलना तो एक बहाना था..
నా ప్రాణాలను (జీవుణ్ణి) నీ శరీరంలో విడిచి వచ్చాను..
కౌగిలించుకోవటం కేవలం ఒక వంక- అంతే..

13.33. एक समंदर जो मेरे काबू में है
और इक कतरा है जो संभलता नहीं..
एक जिंदगी है जो तुम्हारे बगैर बितानी है
और इक लमहा है जो गुजरता नहीं ..
నా అధీనంలో ఉన్నదేమో ఒక సముద్రం,
కానీ ఒక నీటిబొట్టును దాచుకోవటం రాదు..
నీవు లేక గడపాల్సినదేమో ఒక జీవితకాలం
కానీ ఒక క్షణం కూడా గడపటం రాదు..

13.34. बड़ा मीठा नशा है तेरी याद का..
वक़्त गुजरता गया और हम आदी होते गए..
నీ జ్ఞాపకం భలే తీయని మత్తు..
కాలం గడిచినాకొద్దీ అలవాటుపడిపోయాను..

13.35. सच को ख्वाहिश होती है कि सब उसे पहचाने..
और झूठ को हमेशा डर लगता है कि कोई उसे पहचान न ले..
తనను అంతా గుర్తు పట్టాలి అని నిజం ఆకాక్షిస్తుంది..
తనను జనాలెక్కడ గుర్తిస్తారో అని అబద్ధం భయపడుతుంటుంది..

13.36. देख ली तेरी ईमानदारी ऐ दिल..
तू मेरा और फ़िक्र किसी और की..
ఓ మనసా, నీ నిజాయితీ బాగా అర్థమైంది..
నువ్వు చెందేది నాకు, కానీ బాధపడేది మరొకరి గురించా..

13.37. चेहरे पर जो अपने दोहरी नक़ाब रखता हैं..
खुदा उसकी चलाकियों का हिसाब रखता हैं..
రెండు రకాలుగా నకిలీ ముఖాలు ఎవరు పెట్టుకుంటారో..
వారి మోసాలను ఖుదా లెక్కపెడుతుంటాడు..

13.38. उन्होंने तो हमें धक्का दिया था डुबाने के इरादे से..
अंजाम ये निकला हम तैराक बन गए..
తను నన్ను తోసిందేమో ముంచాలనే ఉద్దేశంతో..
కానీ ఫలితంగా నేను ఈతగాణ్ణి అయ్యాను..

13.39. हुक़ूमत वो ही करता है, जिसका दिलों पर राज होता है..
वरना यूँ तो गली के मुर्गों के सिरों पे भी ताज होता है..
మనసులపై రాజ్యంచేసేవాడే అధికారం చేయగలడు..
వీథుల్లో కోళ్ళకు మాత్రం కిరీటాలుండవా..

13.40. मेरी हर ख्वाइश में सिर्फ तुम होते हो..
बस दर्द ये है कि सिर्फ ख्वाईशों में ही क्यों होते हो..
నా ప్రతి కోరికలో నీవుంటావు..
కానీ బాధేంటంటే కేవలం కోరికలలోనే ఉంటావు..

13.41. कम्बख्त दिल भी कमाल करता है..
जब खाली खाली होता है तो भर आता है..
ఈ గుండె కూడా భలే విచిత్రంగ చేస్తుంది..
ఖాళీ ఖాళీగా ఉన్నప్పుడే నిండి వస్తుంది..

13.42. सुना है कि मौत से पहले एक और मौत होती है..
और उसे प्यार से लोग मोहब्बत कहते हैं..
మృత్యువుకన్నా ముందొచ్చే మృత్యువొకటి ఉంటుందని విన్నాను..
దాన్నే జనాలు ప్రేమగా ప్రేమ అంటారు..

13.43. बिकती है ना ख़ुशी कहीं ना कहीं गम बिकता है..
लोग गलतफ़हमी में हैं कि शायद कहीं मरहम बिकता है..
ఎక్కడా సంతోషాన్నీ అమ్మరు, ఎక్కడా బాధలనూ అమ్మరు..
జనాలు తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు,
ఏదోచోట ఉపశమనానికి లేపనం దొరుకుతుందని

13.44. जहाँ जहाँ खबर पहुँची हर एक ने एक ही सवाल किया..
तुम्हें कैसे मुहब्बत हो गयी, तुम तो समझदार थे..
వార్త చేరిన ప్రతీ చోటునుంచి అంతా ఒకే ప్రశ్నను వేశారు..
తెలివైనవాడివి కదా, నువ్వెట్లా ప్రేమలో పడ్డావని..

13.45. रिश्ते चाहे कितने भी बुरे हो लेकिन कभी भी उन्हें मत तोड़ना
क्योंकि पानी चाहे कितना भी गंदा हो..
प्यास नहीं तो आग तो बुझा ही देता है..
అనుబంధాలు ఎంత చెడ్డవైనా తెంచుకోకండి..
నీరు ఎంత అశుచిగా ఉన్న, దాహం కాకపోతే
కనీసం నిప్పునైనా ఆర్పగలుగుతుంది..

13.46. कोई सुलह करा दे जिदंगी की उलझनों से..
बड़ी तलब लगी है आज मुस्कुराने की
ఏదైనా ఒప్పందం చేసుకోవాలి జీవితపు సమస్యలతో..
ఎందుకో మరి, చిరునవ్వు నవ్వాలని బాగా అనిపిస్తున్నది..

13.47. रिश्ते मोतियों की तरह होते हैं..
कोई गिर भी जाये तो झुख कर उठा लेना चाहिए..
అనుబంధాలు ముత్యాలలాంటివి..
పడిపోయినా వంగి పైకి తీసుకోవాలి..

13.48. बस, ज़रा स्वाद में कड़वा है..
नहीं तो सच का कोई जवाब नहीं..
కాస్త రుచి చేదుగా ఉంటుంది, అంతే..
కానీ, సత్యానికి తిరుగే లేదు..

13.49. ज़िन्दगी इतनी मुश्किल इसलिए है..
क्यों कि लोग आसानी से मिली चीज़ की कीमत नहीं जानते..
జీవితం ఇంక కష్టంగా ఎందుకు ఉంటుందంటే..
జనాలకు సులువుగా దొరికిన వస్తువుల విలువే తెలియదు..

13.50. पर्दा गिरते ही खत्म हो जाते हैं तमाशे सारे ..
खूब रोते हैं फिर औरों को हँसाने वाले..
తెర పడుతూనే నాటకాలన్నీ పూర్తవుతాయి..
ఇతరులను నవ్వించేవారంతా ఇక వెక్కివెక్కి ఏడుస్తారు..

13.51. दिल के रिश्ते कभी नहीं टूटते..
बस, खामोश हो जाते है..
మనసుతో పెనవేసుకున్న అనుబంధాలు ఎన్నటికీ తెగిపోవు..
నిశ్శబ్దమైపోతాయి, అంతే..

13.52. हथियार तो शौक़ के लिए रखे जाते हैं..
खौफ़ के लिए तो आँखें ही काफ़ी है..
ఆయుధాలు ఏదో మోజుకు ఉంటాయి, అంతే..
భయపెట్టటానికి కళ్ళే చాలు..

13.53. बहुत देखा है ज़िन्दगी में समझदार बनकर..
पर ख़ुशी हमेशा पागल बनकर ही मिली है..
జీవితంలో బుద్ధిమంతుడనై చాలా చూశాను..
కానీ సంతోషం కేవలం వెర్రివాడిగా అయినప్పుడే కలిగింది..

13.54. दो चार लफ्ज़ प्यार के लेके मैं क्या करूँ..
देनी है तो वफ़ा की मुकम्मल किताब दे..
ప్రేమగా రెండు మూడు మాటలు చెప్తే నేనేం చేసుకోను?..
ఇచ్చేదుంటే నమ్మకమనే పుస్తకం మొత్తమంతా ఇవ్వు..

13.55. सीढ़ियाँ उन्हें मुबाराक, जिन्हें छत पर जाना हो..
मेरी मंज़िल तो आसमाँ है, मुझे रास्ता खुद बनाना है..
మిద్దెమీదకు పోవాలనుకునేవారు మెట్లతో పండగచేసుకోనీ..
నా గమ్యం ఆకాశం, నేను దారి స్వయంగా చేసుకోవాలి..

13.56. मेरी फ़ितरत में नहीं अपना गम बयां करना..
अगर तेरे वजूद का हिस्सा हूँ तो महसूस कर तकलीफ मेरी..
బాధలు వెళ్ళబోసుకోవటం నా పద్ధతే కాదు..
నీ అస్తిత్వంలో నేనొక భాగాన్నైతే నా బాధను అర్థం చేసుకో..

13.57. हजारों नामुकम्मल हसरतों के बोझ तले..
ऐ दिल, तेरी हिम्मत है, जो तू धडकता है..
వేలకొద్దీ అసంపూర్ణమైన ఆకాంక్షల బరువు కింద..
ఓ హృదయమా, నీకెంత ధైర్యం, స్పందించటానికి..

13.58. हर किसी को मैं खुश रख सकूं, वो सलीका मुझे नहीं आता..
जो मैं नहीं हूँ वो दिखने का तरीका मुझे नहीं आता..
ప్రతీఒక్కరిని సంతోషపట్టగలిగే పద్ధతి నాకు చేతకాదు..
నేను ఏది కానో దానిగా కనపడే తెలివి నాకు లేదు..

13.59. सूखे होंटों पे ही होती हैं मीठी बातें..
प्यास जब बुझ जाये तो लहजे बदल जाते हैं..
పెదవులు ఎండినప్పుడే తీయని మాటలు వస్తాయి..
దాహం తీరంగనే వైఖరులు మారిపోతాయి..

13.60. मंजिलें भी जिद्दी हैं, रास्ते भी जिद्दी हैं..
देखतें हैं कल क्या हो, हौंसले भी जिद्दी हैं..
గమ్యాలు పట్టైనవే, దారులూ పట్టుగలవే..
రేపు ఏం జరుగనుందో మరి, ధైర్యాలూ పట్టుబట్టినవే..

13.61. कुछ मीठी सी ठंडक है आज इन हवाओं में..
शायद दोस्तों की यादों का कमरा खुला रह गया है..
ఏదో తీయని హాయి ఉంది ఈ గాలుల్లో..
బహుశ, నేస్తాల జ్ఞాపకపు గది తలుపు తెరుచుకుందేమో..

13.62. एक नींद है जो लोगों को रात भर नहीं आती..
बस एक जमीर ही है जो हर वक्त सोया रहता है..
ఒకటేమో నిద్ర, జనాలకు రాత్రంతా రాదు..
మరోవైపు అంతరాత్మ, ఎప్పుడూ పడుకునే ఉంటుంది..

13.63. प्यार, एहसान, नफ़रत, दुश्मनी जो चाहो वो करलो मुझसे..
आप की कसम वही दोगुना होकर मिलेगा..
ప్రేమ, ఉపకారం, ద్వేషం, శత్రుత్వం- ఏదైనా చేయండి నాతో..
మీ మీద ఒట్టు, అదే రెండింతలై మీకు తిరిగి అందుతుంది..

13.64. अकड़ तोड़नी है उन मंजिलों की..
जिनको अपनी ऊंचाई पर ग़ुरूर है..
ఆ గమ్యాల పొగరు అణచాలి..
వాటికి తమ ఎత్తులపై చాలా గర్వం..

13.65. मसला ये भी है इस ज़ालिम दुनिया का..
कोई अगर अच्छा भी है तो क्यूँ है..
ఈ దయలేని లోకంలో ఇది కూడా ఒక సమస్యే..
ఎవరైనా మంచివారుగా ఉంటే ఎందుకున్నారు అని..

13.66. रुतबा तो खामोशियों का होता है..
अलफ़ाज़ तो बदल जाते है लोगों को देखकर..
మౌనాలకే గౌరవం ఉంటుంది..
మాటలు జనాలను చూస్తూనే మారిపోతాయి..

13.67. न माँग कुछ जमाने से ये देकर फिर सुनाते है..
किया एहसान जो एक बार वो लाख बार जताते है..
లోకాన్ని ఏమీ అడగకు, ఇచ్చి మళ్ళీ మాటలంటారు..
ఒకసారి చేసిన ఉపకారాన్ని లక్షసార్లు చెప్పుకుంటారు..

13.68. या तो खरीद लो या खारिज़ कर दो दोस्तों..
यूँ किराए पर मत लिया करो मुझे..
కొననైనా కొనేసుకోండి, లేదా పక్కకు పెట్టేయండి..
నన్ను ఇట్లా అద్దెకు మాత్రం తీసుకోకండి..

13.69. सख़्त हाथों से भी छूट जाते हैं हाथ..
रिश्ते ज़ोर से नहीं तमीज़ से थामे जाते हैं ..
కఠోరమైన చేతులనుండి వీడిపోతాయి చేతులు..
అనుబంధాలు బలంవల్ల నిలవవు, గౌరవంతో నిలుస్తాయి..

13.70. जिसे आज मुझमे हज़ार एब नज़र आते हे..
कभी वही लोग हमारी ग़लती पे भी ताली बजाते थे..
ఈనాడు నాలో వేయి తప్పులు ఎవరికి కనిపిస్తున్నాయో..
వారే ఒకప్పుడు నా పొరపాట్లకు కూడా చప్పట్లు కొట్టేవారు..

13.71. प्यार के दो मीठे बोल से खरीद लो मुझे..
दौलत की सोचोगे तो पूरी दुनिया बेचनी पड़ेगी तुम्हे..
ప్రేమగా రెండు మాటలు మాట్లాడి నన్ను కొనేసుకో..
డబ్బు గురించి ఆలోచిస్తే ప్రపంచమంతా అమ్ముకోవాలి నీవు..

13.72. मिट्टी का मटका और परिवार की कीमत..
सिर्फ बनाने वाले को पता होती है, तोड़ने वाले को नहीं..
మట్టి కుండ, కుటుంబం - వీటి విలువ..
తయారు చేసినవాడికి తెలుస్తుంది, విరిచినవాడికి ఎన్నడూ తెలియదు..

13.73. ग़ुज़री तमाम उम्र उसी शहर में जहाँ..
वाक़िफ़ सभी थे, कोई पहचानता न था..
జీవితమంతా ఆ నగరంలోనే గడిచింది..
అందరూ గుర్తుపట్టేవారు, తెలిసినవారొక్కరూ లేరు..

13.74. सब के दिलों में धड़कना ज़रूरी नहीं होता साहब..
कुछ की आँखों में खटकने का भी एक अलग मज़ा है..
అందరి గుండెల్లో స్పందించటం ముఖ్యం కాదు సుమండీ..
కొందరి కన్నుల్లో గరగరమనటంలో కూడా ఒక మజా ఉంది..

13.75. है रूह को समझना भी ज़रूरी..
सिर्फ़ हाथ पकड़ना ही मोहब्बत नहीं होती..
అంతరంగాన్ని అర్థం చేసుకోవటమూ ముఖ్యమే..
చేతులు పట్టుకోవటమొక్కటే ప్రేమ అనిపించుకోదు..

13.76. तुम्हारे हर सवाल का जवाब मेरी आँखों में था..
और तुम मेरी जुबान खुलने का इंतज़ार करते रहे..
నీ ప్రతి ప్రశ్నకు సమాధానం నా కన్నుల్లోనే ఉండింది..
నీవేమో నా మాట పెగిలేందుకు ఎదురుచూస్తుండిపోయావు..

13.77. सिर्फ़ ख़ुशी में आना तुम..
अभी दूर रहो, थोड़ा परेशान हूँ मैं..
సంతోషంలో మాత్రమే రావా నువ్వు..
ఇప్పుడు ఎడంగా ఉండు, కాస్త ఇబ్బందిలో ఉన్నా నేను..

13.78. जिसे मैं की हवा लगी..
उसे फिर ना दवा लगी न दुआ लगी..
అహంకారం అనే గాలి సోకినవాడికి..
ఏ మందూ ఉండదు, ఏ ప్రార్థనా పనిచేయదు..

13.79. ग़लत होकर भी खुद को सही साबित करना, उतना मुश्किल नहीं होता..
जितना कि सही होकर खुद को सही साबित करना..
తప్పు చేసి కూడా నిర్దోషినని నిరూపించుకోవటం అంత పెద్ద కష్టం కాదు..
నిర్దోషి అయి ఉండీ నిర్దోషినని నిరూపించుకోవటమే కష్టం..

13.80. लफ्ज़ इन्सान के गुलाम होते हैं, मगर बोलने से पहले..
और बोलने के बाद इन्सान अपने लफ़्ज़ों का गुलाम बन जाता है..
మాటలు మనిషి బానిసలు, కానీ పలకక ముందు మాత్రమే..
మాట్లాడాక మనిషే తను పలికిన మాటలకు బానిసైపోతాడు..

13.81. अब अपनी शख़्सियत की भला मैं क्या मिसाल दूँ यारों..
ना जाने कितने लोग मशहूर हो गये, मुझे बदनाम करते करते..
నా వ్యక్తిత్వానికి ఉపమానం ఏం ఇవ్వమంటారు నేస్తాలూ..
నా పేరు పాడు చేస్తూ ఎందరు పేరుతెచ్చుకున్నారో..
నన్ను అపకార్తి పాలుచేస్తూ ఎందరు కీర్తిని పొందారో..

13.82. उड़ा भी दो रंजिशें इन हवाओं में यारों..
छोटी सी जिंदगी है नफ़रत कब तक करोगे..
గాలుల్లోకి వదిలేయండి అన్ని చిరాకులను..
చిన్ని జీవితం, ఎంతకాలమని ద్వేషం పెట్టుకుంటారు..

13.83. तुम जायदाद हो मेरी इस जिंदगी की..
जो तुम्हे भूल गया तो फ़कीर हो जाऊँगा ..
నీవు నా ఆస్తివి ఈ జీవితంలో..
నిన్ను మర్చిపోతే పేదవాడినైపోతాను..

13.84. जिन लोगों को मुझसे नफ़रत है वो करते रहे..
मैं कौन सा सबसे प्यार करता हूँ..
ఎవరైనా నన్ను ద్వేషిస్తే అట్లాగే చేస్తుండుగాక..
నేను మాత్రం అందరిని ప్రేమిస్తానా ఏంటి?..

13.85. मुझे मिलना है आसमान से..
ऊँचाइयों पर नहीं, उस से कहो नीचे आए..
నేను ఆకాశాన్ని కలవాలి...
ఎత్తులమీద కాదు, దానికి చెప్పు, కిందకు దిగమని..

13.86. चर्चाएँ ख़ास हो तो किस्से भी ज़रूर होते है..
उँगलियाँ भी उनपर ही उठती है जो मशहूर होते है..
చర్చలు కీలకమైనవైతే కథలూ తప్పక చెప్పుకుంటారు..
పేరున్నవారి వైపే వేళ్ళూ ఎత్తి చూపుతుంటారు...

13.87. शिकवे आँखों से गिर पड़े वरना..
होठों से शिकायत कब की हमने..
బాధలు కళ్ళలోనుండి జారిపడ్డాయి, అంతేకానీ..
ఎప్పుడైనా పెదవులు కదిపి ఏమైనా చెప్పానా?..

13.88. काश वो आए और हमें देख कर कहे कि..
हम मर गए है जो तुम इतने उदास हो..
తను వచ్చి నన్ను చూసి ఇట్లా అంటే బాగుండు..
నేను చచ్చిపోయానా, ఎందుకంత దిగులుగా ఉన్నావని..

13.89. तकलीफ़ ये नहीं कि प्यार हो गया..
दर्द ये है कि अब भुलाया नहीं जा रहा..
ప్రేమ కలిగినందుకు బాధ కాదు..
ఇక మర్చిపోలేకపోతున్నాననే నెప్పి అంతా..

13.90. कितने दिन गुज़र गए और तुमने याद तक ना किया..
मुझे नहीं पता था की इश्क में छुट्टिया भी होती है..
ఎన్నాళ్ళైంది, నువ్వు నన్ను గుర్తైనా చేసుకోలేదే..
ప్రేమలో శెలవలుంటాయని నేనెరుగను..

13.91. इत्तेफ़ाक़ से मिल जाती हो जब तुम कभी राह में..
ऐसा लगता है जैसे ज़िन्दगी जा रही है करीब से..
ఎప్పుడైనా యాదృచ్ఛికంగా దారిలో నీవు కనిపిస్తే..
జీవితం నా పక్కనుంచే వెళుతున్న భావన వస్తుంది..

13.92. कौन कहता है कुछ तोड़ने के लिए पत्थर ज़रूरी है..
लहज़ा बदल कर बोलने से भी बहुत कुछ टूट जाता है..
పగలగొట్టటానికి రాళ్ళు అవసరం అని ఎవరన్నారు?..
వైఖరి మార్చి మాట్లాడినా చాలా విరిగిపోతాయి..

13.93. ग़म बढ़े आते हैं, कातिल की निगाहों की तरह..
तुम छुपा लो मुझे, ऐ दोस्त, गुनाहों की तरह..
బాధలు తోసుకువస్తాయి, హంతకుని చూపులవలె..
నన్ను దాచేసుకో ఓ నేస్తమా, నేరాల వలె..

13.94. तुम्हारी याद की जब जख़्म भरने लगते हैं..
तो किसी बहाने तुम्हें याद करने लगते हैं..
నీ జ్ఞాపకాల గాయాలు మానివేస్తున్నప్పుడల్లా..
ఏదో వంకతో నిన్ను గుర్తు చేసుకుంటుంటాను..

13.95. औकात नहीं थी इस दुनिया में किसी की जो हमारी कीमत लगा सके..
लेकिन प्यार में पड गया आखिर और मुफ़्त में खुद बिक गया..
నాకు వెల కట్టే సత్తువ ఎవ్వడికీ ఉండలేదు ఈ లోకంలో..
కానీ చివరకు ప్రేమలో పడి, ఉత్తగనే అమ్ముడు పోయాను..

13.96. हाथ मेरे पत्थर के और पत्थर की हैं मेरी उंगलियां..
दिल का दरवाज़ा तेरा काँच का मुझसे खटखटाया ना गया..
నా చేతులు రాతివి, నా వేళ్ళూ రాతివే..
నీ గుండె తలుపు గాజుది, నేను తట్టలేకపోయాను..

13.97. खुल जाता है तेरी यादों का बाज़ार सुबह सुबह..
और हम उसी रौनक में पूरा दिन गुज़ार देते है..
నీ జ్ఞాపకాల దుకాణం ఉదయాన్నే తెరుచుకుంటుంది..
నేను ఆ నూతన ఉత్సాహంలో రోజంతా గడిపేస్తాను..

13.98. सब्र का घूंट दूसरों को पिलाना कितना आसान लगता है..
खुद पियो तो, क़तरा क़तरा ज़हर लगता है..
ఇతరులకు ఓర్పు గుటకలు తాగించటం ఎంత సులువో కదా..
మనం తాగాలంటేనే, బొట్టు బొట్టు విషమనిపిస్తుంది..

13.99. साझेदारी करो तो किसी के दर्द के साथ..
क्योंकि खुशियों के दावेदार तो बहुत हैं..
పంచుకోవాలనుంటే ఒకరి దుఃఖం పంచుకో..
ఎందుకంటే సంతోషాలపై అధికారం కలవరెందరో ఉంటారు..

13.100. मुझे भी शामिल करो गुनहगारों की महफ़िल में..
मैं भी क़ातिल हूँ अपनी हसरतों का..
मैंने भी अपनी ख्वाहिशों को मारा है..
నన్నూ నేరస్తుల సభలో చేర్చుకోండి..
నేనూ నా కోరికల హంతకుడిని..
నేనూ నా ఆకాంక్షలను చంపినవాడినే..

13.101. रात गुमसुम है, मगर चैन ख़ामोश नहीं..
कैसे कह दूँ आज फिर होश नहीं..
ऐसा डूबा तेरी आखों की गहराई में..
हाथ में जाम है मगर पीने का होश नहीं..
రాత్రి స్తబ్ధంగా ఉంది, కానీ ప్రశాంతత మౌనంగా లేదు..
ఎట్లా చెప్పను, మళ్ళీ రోజు స్పృహ లేదని..
నీ కన్నుల లోతుల్లో మునిగిపోయందెంత అంటే
చేతిలో ఉంది మదిర, కానీ తాగాలనే స్పృహే లేదు..

13.102. उलझी शाम को पाने की ज़िद न करो;
जो ना हो अपना उसे अपनाने की ज़िद न करो;
इस समंदर में तूफ़ान बहुत आते है;
इसके साहिल पर घर बनाने की ज़िद न करो..
చిక్కుపడిన సాయింత్రాలను పొందాలని పట్టు పట్టకు
మనది కానిది సొంతం చేసుకోవాలనే పట్టు పట్టకు..
ఈ సముద్రంలో తుఫాన్లు చాలా వస్తాయి..
దీని తీరంలో ఇల్లు కడతానని పట్టు పట్టకు..

13.103. मोहब्बत भी अज़ीब खेल है दोस्तोँ..
जो जितना अच्छा खेलता है वो बाज़ी हार जाता है..
ప్రేమకూడా విచిత్రమైన ఆటే నేస్తాలూ..
బాగా ఆడినవారే ఆట ఓడిపోతారు..

13.104. चेहरे अजनबी हो जाये तो कोई बात नहीं..
लेकिन रवैये अजनबी हो जाये तो बडी तकलीफ देते हैं..
ముఖాలు అపరిచితమైనా ఫరవాలేదు..
ప్రవర్తనలు అపరిచితమైతే చాలా బాధపెడతాయి..

13.105. मेरे जीने के लिए तेरा अरमान ही काफी है..
दिल की कलम से लिखी ये दास्तान ही काफी है..
तीर तलवार की क्या ज़रूरत है तुझे ऐ हसीन..
क़तल करने के लिए तेरी मुस्कान ही काफी है..
నేను బ్రతకటానికి నీ చిరున్వవు చాలు
గుండెకలంతో వ్రాసిన కథ చాలు..
నీకు బాణాలో, కత్తులో ఎందుకు, ఓ సుందరీ
చంపివేయటానికి నీ చిరునవ్వు చాలు..

13.106. कुछ मतलब के लिए ढूँढते हैं मुझको..
बिन मतलब जो आए तो क्या बात है..
कत्ल कर के तो सब ले जाएँगे दिल मेरा..
कोई बातों से ले जाए तो क्या बात है.
ఏదో ఓ స్వార్థం కోసం వెతుకుతారు నన్ను
స్వార్థం లేకుండా వస్తే ఆహా, ఇంకేం చెప్పాలి..
చంపేసి నా గుండెను అందరూ తీసుకుపోగలరు
ఎవరైనా మాటలతో తీసుకుపోతే ఆహా, ఇంకేం కావాలి..

13.107. बस इतना ही चाहिये तुझसे, ऐ जिंदगी..
कि जम़ीन पर बैठूँ तो लोग उसे मेरा बडप्पन कहें, औकात नहीं..
నీ నుంచి కావలసిందింతే ఓ జీవితమా..
నేలపై కూర్చుంటే జనాలు అది నా గొప్పతనమనాలి, పరిధి అనకూడదు..

13.108. जिंदगी वक्त के बहाव में है
यहां हर आदमी तनाव में है,
हमने लगा दी पानी पर तोहमत
यह नहीं देखा कि छेद नाव में है..
జీవితం కాలం ప్రవాహంలో ఉంది
ఇక్కడ ప్రతి మనిషికీ ఏదో ఒత్తిడి ఉంది..
అయ్యో, నీటి పై నెపాన్ని వేసేశామే
చూడలేదే, ఛిద్రం పడవలో ఉంది..

13.109. कमाल करता है ऐ दिल तू भी..
उसे फुरसत नहीं और तुझे चैन नहीं..
భలే విచిత్రంగా చేస్తావు మనసా నీవు..
తనకు తీరిక లేదు, నీకు హాయి లేదు..

13.110. अकल आयी थी मशवरा देने..
मोहब्बत ने मुस्करा कर टाल दिया..
మెదడు వచ్చింది సలహా ఇవ్వటానికి..
కానీ ప్రేమ నవ్వి దాన్ని వినకుండా విడిచింది..

13.111. आओ, बिछड़ने का कोई और तरीका ढूंढें..
प्यार बढ़ता है मेरी जां खफ़ा रहने से..
పద, విడిపోవటానికి మరో తీరేదైనా వెతుకుదాం..
అలిగి ఉండిపోతే ప్రేమ పెరుగుతుంది, ప్రాణమా..

13.112. कभी टूट कर बिखरो तो मेरे पास आ जाना..
मुझे अपने जैसे लोगों का साथ अच्छा लगता है..
ఎప్పుడైనా విరిగి చెదిరిపోతే నా దగ్గరికి వచ్చేసెయి..
నాకు నా వంటి వారి తోడు చాలా బాగనిపిస్తుంది..

13.113. तुम्हे मैं याद करता हूँ तो खुद को भूल जाता हूँ..
हद-ए-बेबसी देखो न तुम मेरे न मैं अपना..
(నితిన్)
నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు నన్ను నేను మరచి పోతాను..
ఈ వివశత్వం చూడు, నీవూ నాకు చెందవు, నేనూ నాకు సొంతం కాను..

13.114. सोचता हूँ ....
हर रोज़ उगते,हर रोज़ ढलते
सूरज का नाम ज़िन्दगी रखा होगा
जिस पल को जिया है,उम्र भर
उस पल का नाम ज़िन्दगी रखा होगा।
(Nitin)
ప్రతిరోజూ ఉదయించే, ప్రతిరోజు అస్తమించే సూర్యుడి పేరు జీవితం అని పెట్టి ఉంటారు..
ఏ క్షణాన్ని పూర్తిగా  అనుభవించి ఉంటారో, దాని
పేరు జీవితం అని చెప్పి ఉంటారు..

13.115. नज़्म, शेर, ग़ज़ल, कविता सब के सब अधूरे ही लगेंगे..
जो किसी लफ़्ज़ में समा जाए, माँ वो कहानी नहीं हैं..
పదం, పద్యం, పాట, కవిత- అన్నీ అసంపూర్తిగానే కనిపిస్తాయి..
ఒక మాటలో ఇమిడిపోయే కథ కాదు, అమ్మ..

13.116. तुझमें और मुझमें फ़र्क़ सिर्फ इतना सा है..
तेरा कुछ-कुछ मैं हूं, और मेरा सबकुछ तू है..
నీకూ నాకూ మధ్య తేడా ఉన్నదింతే..
నీలో కొద్ది భాగం నేను, నాలో సర్వం నీవే..

No comments:

Post a Comment