8.1. ये दुनिया अक्सर उन्हें सस्ते में लूट लेती
है..
खुद की क़ीमत का जिन्हें अंदाजा नहीं होता..
ఎక్కువగా లోకం వారినే చౌకగా దోచుకుంటుంది..
ఎవరికైతే తమ విలువెంత అనే అంచనా ఉండదో..
8.2. वक्त निकाल कर अपनों से मिल लिया करो..
अगर अपने ही ना होंगे तो क्या करोगे वक्त का..
వెసులుబాటు చేసుకుని నీవారిని కులుస్తుండు..
నీవారే లేనప్పుడు సమయాన్ని ఏం చేసుకుంటావు..
8.3. हालात हैं, वक़्त है,
या खुदा है..
ये रह रह के मुझे परखता कौन है..
పరిస్థితులా, కాలమా, లేక దేవుడా..
ఎవరు, ఊరికే నన్ను పరీక్షిస్తున్నది?..
8.4. किसी टूटे हुए मकान की तरह हो गया है ये
दिल..
कोई रहता भी नहीं.. और कमबख्त बिकता भी नहीं..
విరిగిన ఇంటిలా అయింది ఈ మనస్సు..
ఎవరూ ఉండటమూ లేదు, అటు అమ్ముడూ పోవటం లేదు..
8.5. मौत ने पुछा-
मैं आऊँगी तो.. स्वागत करोगे कैसे..
मैंने कहा-
राह में फूल बिछाकर पूछुंगा..
कि आने में इतनी देर कैसे..??
మృత్యువు అడిగింది-
నేను వచ్చినప్పుడు నా స్వాగతసత్కారం ఎట్లా చేస్తావు?
అని.
నేనన్నాను- దారిలో పూలు చల్లి అడుగుతాను..
రావటంలో ఇంత ఆలస్యమైందేమని..
8.6. ख़्वाहिश नहीं मुझे मशहूर होने की..
आप मुझे पहचानते हो बस इतना ही काफ़ी है..
నాకు పేరు సంపాదించాలని కోరిక లేదు..
మీరు నన్ను గుర్తు పడతారు, ఇదే నాకు చాలు..
8.7. कौन कहता है आईना झूठ नहीं बोलता..
वह सिर्फ होठो की मुस्कान देखता है, दिल का दर्द नहीं..
అద్దం అబద్ధం చెప్పదని ఎవరన్నారు?..
అది కేవలం పెదవుల పై చిరునవ్వును చూస్తుంది, మనసులో బాధను
చూడదు..
8.8. चढ़ते सूरज के पुजारी तो लाखों हैं..
डूबते वक़्त हमने सूरज को भी तन्हा देखा..
ఉదయిస్తున్న సూర్యుడిని పూజించేవారు ఎందరో..
అస్తమించే వేళ సూర్యుని కూడా ఒంటరికావటం చూశాను..
8.9. अपनाने के लिए हजार खूबियाँ भी कम है..
और छोड़ने के लिए एक कमी ही काफ़ी है..
నా అనుకోవటానికి వేయి మంచిగుణాలు కూడా తక్కువే..
వదిలిపెట్టటానికి ఒక్క లోటు చాలు..
8.10.
लोग कहते है की सच्चे प्यार की हंमेशा जीत होती है..
परंतु होती कब है
ये भी बता देते..
జనాలంటారు, నిజమైన ప్రేమ గెలిచి తీరుతుందని..
కానీ ఎప్పుడనేది కూడా చెప్తే బాగుండేది..
8.11. गलत लोग सभी के जीवन में आते हैं..
लेकिन सीख हमेशा सही ही देकर जाते हैं..
తప్పుడు మనుషుల అందరి జీవితంలోకి వస్తారు..
కానీ పాఠం ఎప్పుడూ సరైనదే చెప్పి వెళతారు..
8.12. मुझको तो चैन आने लगा बेचैनियों में..
इश्क़, बता तेरी तबियत
कैसी है..
నాకైతే అశాంతిలోనే శాంతి లభిస్తోందిప్పుడు..
ఓ ప్రేమా, చెప్పు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది?..
8.13. नफ़रत का खुद कोई वजूद नहीं होता साहब..
ये तो मोहब्बत की ग़ैरहाज़िरी का नतीजा है..
ద్వేషానికి ఏ అస్తిత్వం ఉండదు సుమండీ..
అది ప్రేమ అనుపస్థితి ఫలితంగా వచ్చిందే..
8.14. छुपी होती हैं अल्फाज़ों में बातें दिल
की..
लोग शायरी समझ के बस मुस्कुरा देते है..
పదాలలో మనసులోని మాటలన్నీ దాగి ఉంటాయి..
జనాలు కవిత్వం అనుకుని చిరునవ్వు నవ్వుతారు..
8.15. तुम मोहब्बत भी मौसम की तरह निभाते हो..
कभी बरसते हो तो कभी एक बूंद को भी तरसाते हो..
నీవు ప్రేమను కూడా వాతావరణం లా నిర్వహిస్తావు..
ఒకసారి కురుస్తావు, మరోసారి ఒక్క చినుకుకు కూడా అలమటింపచేస్తావు..
8.16. किसी ने धूल क्या झोकी आखों में..
कम्बख़्त पहले से बेहतर दिखने लगा..
కళ్ళలో ఎవరో ఏమంటూ దుమ్ము కొట్టారో కానీ..
అబ్బ, ముందుకన్నా నయంగా కనిపించటం మొదలైంది..
8.17. जिंदगी फिर कभी न मुस्कुराई बचपन की तरह..
मैंने मिट्टी भी जमा की, खिलोने
भी लेकर देखे..
జీవితం మళ్ళీ ఎప్పుడూ చిరునవ్వు నవ్వలేదు చిన్నతనం
అప్పటిలా..
నేను మట్టి కూడా కూడబెట్టాను, బొమ్మలు కూడా కొని
చూశాను..
8.18. वैसे तो ए ज़िन्दगी, तुझ में, फरेब है उदासी है, रुसवाई
है..
पर हमने भी हर बार मुस्कुरा कर तेरी ही आबरू
बचाई है..
ఓ జీవితమా, నీలో మోసం ఉంది, బాధ ఉంది, అవమానం ఉంది..
కానీ ప్రతీసారి చిరునవ్వు నవ్వి మేము నీ గౌరవాన్నే
కాపాడాము..
8.19. सुनों, नजदीकियां
नहीं चाहते तो फ़ासला बना लो..
आदत बन जाने की आदत है मेरी..
చూడు, దగ్గరితనం వద్దనుకుంటే దూరాలు ఉంచుకో..
(ఒకరి) అలవాటుగా కావటం అలవాటు నాకు..
8.20. हस्ती मिट जाती है आशियाँ बनाने में
बहुत मुश्किल होती है अपनों को समझाने में..
एक पल में किसी को भुला ना देना,
ज़िंदगी लग जाती है किसी को अपना बनाने में..
ఒక గూడు కట్టుకోవటానికి జీవితం సమసి పోతుంది..
చాలా కష్టమవుతుంది తనవారికి సర్ది చెప్పుకోవటం..
ఒక్క క్షణంలో ఎవ్వరినీ మర్చిపోవద్దు..
జీవితకాలం పడుతుంది, ఒకరిని మనవారిగా
చేసుకోవటానికి
8.21. जंगली जड़ी बूटी सा हूँ मैं दोस्तों..
किसी को ज़हर तो किसी को, दवा
सा लगता हूँ..
అడవి మూలికవంటివాడిని, నేస్తాలూ..
కొందరికి విషంలా, కొందరికి మందులా అనిపిస్తాను..
8.22. लोगों से कह दो हमारी तक़दीर से जलना छोड़
दे..
हम घर से दवा नहीं माँ की दुआ लेकर निकलते है..
జనాలకు చెప్పండి, నా భాగ్యం చూసి ఈర్ష్యపడటం మానమని..
నేను ఇంటినుండి మందు కాదు, అమ్మ దీవెన అందుకుని
బయల్దేరతాను..
8.23. हम भी दरिया है, हमे
अपना हुनर मालूम है..
जिस तरफ भी चल पडेंगे रास्ता हो जायेगा..
నేను నదిని, నా ప్రతిభ నాకు తెలుసు..
నేను ఎటైనా తిరిగనీగాక, అటు దారి
ఏర్పడుతుంది..
8.24. क्या औकात है तेरी ए जिन्दगी..
चार दिन की मोहब्बत तुझे बरबाद कर देती है..
ఓ జీవితమా, నీ స్థాయి (విలువే) ఏంటే..
నాలుగు రోజుల ప్రేమ నిన్ను నాశనం చేసేస్తుంది..
8.25. शायरी वो लोग करते हैं जनाब..
जिनकी आँखों में दर्द रोता है..
ఎవరి కళ్ళలో నెప్పి (కన్నీరై) కారుతుందో..
వారు కవిత్వం చెప్తారండీ..
8.26. बड़ा आदमी वो होता है..
जिस से मिलने के बाद आदमी खुद को छोटा ना समझे..
ఎవరిని కలిసాక మనం తక్కువవారం అనిపించదో..
అతడండీ గొప్పవాడు అంటే..
8.27. मंजिल चाहे कितनी भी ऊंची क्यों ना हो
दोस्तों..
रास्ते हमेशा पेरों के नीचे होते है..
గమ్యం ఎంత ఎత్తుల్లో ఉన్నా సరే, నేస్తాలూ..
దారులు ఎప్పుడూ పాదాల కిందే ఉంటాయి..
8.28. कुछ तो बात है तेरी फितरत में ऐ दोस्त..
वरना तुझ को याद करने की खता हम बार-बार न
करते..
ఏదో విశేషం ఉంది నీ స్వభావంలో ఓ మిత్రమా..
లేదంటే నిన్ను గుర్తు చేసుకోవటమనే తప్పు నేను మాటిమాటికీ
చేయను..
8.29. अपने वजूद पर इतना न इतरा ए ज़िन्दगी..
वो तो मौत है जो तुझे मोहलत देती जा रही है..
నీ అస్తిత్వం మీద అంత ఎగిసిపడకే ఓ జీవితమా..
ఏదో మరణం నీకు గడువునిస్తున్నది కనుక సరిపోతోంది..
8.30. भूख रिश्तों को भी लगती है..
प्यार परोस कर तो देखिये..
అనుబంధాలకు కూడా ఆకలి అవుతుంది..
కాస్త ప్రేమను వడ్డించైతే చూడండి..
8.31. तुम जिन्दगी में आ तो गये हो मगर ख्याल
रखना..
हम जान दे देते हैं मगर जाने नहीं देते..
నీవు జీవితంలోకి రానైతే వచ్చావు, కానీ గుర్తుంచుకో..
నేను ప్రాణాలిస్తాను, కానీ (నిన్ను)
పోనివ్వను..
8.32. खूबसूरती से धोका न खाइये जनाब..
तलवार कितनी भी खूबसूरत क्यों न हो, मांगती तो खून ही है..
అందం చూసి మోసపోకండి బాబూ..
కత్తి ఎంత అందంగా ఉన్నా సరే, కోరేది రక్తమే..
8.33. न कहा करो हर बार की हम छोड़ देंगे तुमको..
न हम इतने आम हैं, न ये
तेरे बस की बात है..
నన్ను విడిచిపెడతానని మాటిమాటికీ అనబోకు..
నేనంత సామాన్యుడినీ కాను, అట్లా చేయటం నీ
వల్లయ్యే పనీ కాదు..
8.34. हम आज भी अपने हुनर में दम रखते है..
होश उड़ जाते है लोगों के जब हम कदम रखते है..
ఇప్పటికి కూడా సత్తువ ఉంది మా ప్రతిభలో..
మేము అడుగు పెట్టామంటే చాలు, జనాలకు దిమ్మ
తిరుగుతుంది,..
8.35. जैसी जलानी थी जला दी हमने जिंदगी..
अब धुएं पर तमाशा कैसा और राख पर बहस कैसी..
ఎట్లా కాల్చుకోవాలో అట్లా కాల్చుకున్నాము జీవితాన్ని..
ఇంక పొగ గురించి రచ్చ ఏంటి, బూడిద పై గొడవేంటి..
8.36. शिकवा तकदीर का, ना
शिकायत अच्छी..
खुदा जिस हाल मे रखे वही जिंदगी अच्छी..
అది భాగ్యం యోకొక్ ఓటమి, వేదన మంచిది కాదు..
దేవుడు ఏ స్థితిలో ఉంచుతాడో, ఆ జీవితమే బాగుంది..
8.37. आँधियाँ गम की चलेगी तो भी सँवर जाऊँगा..
मैं तो दरिया हूँ समुद्र में भी उतर जाऊँगा..
బాధల తుఫాన్లు చెలరేగినా తట్టుకుని నిలుస్తాను..
నేను నదిని, సముద్రంలోకి కూడా దిగిపోతాను..
8.38. कमाल का ताना दिया आज मंदिर में भगवान
ने..
माँगने ही आते हो कभी मिलने भी आया करो..
గుడిలో దేవుడు ఇవాళ భలే దెప్పి పొడిచాడు..
ఎప్పుడూ అడగటానికి వస్తావు, అప్పుడప్పుడు
కలవటానికి కూడా రావచ్చు కదా..
8.39. मौसम बहुत सर्द है, चल
ए दोस्त..
ग़लत फ़हमियों को आग लगाते है..
వాతావరణం చాలా చల్లగా ఉంది, పద నేస్తమా..
అపోహలకు నిప్పు పెడదాము..
8.40. यूँ गुमसुम मत बैठो, पराये लगते हो..
मीठी बातें नहीं है, तो
चलो, झगड़ा ही कर लो..
అట్లా స్తబ్ధంగా ఉండిపోకు, పరాయిగా
అనిపిస్తావు..
తీయని కబుర్లు లేకపోతే పోనీ, కనీసం పోట్లాటైనా
పెట్టుకో..
8.41. न जाने इतनी मोहब्बत कहाँ से आ गयी उस अजनबी के लिए..
कि मेरा दिल भी उसकी खातिर अक्सर मुझसे रूठ जाया करता है..
ఆ అపరిచితునిపై ఇంత ప్రేమ ఎక్కడి నుంచి కలిగిందో..
తనకై నా మనసు మాటి మాటికీ నాపై అలుగుతుంది..
8.42. अगर नींद आ जाये तो सो भी लिया करो..
रातों को जगने से मोहब्बत लौटा नहीं करती..
ఒకవేళ రాత్రికి నిద్ర వస్తే పడుకుంటుండు..
రాత్రుళ్ళు మేలుకుని ఉండటం వల్ల ప్రేమ తిరిగి రాదు..
8.43. दर्द की भी अपनी एक अदा है..
ये तो सहने वालों पर ही फ़िदा है..
నెప్పికి కూడా తనదైన ఒక శైలి ఉంది..
ఇది సహించేవారి పైనే మనసు పారేసుకుంటుంది..
8.44. सो जाऊँ, के तेरी
याद में खो जाऊँ..
ये फैसला भी नहीं होता और सुबह हो जाती है..
పడుకోనా, లేక నీ జ్ఞాపకాలతో మైమరచిపోనా?..
నిర్ణయం కానే కాదు, ఇంతలోకే తెల్లారిపోతుంది..
8.45. हर इंसान दिल का बुरा नहीं होता..
बुझ जाता है दीपक अक्सर तेल की कमी के कारण..
हर बार कसूर हवा का नहीं होता..
ప్రతి మనిషి చెడ్డవాడు అయిఉండాలని లేదు..
నూనె అయిపోయినందుకు కూడా దీపం ఆరిపోవచ్చు..
ప్రతీసారి తప్పు గాలిదే ఉండదు..
8.46. कैसे कह दूं की महंगाई बहुत है..
मेरे शहर के चौराहे पर आज भी एक रूपये मे कई
दुआएँ मिलती है..
ధరలు పెరిగిపోయాయి అని ఎట్లా అనేది?..
నా నగరపు ప్రతి కూడలిలో ఇవాల్టికి కూడా ఒక్క రూపాయికి
బోలెడు దీవెనలు దొరుకుతాయి..
8.47. आज अपनी फालतू चीजें बेच रहा हूँ मैं..
है कोई ऐसा जिसे मेरी शराफत चाहिए..
ఇవాళ నా వద్ద ఉన్న అనవసరమైన వస్తువులు అమ్ముతున్నాను..
ఎవరైనా ఉన్నారా, మంచితనం కావాల్సినవారు?..
8.48. मोहबत हो इसलिए जाने दिया..
ज़िद होते तो बाहों में ले लेते..
ప్రేమవు కనుక వెళ్ళనిచ్చాను..
పట్టుదలవై ఉంటే కౌగిట్లో బంధించేవాడిని..
8.49. माफ़ी गल्तियों की होती है..
धोखे की नहीं..
తప్పులను క్షమించటానికి వీలుంటుంది..
మోసాన్ని కాదు..
8.50. हम शतरंज नहीं खेलते..
क्योंकि दुश्मनों की हमारे सामने बैठने कि औकात
नहीं
और दोस्तों के खिलाफ़ हम चाल नहीं चलते
నేను చదరంగం ఆడను..
శత్రువులకు నా ఎదుట కూర్చునే స్థాయి లేదు..
నేస్తాలకు విరుద్ధంగా నేను ఎత్తులు వేయను..
ऐसा कोई शहर नहीं जहा अपना कहर नहीं..
ऐसी कोई
गली नहीं जहा अपनी चली नहीं..
8.51. गलत कहते हैं लोग की सफेद रंग में वफा
होती है यारों..
अगर ऐसा होता तो आज नमक जख्मों की दवा होती..
తెల్ల రంగు విశ్వాసానికి గుర్తు అనేవారి మాట తప్పు..
అదే నిజమైతే ఉప్పు గాయాలకు మంచి మందై ఉండేది..
8.52. कितना मुश्किल है मोहबत की कहानी लिखना..
जैसे पानी से पानी पर पानी लिखना..
ప్రేమ కథా కమామీషు వ్రాయటం ఎంత కష్టమో..
నీటి మీద నీటితో నీరు అని వ్రాయటం లాగా..
8.53. दुश्मन बनाने के लिए ज़रूरी नहीं लड़ा
जाए..
आप थोड़े कामयाब हो जाओ तो वो ख़ैरात में
मिलेंगे..
శత్రువులు కావాలంటే పోట్లాడాలనే నియమమే ఏం లేదు..
కాస్త విజయాలు సాధించండి, వాళ్ళు ఉచితంగానే
లభిస్తారు..
8.54. मौत को देखा तो नहीं, पर शायद वो बहुत खूबसूरत होगी..
कम्बख़त
जो भी उस से मिलता है, उसी का हो जाता है ..
చావునెప్పుడూ చూడలేదు, కానీ చాలా అందంగా
ఉండి ఉంటుంది..
తనను కలిసిన ప్రతీవారూ తన సొంతం అయిపోతారు..
8.55. जब वो नाराज़ होता है
तब मुझे दुनिया की सबसे महेंगी चीज उसकी मुस्कान
लगती है..
తనకు కోపం వచ్చినప్పుడు..
ప్రపంచంలో అన్నింటికన్నా ఖరీదైనది తన
చిరునవ్వేననిపిస్తుంది..
8.56. समय से आ जाया करो दिल दुखाने वरना...
ऐसे तो हम तुम्हें भूलते जायेंगें..
కాస్త వేళకు వస్తుండు మనసు నొప్పించటానికి..
లేదంటే ఇట్లా నేను నిన్ను మెల్లగా మర్చిపోతాను..
8.57. हमेशा नहीं रहते सभी चेहरे नकाबो में..
हर एक किरदार खुलता है कहानी ख़तम होने पर..
ముఖాలన్నీ ఎప్పటికీ ముసుగు వెనకే ఉండిపోవు..
కథ ముగిసేవేళ అన్ని పాత్రలు తెరుచుకుంటాయి..
8.58. ज़हर से ज्यादा खतरनाक है ये मुहब्बत..
ज़रा सा कोई चख ले तो मर-मर के जीता है..
విషం కన్నా ప్రమాదకరమైనది, ప్రేమ..
కొద్దిగా రుచి చూస్తే చాలు, నిత్యం చస్తూ
బ్రతుకుతారు..
8.59. जब भी दिल से लिखने बैठे..
कलम भी फूट-फूट कर रोयी है..
మనసు విప్పి వ్రాద్దామని కూర్చున్నప్పుడల్లా..
నా కలం వెక్కి వెక్కి ఏడ్చింది..
8.60. खुद ही दे जाओगे तो बेहतर है..
वरना हम दिल चुरा भी लेते हैं..
నీకై నీవే ఇస్తే మంచిది..
కాదంటే మనసు దోచుకోగలను కూడా..
8.61. क्या ख़ाक तरक़्क़ी की आज की दुनिया ने..
मरीज़-ए-इश्क़ तो आज भी लाइलाज बैठे हैं..
నేటి ప్రపంచం ఏం పెద్ద ప్రగతి సాధించిందిటా?..
ప్రేమ రోగులకు ఇవాల్టికి కూడా ఏ వైద్యం లేదు కదా..
8.62. सीख ली जिसने अदा गम में मुस्कुराने की..
उसे क्या मिटायेंगी गर्दिशे जमाने की..
దుఃఖంలో చిరునవ్వు నవ్వే పద్ధతి నేర్చేసుకున్నవాడిని..
లోకంలో కష్టాలు ఏం తుడిపేయగలవు?..
8.63. किसी ख़्वाब की इतनी औकात नहीं..
जिसे हम देखे और वो पूरा ना हो..
ఏ కలకూ అంత సత్తా లేదు..
నేను కల కనటమూ, అది తీరకపోవటమూనా..
8.64. इतना दर्द तो मौत भी नहीं देती है..
जितना तेरी ख़ामोशी ने दिया है..
చావు కూడా అంత బాధపెట్టదేమో..
నీ మౌనం పెట్టినంత..
8.65. बड़ी मुश्किल से सुलाया है ख़ुद को
मैंने..
अपनी आंखों को तेरे ख़्वाब क़ा लालच देकर...
చాలా కష్టం మీద నన్ను నేను పడుకోబెట్టుకున్నాను..
నా కన్నులకు నీ కలల ఆశ పెట్టి..
8.66. बरसों बाद भी तेरी ज़िद की आदत ना बदली..
काश हम मोहब्बत नहीं, तेरी
आदत होते ...
ఇన్నేళ్ళకు కూడా నీ పట్టు పట్టే అలవాటు మారలేదు..
నేను నీ ప్రేమను కాక అలవాటునైతే బాగుండేది..
8.67. मुझे तेरे ये कच्चे रिश्ते जरा भी पसंद
नहीं आते..
या तो लोहे की तरह जोड़ दे या फिर धागे की तरह
तोड़ दे ..
నాకు నీ ఈ పచ్చి ఆరని అనుబంధాలు నచ్చటంలేదు..
ఇనుములా ఐనా అతికించేయి, లేదా దారంలా
తెంపేసేయి..
8.68. सारा दिन गुज़र जाता है खुद को समेटने
में..
फिर रातको उसकी यादों की हवा चलती है और हम फिर
बिखर जाते है..
పగలంతా సరిపోతుంది, నన్ను నేను పోగుచేసుకోవటానికి..
తిరిగి రాత్రి తన జ్ఞాపకాల గాలి వీచి, మళ్ళీ
చెదిరిపోతాను..
8.69. हर ग़म ने, हर सितम
ने, नया हौंसला दिया..
मुझको मिटाने वालों ने मुझको बना दिया..
ప్రతి బాధ, ప్రతీ అన్యాయం కొత్త ధైర్యాన్ని ఇచ్చింది..
నన్ను చెరపాలనుకునేవారే నన్ను నిలబెట్టారు..
8.70. संघर्षो में यदि कटता है तो कट जाए सारा
जीवन..
कदम-कदम पर समझौता मेरे बस की बात नहीं..
సంఘర్షణలతోనే జీవితమంతా గడుస్తుందంటే గడవనీ గాక..
ప్రతి అడుగుకు ఒప్పందం చేసుకోవటం నావల్ల అయ్యే పని కాదు..
8.71. कैसे लडूँ मुकदमा, खुद
से उसकी यादो का?..
ये दिल भी वकील उसका, ये
जान भी गवाह उसकी..
నేను తన జ్ఞాపకాల కేసు ఎట్లా వాదించేది?
ఈ మనసూ తనకే వకీలు, ఈ ప్రాణాలూ తనకే సాక్షులు..
8.72. लाख करो गुज़ारिशें लाखों दो हवाले..
बदल ही जाते हैं आखिर बदल जाने वाले..
లక్ష వేడుకో, లక్ష ప్రమాణాలు చూపు..
మారిపోయేవారు చివ్వరకు మారిపోనేపోతారు..
8.73. चलो, मान लेता हूँ
मुझे मोहब्बत करना नहीं आता..
लेकिन आप ये बताओ कि आप को दिल तोडना किस ने
सिखाया..
సరే, నాకు ప్రేమించటం రాదని ఒప్పుకుంటాను..
మరి తమరు చెప్పండి, తమరికి మనసు విరవటం ఎవరు నేర్పారో?..
8.74. मुस्कुराने से शुरु और रुलाने पे खतम..
ये वो ज़ुल्म है जिसे लोग मुहब्बत कहते है ...
చిరునవ్వుతో ప్రారంభమై, ఏడిపించటంతో
అంతమవుతుంది..
ఈ దురాగతాన్నే జనాలు ప్రేమ అంటారు..
8.75. मेरे खुदा ले चल, ऐसे
मंजर पर, मेरे कदम..
जहां न कुछ पाने की खुशी हो, न कुछ खोने का गम..
దొరికిందన్న ఆనందమూ, పోగొట్టుకున్న బాధా
ఉండని-
ఆ పూలబాటలోకి నన్ను నడిపించు దేవుడా..
8.76. सुलग रही है अगरबत्तियां सी मुझ में..
तुम्हारी याद ने महका भी दिया, जला भी दिया ...
వెలుగుతున్నది అగరొత్తిలా నాలో..
నీ జ్ఞాపకం నన్ను పరిమళింపచేస్తుంది, కాలుస్తుంది కూడా..
8.77. नफ़रत हो जायेगी तुझे अपने ही किरदार
पे...
अगर में तेरे ही अंदाज़ में तुझसे बात करूँ..
నీకు నీ పాత్ర మీదే ద్వేషం పుడుతుంది..
నేను నీ తీరుగనే నీతో మాట్లాడటం మొదలుపెడితే..
8.78. मोहब्बत क्या है, चलो,
दो लफ्ज़ो में बताते है..
तेरा मजबूर कर देना, मेरा
मजबूर हो जाना..
ప్రేమంటే ఏంటో రెండు మాటల్లో చెప్తున్నా..
నీవు (నన్ను) నిస్సహాయంగా చేయటం, నేను నిస్సహాయంగా
కావటం..
8.79. कैसे भुला देते हैं लोग तेरी खुदाई को,
या रब..
मुझसे तो तेरा बनाया हुआ एक शख्स भुलाया नहीं
जाता..
నీ అస్తిత్వాన్ని జనాలు ఎట్లా మర్చిపోతారో, భగవంతుడా..
నీవు చేసిన ఒక్క మనిషి నాకు మరుపుకు రావట్లేదే..
8.80. काश, तुम भी हो जाओ
तुम्हारी यादों की तरह..
न वक़्त देखो न बहाना, बस
चली आओ..
అబ్బ, నీవూ నీ జ్ఞాపకంలా అయిపోతే బాగుండు..
వేళ, వంక చూడకు, అట్లా వచ్చేయి..
8.81. तुझपे खर्च करने के लिए बहुत कुछ नहीं है
मेरे पास..
थोड़ा वक़्त हैं, थोड़ा मैं
हूँ..
నీమీద ఖర్చు చేయటానికి ఎక్కువ ఏం లేదు నా వద్ద..
కొంత సమయం ఉంది, కొద్దిగ నేనున్నాను..
8.82. दिल में चाहत का होना ज़रूरी है..
वरना याद तो रोज़ दुश्मन भी करते हैं..
మనసులో ఆత్మీయత ఉండటం అవసరం..
గుర్తు చేసుకోవటం ఏం ఉంది? శత్రువులు కూడా
చేసుకుంటారు..
8.83. एक पत्थर कभी आसमान में उछाला था मैं ने..
आज अपनी हालत देखकर लगता है..
कही वो उपर वाले को तो नहीं लग गई ..
ఒకసారి ఓ రాయి ఎగరేశాను ఆకాశంలోకి..
నేటి నా దుస్థితి చూసి అనిపిస్తుంది..
అది పైవాడికి తగలలేదు కదా అని..
8.84. शिकवा करने गये थे, और
इबादत सी हो गई..
तुझे भुलाने की ज़िद अब तेरी आदत सी हो गई..
బాధను చెప్పుకోవాలని వెళ్ళాను, ఓ ఆరాధనలా
అయిపోయింది..
నిన్ను మరుపుకుతేవాలన్న పట్టుదల ఇక నీ అలవాటుగా
అయిపోయింది..
8.85. बहुत कुछ बदला है मैंने अपने आप में,
लेकिन..
तुम्हे वो टूट के चाहने की आदत अब तक नहीं बदली
..
నాలో చాలానే మార్చుకున్నాను, కానీ..
నిన్ను పడీ పడీ కోరుకునే అలవాటు ఇప్పటిదాకా మారలేదు..
8.86. मत पूछ दास्ताँ ऐ इश्क़, बस,
जो रुलाता है, उसी के गले
लग कर रोने को दिल चाहता है..
ప్రేమ యొక్క కథ ఏంటని అడగకండి..
ఎవరు ఏడిపిస్తారో, వారినే కౌగిలించుకుని ఏడవాలి
అనిపిస్తుంది..
8.87. तू बदनाम ना हो इसलिये जी रहा हूँ मैं..
वरना तेरी चौखट पे मरने का इरादा रोज़ होता
है...
నీకు చెడ్డపేరు రావద్దని బ్రతుకుతున్నాను..
లేదంటే నీ ద్వారం వద్ద చచ్చిపోవాలనే కోరిక రోజూ
కలుగుతుంది..
8.88. देख लेती हूँ तस्वीर तेरी, जब भी परेशान होती हूँ..
मानो मेहेज़ तस्वीर से ही तुम मेरे दर्द खींच
लेते हो..
ఉద్విగ్నమైనప్పుడుల్లా నీ చిత్రపటం చూసుకుంటాను..
చిత్రపటం నుండే నా నెప్పిని లాగేస్తావేమోననిపిస్తుంది..
8.89. उसी का शहर, वहीं का
खुदा, और वहीं के गवाह..
मुझे यक़ीन था, कुसूर मेरा
ही निकलेगा..
నగరం తనదే, దేవుడూ అక్కడివాడే, సాక్షులూ అక్కడివారే..
మొదలే తెలుసు, అపరాధం నాదే తేలుతుందని..
8.90. सुना है, तेरी सूरत
को देखने वाले...
कोई और नशा नहीं करते..
నీ ముఖాన్ని చూసేవారు..
వేరే ఏ మత్తూ సేవించరని విన్నానే..
8.91. हम सबको मिला है, मौत
से उधार कुछ वक्त..
जिसे हम ज़िन्दगी कहते हैं..
చావు నుండి కొద్దిగ సమయం మనకు అప్పు దొరికింది..
దాన్ని మనం జీవితం అంటాము..
8.92. तुम अगर लौट आओ तो मुझे ज़रा पहले बता
देना..
मुझे खुद को ढूंढने में कुछ वक़्त लगेगा..
నీవు తిరిగి వచ్చేదుంటే కాస్త ముందుగా చెప్పు..
నన్ను నేను వెతుక్కోవటానికి కొద్దిగ సమయం పడుతుంది..
8.93. बैठें तो किस उम्मीद पर बैठे रहें यहाँ..
उठें तो उठ के जायें कहाँ तेरे दर से हम ..
కూర్చుందామంటే ఏ ఆశతో కూర్చుండిపోవాలిక్కడ?..
లేద్దామంటే నీ దరి నుండి లేచి ఎక్కడకు పోగలను?..
8.94. क्या पता कि कब कहाँ से मारेगी..
बस की मैं ज़िन्दगी से डरता हूँ..
मौत का क्या है, एकबार
मारेगी..
ఏమో, ఎటు నుండి కొడుతుందో..
నేను జీవితమంటేనే భయపడతాను..
చావుదేం ఉంది, ఒకేసారి కొడుతుంది..
8.95. सोचता हूँ कि कभी भी तुझे अब याद ना
करूँगा मैं..
फिर सोचता हूँ कि ये फर्क तो रहने दो हम दोनों
में..
ఇక నిన్నెప్పుడూ జ్ఞాపకం చేసుకోవద్దని అనుకుంటాను..
మళ్ళీ అనిపిస్తుంది, నీకూ నాకూ ఈ తేడా
అయినా ఉండనీ..
8.96. उम्रकैद की तरह होते हैं कुछ रिश्ते..
जहाँ ज़मानत देकर भी रिहाई मुमकिन नहीं..
జీవిత ఖైదు వంటివి కొన్ని అనుబంధాలు..
ఇక్కడ అపరాధరుసుము చెల్లించి కూడా విడుదల సాధ్యం కాదు..
8.97. ऐ कलम, ज़रा रुक रुक
कर चल..
क्या गज़ब का मुक़ाम आया हैं..
थोड़ी देर ठहर जा, उसे दर्द
ना हो..
तेरी नोंक के नीचे उसका नाम आया हैं..
ఓ లేఖనీ, కాస్త ఆగి నెమ్మదిగా నడువు
ఎంతటి సంకట స్థితి వచ్చింది..
కాస్త ఆగు, తనకు నెప్పి కలుగుతుందేమో..
నీ పాళీ అంచుకు తన పేరు వచ్చింది..
8.98. जब भी मैं टूटता हुँ तुम्हें ढुढता हूँ..
तुमने एक बार कहाँ था ना, हम
एक है..
ఎప్పుడు విరిగినా నీగురించి వెతుకుతాను నేను..
నీవు ఓసారి అన్నావు, మనిద్దరం ఒకటేనని..
8.99. अकेले रहने का भी एक अलग सकून है...
ना किसी के लौट आने कि उम्मीद, ना किसी से अलग होने का डर..
ఒంటరిగా ఉండటంలో హాయే వేరు..
ఒకరు తిరిగొస్తారనే ఆశా ఉండదు, ఒకరు దూరమైతారని
భయమూ ఉండదు
8.100. हराना है तो मैदान में आके हराना..
वरना दिल जीतने की आदत तो बचपन से है..
ఓడించాలనుంటే యుద్ధభూమిలోకి వచ్చి ఓడించు..
మనసు గెలుచుకునే అలవాటు అంటావా, అది నాకు చిన్నప్పటి
నుంచే ఉంది..
8.101. किसे फ़िक़्र है ज़माने के ज़ुल्मों सितम
की..
दर्द अच्छे लगते हैं, जब
वो ज़ख्मों पे हाथ रखते है..
సమాజపు అత్యాచారాల గురించి ఎవరికుంది బాధ?..
గాయాలపై తను చేయి వేసినప్పుడు నెప్పి కూడా హాయిగానే
అనిపిస్తుంది..
8.102. सब कुछ हासिल नहीं होता ज़िन्दगी में
यहाँ...
किसी का काश तो किसी का अगर छूट ही जाता है..
జీవితంలో అందరికి అన్నీ దొరకవిక్కడ..
ఒకరి ‘అయితే బాగుండు’, మరొకరి ‘ఇట్లా అయి ఉంటే’
చేజారుతూనే
ఉంటాయి..
8.103. हमदर्दी ना करो मुझसे, ऐ मेरे हमदर्द दोस्तों ..
वो भी बड़े हमदर्द थे, जो
दर्द हजारों दे गए ..
ఓ సానుభూతి గల నేస్తాలూ, నాపై సానుభూతి
చూపకండి..
వేయి బాధలు పెట్టి పోయినవారు కూడా ఎంతో సానుభూతిపరులే..
8.104. जब कभी भी बादलों में घिरता है..
चाँद लगता है आदमी की तरह..
మబ్బుల మధ్య చిక్కుకున్నప్పుడల్లా..
చంద్రుడు మనిషిలా అనిపిస్తాడు..
8.105. काश कयामत के दिन हिसाब हो सब बेवफाओं
का..
और तुम मेरे गले लग के कहो की मेरा नाम मत
लेना..
సృష్టి చివరినాడు మోసకారుల లెక్కాపత్రం చూసేవేళలో..
నీవు నన్ను ఆలింగనం చేసుకుని, ‘నా పేరు చెప్పకు’
అంటే
బాగుండు..
8.106. मैं अगर चाहूँ भी तो शायद ना लिख सकूँ उन
लफ़्ज़ों को..
जिन्हें पढ़ कर तुम समझ सको कि मुझे तुम से कितनी
मोहब्बत है..
నీవంటే నాకెంత ప్రేమో- చదవంగానే నీకు అర్థమైపోయే విధంగా..
ఆ మాటలను- నేను కావాలనుకున్నా వ్రాయలేనేమో..
8.107. कौन कहता है कि दिल सिर्फ लफ़्जों से
दुखाया जाता है..
तेरी खामोशी भी कभी कभी आँखें नम कर देती हैं..
ఎవరన్నారు, మనసు మాటలవల్లే నొచ్చుకుంటుందని..
నీ మౌనంతో కూడా నా కన్నులు చెమరుస్తాయి..
8.108. ख़ुदा का शुक्र है की ख़्वाब बना दिए..
वरना तुम्हें देखने की तो हसरत ही रह जाती..
కలలను చేసినందుకు ఖుదా కు ధన్యవాదాలు..
లేదంటే నిన్ను చూడాలనే కోరిక అట్లాగే మిగిలిపోయి ఉండేది..
8.109. माना कि तुम लफ्जो के बादशाह हो..
लेकिन हम भी खामोशियों पर राज किया करते है.
నీవు మాటల చక్రవర్తివి కావచ్చుగాక..
కానీ, మేము కూడా మౌనాల పై రాజ్యం చేస్తుంటాము..
8.110. वो कुछ रातों से मेरे नींदों में दबे
पाँव चलके आती हैं..
और फिर सुबह को शिकायत करती हैं कि उसे नींद ठीक
से आई नहीं..
ఆమె కొద్ది రాత్రులుగా నా నిద్దురలోకి చడి చేయకుండా
వచ్చేస్తోంది..
మళ్ళీ ఉదయాన్నే వచ్చి బాధచెప్పుకుంటుంది- నిద్రే సరిగ్గా
పట్టలేదని..
8.111. शब्द दिल से निकलते है..
दिमाग से तो मतलब निकलते है..
మాటలు మనసు నుంచి వెలువడుతాయి..
మెదడు నుండి వచ్చేవి అవసరాలే..
8.112. उसके जैसे कोई और कैसे हो सकता है ..
और अब तो वो खुद अपने जैसे नहीं रहें..
తనను పోలేవారు ఎక్కడుంటారు?..
ఇప్పుడైతే తనూ తనలా ఉండటం లేదు..
8.113. बचपन में तो शामें भी हुआ करती थी..
अब तो बस सुबह के बाद रात हो जाती है..
చిన్నతనంలో సాయింత్రాలు కూడా అవుతుండేవి..
ఈ మధ్య ఉదయం తరువాత నేరుగా రాత్రే అవుతుంది..
8.114. बहाना कोई और न बनाओ मुझसे ख़फा होने
का..
तुम्हे चाहने के अलावा अब मेरा गुनाह कोई नहीं..
నా మీద అలిగేందుకు వేరే వంకలు వెతుక్కోకు..
నిన్ను కోరుకోవటం తప్ప నేను చేసిన వేరే నేరమేమీ లేదు..
8.115. उड़ा के जो हँस रहे हो, मेरे एहसासों के परिंदे..
पाले थे सिर्फ तुम्हारे ही लिए, ये जान के रोओगे..
నా భావాల పక్షులను ఎగురవేసి నవ్వుతున్నావే..
నీకోసమే వాటిని పెంచుకున్నానని తెలిస్తే ఏడుస్తావు..
8.116. न जाने क्या कशिश है, उसकी मदहोश आँखों में..
नज़र अंदाज़ जितना करो, नज़र
उस पे ही पड़ती है..
ఏం ఆకర్షణం ఉందో, తన మత్తెక్కించే కన్నుల్లో..
ఎంత నిర్లక్షం చేసినా వీక్షణ తనకేసే పోతుంది..
No comments:
Post a Comment